జలుబు మరియు ఫ్లూతో పోరాడుతున్నారా? లక్షణాలు మరియు గృహ నివారణ చిట్కాలు.

జలుబు అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. 200 రకాల వేరువేరు వైరస్లలో దేని ద్వారానైనా ఇది సంభవిస్తుంది. ఇది చాలా సర్వసాధారణం. ఇది నవజాత శిశువులలో తప్ప ప్రమాదకరమైన పరిస్థితి కాదు. దీనికి ఎటువంటి చికిత్స లేకుండానే దానంతట అదే కొద్దిరోజుల్లో నయమవుతుంది.
జలుబు మరియు ఫ్లూ రెండు కూడా గాలి ద్వారా వ్యాపిస్తాయి. సాధారణ దగ్గు, జలుబు వ్యాప్తికి ప్రధాన కారణం చేతులతో ముట్టుకోవడం. పెన్సిల్, పుస్తకం, బొమ్మ లేదా తలుపు యొక్క గడియలు వంటి వైరస్ సోకిన వస్తువులను తాకడం ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. ఇన్ఫ్లుఎంజా వైరస్ వల్ల ఫ్లూ సంభవిస్తుంది. ఇది కూడా జలుబు వంటిదే. దీనినే సోకిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండడం లేదా సోకిన వస్తువులను తాకడం ద్వారా వ్యాపిస్తుంది.
దగ్గు మరియు జలుబు లక్షణాలు :
దగ్గు మరియు జలుబు యొక్క సాధారణ లక్షణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి...
తుమ్ములు మరియు ముక్కుదిబ్బడ
గొంతు నొప్పి మరియు దగ్గు
అలసట మరియు ఆకలిలేకపోవడం
కొన్ని సందర్భాలలో జ్వరం
సాధారణ నమ్మకానికి విరుద్ధంగా జలుబు మరియు ఫ్లూ రెండు వేరు వేరు లక్షణాలు. ఫ్లూ యొక్క లక్షణాలు జలుబు నుండి మారుతూ తీవ్రతరం అవుతాయి. జలుబు లక్షణాలతోపాటు ఫ్లూ కు కొన్ని ఇతర లక్షణాలు కూడా ఉంటాయి.
తలనొప్పి , ఒంటి నొప్పులు
ఆకలి లేకపోవడం
101 ఎఫ్ కంటే ఎక్కువ జ్వరం ఉండడం
వేగవంతమైన శ్వాస, అలసట, చిరాకు, మింగడంలో ఇబ్బంది మరియు దద్దుర్లు జ్వరం వంటి లక్షణాలు ఫ్లూ యొక్క తీవ్రతను సూచిస్తాయి.
ఈ లక్షణాలు అకస్మాత్తుగా కనిపిస్తాయి. మరియు వాంతులు విరోచనాలు కూడా ఉండవచ్చు.
ఈ లక్షణాలను తగ్గించడానికి ఫ్లూకు తక్షణ వైద్య సహాయం మరియు చికిత్స అవసరం. ఫ్లూ వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే దాని నుండి రక్షణను కలిగిస్తుంది. ఆరు నెలలకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మాత్రమే ఈ వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది.
దగ్గు మరియు జలుబు నివారణ :
పిల్లలను వీటినుండి రక్షించడానికి తరచుగా చేతులు కడుక్కోవడం అనేది జర్మస్ ద్వారా వచ్చే ఈ వ్యాధిని అరికట్టేందుకు ఉత్తమమైన మార్గము. గోరువెచ్చని నీటితో మరియు తేలికపాటి సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు చేతులను శుభ్రపరచుకోవాలి.
జర్మ్స్ కొరకు ఒక నియమం పాటించవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా పాఠశాల నుండి లేదా ఆటస్థలం నుండి తిరిగి వచ్చిన తర్వాత మరియు భోజనానికి ముందు (ఈ సూక్ష్మ క్రిములు సమృద్ధిగా సంభవించే ప్రదేశాలు) ఈ వ్యాధి సోకిన పిల్లల్లో దగ్గు మరియు తుమ్ములు వచ్చే సమయంలో నోరు మరియు ముక్కును కప్పి ఉంచుకునేలా చూసుకోండి. చల్లటి వాతావరణంలో చిన్నపిల్లలను ఆరు బయటకు తీసుకు వెళ్లడం మానుకోండి. వెచ్చని బట్టలు, టోపీలు, స్వెట్టర్లు మరియు మిట్టెన్లు పిల్లలకు చలినుండి రక్షణను అందిస్తాయి. ఇన్ఫ్లూయెంజా వ్యాక్సిన్ అన్నది ఎంతో అవసరం. ఎందుకంటే ఇది పిల్లలలో ప్రతిరోధకాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. మరియు ఫ్లూ సంభవించకుండా అరికడుతుంది.
దగ్గు మరియు జలుబు చికిత్సకు ట్రీట్మెంట్ చిట్కాలు:
జలుబు దానంతట అదే తగ్గిపోయే వ్యాధిగా మనకి తెలుసు. ఈ సమయంలో పిల్లలు సౌకర్యవంతంగా ఉండేందుకు మనము కొన్ని చిన్న చిన్న పనులు చేయాలి. పిల్లలకు టీ, సూప్ మరియు వేడి నీళ్లు వంటి హాయేనిచ్చే ద్రవాలను పుష్కలంగా ఇవ్వాలి. పిల్లలకు ఆవిరి పట్టడం మంచి మార్గము. ఇది కఫము, ముక్కుదిబ్బడ మరియు చాతిని క్లియర్ చేయడంలోనూ సహాయపడుతుంది. ఆవిరి పట్టడం వలన నాసికా రంధ్రాలు మూసుకుపోకుండా ఉంటాయి. దయచేసి నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఫ్లూ లాంటి లక్షణాలు ఉన్నట్లయితే డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఔషధాలను ఇవ్వకండి. పిల్లలకు ఫ్లూ సోకిన సందర్భాలలో వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న పిల్లలకు (ఉబ్బసం, మధుమేహం మొదలైనవి) అదనపు శ్రద్ధ అవసరం. ఫ్లూట్ చికిత్స ఆలస్యం అయితే సైనస్ ఇన్ఫెక్షన్ లేదా న్యూమోనియా వంటి సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది అని పరిశోధనలు తెలుపుతున్నాయి.
సాధారణ జలుబు మరియు దగ్గుకు గృహ నివారణలు:
డాక్టర్ సూచించిన ఔషధాలతోపాటు జలుబు మరియు ఫ్లూ లక్షణాలు తగ్గించడానికి మరియు వ్యాధి నుంచి త్వరగా బయట పడటానికి కొన్ని గృహ నివారణలు ఇక్కడ ఉన్నాయి.
గోరువెచ్చని నీటితో గార్గిలింగ్ చేయడం వలన మంచి ఉపశమనం లభిస్తుంది. దీని వలన గొంతు నొప్పి కూడా ఎంత ఉపశమనం దొరుకుతుంది.
దగ్గుకి మంచి ఉపశమనాన్ని కలిగించే అల్లంతో టీ తయారు చేసి ఇవ్వడం కూడా దగ్గుకు మరొక నివారణ.
4 ఏలకలు, 4 లవంగాలు, చిన్న అల్లం ముక్క మరియు చిన్న దాల్చిన చెక్కను ఒక గ్లాసు నీటిలో సుమారు పది నిమిషాల పాటు ఉడికించి అందులో కొంచెం తేనెను కలిపి నిలువ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు స్పూన్లు పిల్లలకు ఇచ్చినట్లయితే ఎంతో ఉపశమనం లభిస్తుంది.
తులసి ఆకులను వేసి టీ తయారు చేసుకోవచ్చు. ఇది నిజంగా ముక్కుదిబ్బడను తొలగించడానికి సహాయపడుతుంది.
గొంతు నొప్పికి తేనె ఒక అద్భుతమైన ఔషధం. మీరు ఒక చెంచా తేనెలో కొంచెం అల్లంరసం వేసి ఇచ్చినట్లయితే నెమ్ము తో పాటు గొంతునొప్పిని కూడా నయం చేయడానికి పిల్లలకు సహాయపడుతుంది.
జోష్ అండా మరియు చావన్ ప్రాష్ వంటి మౌలిక సమ్మేళనాలు పిల్లల రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి మరియు గొంతు నొప్పి మరియు జలుబును తగ్గించడానికి సమర్థవంతంగా పని చేస్తాయి.
నవజాత శిశువులలో సంభవించే జలుబును తగ్గించడానికి వెల్లుల్లి రెబ్బలు మరియు లవంగాలను ఒక బట్టలో కట్టి మెడ దగ్గర ఉంచినట్లయితే వెల్లుల్లి యొక్క వాసన శిశువు పీల్చుకున్నప్పుడు నాసికా మార్గాన్ని సులభతరం చేయడానికి సహాయపడుతుంది.
మీ పిల్లల్లో జలుబు మరియు ఫ్లూ లక్షణాలు గుర్తించిన వెంటనే మీరు ఇంటి నివారణలను ప్రారంభించినట్లు అయితే ఇవి చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి.
శీతాకాలంలో పిల్లలకు చల్లని పానీయాలు మరియు ఐస్క్రీమ్ నుండి దూరంగా ఉంచడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలను వెచ్చగా ఉంచండి మరియు తేలికపాటి ఆహారాన్ని ఇవ్వండి. పాలు మరియు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. మీరు సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వండి. పాలను టీ లో చేర్చి ఇవ్వవచ్చు. సూర్యరశ్మిని మరియు స్వచ్ఛమైన గాలిని, అందులో అన్ని ప్రయోజనాలను పొందడానికి పిల్లలను బయటకు వెళ్ళమని ప్రోత్సహించండి. పిల్లలకు వ్యాధి సోకినట్లు అయితే సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి వారిని పాఠశాలలకు పంపడం మానుకోండి. అంతే కాకుండా మీ బిడ్డ త్వరగా కోలుకోవడానికి సహాయకారిగా ఉంటూ వారికి వెచ్చదనాన్ని ఇవ్వండి.
Be the first to support
Be the first to share
Comment (0)
Related Blogs & Vlogs
No related events found.
Loading more...