• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

శీతాకాలపు గర్భధారణ సమయంలో ఏ ఆహారాలను నివారించాలి ?

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Oct 17, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

గర్భం అనేది స్త్రీ జీవితంలో చాలా ముఖ్యమైన దశ. ఏదైనా తినడానికి లేదా త్రాగడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. తల్లి తినే ఆహారం గర్భం యొక్క ఆరోగ్యకరమైన పురోగతిని మరియు పిండం యొక్క అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని మనందరికీ తెలుసు. ఇప్పుడు శీతాకాలం మీ గుమ్మం ముందు ఉన్నది. మీరు గర్భవతిగా ఉన్నట్లయితే కొన్ని రకాల ఆహారాలను నివారించాలి అని తెలుసుకోండి.

 

ఈ సీజన్ లో మాత్రమే లభించే కొన్ని రకాలైన ప్రత్యేకమైన పండ్లు మరియు కూరగాయలతో పాటు , శీతాకాలపు గర్భము కొత్త కొత్త కోరికలు కల్పిస్తుంది. అదేవిధంగా పండ్లు మరియు కూరగాయల విషయానికి వస్తే, ఆయా సమయాలలో దొరికే పండ్లు మరియు కాయగూరలు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని మనం తరచూ వింటూ ఉంటాము. కాబట్టి శీతాకాలపు గర్భధారణలో ఏమి తినాలో మరియు వేటిని నివారించాలో పరిశీలించండి.

 

శీతాకాలపు గర్భధారణ సమయంలో మీరు నివారించవలసిన పండ్లు మరియు కాయగూరలు :

 

పండ్లు, కాయగూరలు మరియు ఇతర ఆహారపదార్థాల జాబితా ఇక్కడ ఉంది. మీరు ఇప్పుడు గర్భవతిగా ఉన్నట్లయితే వీటిని నివారించాలి. సాధారణంగా గర్భధారణ సమయంలో ఈ పండ్లు చాలా ఆరోగ్యకరమైనవి మరియు ప్రయోజనకరమైనవిగా పరిగణించబడుతున్నాయి. కానీ , ఇవి శీతాకాలానికి అనుగుణమైనవి కాదు.  కనుక ఈ పండ్లు లేదా కాయగూరలను నివారించాలి.

 

ఆస్పరాగస్ :

ఫోలిక్ ఆసిడ్ తో పాటుగా మరెన్నో ఇతర పోషకాలు ఎక్కువగా ఉన్న కారణంగా ఆస్పరాగస్ ను గర్భధారణ సమయంలో తినడానికి ఎక్కువగా సిఫార్సు చేస్తారు. ఇది సూప్లకు మంచి రుచిని ఇస్తుంది. శీతాకాలంలో సూపులు తీసుకోవడం ఎంతో మంచిది. అయినప్పటికీ శీతాకాలంలో లభించే ఆస్పరాగస్ ఉత్తమమైన నాణ్యత కలిగి ఉండదు. ఇది ప్రత్యేకించి వసంతకాలంలో దొరుకుతుంది. ఆకుపచ్చగా మంచిగా ఉండే ఇది శీతాకాలంలో లేత ఆకుపచ్చగా పేలవంగా ఉండి కలపలాగా ఉంటుంది. శీతాకాల గర్భధారణ సమయంలో లేత ఆకుపచ్చ కాయగూరలకు బదులుగా ఆకుపచ్చ రంగులో ఉండే కాయగూరలను ఎంచుకోండి.

 

బెర్రీలు :

స్ట్రాబెర్రీ లు మరియు బ్లూబెర్రీ లలో విటమిన్ సి, బీటా కెరోటిన్, పొటాషియం,ఫోలిక్ ఆసిడ్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ తో నిండి ఉంటాయి. ఇవన్నీ తల్లికి మరియు పుట్టబోయే బిడ్డకు ఎంతో మేలు చేస్తాయి. అయితే సీతాకాలంలో మార్కెట్లో లభించే స్ట్రాబెర్రీల చర్మం లేతగా ఉంటుంది. ఇలా ఉన్నట్లయితే ఫైటో న్యూట్రియంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. సీతాకాలంలో లభించే స్ట్రాబెరీ లలో సి విటమిన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. శీతాకాలంలో లభించే బ్లూబెర్రీ లలో కూడా కృత్రిమ పదార్థాలను ఉపయోగించడం వలన తాజాగా కనిపిస్తాయి. స్ట్రాబెర్రీ ల మాదిరిగానే బ్లూబెర్రీ లలో కూడా శీతాకాలంలో పోషక విలువలు తక్కువగా ఉంటాయి. అందువల్ల శీతాకాలంలో ఈ బెర్రీలు తినడం మానుకోండి. ఇది కూడా చదవండి..శీతాకాలంలో గర్భిణీ స్త్రీల చర్మ సంరక్షణకు చిట్కాలు...

 

పాల ఉత్పత్తులు :

పాలు (పసుపు కలిపిన వేడి పాలు తప్ప), మీగడ మరియు జున్ను గర్భధారణ సమయంలో తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే, ఇది శీతాకాలంలో సమస్యలను సృష్టిస్తాయి. ఇవి కడుపులో ఉబ్బరం, జలుబు మరియు దగ్గును పెంచుతాయి. శీతాకాలంలో సాధారణంగా వచ్చే ఈ సమస్యలన్నీ కూడా గర్భిణీ స్త్రీలకు ఇబ్బందికరంగా ఉంటాయి. ఇవి తీవ్రమైన సమస్యలు కానప్పటికీ, వారిని ఎంతో అసౌకర్యానికి గురి చేస్తాయి.

 

వేయించిన ఆహారం :

శీతాకాలంలో వేడి వేడి సమాసాలు మరియు వేడి టీ కి మించినది ఏమీ ఉండవు. అయినప్పటికీ శీతాకాలపు గర్భధారణ సమయంలో మీ వేయించిన ఆహారపు కోరికల నుండి దూరంగా ఉండడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. (ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు. ఇక్కడ మేము తరచుగా తినే వారి గురించి మాట్లాడుతున్నాము)ఒక కొత్త అధ్యయనం ప్రకారం గర్భధారణ సమయంలో ఆహారాన్ని ఎక్కువగా తినే వారికి గర్భధారణ మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది.

 

వైట్ షుగర్ :

చల్లని వాతావరణము మరియు వేడి చాక్లెట్  దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. వైట్ షుగర్ దానికి ప్రధానమైన పదార్థము. ఇది ఎటువంటి పోషకాహారం లేకుండా ఎక్కువగా ప్రాసెస్ చేయబడి శుద్ధిచేసిన పదార్థము. చక్కెర అధికంగా తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం చక్కెర సిరప్ లు లేదా చక్కెర ఉత్పత్తులను ఎక్కువగా తీసుకునే గర్భిణి స్త్రీలు బ్యాక్టీరియాతో పోరాడలేరని తెలిసింది. తెల్లని పంచదార మీ కోరికలను తీర్చగలదు. కానీ అది మీకు ఆరోగ్యం కాదు.

 

ఆల్కహాల్ :

ఆల్కహాల్ వినియోగం గర్భం యొక్క సాధారణ పురోగతి మరియు పిండం యొక్క అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని అందరికీ తెలిసినప్పటికీ, చల్లని శీతాకాలపు రోజులలో గర్భిణీ స్త్రీలకు(గర్భం కారణంగా మద్యం సేవించడం మానేసిన వారు) కూడా  కొంచెం తీసుకోవాలనే కోరిక ఉంటుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి ఒకటి లేదా రెండు సిప్స్ ఎటువంటి హాని చేయదని వారు అనుకోవచ్చు. శీతాకాలంలో తగినంత నీటిని తీసుకోవడం కూడా తగ్గుతుంది. అందువల్ల డీహైడ్రేషన్ అవకాశాలు కూడా పెరుగుతాయి. మద్యం తీసుకోవడం తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ, ఇది శరీరాన్ని విస్తృతంగా డీహైడ్రేట్ చేస్తుంది. ఇది గర్భధారణ సమయంలో అనేక సమస్యలకు దారి తీస్తుంది.

 

హాలీ బట్ ఫిష్ :

ఉత్తర పసిఫిక్ మరియు అట్లాంటిక్ జలాలకు చెందిన హాలీ బట్ ప్రోటీన్, సెలీనియం, నియాసిన్ మరియు ఓమెగా 3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం. గర్భధారణ సమయంలో ఈ చేపను తక్కువ పరిమాణంలో తినడం సురక్షితం. ఏది ఏమైనా శీతాకాలంలో హాలీ బట్ సీజన్ ముగుస్తుంది. మీరు వీటిని మార్కెట్ లో కొనాలంటే కృత్రిమ ఆహారాల ద్వారా పెంచినవి మాత్రమే దొరుకుతాయి. వాటిలో సరైన పోషకాలు ఉండవు. శీతాకాలపు గర్భధారణ సమయంలో ఈ రకమైన ఆహారాలను కచ్చితంగా నివారించాలి.

 

ఆయా సమయాలలో దొరకని పండ్లు మరియు కాయగూరలు గర్భధారణ సమయంలో ఉపయోగమా ?

 

మామూలు పండ్లు కాయగూరలతో పోల్చినట్లయితే, ఆయా సమయాలలో లభించే పండ్లు కాయగూరలు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైనవి మరియు ప్రయోజనకరంగా ఉంటాయి. అయినప్పటికీ మార్కెట్లలో కోల్డ్ స్టోరేజ్ వంటి టెక్నాలజీని ఉపయోగించి వాటిని తాజాగా ఉంచుతున్నందుకు కృతజ్ఞతలు.

 

ఆయా సమయాలలో పండే పండ్లు మరియు కాయగూరల యొక్క తాజాదనాన్ని నిలుపడానికి కోల్డ్ స్టోరేజ్ లో ఉంచి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. రవాణాలో ఈ పండ్లు మరియు కాయగూరలు యొక్క సహజ చక్కెరలు, విటమిన్లు, ఖనిజాలను కోల్పోతాయి. అందువలన ఆయా సమయాలలో దొరికే పండ్లు మరియు కాయగూరలతో పోల్చినట్లయితే మామూలు సమయాలలో దొరికే పండ్లు మరియు కాయగూరలు తక్కువ ఆరోగ్యాన్ని కలిగి ఉంటాయి.

 

మీరు గర్భవతి గా ఉన్నట్లయితే ఆరోగ్యం జాగ్రత్త...

శీతాకాలము మార్కెట్లో లభించే అన్ని ఆహారాలు గర్భధారణ సమయంలో తినడం సురక్షితమేనా ? శీతాకాలపు గర్భధారణ సమయంలో సాధారణ శీతాకాలంలో తినే ఆహారాలు తీసుకోవచ్చా? మీకు కూడా అదే సందేహాలు ఉన్నాయా? శీతాకాలపు గర్భధారణ సమయంలో ఏ ఆహారాలు నివారించాలో మరియు ఏమి తినాలో తెలుసుకోండి. శీతాకాలపు గర్భధారణ సమయంలో నివారించాల్సిన అన్ని ఆహారాలను మీరు గమనించారని మేము ఆశిస్తున్నాము.


శీతాకాలపు గర్భధారణ సమయంలో తినకూడని మరికొన్ని ఆహారాలు, పండ్లు మరియు కాయగూరల జాబితా మీ దగ్గర ఉందా? క్రింది వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మరియు సూచనలను మాతో పంచుకోండి !

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • 1
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.

| Nov 01, 2020

Sithaphal tinnocha

  • Reply
  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}