• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

గర్భధారణ సమయంలో జంక్ ఫుడ్ తీసుకోవడం వలన కలిగే దుష్ప్రభావాలు

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jan 07, 2021

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

గర్భధారణ సమయంలో అనారోగ్యకరమైన ఆహారాలు తినాలి అనిపించే కోరికలను ఆపడం కష్టం. ముఖ్యంగా జంక్ ఫుడ్. వేపుడు కూరలు నుండి అర్ధరాత్రి ఐస్క్రీముల వరకు గర్భధారణ సమయంలో మహిళలకు కొన్ని అందమైన క్రేజీ ఆహారపు కోరికలు ఉంటాయి. ఇటువంటి కోరికలు ఉన్న మహిళలు తీవ్రమైన హార్మోనల్ ప్రభావాలను నిందించండి. ఇది వారి రుచి మరియు వాసనల యొక్క భావన లో ప్రధాన పాత్ర పోషిస్తుంది .కాబట్టి మీరు ఎప్పుడూ బంగాళా దుంప ప్రింగెల్స్ చిప్స్ డబ్బాను వాసన పీల్చుకుంటూ ఉండాలి అనిపించినా కూడా ఆశ్చర్యపోకండి.

 

అంతే కాకుండా , ఆ కోరికలను తీర్చుకోవడానికి కూడా చాలాసాకులు ఉంటాయి. కానీ గర్భధారణ సమయంలో జంక్ ఫుడ్ తినే తల్లులకు మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడే పిల్లలు పుడుతారు అని పరిశోధనలు చెబుతున్నాయి . గర్భం ప్రారంభమైనప్పటి నుండి శిశువు ప్రసవించే వరకు మీ శరీరంలో విపరీతమైన మార్పులు జరుగుతాయి. మరియు తల్లులు తీసుకునే ఆహారం గర్భంలో ఉన్న పిండం అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తుంది.

 

కొన్ని కోరికలు బాగానే ఉన్నప్పటికీ, జంక్ ఫుడ్ కోసం తల్లి ఆశ పడినట్లయితే అభివృద్ధి చెందుతున్న బిడ్డకు ప్రమాదకరం. అటువంటి పరిస్థితులలో మనం దానిని ఎలా తీసుకోగలం ! మనం ఇప్పుడు జంక్ ఫుడ్ అంటే ఏమిటో తెలుసుకుందాం.

 

జంక్ ఫుడ్ అంటే ఏమిటి ?

జంక్ ఫుడ్ అంటే మనం సాధారణంగా అనుకునేది బర్గర్లు, పిజ్జాలు మరియు పాస్తా. ఏదిఏమైనప్పటికీ, జంక్ ఫుడ్ యొక్క సరైన నిర్వచనం మన శరీరానికి ఎటువంటి ఉపయోగము లేని ఆహారము మరియు  శరీరం దీనిని చెత్తగా పరిగణిస్తుంది . కాబట్టి వాస్తవానికి మీరు తినే ఆహారంలో క్రింద పేర్కొన్న అన్ని గుణాలు ఉన్నట్లయితే మీరు తినే ఆహారం జంక్ ఫుడ్.

 

1. ఉప్పు శాతం అధికంగా ఉండటం :

జంక్ ఫుడ్ లో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇందులోని మయోని మరియు ఇతర సాస్లు చాలా రుచికరమైనవి మరియు తినడానికి ఎంతో ఉత్సాహంగా ఉంటాయి. ఉప్పు ఎక్కువగా ఉండే ప్రాసెస్ చేసిన జున్ను కూడా ఇందులో ఉంటుంది అని మర్చిపోకూడదు . గర్భధారణ సమయంలో ఎక్కువ ఉప్పు మంచిది కాదు. ఎందుకంటే ఇది శరీరంలో నీరు నిలుపుకోవడానికి దారితీస్తుంది. దీని ఫలితంగా పాదాలు మరియు చేతులలో వాపు వస్తుంది . అదనంగా , ఇది గర్భధారణ రక్తపోటుకు (అధిక రక్తపోటు) దారితీస్తుంది.

 

2. ఫైబర్ లేకపోవడం :

గర్భధారణ సమయంలో ఎక్కువ ఫైబర్ అవసరం ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వలన మలబద్ధకం రాకుండా ఉంటుంది. జంక్ ఫుడ్ లో ఎంతమాత్రము ఫైబర్ ఉండదు. తద్వారా మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ప్రేగు కదలికలపై ఒత్తిడి తీసుకురావడం వలన మీ పిండం యొక్క సంచి కూడా చీల్చబడవచ్చు.

 

3. చక్కెర మరియు కొవ్వు :

ముందు చెప్పినట్లుగా జంక్ ఫుడ్ లో ఉప్పు శాతం ఎక్కువగా ఉండటం మాత్రమే కాదు. ఇందులో చక్కెర మరియు కొవ్వు పదార్థాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు , ఫ్రెంచ్ ఫ్రైస్ నూనె మరియు ఉప్పుతో నింపబడతాయి.  మీ పిజ్జా మరియు పాస్తా సాస్ వంటి వాటిలో చక్కెర ఉంటుంది . ఆపై డోనట్స్ లో ఉప్పు, చక్కెర మరియు కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. ఉప్పు చక్కెర మరియు కొవ్వులతో నిండి ఉండడం అన్నది జంక్ఫుడ్ యొక్క మొదటి లక్షణం. గర్భధారణ సమయంలో ఎక్కువ చక్కెర తీసుకోవడం వలన గర్భధారణ మధుమేహానికి దారితీస్తుంది . మరియు ఇది శిశువు యొక్క ఆరోగ్యకరమైన అభివృద్ధికి కూడా ఆటంకం కలిగిస్తుంది . గర్భధారణ మధుమేహంతో ఉన్న తల్లులకు పిల్లలు అధికబరువుతో జన్మించే అవకాశం ఉంది.

 

కాబట్టి , జంక్ ఫుడ్ అంటే ఏమిటో ఇప్పుడు మీకు తెలుసు . ఇప్పుడు అది తల్లి నుండి బిడ్డకు ఎలా సంభవిస్తుందో చూద్దాం.

 

గర్భధారణ సమయంలో జంక్ ఫుడ్ తినడం వలన శిశువును ఎలా ప్రభావితం చేస్తుంది ?

తల్లి కాబోతున్న వారు ఎటువంటి విలువలు లేని ఉప్పు మరియు చక్కెర శాతం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వలన, అది మావి ద్వారా గ్రహించబడుతుంది. తద్వారా శిశువులు స్థూలకాయము , మానసిక మరియు శారీరక రుగ్మతలతో బాధపడతారు.

 

గర్భధారణ సమయంలో జంక్ ఫుడ్ తినడం చెడ్డదా ?

అవును, ముఖ్యంగా గర్భధారణ సమయంలో జంక్ ఫుడ్ తినడం ఎంత మాత్రమూ మంచిది కాదు. ఎందుకంటే మీరు క్రమం తప్పకుండా జంక్ఫుడ్ తింటూ ఉన్నట్లయితే, మీరు మరియు మీ బిడ్డ  ఆరోగ్య ప్రమాదంలో పడుతున్నారు. మీరు కూడా అవాంఛితమైన మరియు అనారోగ్యకరమైన బరువు పెరుగుతారు. ఇది డెలివరీ సమయంలో ఎన్నో సమస్యలను కలిగిస్తుంది. ఎందుకంటే గర్భధారణ సమయంలో పెరిగిన బరువును తగ్గించ జాలరు.

 

గర్భధారణ సమయంలో జంక్ ఫుడ్స్ యొక్క హానికరమైన ప్రభావాలు ఏమిటి ?

జంక్ ఫుడ్స్ ఆకలి పుట్టించేవిగా ఉంటాయి. కానీ చెత్త తినడం ఎంతో హానికరం .ఇది ఒక సాధారణ వ్యక్తినే చాలా తేలికగా ప్రభావితం చేస్తుంది . కాబట్టి గర్భిణీ స్త్రీ కి మరి ఎంత హానికరం అవుతుందో మీరే ఊహించవచ్చు. ఇది గర్భం లోపల ఉన్న శిశువుపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.

 

1. అనారోగ్యకరమైన మరియు అవాంఛిత మైన బరువు పెరుగుట :

జంక్ ఫుడ్స్ తినడం వలన కనిపించే స్పష్టమైన లక్షణం బరువు పెరగడం. జంక్ ఫుడ్స్ ఒక వ్యక్తిపై అధిక బరువు మరియు ఊబకాయాన్ని కలిగిస్తాయి. గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో కలిగే  తీవ్రమైన సమస్యలకు ఇది చాలా ప్రమాదకరం. పర్యవసానాలు అధిక రక్తపోటు, గర్భధారణ ప్రేరిత రక్తపోటు మరియు వివిధ జనన లోపాలు సంభవిస్తాయి. అందువలన నష్టాలను తగ్గించడానికి ఊబకాయం ఉన్నవారు బరువు పెరుగుటపై పరిమితిని కొనసాగించాలి. శారీరకంగా స్థిరంగా మరియు ఆరోగ్యకరంగా ఉన్న తర్వాత మాత్రమే గర్భధారణకు ప్లాన్ చేసుకోవాలని వైద్యులు తరచుగా జంటలకు సిఫార్సు చేస్తారు. ముఖ్యంగా తల్లులకు. ఎవరైనా ఊబకాయం కలిగి ఉన్నట్లయితే తరువాతి  నెలల్లో అదనపు బరువు మోయడం చాలా కష్టం అవుతుంది. ఊబకాయం కారణంగా గర్భస్రావం జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది.

 

2. పిండం అభివృద్ధి :

గర్భధారణ సమయంలో ప్రొటీన్ లేకపోవడం వలన పిండం యొక్క మూత్రపిండాల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని మీకు తెలియకపోవచ్చు. మీరు ప్రోటీన్ల లోపం వున్న ఆహారం తీసుకున్నట్లయితే సంతానం యొక్క మూత్రపిండాలు అభివృద్ధి చెందవు. కాబట్టి ఈ ప్రక్రియ యుక్త వయస్సుకు చేరుకునే సమయానికి పిల్లలు అధిక రక్తపోటు మరియు మూత్రపిండ వ్యాధి యొక్క బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరైన పోషణ లేకపోవడంవలన వయోజన రక్తపోటు మరియు కొరోనరీ గుండె జబ్బులు సంభవించవచ్చు అని వైద్యులు తెలుపుతున్నారు.

 

3. అకాల డెలివరీ ప్రమాదాన్ని పెంచుతుంది :

ఫైబర్ లేని జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వలన ప్రేగుల మీద అనవసరమైన ఒత్తిడి కలుగుతుంది. ఇది వాటర్ బ్యాగ్ చీలి పోవడానికి దారి తీస్తుంది. తద్వారా గర్భస్రావం జరుగుతుంది.

 

4. మలబద్ధకం :

మలబద్ధకం గర్భస్రావానికి దారితీసే మరొక ప్రమాదకరమైనది . ఎందుకంటే ఇది మీ ప్రేగుల మీద అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుంది.

 

5. మానసిక అపరిపక్వత :

మీరు గర్భధారణ సమయంలో జంక్ మరియు కొవ్వు గల ఆహారాన్ని ఎక్కువగా తినడం వలన, మీలో విపరీతమైన మార్పులు తలెత్తుతాయి. పిల్లలకు బాల్యంలో వచ్చే ఊబకాయం కారణంగా ఏకాగ్రత లోపించడం మరియు గ్రహణ శక్తి తక్కువగా ఉంటుంది అని డాక్టర్లు చెబుతున్నారు. డోనట్స్, చిప్స్, కొవ్వు పదార్థాలు మరియు క్యాండీలు ఎక్కువగా తినే గర్భిణీ స్త్రీలకు లోపభూయిష్టమైన బిడ్డలు పుట్టే ప్రమాదం ఉందని అనేక రకాల పరిశోధనలు చెబుతున్నాయి. సాధారణంగా బిడ్డ మెదడుతో పాటు తల్లి మెదడు కూడా స్పందించడం మొదలు పెడుతుంది. అందువలన జంక్ ఫుడ్  బిడ్డతో పాటుగా తల్లి ప్రవర్తనలో కూడా రుగ్మతలను తెస్తుంది.

 

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి ?

శిశువుపై చూపే ప్రతికూల ప్రభావాలతో పాటు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన గర్భధారణను కఠినతరం చేస్తుంది. " అలసట , గుండెల్లో మంట , స్ట్రెచ్ మార్కు లు, గర్భధారణ మధుమేహం మరియు ఎన్నో రకాల గర్భధారణ సంబంధిత ప్రమాదాలను పెంచుతుంది.

 

వీటిని తినాలని అనిపిస్తున్నట్లయితే :

పొటాటో చిప్స్, నాచోస్, చీటోస్

 

వీటిని ప్రయత్నించండి :

కర్రపెండలంతో తయారుచేసిన చిప్స్, డ్రైడ్ సీవీడ్.

 

వీటిని తినాలని అనిపిస్తున్నట్లయితే :

మిఠాయి, కేకులు

 

వీటిని ప్రయత్నించండి :

అరటి పండ్లు, ఆప్రికాట్ లేదా ఇతర పండ్లు (బాదం , వెన్నతో కలిపిన డార్క్ చాక్లెట్లు) ఇంట్లోనే అందంగా తయారు చేసుకున్న కప్ కేకులు.

 

దీనిని తినాలని అనిపిస్తున్నట్లయితే :

ఐస్ క్రీమ్ (మీరు ఐస్ క్రీమ్ ను అప్పుడప్పుడు తీసుకోవచ్చు. కానీ , ప్రతి రోజు కాదు)

 

దీనిని ప్రయత్నించండి :

ఫ్రూట్ ఫ్లేవర్ ఉన్న పెరుగు.

 

ఆరోగ్యకరమైన మరికొన్ని ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలు :

 

1.తురిమిన చీజ్, మెత్తని ట్యూనా, సాల్మన్ లేదా సార్డినస్ తో శాండ్విచ్ , పీటా బ్రెడ్ మరియి సలాడ్లు

 

2. క్యారెట్, సెలేరి లేదా కీర దోసకాయలతో సాలాడ్లు

 

3. కొవ్వు శాతం తక్కువగా ఉండే పెరుగు

 

4. చపాతీ, కాబులి శనగలు మరియు కాయకూరలు

 

5. ముగ్గిన ఆప్రికాట్స్, ఫిగ్స్, ఎండు ద్రాక్ష

 

6. బీన్స్ మరియు కాయగూరల సూప్

 

7. తీయని అల్పాహార తృణధాన్యాలు లేదా పాలతో తయారు చేసిన పాయసం

 

8. పాలతో తయారు చేసిన పానీయాలు లేదా చక్కెర లేని పండ్లరసాలు

 

9. తాజా పండ్లు

 

10. ఫ్రై చేసిన బీన్స్ లేదా వేపిన బంగాళాదుంపలు

 

ఇప్పుడు మళ్లీ బర్గర్ ను ముట్టుకొనేముందు తల్లి కాబోతున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.


గర్భధారణ సమయంలో జంక్ ఫుడ్ యొక్క హానికరమైన ప్రభావాలపై వచ్చిన ఈ బ్లాగ్ మీకు నచ్చిందా ? దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మరియు సూచనలను మాతో పంచుకోండి. మీ అభిప్రాయాలను తెలుసుకోవడం మాకెంతో సంతోషం.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}