గర్భధారణ సమయంలో మీ జఘన జుట్టును షేవ్ చేయడం సురక్షితమేనా ?

Aparna Reddy సృష్టికర్త నవీకరించబడిన Dec 03, 2020

మీ ప్రసవ సమయం సమీపిస్తుండటంతో, అనేకమైన ఇతర ఆందోళనలతోపాటు మీ క్రింది భాగంలో శుభ్రం చేసుకొని వెళ్ళాలా అని ఆలోచిస్తున్నారా ? గర్భధారణ సమయంలో జఘన జుట్టును తొలగించాలి అన్నది తల్లి కాబోతున్న చాలామంది మనస్సులలో సాధారణంగా ఉంటుంది. ప్రత్యేకంగా షేవ్ చేయాలా వద్దా అని. ఈ బ్లాగ్ ద్వారా మేము గర్భధారణ సమయంలో జఘన జట్టును షేవ్ చేయడంలో ఉన్న కొన్ని లాభాలు మరియు సమస్యలను మీ ముందు ఉంచుతున్నాము తద్వారా మీరు మీ ఎంపిక చేసుకోవచ్చు. మరింత సమాచారం..
డెలివరీకి ముందు జఘన జుట్టును ఎందుకు షేవ్ చేస్తారు ?
చాలా ఆస్పత్రుల్లో మీ డెలివరీకి ముందు సిబ్బంది మీ జఘన జుట్టును షేవ్ చేస్తారు. లేదా మీరు డెలివరీ రూమ్ లోపలికి రాక ముందే దాన్ని మీరు షేవ్ చేసుకోమని సలహా ఇస్తారు. అలా చేయడానికి గల కారణాలు ఇక్కడ ఉన్నాయి..
ఇది నిరూపించబడనప్పటికీ, జఘన జుట్టును తొలగించడంవలన డెలివరీ సమయంలో అంటువ్యాధులు వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని నమ్ముతారు.
తల్లి యొక్క ఉదర భాగాన్ని కట్ చేసే ముందు పరిశుభ్రతను పాటించేందుకు సిజేరియన్ సమయంలో దీనిని చేస్తారు.
జఘన జుట్టును షేవ్ చేయడం వలన కలిగే ప్రయోజనాలు..
జఘన జుట్టు షేవ్ చేయడం వలన కలిగే కొన్ని లాభాలు ఇక్కడ ఉన్నాయి :
ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది :
జఘన ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యమైనది. ఆ ప్రాంతంలో చెమట పట్టకుండా ఉంటుంది. తద్వారా అనేక రకాల సూక్ష్మజీవులు వలన అంటువ్యాధులు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
డెలివరీ సమయంలో సౌలభ్యం :
ప్రసవం సమయంలో మీ వైద్యుడు ఫోర్సెప్స్ లేదా మరేదైనా వాడాల్సిన అవసరం ఉంటే జఘన ప్రాంతం శుభ్రంగా ఉంటే సౌలభ్యంగా ఉంటుంది.
జఘన జుట్టును షేవ్ చేయడం వలన కలిగే కొన్ని ప్రమాదాలు :
మన శరీరంలో అన్ని భాగాలకు జరిగినట్టుగా జఘన జుట్టును షేవ్ చేసే సమయంలో కూడా పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి..
ఎప్పుడైతే షేవ్ సరిగ్గా చేయకుండా కొన్ని గాట్లు పడినప్పుడు అది ఇన్ఫెక్షన్ కు దారి తీసే అవకాశం ఉంటుంది. అది షేవింగ్ యొక్క ప్రయోజనానికి అర్థం లేకుండా పోతుంది. మీ జఘన ప్రాంతాన్ని షేవ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతో ముఖ్యం.
జుట్టు మళ్లీ పెరగడం ప్రారంభించినప్పుడు దురద మరియు ఎంతో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
గర్భధారణ సమయంలో జఘన జట్టును షేవ్ చేయడం వలన కలిగే మరొక సమస్య ఏమిటంటే, మీ పొట్ట అడ్డుగా వస్తుంది ! మీరు చూడలేని ప్రాంతాన్ని షేవ్ చేయటం కష్టం. దీనివలన అనుకోకుండా ఘాట్లు పడడానికి అవకాశం ఉంటుంది. అందువలన మీకు సౌకర్యవంతంగా ఉన్న మరొకరిని షేవింగ్ చేయమనడం మంచిది.
గర్భధారణ సమయంలో జఘన జుట్టును షేవింగ్ చేసేటప్పుడు మనసులో
ఉంచుకొనవలసిన విషయాలు.
సహాయం తీసుకోండి :
ప్రసవానికి ముందు ఒక నర్సు మీ జఘన జుట్టును షేవ్ చేయడం మీకు అసౌకర్యంగా ఉన్నట్లయితే ఆ పని మీరే చేసుకోవచ్చు లేదా మీ భాగస్వామిని సహాయం చేయమని అడగండి. సరైన పరిశుభ్రతను మరియు జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తుంచుకోండి.
కొత్త రేజర్ :
ఆస్పత్రిలో షేవ్ జరిగినట్లయితే సిబ్బంది అంతవరకు ఉపయోగించని కొత్త రేజర్ ను ఉపయోగిస్తున్నారో లేదో పరిశీలించుకోండి. ప్రారంభించేముందు నర్స్ కూడా యాంటీసెప్టిక్ లోషన్‌తో జఘన భాగాన్ని తప్పక శుభ్రపరచాలి.
మీ వైద్యుని సంప్రదించండి :
మీ జఘన జుట్టును సేవ్ చేయడం మీకు సౌకర్యంగా లేనట్లయితే మరేమైనా ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయో డాక్టర్ తో మాట్లాడండి. ముందుగా గైనకాలజిస్టును సంప్రదించకుండా ఎటువంటి ప్రయత్నాలు చేయకండి.
జఘన ప్రాంతాన్ని షేవ్ చేయడం ఎంతో వ్యక్తిగత విషయం. అది మీ పరిశుభ్రత మరియు మీ అలవాట్లు మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మీకు ఏ ఎంపికలు ఉన్నాయో డాక్టర్‌ను సంప్రదించి తెలుసుకోండి. మీకు ఉత్తమమైన దానిని ఎంచుకోండి. మేము మీ సురక్షితమైన ప్రసవాన్ని కోరుకుంటున్నాము. !
గర్భధారణ సమయంలో జఘన జట్టును షేవ్ చెయ్యటంపై వచ్చిన ఈ బ్లాగ్ మీకు ఉపయోగకరంగా ఉందా ? దయచేసి మీ అభిప్రాయాలను ఈ క్రింది వ్యాఖ్యల విభాగంలో మాతో పంచుకోండి. మీ అభిప్రాయాలు తెలుసుకోవడం మాకెంతో సంతోషం !
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు