గర్భధారణ సమయంలో మస్క్ మిలన్ (కర్బూజ) విత్తనాల ప్రయోజనాలు

Aparna Reddy సృష్టికర్త నవీకరించబడిన Dec 11, 2020

గర్భధారణ సమయంలో మహిళలు సంతోషంగా ఆనందంగా ఉంటారని మనకి స్పష్టంగా తెలుసు. ఈ వాస్తవం మీకు తెలుసు కనుక మీరు మీ గురించి జాగ్రత్త తీసుకోవడమే కాదు, మరొక జీవి యొక్క బాధ్యత కూడా మీకు ఉంటుంది. అందువలన ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిగణలోనికి తీసుకోవడం ఎంతో అవసరం. ఇది మీ అభివృద్ధి మరియు పెరుగుదలకు మరియు శిశువు ఆరోగ్యానికి కూడా దోహదపడుతుంది.
గర్భధారణ సమయంలో మస్క్ మిలన్ విత్తనాలు ఆరోగ్యానికి మంచిదా ? ఈ విషయమై మీలో అనేక ప్రశ్నలు ఉండవచ్చు అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. గర్భధారణ సమయంలో మస్క్ మిలన్ విత్తనాలను తీసుకోవడం వలన అపారమైన ప్రయోజనాలు ఉన్నాయి.
మస్క్ మిలన్ యొక్క ప్రయోజనాలు :
మీ ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు , విటమిన్లతో కూడిన మస్క్ మిలన్ వంటి పండ్లు కావాలి. అవి విటమిన్ ఏ, బీ మరియు సి సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా పొటాషియం మరియు ఫోలిక్ యాసిడ్ కూడా కలిగి ఉంటాయి.
గర్భధారణ సమయంలో మస్క్ మిలన్ విత్తనాలు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు :
1. శక్తిని సరఫరా చేస్తాయి :
పుష్కలమైన విటమిన్లు మరియు ఖనిజాలు ఉండటంవలన మస్క్ మిలన్ విత్తనాలు మీ శక్తి స్థాయిని పెంచుతాయి. తద్వారా శిశువు ఆరోగ్యానికి కూడ ఎంతో మంచిది.
2. జీర్ణక్రియకు సహాయపడుతుంది :
ఇది గ్యాస్ ఏర్పడటం, ఎసిడిటీ మరియు గుండెల్లో మంట వంటి జీర్ణ సమస్యల నుండి కాపాడుతుంది.
3. మలబద్ధకం లేకుండా సౌకర్యాన్ని ఇస్తుంది :
దీనిలో నీటి శాతం అధికంగా ఉండటం వలన గర్భధారణ సమయంలో మస్క్ మిలన్ తినడం శరీరానికి ఎంత ఓదార్పునిస్తుంది.
4. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది :
గర్భధారణ సమయంలో మస్క్ మిలన్ విత్తనాలను తీసుకోవడానికి అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే అది మీ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వలన జలుబు మరియు ఫ్లూ నుంచి దూరంగా ఉంచడానికి వీలు కల్పిస్తుంది.
5. రక్తహీనతను తగ్గిస్తుంది :
సరైన మోతాదులో విటమిన్ సి తీసుకోవడం వలన మీ శరీరంలో ఇనుము సరఫరా ద్వారా ఎర్ర రక్త కణాల ఉత్పత్తి జరుగుతుంది.
6. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది :
ఇందులో అధిక శాతం ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఇది మీ శిశువు ఆరోగ్యానికి సంబంధించి ప్రతికూల ప్రభావాలను నివారిస్తుంది.
7. పిండం యొక్క అసాధారణతలను నివారిస్తుంది :
విటమిన్ బి9, జింక్, పొటాషియం మరియు ఫోలిక్ ఆసిడ్ పిండం యొక్క అభివృద్ధికి మరియు శిశువు యొక్క కణజాలాలకు అత్యవసరం.
8. ఆరోగ్యకరమైన దంతాలు మరియు ఎముకలు నిర్మాణాన్ని సులభతరం చేస్తుంది :
మస్క్ మిలన్ లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలు మరియు దంతాల అభివృద్ధిని పెంచుతుంది. పిండం యొక్క నాడీ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
9. గర్భధారణ సమయంలో అధిక బరువు ఉన్న మహిళలకు సహాయపడుతుంది :
అధిక బరువు రక్తపోటు మరియు గర్భస్రావం యొక్క ప్రమాదాలకు దారితీస్తుంది. మస్క్ మిలన్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
10. ఎసిడిటీ నుండి కాపాడుతుంది :
మస్క్ మిలాన్ మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఎసిడిటీ వచ్చే అవకాశాలను నివారిస్తుంది.
ఒకవేళ మీకు మస్క్ మిలన్ ఎలర్జీ ఉన్నట్లయితే దానిని తినకపోవడం మంచిది. లేనట్లయితే, గర్భధారణ సమయంలో మస్క్ మిలన్ విత్తనాలను మీరు తప్పకుండా తినాలి. క్రిమిసంహారక మందులతో ఉన్న పండుని తినటంలేదని నిర్ధారించుకోండి. బ్యాక్టీరియా ప్రమాదకరమని రుజువు చేయబడింది. పండు తీసుకునే ముందు ఎప్పుడూ శుభ్రంగా కడగాలి అని గుర్తుంచుకోండి.
గర్భధారణ సమయంలో మస్క్ మిలన్ సురక్షితమా , కాదా అని తెలుసుకోవాలనే మీ తపనను ఈ బ్లాగ్ పరిష్కరిస్తుందని నేను ఆశిస్తున్నాను.
ఈ బ్లాగ్ మీకు నచ్చిందా ? ఇది మీకు ఉపయోగకరంగా ఉందా ? దయచేసి దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. మీ అభిప్రాయాలను తెలుసుకోవడం మాకెంతో సంతోషం !
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు