• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
గర్భం

గర్భధారణ సమయంలో సోరియాసిస్ : కారణాలు, లక్షణాలు మరియు నివారణ

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Dec 03, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

సొరియాసిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. ఈ అసాధారణమైన వ్యాధి కారణంగా మీ చర్మంపై ఎరుపు మరియు దురదతో కూడుకున్న మచ్చలు ఏర్పడతాయి. ఇవి మీ అరచేతుల వెనుక భాగంలోనూ, నాభి మరియు పుర్రె ప్రాంతాలను సాధారణంగా ప్రభావితం చేస్తాయి. గర్భధారణ సమయంలో సోరియాసిస్ సంభవించవచ్చు లేదా మీకు ఇప్పటికే సొరియాసిస్ ఉన్నట్లయితే కొన్ని మార్పులు సంభవిస్తాయి. సొరియాసిస్కు చికిత్స లేదు. కానీ దాని ప్రభావాన్ని తగ్గించేందుకు మంచి చికిత్స అందుబాటులో ఉంది.

 

సొరియాసిస్కు కారణాలు :

 

* జన్యుపరమైనవి :

మీ కుటుంబానికి సోరియాసిస్ చరిత్ర ఉన్నట్లయితే  మీకు సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సొరియాసిస్ తో బాధపడే వారిలో 1/3 వంతు కుటుంబ చరిత్ర ఉన్న వారే.

 

* హెచ్ఐవి :

హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తులలో సొరియాసిస్ రేటు హెచ్ఐవి లేని వ్యక్తుల కంటే ఎక్కువగా ఉంటుంది.

 

* జీవనశైలి :

దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు, వాతావరణంలో మార్పు, చర్మం పొడిబారడం, అధికంగా మద్యం సేవించడం మరియు ధూమపానం వల్ల సోరియాసిస్ వస్తుంది.

 

సోరియాసిస్ లక్షణాలు :

 

తెల్లటి పొలుసులతో కప్పబడిన ఎర్రని చర్మం శరీరమంతా విస్తరిస్తుంది.

 

గోర్లు మందంగా, చీలినట్లుగా,  గుంటగా అయి రంగుమారుతాయి.

 

చర్మంపై ఎర్రటి మచ్చలు ఏర్పడుతాయి.

 

ప్రభావిత ప్రాంతంలో దురద లేదా మంటలు ఏర్పడతాయి.

 

గర్భం సొరియాసిస్ను ప్రభావితం చేస్తుందా ?

 

కేవలం 10 నుండి 20 శాతం మంది  స్త్రీలలో మాత్రమే సొరియాసిస్ ప్రభావితం చేస్తుంది. గర్భిణీ స్త్రీలలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు గర్భవతిగా ఉన్నప్పుడు ఈ సొరియాసిస్ ప్రభావం 40 శాతం అధికం అయ్యే అవకాశం ఉంటుంది. మీ పరిస్థితి దిగజారుతున్నట్లుగా మీరు గమనించినట్లయితే ఈ లక్షణాలను ఎదుర్కోవడానికి సురక్షితమైన, ఉత్తమమైన మార్గాన్ని కనుగొనేందుకు మీ వైద్యుని సంప్రదించండి.

 

సొరియాసిస్ కు చికిత్స :

 

శరీరంలో సోరియాసిస్ 5 నుండి 10 శాతానికి మించకుండా ఉండే తల్లులలో సమయోచిత నివారణలు ఉత్తమంగా పనిచేస్తాయి. చర్మం తేమగా ఉండేందుకు ప్రభావిత ప్రాంతంపై సిఫార్సు చేసిన లోషన్లను రాయండి.

 

మీ శరీరంపై సోరియాసిస్ తీవ్రంగా ఉండి సమయోచిత నివారణలు పని చేయనట్లయితే, మీరు యు వి బి ఫోటోగ్రఫీ కోసం వెళ్ళవచ్చు.

 

చాలా మంది గర్భిణీ స్త్రీలకు సమయోచిత నివారణలు లేదా తేలికపాటి చికిత్స చేయవచ్చు. అయితే సొరియాసిస్ తీవ్రంగా ఉన్న మహిళలు మెరుగైన చికిత్స కోసం మందులు వాడవలసి ఉంటుంది. గర్భధారణ సమయంలో అన్ని మందులు సురక్షితం కాదని గుర్తుంచుకోండి. మీ వైద్యుని సలహాతో మీ లక్షణాలకు సురక్షితమైన, ఉత్తమమైన చికిత్సను ఎంపిక చేసుకోండి.

 

ఒత్తిడి మీ సోరియాసిస్ స్థాయిని మరింత దిగజార్చే అవకాశం వుంది. మీ ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం ఎల్లప్పుడూ మంచిది. అదేవిధంగా ఆరోగ్యకరమైన జీవన విధానము మరియు సమతుల్య ఆహారము కూడా సహాయపడుతుంది.

 

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మీకు సోరియాసిస్ లక్షణాలు కనిపించినట్లయితే మీ వైద్యునికి తెలియజేయడం ఎంతో ముఖ్యం. సకాలంలో చర్యలు తీసుకోవడం మరియు సరైన చికిత్స గర్భధారణ సమయంలో ఈ లక్షణాలను నియంత్రించడానికి సహాయపడుతుంది.

 

ఈ బ్లాగ్ మీకు నచ్చిందా ? ఇది మీకు ఉపయోగకరంగా ఉందా ? దయచేసి దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. మీ అభిప్రాయాలను తెలుసుకోవడం మాకెంతో సంతోషం !

 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}