• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

గర్భధారణ సమయంలోనూ మరియు ఆ తరువాత ఏర్పడే స్ట్రెచ్ మార్క్లకు బాదం నూనె మంచిదా?

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Nov 24, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

తల్లి కావడం అన్నది స్త్రీ జీవితంలో అత్యంత అద్భుతమైన భావోద్వేగం అయితే, గర్భం అనేది అందులో ఒక దశ. గర్భధారణ సమయంలో ఆమె శరీరం అనేక శారీరక మరియు హార్మోన్ల సమస్యలను ఎదుర్కొంటుంది. ఆమె శరీరంలోని అపరిమితమైన పరిమాణాలతో మానసిక స్థితి అనూహ్యంగా మారుతుంది. ఈ మార్పులు ప్రసవానికి ముందు లేదా గర్భధారణ సమయంలో మాత్రమే అనే పరిమితి లేదు. డెలివరీ తర్వాత కూడా మీ శరీరాన్ని ప్రభావితం చేసే స్ట్రెచ్ మార్కులు ఉంటాయి. శిశువుకు జన్మనిచ్చే ముందు ఆ తర్వాత కూడా ఆడవారిని ఈ శారీరక స్థితి చాలా నిరుత్సాహపరుస్తుంది. హార్మోన్ల ప్రభావం అధికంగా ఉండటం వలన చర్మం సాగిపోవటం, గీతలు పడడం లాంటి వాటికి కారణం అవుతుంది.

 

శరీరం పై ఏర్పడే స్ట్రెచ్ మార్కుల గురించి కొన్ని వాస్తవాలు :

కొల్లాజెన్ మరియు ఎలాస్టిక్ ఫైబర్స్ వక్రీకరణల కారణంగా చర్మంలో ఈ మార్పు జరుగుతుంది. ఇది కొవ్వును నిల్వ చేయగల కొన్ని శరీర భాగాల చర్మంపై ఏర్పడే లోపము.  ఇది గర్భిణీ స్త్రీ యొక్క నడుము, ఎద, బొడ్డు, తొడలు మరియు వెనుక భాగంలో ఈ గీతల గుర్తులు ఎక్కువగా కనిపిస్తాయి.

 

గర్భధారణ సమయంలో లేదా చనుపాలు ఇచ్చే సమయంలో 85 నుండి 90% ఈ స్ట్రెచ్ మార్కులు కనిపిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.

 

ఈ స్ట్రెచ్ మార్కులు చర్మాన్ని మరియు రక్తనాళాలను విచ్ఛిన్నం చేస్తాయి .ఇవి చర్మం యొక్క రంగులో కూడా మార్పును తీసుకు వస్తాయి.

 

ఇవి జన్యు పరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీ తల్లికి ఈ గీతలు ఉన్నట్లయితే మీరు కూడా మీ గర్భధారణ సమయంలో స్ట్రెచ్ మార్కులు కలిగి ఉండే అవకాశం ఉంటుంది.

 

గర్భధారణ సమయంలో బాదం నూనె వాడటం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ స్ట్రెచ్ మార్కులను నియంత్రించడంలో బాదంనూనె అత్యంత ప్రభావవంతంగా పనిచేసే ఒక సహజ నివారణ. గర్భధారణ సమయంలో రంగు మారిన చర్మానికి బాదం నూనెను క్రమం తప్పకుండా వాడుతూ ఉన్నట్లయితే మహిళలలో మంచి ఫలితాలను గమనించవచ్చు.

 

కొన్నిసార్లు మార్కెట్లో లభించే రసాయనిక లోషన్లు లేదా క్రీములు అలర్జీని కలిగిస్తాయి. మరియు గర్భిణీ స్త్రీలలో దద్దుర్లు కలిగిస్తాయి. ఇటువంటి పరిస్థితులలో స్ట్రెచ్ మార్కుల కోసం సహజ నివారణలను ఉపయోగించడం ఎంతో మంచిది. అందుకే బాదం నూనె చాలా సరళమైనది మరియు ఈ మార్కులకు సహజ నివారిణిగా పనిచేస్తుంది.

 

గర్భధారణ సమయంలో బాదం నూనెను వాడటం సురక్షితమేనా ?

అవును, గర్భధారణ సమయంలో బాదం నూనెను వాడటం సురక్షితం. మార్కెట్లో ఈ మార్కులకు చికిత్స చేయడానికి చాలా సౌందర్య సాధనాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలోని రసాయన స్వభావం కారణంగా గర్భధారణ సమయంలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉండదు. అవి అసహజమైనవి .కాబట్టి  ఇటువంటి సమయంలో సున్నితమైన చర్మంపై చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి అనవసరమైన అలర్జీ లక్షణాలను నివారించడానికి బాదం నూనె వంటి సహజ నూనెలను వాడమని నిపుణులు సూచిస్తారు.

 

తీపి బాదం నూనె మరియు సహజ బాదం నూనెల మధ్య తేడా ఏమిటి ?

బాదం చెట్ల లో తీపి మరియు చేదు బాదం నూనెలను ఇచ్చే రెండు జాతులు ఉన్నాయి. ఈ రెండూ కూడా భౌతికంగానూ మరియు రసాయన పరంగానూ వేర్వేరు లక్షణాలను కలిగి ఉన్నాయి. వీటికి ప్రత్యేకమైన లక్షణాలు మరియు ప్రత్యేకమైన ఉపయోగాలు కూడా ఉన్నాయి. వారి చర్మ తత్వాన్ని బట్టి ఇవి కూడా మారుతూ ఉంటాయి.

 

తీపి బాదం నూనెను తినదగిన బాదం నుండి తీపి రుచి కోసం ప్రత్యేకంగా వాటిని పండిస్తారు. చేదు బాదం నూనెను వేరొక జాతికి చెందిన బాదం చెట్టు నుండి తీస్తారు మరియు ఇది రుచిలో కూడా చేదుగా ఉంటుంది.

 

తీపి బాదం నూనె ఒక స్థిరమైన నూనె. కానీ చేదు బాదం నూనెను ముఖ్యమైన నూనెగా భావిస్తారు.

 

తీపి బాదం నూనెను మసాజ్ చేసే సమయంలో ఉపయోగిస్తారు మరియు చర్మం పై నేరుగా ఉపయోగిస్తారు. అయితే చేదు నూనె సువాసనలు మరియు సుగంధాలకు మరియు ఆహార ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తారు.

 

తీపి బాదంనూనె మృదువుగా ఉండి శరీరానికి ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తుంది. అయితే చేదు బాదం నూనెను సబ్బులు, లిప్ బామ్స్ మరియు బార్ లలో వాసన కోసం ఉపయోగిస్తారు.

 

తీపి బాదం నూనెను చర్మంపై నేరుగా ఉపయోగించి చర్మాన్ని తేమగా ఉంచడానికి ఉపయోగిస్తారు. అయితే చేదు బాదం నూనె సాధారణంగా గర్భధారణ సమయంలో మసాజ్ కోసం నివారించబడుతుంది.

 

బాదం నూనె చర్మంపై ఎలా పనిచేస్తుంది ?

 

ఇందులో విటమిన్ ఈ, కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు, జింకు మరియు పొటాషియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది దెబ్బతిన్న శరీరంపై మంచి వైద్య సామర్థ్యం కలిగి ఉంటుంది.

 

బాదం నూనె స్కిన్ టోన్ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తద్వారా సాగిన గీతలు మరుగు పడతాయి.

 

ఇది చర్మానికి పోషకాల సరఫరాను పెంచుతుంది మరియు సౌకర్యవంతంగా చేస్తుంది.

 

ఇది కొల్లాజెన్ ఫైబర్ ను బలపరుస్తుంది మరియు చర్మాన్ని మెరుగుపరుస్తుంది.

 

బాదం నూనె కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్ ఫైబర్ ను బంధించి  చర్మ నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది.

 

ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు పునరుత్పత్తి కణాలను కలిగి ఉంటుంది.

 

విటమిన్ ఎఫ్, ఈ, ఏ మరియు బీ2 యొక్క గొప్ప వనరులు ఇందులో ఉండడంతో ఇది యాంటీ ఏజింగ్ ఆయిల్గా కూడా పనిచేస్తుంది.

 

లావెండర్ మరియు ఆలివ్ నూనెల కలయికతో దీనిని ఉపయోగించినప్పుడు ఇది యాంటీ స్ట్రెచింగ్ లక్షణాలను పెంపొందించుకుంటుంఉంది.

 

స్ట్రెచ్ మార్కుల కోసం బాదం నూనెను ఎలా ఉపయోగించాలి ?

 

బాదం నూనెలో గల అధిక ఏమోలయంట్ మన చర్మాన్ని సులభంగా గ్రహించగలుగుతుంది. కాబట్టి దీనిని మీరు మాయిశ్చరైజర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు మరియు స్ట్రెచ్ మార్కులు ఉన్న ప్రదేశాలలో దీన్ని అప్లై చేయవచ్చు. విటమిన్ ఈ చర్మాన్ని బాగు చేసే లక్షణాలకు ప్రసిద్ధి చెందినది. తీపి బాదం నూనె స్ట్రెచ్ మార్కులను తగ్గించడానికి సహాయపడుతుంది. వాస్తవానికి నిపుణుల అభిప్రాయం ప్రకారం తీపి మరియు చేదు బాదం నూనెలను కలిపి ఉపయోగిస్తే మరియు దానితో మీ శరీరానికి మసాజ్ చేస్తే గర్భధారణ సమయంలో వచ్చే స్ట్రెచ్ మార్కులను తగ్గించడానికి సహాయపడుతుంది అని తెలపడం జరిగింది.

 

డి ఐ వై బాదం ఆయిల్ లోషన్లు మరియు వాటిని తయారు చేసే విధానం కోసం చూస్తున్నట్లయితే, మంచి అవగాహన కోసం ఇంట్లో తయారుచేసిన బాదం ఆయిల్ ఔషధాలు ఇక్కడ ఉన్నాయి.

 

బాదం ఆయిల్ స్క్రబ్స్ మరియు వాటిని ఉపయోగించే విధానం :

 

ఏదైనా సహజ నివారణ ప్రారంభించే ముందు మృత చర్మాన్ని శుభ్రం చేయడం ఎప్పుడూ మంచిది. తద్వారా దీని ప్రభావం చర్మంలోనికి లోతుగా చొచ్చుకుపోతుంది. బాదం నూనెను స్క్రబ్స్ కోసం ఉపయోగించేటప్పుడు అందులో మరికొన్ని పదార్థాలను కూడా కలపవచ్చు.

 

బాదం నూనె మరియు పెరుగులో కొంచెం నిమ్మరసాన్ని కలిపినట్లయితే ఎంతో ప్రభావవంతమైన స్క్రబ్లా పనిచేస్తుంది. నిమ్మకాయ మెరుపు లక్షణాలకు ప్రసిద్ధి చెందినది. అందువలన ఈ స్క్రబ్ స్ట్రెచ్ మార్కులు పై బాగా పనిచేస్తుంది. మంచి ఫలితాల కోసం వారానికి రెండు సార్లు దీనిని ఉపయోగించండి.

 

బాదం నూనెలో షియాబట్టర్ మరియు మాన్గోబట్టర్ కలిపి స్నానానికి ముందు ఉపయోగించినట్లయితే ఎంతో మంచిది. గర్భధారణ సమయంలోనూ మరియు ఆ తరువాత కూడా ఈ మార్కులను తగ్గించడానికి ఇది చాలా సహాయపడుతుంది. దీనిలో కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ ను కలిగి ఉన్నట్లయితే ఇది ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది.

 

నువ్వుల నూనె మరియు బాదం నూనెల మిశ్రమాన్ని కూడా స్ట్రెచ్ మార్కులను తగ్గించడానికి అద్భుతమైన స్క్రబ్లాగా పనిచేస్తుంది. ఫలితాలు త్వరగా రావాలంటే మీరు నిద్రకుపక్రమించే ముందు ప్రతిరోజు దీనిని నెలరోజులపాటు రాసినట్లయితే మంచి ఫలితాలను ఎదురు చూడవచ్చు.

 

బాదం నూనెలో పంచదార మరియు నిమ్మరసం కలిపి రాసినట్లయితే స్ట్రెచ్ మార్కులకు ఇది మంచి స్క్రబ్లాగా పనిచేస్తుంది. నిమ్మలోని యాంటీ టాన్ లక్షణాలు ఈ మార్కులను త్వరగా తగ్గిస్తాయి.

 

స్ట్రెచ్ మార్కులు పూర్తిగా తగ్గించి బడ్డాయి అనే విషయాల గురించి ఎన్నో కథనాలు ఉన్నాయి. కానీ వాస్తవం ఏమిటంటే వాటిని పూర్తిగా తగ్గించడం అన్నది జరగదు. అయినప్పటికీ, సరైన శ్రద్ధ మరియు ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వాటిని కొంతవరకు కనిపించకుండా చేయవచ్చు. కాబట్టి ముందునుండే సరైన సంరక్షణ తీసుకోవడం ఎంతో అవసరం.

 

సరైన జీవన విధానానికి సరైన పోషణ అన్నది చాలా అవసరం. తద్వారా శరీర పరిమాణంలో హెచ్చుతగ్గులు తక్కువగా ఉంటాయి.

 

స్నానం తరువాత మరియు స్నానానికి ముందు ఉపయోగించే ప్రత్యేకమైన ఔషధాలు మార్కులను తగ్గించడానికి సహాయపడుతాయి.

 

సాధ్యమైనంతవరకు మీకు మీరు మసాజ్ చేసుకోవడానికి ఆయిల్ ను అందుబాటులో ఉంచుకోండి. ఇది మీ చర్మాన్ని త్వరగా గుణ పరచడానికి ఉపయోగపడుతుంది.

 

రాత్రికి రాత్రే ఫలితాలు రాలేదని నిరాశ చెందకండి. సానుకూల ఫలితాల కోసం వేచి చూడండి.

 

అలర్జీలు రియాక్షన్లు రాకుండా ఉండడానికి మీ వైద్య సలహా దారులతో క్రమం తప్పకుండా సన్నిహితంగా ఉండండి.


బాదం నూనెపై ఇచ్చిన ఈ సమాచారం మీ స్ట్రెచ్ మార్కులకు మెరుగైన రీతిలో చికిత్స చేయడంలో మీకు సహాయ పడుతుందని ఆశిస్తున్నాము. బాదం నూనె పై వచ్చిన ఈ బ్లాగ్ మీ స్ట్రెచ్ మార్కులకు ఉపయోగకరంగా ఉందా ? దయచేసి ఈ క్రింది వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మరియు సూచనలను మాతో పంచుకోండి.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}