• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

గర్భధారణ సమయంలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ను ఎలా నివారించాలి?

Sreelakshmi
గర్భధారణ

Sreelakshmi సృష్టికర్త
నవీకరించబడిన Nov 22, 2018

గర్భధారణ సమయంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ బారిన పడటమనేది చాలా బాధాకరమైన అనుభవము. ఎందుకంటే అది చాలా ఇబ్బందికరమైనది, బాధాకరమైనది (లేదా) కొన్నిసార్లు ఇది చాలా మొండిదైనది కూడా కావచ్చు. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్కి గల సంకేతాలు ఎరుపుదనం, వాపు, దురదలు, మంటలు & వైట్ డిస్చార్జ్ అవ్వడం. కారణమేదైనా గాని, ఫంగల్ ఇన్ఫెక్షన్ మీకు & మీ శిశువుకు ఇద్దరికీ మంచిది కాదు. కాబట్టి మీ డెలివరీకి ముందుగా దీనికి చికిత్సను అందించడమనేది చాలా ముఖ్యం. లేకపోతే, మీ శిశువు దాని చేత ప్రభావితమవుతుంది. మీ గర్భధారణ సమయంలో ఎదురయ్యే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్కు తగిన చికిత్స మార్గాలను ఈ క్రింద సూచించడం జరిగింది.

చమోమిలే(చామంతి)

కాండిడా  కు కారణమైన ఫంగస్ పెరుగుదలను నివారించడంలో చమోమిలే(చామంతి) అధికమైన పనితీరును కలిగి ఉంటుంది. ఇది మీ గర్భానికి పూర్తి సురక్షితంగానూ, మృదువైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మీరు చమోమిలే సమ్మేళనాలను కలిగిన పదార్థాలను తీసుకోవచ్చు (లేదా) ఒక కప్పు చమోమిలే టీని కూడా తాగవచ్చు. మీ గర్భధారణ సమయంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ను నివారించగలిగే అత్యంత ప్రభావవంతమైన ఇంటి చికిత్సలలో ఇది ఒకటి.

వెల్లుల్లి:

ఇది కేవలం మసాలాగా ఉపయోగించే ఒక పదార్థం మాత్రమే కాదు, దానిలో ఉన్న ఔషధ గుణాల కారణంగా ఇది చాలా ప్రసిద్ధి పొందింది. వెల్లుల్లిలో ఉండే యాంటీ-ఫంగల్ లక్షణాల కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారణ చికిత్సలో బాగా ఉపయోగిస్తారు. వెల్లుల్లి అనేది ఇన్ఫెక్షన్స్కు వ్యతిరేకంగా పోరాడే సహజసిద్ధమైన పదార్థంగా ఉండటమే కాకుండా, మీ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇది కూడా కాండిడా కు కారణమైన ఫంగస్ పెరుగుదలను నియంత్రించడంలో బాగా సహాయపడుతుంది. మీరు ఫంగల్ ఇన్ఫెక్షన్ను గుర్తించిన వెంటనే, ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకుని దానిపై తొక్కను తొలగించి, ఇన్ఫెక్షన్కు గురైన ప్రాంతంలో దీనిని ఉంచండి. ఈ విధంగా మీరు రాత్రివేళల్లో పడుకునే ముందు చేసి, మరుసటి రోజు ఉదయాన్నే దానిని తొలగించండి. ఫంగల్ ఇన్ఫెక్షన్కు గురైన ప్రారంభ దశలోనే మీరు ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని సత్వరంగా నివారించే వీలుంటుంది. ఈ పద్ధతిని 1-2 రాత్రుల వరకూ చేయండి. పచ్చి వెల్లుల్లి వాసనను అసహ్యించుకునే వారికి ప్రత్యామ్నాయంగా ఉండే వెల్లుల్లి సప్లిమెంట్స్‌ను ఉపయోగించవచ్చు

యోగర్ట్ (పెరుగు):

యోగర్ట్‌లో లాక్టోబాసిల్లస్ అసిడోఫైలస్ అని పిలవబడే ఒక బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. ఈ బ్యాక్టీరియా సిద్ధంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ను చికిత్స చేయడంలో బాగా సహాయపడుతుంది. మీరు ఫంగల్ ఇన్ఫెక్షన్ను దూరంగా ఉంచడానికి మీ ఆహారంలో భాగంగా యోగర్ట్‌ను ఉంచండి.

ఆపిల్ సైడర్ వినెగర్:

మీరు నిరంతరము ఫంగల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లయితే ఆపిల్ సైడర్ వినెగర్ ఉత్తమమైన చికిత్స మార్గంగా పనిచేస్తుంది. ఆపిల్ సైడర్ ఒక యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా, & యాంటీ వైరల్ ఏజెంట్‌గా ఉంటూ, ఒక స్పాంజ్ వలె పనిచేస్తూ, సమీపంలోని కణజాలాల నుండి విడుదల కాబడే విష వ్యర్ధాలను & జెర్మ్స్‌ను పీల్చి సేకరిస్తుంది. ఆపిల్ సైడర్లో ఎసిటోలిసిస్ను ప్రేరేపించే లక్షణాలను కూడా కలిగి ఉంది, ఇది ప్రమాదకారిగా ఉన్న అన్ని విషక్రిములను విచ్ఛిన్నం చేసి, మిమ్మల్ని మరింతగా రక్షిస్తాయి.

కొబ్బరినూనె:

కొబ్బరినూనెలో లారిక్ యాసిడ్, కాప్రిలిక్ ఆమ్లం & కాప్రిక్ యాసిడ్ ఉన్నాయి; వీటిలో యాంటీ ఫంగల్ లక్షణాలకు ప్రసిద్ది చెందిన కొవ్వు ఆమ్లాలను కలిగి ఉన్నాయి. ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్ను నివారించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ కొవ్వు ఆమ్లాలు మీ శరీర కణాలపై ఉండే రక్షిత పొరల ద్వారా మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి, అలా ప్రవేశించిన వీటివల్ల శరీరానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ, ఈ కొవ్వు ఆమ్లాలు అలా ఫంగల్ ఇన్ఫెక్షన్కు గురైన కణము యొక్క పొర ద్వారా కణాన్ని చేరుకుని, కణాలను మరింత బలహీనంగా మరెలా చేసి, పూర్తిగా కణాన్ని నశింపజేస్తుంది, ఇలా ఇది దెబ్బతిన్న కణాలను క్లియర్ చెయ్యడానికి ఆ ప్రాంతంలో తెల్ల రక్త కణాలు ఏర్పడతాయి. అందువలన, మీరు గర్భవతిగా ఉన్న సమయంలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్కు చికిత్స చేయాలనుకున్నప్పుడు, మీరు వండే ఆహార పదార్థాలలో కొబ్బరినూనెను ఉపయోగించడం చాలా ఉత్తమమైన మార్గం. మరొక ప్రత్యామ్నాయం కాప్రిలిక్ యాసిడ్‌ను కలిగి ఉండే క్యాప్సూల్స్‌ను తీసుకోవడమే. అయితే, మీ గర్భధారణ సమయంలో ఏదైనా ఔషధాలను వాడే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.

6.షుగర్ వినియోగాన్ని తగ్గించండి : సహజమైన మార్గంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ను చికిత్స చేయడం కోసం మీరు షుగర్ తీసుకోవడాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. మీరు చక్కెరను కలిగిన పదార్ధాలను తినేటప్పుడు మీరు కాండిడాకు కారణమైన ఫంగస్‌ను ఆహ్వానిస్తున్నారని అర్థం. అందువలన, మీరు ఫంగల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లయితే, మీ చక్కెర వినియోగాన్ని తగ్గించడం చాలా అవసరం.

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు
Tools

Trying to conceive? Track your most fertile days here!

Ovulation Calculator

Are you pregnant? Track your pregnancy weeks here!

Duedate Calculator
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}