• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్ గర్భం

గర్భం సమయంలో డయాబెటిస్ యొక్క శ్రద్ధ వహించడానికి ఎలా?

Radha Shree
గర్భధారణ

Radha Shree సృష్టికర్త
నవీకరించబడిన Dec 04, 2018

శరీరంలోని మధుమేహం అనబడే అనారోగ్య పరిస్థితి తలెత్తినపుడు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. 'ముందు నుండి మధుమేహం' ఉన్నా లేదా 'గర్భధారణ ముందు తలెత్తే మధుమేహం', అయినా, మీరు గర్భిణీ కాక ముందు నుండే మీకు. మధుమేహం ఉన్నట్లు సూచిస్తుంది. కొందరిలో 'గర్భధారణ మధుమేహం', అనగా గర్భధారణ సమయంలో కొంతమంది మహిళలలో అభివృద్ధి చెందే ఒక రకమైన మధుమేహం, పైన చెప్పబడిన మధుమేహం నుండి భిన్నంగా ఉంటుంది. మీరు మధుమేహం ఉన్నప్పుడు, మీ శరీరం తగినంతగా ఇన్సులిన్ తయారు చేయలేదు లేదా ఇన్సులిన్ సరిగా ఉపయోగించుకోలేదు. అందువలన మీ రక్తంలో అధిక చక్కెర స్థాయి ఉంటుంది. ఇది గుండె మరియు మూత్రపిండాల వ్యాధులు, మరియు అనేక ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

మధుమేహం జన్మతః ఆరోగ్య లోపాలను కలిగిస్తుందా? గర్భధారణ సమయంలో తల్లికి మధుమేహం ఉన్నట్లైతే, తప్పక చికిత్స అందించాలి. చికిత్స చేయకుండా వదిలేస్తే, తల్లికి మరియు ముఖ్యంగా ఆమె గర్భంలో అభివృద్ధి చెందుతున్న శిశువుకు కూడా తీవ్రమైన పరిణామాలు సంభవిస్తాయి. అందువల్ల, గర్భానికి ముందు మరియు గర్భధారణ సమయంలో మధుమేహ పరీక్షలు చేయడం మరియు చికిత్స చేయటం ద్వారా దుష్ప్రభావాలను నివారించవచ్చు.

మధుమేహం జన్మతః ఆరోగ్య లోపాలను కలిగిస్తుందా? గర్భధారణ సమయంలో తల్లికి మధుమేహం ఉన్నట్లైతే, తప్పక చికిత్స అందించాలి. చికిత్స చేయకుండా వదిలేస్తే, తల్లికి మరియు ముఖ్యంగా ఆమె గర్భంలో అభివృద్ధి చెందుతున్న శిశువుకు కూడా తీవ్రమైన పరిణామాలు సంభవిస్తాయి. అందువల్ల, గర్భానికి ముందు మరియు గర్భధారణ సమయంలో మధుమేహ పరీక్షలు చేయడం మరియు చికిత్స చేయటం ద్వారా దుష్ప్రభావాలను నివారించవచ్చు.

గర్భధారణ ప్రణాళిక చేసుకునేటప్పుడు మధుమేహ వ్యాధిగ్రస్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు:

  1. అవసరమైతే అధిక ప్రమాదం ఉన్న గర్భాలు కలిగిన స్త్రీలను పరీక్షించే 'పెరీనాటాలజిస్టు'ను, మరియు మధుమేహానికి చికిత్సను అందించే 'ఎండోక్రినాలజిస్ట్' ను సంప్రదించి, ఆరోగ్య పరిస్థితులకు తగిన చర్యలను చేపట్టాలి.

  2. మధుమేహంతో సంబంధం లేనప్పటికీ, మీరు తీసుకొనే వివిధ ఔషధాల గురించి వైద్యునితో వివరంగా చర్చించాలి.

  3. మధుమేహ సంబంధిత సమస్యల నిర్ధారణ కోసం, రక్తం మరియు మూత్రాన్ని పరీక్షించాలి. అంతేకాక, రక్తపోటు, థైరాయిడ్ మరియు కొలెస్ట్రాల్ సంబంధిత పరీక్షలు కూడా చేయించుకోవాలి.

  4. మధుమేహం ఉన్న మహిళలకు గర్భధారణ జరగక ముందే, శారీరక మరియు ఆరోగ్యకరమైన గర్భధారణ కొరకు మానసికంగా సిద్ధం చేయడానికి ముందస్తు కౌన్సెలింగ్ చాలా అవసరం
    మధుమేహం బిడ్డ ఆరోగ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది?

గర్భధారణ సమయంలో మధుమేహం కలిగి ఉండే చాలామంది మహిళలు, వారి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకుంటే, ఆరోగ్యకరమైన శిశువులు జన్మించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ సమయంలో, మధుమేహానికి సరైన చికిత్స అందించని యెడల తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. తల్లి యొక్క రక్తంలో చక్కెర స్థాయి పెరిగినట్లయితే, శిశువు యొక్క రక్తంలోనికి, గ్లూకోజ్ అధికంగా ప్రవేశించవచ్చు. ఫలితంగా శిశువు అధిక బరువుతో లేదా చాలా పెద్దదిగా ఉండవచ్చు. అంతేకాకుండా, గర్భధారణ సమయంలో రక్తంలో అధిక చక్కెర స్థాయిలు, ప్రసవానంతరం బిడ్డలో హైపోగ్లైకేమియా అభివృద్ధికి దోహదం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించకపోతే శిశువుకు శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఎదురవ్వవచ్చు. దీని మూలంగా అకాల ప్రసవం మరియు శిశువులో కామెర్ల ప్రమాదం కూడా కలిగే అవకాశాన్ని తోసిపుచ్చలేము. శిశువులో ఇతర ఆరోగ్య సమస్యలను కూడా ప్రభావితం చేస్తుంది. గర్భస్రావం జరగడం లేదా బిడ్డ చనిపోవడంకూడా జరిగే అవకాశంఉంది.

మధుమేహం జనన లోపాలను కలుగజేస్తుందా?

పలు అధ్యయనాలలో, గర్భధారణ సమయంలో లేదా ముందు మధుమేహం లేని వారితో పోల్చినప్పుడు, మధుమేహంతో బాధపడుతున్నవారిలో జన్మ లోపాలు లేదా బహుళ లోపాలు కలిగిన బిడ్డకు జన్మను ఇచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చాలామంది మహిళలలో నిరూపితమయ్యింది. మధుమేహం కారణంగా గుండె లోపాలు మరియు 'నాడీ ట్యూబ్ లోపాలు' గా పిలువబడే మెదడు మరియు వెన్నెముక లోపాలు వంటి ఇతర అనారోగ్య పరిస్థితులు, అప్పుడే పుట్టిన పిల్లలలో కలుగవచ్చు. ఈ లోపాలు కూడా శరీరంలోని, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాగాల యొక్క ఆకారం లేదా పనితీరును మార్చవచ్చు మరియు శిశువు యొక్క సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రభావితంచేయవచ్చు.

మధుమేహాన్ని నివారించడానికి తీసుకోవలసిన ఆహారం ఏమిటి?

గర్భధారణ సమయంలో మధుమేహం ఉన్నవారు సరైన ఆహార ప్రణాళికను అనుసరించడం మరియు రక్తంలో చక్కెర స్థాయిని పెంచే ఆహారాన్ని నివారించడం చాలా అవసరం. అందువల్ల, రక్తంలో చక్కెర స్థాయిని పెంచుకునే ఆహారాలు ఏమిటో తెలుసుకోండి. చక్కెరలు కలిగిన ఆహారాలు, ముఖ్యంగా శుద్ధి మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించండి. సాధ్యమైనంతవరకు కేకులు, స్వీట్లు, పుడ్డింగ్లు, బిస్కెట్లు, సోడా, మరియు చక్కెర కలిపిన పండ్ల రసాలు సేవించకండి. కార్బోహైడ్రేట్లను ఎక్కువగా కలిగి ఉన్న పిండి పదార్ధాలను నివారించండి. అవి రక్తంలోని చక్కెరపై అధిక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. కొన్ని పిండి పదార్ధాలను పూర్తిగా నివారించాలి. మరికొన్నిటిని పరిమితంగా తీసుకోవాలి. తెల్లని బంగాళాదుంపలు, తెల్లని బియ్యం, తెలుపు రొట్టె మరియు తెలుపు పాస్తా ఈ వర్గానికి చెందిన ఆహార పదార్థాలు. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, మసాలా దినుసులు, ఫాస్ట్ ఫుడ్స్ మరియు మద్యానికి కూడా చాలా దూరంగా ఉండాలి.

 

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు
Tools

Trying to conceive? Track your most fertile days here!

Ovulation Calculator

Are you pregnant? Track your pregnancy weeks here!

Duedate Calculator
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}