• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
గర్భం

గర్భధారణ సమయంలో ఉండే అపోహలు-వాస్తవాలు

Radha Shree
గర్భధారణ

Radha Shree సృష్టికర్త
నవీకరించబడిన Dec 11, 2018

గర్భం దాల్చడం అనేది ప్రత్యేకమైనది మరియు పరిపూర్ణమైనది. గర్భధారణకు సంబంధించి మొదటి అపోహ ఇదే అని చెప్పవచ్చు. చాలామంది గర్భం ధరించిన మహిళలు తొమ్మిది నెలల పాటు విపరీతంగా అలసిపోయామని, ఎదో ఒక వింత వికరమైన భావన కలిగిందని మరియు ఉబ్బినట్లుగా భావించామని చెబుతూ ఉంటారు. ఇవన్నీ విని ఎవ్వరు గని మరీ ఎక్కువ ఆందోళనకు లోనుకాకండి మరియు భయపడకండి.

గర్భధారణకు సంబంధించి కొన్ని అపోహలు ప్రాచుర్యంలో ఉన్నాయి - కానీ, అవి నిజం కావు

మన జీవితాన్ని మనకు నచ్చినట్లు చేసుకోవడం ద్వారా ఎంతో ఉత్సాహం మరియు ఆనందం మనకు లభిస్తుంది. వాటిని ఎలా అందుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

మొదటి అవాస్తవం : గర్భం దాల్చినప్పుడు కడుపు యొక్క ఆకారాన్ని బట్టి కడుపులో పెరుగుతున్నది మగా లేదా ఆడ అని నిర్ధారించవచ్చు అని చెబుతుంటారు. ఇది పూర్తిగా అవాస్తవం. అదే గనుక నిజమైతే అసలు ఈ ప్రపంచంలో తొమ్మిది నెలల పాటు ఉత్తేజంతో ఎదురుచూసే పనే ఉండదు, ఆ ఆనందాన్ని కోల్పోతారు. కొన్ని నెలల గర్భం తర్వాత, సోనోగ్రఫీ అనే ప్రక్రియ ద్వారా కడుపులో పెరుగుతున్నది ఏ బిడ్డ అని నిర్ధారించుకోవచ్చు. కానీ, భారతదేశంలో ఇలా చేయడం పూర్తిగా చట్టవ్యతిరేకం. కావున బిడ్డ జన్మించే వరకు వేచి చూడవలసి ఉంటుంది.

రెండవ అవాస్తవం : ఎక్కువ వేడి గనుక చేసినట్లయితే, జన్మించేటప్పుడు బిడ్డకు ఎక్కువగా జుట్టు ఉంది అనే మాటల్లో కూడా ఎటువంటి వాస్తవం లేదు. అది కూడా పూర్తిగా అవాస్తవం. గర్భధారణ సమయంలో వేడి చేయడం అనేది సాధారణంగా కొంతమందికి ఎదురయ్యే పరిస్థితి. ఆహారనాళంలో ఆహార పదార్ధాలు అన్నవాహిక యొక్క శోదం వల్ల వెనుకకు వస్తుంటాయి. ఇందువల్ల అలా జరుగుతూ ఉంటుంది. అందులో ఉండే ఆమ్లాలు వల్ల వేడి చేస్తుంది. జుట్టు ఉన్న పిల్లలకు జన్మనిచిన్న స్త్రీలు ఎవ్వరు గాని వేడి చేసిందని ఫిర్యాదు చేయలేదు.

మూడవ అవాస్తవం : ఇద్దరికి కావాల్సిన అంత ఆహారాన్ని గర్భం ధరించిన స్త్రీలు తినాలి అనే మాట పూర్తిగా అవాస్తవం. గర్భధారణ తర్వాత బరువు తగ్గడం అనేది చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం. మీరు మరింత బరువుని జోడించాలని అనుకుంటున్నారా ? అలా గనుక ఏమైనా చేయదలిస్తే సాధారణం కంటే కూడా మీరు ఎక్కువగా తినాలి అనే ఆశ మీలో ఉందని మీరు గుర్తిస్తారు. కానీ, అలా చేయడానికి గర్భదారణను ఒక సాకుగా చూపకండి.

నాల్గవ అవాస్తవం : చివరి రెండు నెలల్లో నెయ్యిని గనుక త్రాగితే, ప్రసవం సులభంగా జరుగుతుంది అనేది కూడా అవాస్తవం. నెయ్యిని త్రాగటం వల్ల దానిలో ఉన్న కొవ్వు శరీరంలో ఉన్న వివిధ భాగాలకు మరియు పొట్ట గోడలకు అంటుకొని ఉంటుంది. ఇలా చేయడం వల్ల ప్రసవ సమయంలో బిడ్డ సులభంగా బయటకు రావడానికి అస్సలు ఉపయోగపడదు. గర్భధారణ సమయంలో కొవ్వు ఉన్న ఆహారాలను తినడాన్ని పూర్తిగా నిషేధించండి. అలా చేయడం వల్ల, ఆ తర్వాత మీరు బరువు సులభంగా తగ్గగలరు

ఐదవ అవాస్తవం : గర్భధారణ సమయంలో శృంగారంలో పాల్గొంటే, అది పుట్టబోయే బిడ్డకు హానిచేస్తుంది. ఇది కూడా పూర్తి అవాస్తవం. ఒకవేళ మీకు వైద్యుడు చెప్పినట్లైతే, అలా చేయండి. అంతేకాని మీ అంతట మీరు గా శృంగారానికి దూరం కావాల్సిన అవసరం లేదు. కడుపులో పెరుగుతున్న బిడ్డ శక్తివంతమైన కండరాలు మరియు వివిధరకాల శ్లేష్మాలు సహాయంతో ఎంతో బాగా సంరక్షించబడుతుంది.

ఆరవ అవాస్తవం : గ్రహణం రోజున గర్భం ధరించిన వారు బయటకు వెళ్తే పుట్టబోయే బిడ్డ సరిగ్గా పుట్టరు అనే విషయం కూడా అవాస్తవం. గ్రహణం అనేది సాధారణంగా ప్రకృతిలో జరిగే ప్రక్రియ. ఇది పుట్టబోయే బిడ్డ పై ఎటువంటి ప్రభావం చూపదు.. కానీ, గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, నేరుగా గ్రహణాన్ని మీ కళ్ళతో చూడకండి.

ఏడవ అవాస్తవం : ఎక్స్ రే కు బహిర్గతం అవ్వడాన్ని పూర్తిగా నిషేధించండి. ఇది కూడా పూర్తిగా అవాస్తవం. పిండం ఎప్పుడు గాని మరీ అంత ఎక్కువవికిరణం కు బహిర్గతం అవ్వదు. వాటి యొక్క సాంద్రత చాలా తక్కువగానే పిండం పై పడుతుంది. అయితే గర్భధారణ సమయంలో అనవసరంగా అటువంటి వాటికీ బహిర్గతం కాకండి.

ఎనిమిదవ అవాస్తవం : తెల్లటి ఆహారం తినడం వల్ల తెల్లటి చర్మం ఉన్న పిల్లలు పుడతారు అనేది కూడా పూర్తిగా అవాస్తవం. అదే గనుక నిజం అయితే ఈ పాటికి అందరు పెరుగు, పాలు , తెల్లటి బ్రేడ్ మాత్రమే తినేవారు. బిడ్డ యొక్క రంగు అనేది జన్యువుల ద్వారా మాత్రమే చెప్పవచ్చు. కేవలం జన్యువులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.

తొమ్మిదవ అవాస్తవం : ప్రసవం అనేది వంశపారపర్యం. మీ తల్లికి గనుక సులభ ప్రసవం జరిగి ఉంటే, మీకు కూడా అలానే జరుగుతుంది. ఇది కూడా పూర్తిగా అవాస్తవం. వంశపారపర్యానికి ప్రసవానికి ఎటువంటి సంబంధం లేదు. గతంలో గనుక మీకు ప్రసవం అయి ఉంటే, కడుపులో ఉన్న బిడ్డ యొక్క స్థితి, పరిస్థితి మరియు గర్భం దరించిన స్త్రీ యొక్క కటి సంబంధిత ఎముకల నిర్మాణం పై పూర్తిగా ప్రసవం అనేది ఆధారపడి ఉంటుంది.

పదవ అవాస్తవం : కడుపు పై తాడుతో కట్టిన ఉంగరాన్ని పెట్టడం ద్వారా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆడ లేక మగా అని చెప్పవచ్చు. ఆ ఉంగరం గనుక ముందుకు జరిగితే అబ్బాయి అని, వృత్తాకారం లో జరిగితే అమ్మాయి అని చెప్పే మాటల్లో కూడా ఎటువంటి వాస్తవం లేదు. ఇది కూడా పూర్తిగా అవాస్తవం. అవాస్తవాల్లో ఏదైనా నవ్వు తెప్పించేది ఉంది అంటే అది ఇది మాత్రమే అని చెప్పవచ్చు.

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు
Tools

Trying to conceive? Track your most fertile days here!

Ovulation Calculator

Are you pregnant? Track your pregnancy weeks here!

Duedate Calculator
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}