• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
గర్భం

గర్భము దాల్చాక శృంగార జీవితం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Preeti
గర్భధారణ

Preeti సృష్టికర్త
నవీకరించబడిన Dec 14, 2018

తల్లి కావటం అనేధీ ప్రతి స్త్రీ కి ఆనంద కరమైన విషయం . అంతేకాదు ఇదొక నూతన అధ్యాయానికి ఆరంభం లాంటిదని చెప్పవచ్చు. కుటుంబం అంతాకూడా ఉల్లాసంగా ఉంటుంది.

ఈ సమయం ఎంతో ఆనందంగా గడపాల్సి ఉంటది . గర్భము దాల్చిన తరువాత శృంగారం లో పాల్గొనవచ్ఛా అనేది ప్రతి ఆలుమగలకి ప్రశ్నయే. లోపల వున్న బేబీకి ఇబ్బంది కలిగిస్తున్నామా, నిద్రిస్తున్న బేబీని లేపటమవుతుందా? పేరెంట్స్ సెక్స్ చేస్తున్నట్లు లోపలి బేబీకి తెలుస్తుందా? ఇటువంటి అనుమానాలు కూడా వుంటాయి. ఐతే నిస్సంకోచంగా రతి చేయొచ్చు అని డాక్టర్ల సలహా కానీ కొన్ని జాగ్రత్తలు మరియు పరిణామాలు పరిగణలోకి తీసుకోవాలి.

గర్భము దాల్చాక శృంగార జీవితం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మొదటి మూడు నెలలు (మొదటి త్రిమాసికం) తల్లి ఆరోగ్యంగా ఉన్నపటికీ శృంగారానికి దూరంగా ఉంటేనే మంచిది అని నిపుణల సలహా . ఎందుకంటే మొదటి మూడు నెలలు గర్భస్థ శిశువుకి ముఖ్యమైన కాలం. ఈ కాలంలో గర్భస్రావమయ్యే ప్రమాదం ఉంది. అందువల్లే మొదటి మూడు నెలలు శారీరక సంబంధం వద్దని వైద్యులు సలహా ఇస్తుంటారు. మహిళ తాను గర్భం మోసే 9 నెలలలోను, మొదటి మూడు నెలల కాలంలో అలసట, మార్నింగ్ సిక్ నెస్, నిద్ర అధికమవటం మొదలైన కారణాలుగా సెక్స్ అంటే చివరి ప్రాధాన్యత చూపుతుంది. దీనికితోడు ఆమె స్తనాలు కామోద్రేకం కలిగితే నొప్పిపెడుతూంటాయి. ఒక వేళ పురుషుడు సెక్స్ తలపెట్టినా ఆమె తిరస్కరిస్తుంది.

రెండో త్రిమాసికం లో కలయిక మంచిదే కానీ మాయ స్థితి ని బట్టి డాక్టర్ ని సంప్రదించి కలవటం మంచిది. హార్మోన్స్ ప్రభావం వలన గర్భము దాల్చిన స్త్రీ కి శృంగారం మీద అంత ఆసక్తి ఉండకపోవచ్చు. ఈ విషయం వారి శరీర తత్వం మీద ఆధార పది ఉంటుంది. ఈ రెండో త్రైమాసికంలో జీవిత భాగస్వాములు ఆనందకర రతిని సౌకర్యంగా చేసుకోవచ్చు. దీనినే సెకండ్ హనీమూన్ గా కూడా చెపుతారు. ఈ సమయంలో మహిళకు సెక్స్ కోర్కెలు అధికం అవుతాయి. బేబీకి ఎటువంటి అపాయం కూడా వుండదు. చాలామంది పురుషులు తమ భాగస్వామి శారీరక లావణ్యం చూసి రతికి సిద్ధపడతారు.

బిడ్డ / మాయ/ గర్భ సంచి స్థితి ని బట్టి డాక్టర్ బెడ్ రెస్ట్ సూచిస్తే అలాంటి దంపతులు దూరంగా ఉండటమే బిడ్డ ఆరోగ్యానికి శ్రేయస్కరం. అమ్మ ,నాన్న ఏమి చేస్తున్నారో శిశువుకు తెలియదు, నిజానికి, శిశువు అమ్నియోటిక్ శాక్ మరియు గర్భాశయ కండరాల గట్టి రక్షణలో ఉంటుంది. గర్భాశయ ద్వారం కూడా ఒక మందపాటి మ్యూకస్ ప్లగ్ తో మూసి ఉంటుంది.

స్త్రీ సహకరిస్తే శృగారం లో పాల్గొనచ్చు ఐతే చాల జాగ్రత్తగా సున్నితంగా మాత్రమే ప్రవర్తించాలి . ఎక్కువ సమయం శృంగారం జరపటం వలన స్త్రీ అలసిపోవడం , ఊపిరి సరిగ్గా అందకపోవడం లాంటివి జరగచ్చు. అలాంటివి జరగకుండా చూసుకోవాలి. గట్టిగా స్ట్రోక్స్ ఇవ్వకూడదు. రఫ్ గా సెక్స్ చేయకూడదు. గర్భిణీపై పడుకుని సెక్స్ చేసే భంగిమను ఎంచుకోకూడదు. ఆమె ఒకపక్కకు తిరిగిపడుకుంటే వెనుక వైపు నుంచి యోనిలోకి అంగ ప్రవేశం చేసే భంగిమ కాస్త శ్రేయస్కరం. ఒకవేళ సెక్స్ కాస్త ఇబ్బందికరంగా ఉంటే ఇద్దరూ పరస్పరం ఫోర్ ప్లే చేసుకోవడం ఉత్తమం.

ఆమెకు మీరు ఫింగరింగ్ చేసి ఆమె సంతృప్తి చెందేలా చేయొచ్చు. యోనిని చూషించడం, వక్షోజాలను చిన్నగా నిమరడం వంటి పనులతో ఆమెను సంతోషపెట్టొచ్చు. అలాగే ఆమెతో మీరు అంగ చూషణ చేయించుకోవడం ద్వారా మీరు సంతృప్తి చెందొచ్చు. సున్నితంగా సెక్స్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు కలగవు.కలయిక ముందు తరువాత భార్య భర్తలు ఇద్దరును జననాంగాలను శుభ్రపరచుకోవాలి దీని వలన ఎలాంటి ఇన్ఫెక్షన్లు ధరిచేరవు.

ప్రెగ్నెన్సీ లైంగిక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించదు. మీరు గర్భవతిగా ఉన్నప్పుడు ఏదైనా లైంగిక వ్యాధి ఉంటే, అది గర్భంలోని శిశువుకు కూడా బదిలీ అవుతుంది. డాక్టర్లను సంప్రదించి ముందుకు సాగడం ఉత్తమం.

మూడవ త్రిమాసికం లో కలసినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి, సెక్స్ సాధ్యమే కానీ కడుపులో బిడ్డ పెద్దదవటంతో అసౌకర్యంగా వుంటుంది. సాధారణంగా రతి చురుకుదనం తగ్గిపోతుంది. ఇక మహిళ దృష్టి అంతా పుట్టబోయే బిడ్డపైనే వుంటుంది. బిడ్డ కదలికలు కూడా లోపల అధికంగా వుండటంతో అలసిపోతుంది.

గర్భంతో ఉన్న సమయంలో శృంగారంలో పాల్గొనడం వల్ల కొంత మంచి కూడా జరుగుతుందట. ప్రసవానికి కొన్ని వారాలకు ముందు లేదా కొన్ని రోజులకు ముందు దంపతులు జాగ్రత్తగా శృంగారంలో పాల్గొనడం వల్ల సుఖ ప్రసవమయ్యే అవకాశాలున్నాయి.సెక్స్ లో పాల్గొంటే గర్భిణికి మంచి నిద్రపట్టేందుకు సహాయపడుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. మానసిక కల్లోలం నుంచి తప్పిస్తుంది. సంతోషంగా ఉండేందుకు సహాయపడుతుంది,శరీరంలో ప్రతినిరోధకాల స్థాయిని పెంచుతుంది,పెల్వి కండరాలు బలంగా మారుతాయి; అందువల్ల మూత్రం తక్కువ వెళ్లడానికి సహాయపడుతాయి,శరీరం ద్వారా సరైన సర్క్యులేషన్ను నిర్ధారిస్తుంది. దీని వల్ల ఇది పిల్లల పెరుగుదలకు సహాయపడుతుంది.

హ్యాపీ ప్రెగ్నన్సీ!!

  • 2
వ్యాఖ్యలు()
Kindly Login or Register to post a comment.

| Apr 03, 2019

ohkiol b p

  • నివేదించు

| Mar 05, 2019

qwruoowfklzcbm

  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు
Tools

Trying to conceive? Track your most fertile days here!

Ovulation Calculator

Are you pregnant? Track your pregnancy weeks here!

Duedate Calculator
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}