• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఫుడ్ అండ్ న్యూట్రిషన్ గర్భం

గర్భవతులు - వారి ఆహారం

Canisha Kapoor
గర్భధారణ

Canisha Kapoor సృష్టికర్త
నవీకరించబడిన May 09, 2022

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

సాధరణంగా మామూలు మనుషులే ఆహార విషయంలో చాలా జాగ్రత్త వహిస్తారు. అలాంటిది గర్భవతులు అంటే వారి ఆహార విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. గర్భవతులకు ఆరోగ్యకరమైన కొన్ని ఆహారాలు, వాటి తయారీ విధానాలు చూద్దాము-

మొలకల కట్లెట్:

కావలసిన పదార్థాలు - రెండు బంగాళదుంప ( ఉడకబెట్టి, తొక్కతీసినవి), వంద గ్రాముల మొలకలు, అర కప్పు సన్నగా తరిగిన తాజా కొత్తిమీర, ఉప్పు ( తగినంత ), ఎనిమిది నుండి పది జీడి పప్పులు ( బాగా తరిగినవి ), ఒక చెంచాడు మొక్కజొన్న పిండి, వంద గ్రాముల బ్రెడ ముక్కలు, వంట నూనె.

తయారీ విధానం - ఉడకబెట్టిన బంగాళదుంపలని మెదిపి, దానికి కొత్తిమీర​, జీడిపప్పు, ఉప్పు, మొక్కజొన్న పిండి, మొలకలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న కట్లెట్లుగా చేసుకోవాలి. ఈ కట్లెట్ల మీద బ్రెడ్డు ముక్కలని పెట్టి వాటికి కొంచెం నూనె పూయాలి. ఈ కట్లెట్లను నూనెలో బంగారు రంగు వచ్చేదాకా వేయించాలి.అంతే మొలకల కట్లెట్లు తయారు.

ఖర్జూరం-అరటి షేక్:

కావలసిన పదార్థాలు - పావు కప్పు ఖర్జూరాలు, అర అరటి పండు, ఒక కప్పుడు పాలు, నాలుగైదు ఐసు గడ్డలు.

తయారీ విధానం - ఖర్జూరాలని వెచ్చని పాలలో ఒక అరగంట నానబెట్టాలి. దీనికి ఐసు గడ్డలు, అరటి పండు కలిపి బాగా మిక్సీ వేయాలి. అంతే ఖర్జూరం-అరటి షేకు తయారు.

వామకు సూప్:

కావలసిన పదార్థాలు - ఒక చెంచాడు వెన్న​, అర కప్పు తరిగిన ఉల్లిపాయలు, పావు కప్పు తరిగిన బంగాళదుంపలు, ఒకటింపావు కప్పుల సన్నగా తరిగిన  వామకు కాడలు, రెండు చెంచాల మొక్కజొన్న పిండి, అర కప్పు పాలు, ఉప్పు, మిరియాలు తగినంత​,ఒక చెంచాడు మీగడ.

తయారీ విధానం - ఒక బాండీలో వెన్నలో ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసి కొన్ని నిమిషాలు వేయించాలి. దీనికి వామకు, రెండు కప్పుల నీరు పోసి ఉదకనివ్వాలి. పొయ్యి మీద నుండి బాండీ తీసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ వేసి వడకట్టాలి. ఈ సూపుని బాండీలో వేసి వేడి చేయాలి. మొక్కజొన్న పిండి, అర కప్పు పాలు కలిపి  ఆ మిశ్రమాన్ని బాండీలో వేసి చిక్కబడే వరకు ఉడకబెట్టాలి. దీనిని పోయ్యి మీద నుండి దించి, దీని మీద మీగడ వేయాలి. అంతే వామకు సూపు తయారు.

క్యాబేజీ రైస్:

కావలసిన పదార్థాలు - ఒకటిన్నర కప్పుల అన్నం, ఒక ఉల్లిపాయ ( సన్నగా తరిగిన ముక్కలు చేసుకుని ), అర కప్పు తురిమిన క్యాబేజీ, ఒక క్యాప్సికం ( తరిగినది ), అర చెంచా మిరియాల పొడి, రెండు చెంచాల వెన్న​, ఉప్పు ( తగినంత ), రెండు చెంచాల తరిగిన జున్ను.

తయారీ విధానం - ఒక బాండీలో వెన్నను కరిగించి, దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. క్యాప్సికం మరియు క్యాబేజీ వేసి అవి మృదువుగా అయ్యే వరకు వేయించాలి. దీనిలో అన్నం, వెన్న, మిరియాల పొడి వేసి బాగా కలపి జున్ను జోడించాలి. అంతే ఘుమఘుమలాడే క్యాబేజీ రైసు తయారు.

బ్రోకలీ-బేబీ కార్ను ఫ్రై:

కావలసిన పదార్థాలు -ముప్పావు కప్పుడు బ్రోకలీ, మూడో వంతు*(  ) కప్పు బేబీ కార్న్, మూడో వంతు కప్పు క్యాప్సికం, మూడో వంతు కప్పు ఉల్లిపాయలు, రెండు చెంచాల ఫ్రెంచు బీన్సు, ఎనిమిది వేయించిన జీడిపప్పులు, ఒక చెంచాడు బాగా తరిగిన వెల్లుల్లి, ఒక చెంచాడు మొక్కజొన్న పిండి, చిటికెడు పంచదార​, అర చెంచాడు మిరియాల పొడి, రెండు చెంచాల నూనె, ఉప్పు తగినంత​.

తయారీ విధానం - ఒక బాండీలో నూనె వేసుకుని పెద్ద మంట మీద వేడి చేసుకోని, వెల్లుల్లి వేసి ఒక నిమిషం పాటూ ఉడికించాలి.  మిగిలిన కూరగాయలని వేసి బాగా కలపాలి. మొక్కజొన్న పిండికి అర కప్పు నీరు కలిపి, ఈ మిశ్రమాన్ని నూనెలో వేగుతున్న కూరగాయల మిశ్రమానికి కలపాలి. దీనిలో మిరియాలు వేసి ఒక నిమిషం పాటూ వేయించి, ఈ మిశ్రమానికి వేయించిన జీడిపప్పులు జోడించాలి. అంతే ఘుమఘుమలాడే బ్రోకలీ-బేబీ కార్ను ఫ్రై సిద్ధం.

బీన్సు సూప్:

కావలసిన పదార్థాలు - ముప్పావు కప్పుడు కిడ్నీ బీన్స్, అర కప్పు తరిగిన ఉల్లిపాయలు, రెండు కప్పుల తరిగిన టమాటాలు, ఒక చెంచాడు సన్నగా తరిగిన వెల్లుల్లి, అర చెంచాడు కారం, ఒక చెంచాడు నిమ్మరసం, ఒక చెంచాడు నూనె, ఉప్పు తగినంత​, సన్నగా తరిగిన ఉల్లికాడలు, తరిగిన కొత్తిమీర​.

తయారీ విధానం - ముందు రోజు రాత్రి కిడ్నీ బీన్సు నానబెట్టలి. కుక్కర్లో నూనె వేడి చేసి దానిలో తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. దాన్లో వెల్లుల్లి, తరిగిన టమాటా ముక్కలు, ఉప్పు, కారం వేసి కొంచెం సేపు బాగా వేయించాలి. దీనికి బీన్స్, నీరు కలిపి కుక్కర్లో పావు గంట ఉడకబెట్టలి. బీన్సు చల్లారే దాకా ఆగి మిక్సీ వేయాలి. ఈ సూపుని వేడి చేసి నిమ్మరసం కలిపి, కొత్తిమీర ఆకులు జోడించాలి. అంతే ఘుమఘుమలాడే బీన్సు సూపు సిద్ధం.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • 2
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.

| Nov 06, 2019

Garbam ravadaniki elanti food ithe manchidhi

  • Reply
  • నివేదించు

| Aug 21, 2020

Give advice now I am 37th week

  • Reply
  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}