• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
గర్భం

గర్భిణీ స్త్రీలు ప్రయాణం చేయడం సురక్షితమా?

Radha Shree
గర్భధారణ

Radha Shree సృష్టికర్త
నవీకరించబడిన Dec 01, 2019

గర్భం ధరించిన స్త్రీ ప్రయాణం చేయకూడదనీ, ప్రయాణం చేస్తే గర్భ విచ్ఛిత్తి అవుతుందన్న భయం చాలా మందిలో ఉంది. గర్భవతి ప్రయాణం చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయన్న అభిప్రా యమూ ఎందరిలోనో ఉంది. కానీ, వర్తమాన సమాజంలో స్త్రీలు కూడా ఎంతో కీలకమైన ఉద్యోగాలు చేస్తున్నారు.

గర్భిణి ఆఫీసుకు చేరుకోవాలంటే ప్రతి రోజూ ప్రయాణం చేయక తప్పదు కదా!    

బస్సుల లోనూ, ఆటోలలోనూ, కార్లల్లోనూ, లోకల్‌ ట్రైన్లలోనూ ప్రయాణం చేసి ఆఫీసుకూ, అదేవిధంగా ఇంటికి చేరు కోవాలి కదా! అందుకని, గర్భం ధరించిన సమయంలో స్త్రీలు సరైన జాగ్రత్తలు తీసుకుంటూ, అవసరమైతే డాక్టరును సంప్రతిస్తూ ఆరోగ్యాన్ని కాపాడు కోవాలి. ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో తీసుకోవాల్సిన కొన్ని ప్రాథమికమైన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

1. గర్భిణులు దూర ప్రయాణం ఎక్కువ సమయం చేయడం మంచిది కాదు. ముఖ్యంగా మూడు నెలలలోపు, నెలలు నిండి ప్రసవ సమయం దగ్గర పడినప్పుడు. హై బిపి, మధుమేహవ్యాధి ఉన్నప్పుడు, తల తిరగడం, వికారం, వాంతులవడం, రక్తస్రావం అయినప్పుడు - అటువంటి గర్భవతులు ప్రయాణాలు చేయకపోవడమే మంచిది.

2. మూడు నెలలు నిండినప్పటి నుంచీ ఎనిమిది నెలల లోపు అవసరమైతే గర్భిణీ స్త్రీ డాక్టరు సలహాతో ప్రయాణం చేయవచ్చు. గర్భస్థ శిశువుకు, గర్భవతికి సుఖంగా ఉండేలా, ఇబ్బందులు కలగకుండా ఉండేలా ప్రయాణం చేయాలి. ఇరుకుగా ఉన్న సీట్లల్లోనూ, కుదుపులు ఎక్కువగా ఉన్న రోడ్ల మీద ప్రయాణం చేయకూడదు. దూరప్రయాణం చేస్తూ, బస్సు సీటులో ఇరుకుగా అనిపించినప్పుడు, ఎక్కువసేపు కూర్చోవడం ఇబ్బందిగా ఉన్నప్పుడు, బస్సు ఆగినప్పుడు క్రిందకు దిగి కొంత సమయం పచార్లు చేయడం మంచిది.

3. అత్యవసర పరిస్థితి ఏర్పడి ఎక్కువ దూరం కారులో ప్రయాణం చేయవలసివస్తే మధ్య మధ్య కొంతసేపు కారు ఆపుకొని, ఇటూ అటూ నాలుగు అడుగులు వేయడం, శక్తినిచ్చే ఆహారపదార్థాలు తీసుకోవడం మంచిది. ప్రసవమయ్యే సమయపు నెలలు దగ్గర పడుతున్నప్పుడు కారు డ్రైవింగ్‌ చేయడం అంతగా మంచిది కాదు.

4. ఎనిమిది నెలల నుంచీ, ప్రసవమయ్యే వరకూ గర్భవతి ప్రయాణం చేయడం మంచిది కాదు. మరీ అవసరమైతే విమానంలోనూ, రైల్లోనూ డాక్టరును సంప్రదించి ప్రయాణం చేయాలి. అవసరమైన దూదులు, టానిక్కులు, నెల తప్పినప్పటి నుంచీ తాను వాడిన మందుల చీటీలు, వైద్యపరీక్షకు సంబంధించిన కాగితాలను వెంట ఉంచుకోవాలి.

5. అంటువ్యాధులు ప్రబలిన ప్రదేశాలకు గర్భిణీ స్త్రీలు వెళ్లడం మంచిది కాదు. మలేరియా వ్యాపించి ఉన్న ప్రదేశాలకు గర్భవతి వెళ్లకూడదు. కలుషిత వాతావరణం, నీటి కాలుష్యపు ప్రాంతాలలో గర్భిణీ స్త్రీ గడపడం శ్రేయస్కరం కాదు. గర్భం ధరించిన సమయంలో మలేరియా వ్యాధి గర్భవతికి సోకినట్లయితే ఆ ప్రభావం గర్భస్థ శిశువు మీద కూడా పడుతుందని చెబుతారు. గర్భస్రావం జరగవచ్చు. లేదా శిశువు మృతిచెంది పుట్టొచ్చు. అకాల ప్రసవం ఏర్పడవచ్చు. అనారోగ్యాలు ఉన్న ప్రాంతాలకు గర్భిణులు ప్రయాణించకూడదు.

6. గర్భిణీ స్త్రీలు ప్రయాణం చేసే సమయంలో తీసుకునే ఆహారం విషయంలో సరైన జాగ్రత్తలను పాటించాలి. ప్రయాణం చేసే సమయంలో రోడ్డు పక్కన అమ్మే తినుబండారాలనూ, శుభ్రత పాటించ కుండా తయారు చేసిన ఆహారపదార్థాలనూ, నిల్వ ఉన్న పదార్థాలనూ తినకూడదు. పోషక విలువలు కలిగిన పదార్థాలను ఇంటి వద్ద తయారు చేసుకుని, హాట్‌ బాక్స్‌లో పట్టుకెళ్లడం మంచిది. మినరల్‌ వాటర్‌ను మాత్రమే తాగాలి. ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు తాగకూడదు. లేదా వాటర్‌క్యాన్‌తో ఇంటి నుంచి పరిశుభ్రమయిన నీళ్లను తీసుకెళ్లాలి.

7. ప్రయాణించే సమయంలో ఘనపదార్థాలు మితంగా తీసుకుంటూ, ద్రవ పదార్థాలు పుచ్చుకోవాలి. మధుమేహం ఉన్నదీ, లేనిదీ తెలుసుకొని, దాన్ని బట్టి పరిశుభ్రమయిన ఫ్రూట్‌జ్యూస్‌ తాగవచ్చు. అరటి, యాపిల్‌, ద్రాక్ష లాంటి పళ్లను, కొబ్బరినీళ్లను తీసుకోవచ్చు. ప్రయాణ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడు కోవడం ఎంతయినా అవసరం. గమ్యం చేరగానే తిరిగి డాక్టరుకు చూపించుకుని, శరీర స్థితిని గురించి తెలుసుకోవాలి.

8. ప్రయాణ సమయంలో అనా రోగ్యం కలిగితే డాక్టర్‌ సలహా లేకుండా అతిగా యాంటీ బయాటిక్‌ మందులను వాడటమన్నది గర్భిణి ఆరోగ్యానికే కాక గర్భస్థ శిశువుకు కూడా మంచిది కాదు. ప్రయాణం చేసే సమ యంలో కడుపునొప్పి వచ్చినా, నడుము నొప్పి వచ్చినా, రక్త స్రావం కనబడినా ప్రయాణం చేయడం ఆపేసి, తప్పనిసరిగా ఆ ప్రదే శంలో ఉన్న డాక్టరుకు చూపించు కోవడమన్నది అతి ముఖ్య విషయం.

సాధ్యమైనంత వరకూ, ఏడు నెలలు దాటిన తర్వాత, గర్భవతి ప్రయాణం చేయకపోవడమే మంచిది. అంతేకాకుండా, వెంట తోడు లేకుండా ఒంటరి ప్రయాణం చేయకపోతే మంచిది. ప్రయాణం ప్రమాదాన్ని కలిగించకుండా సరైన జాగ్రత్తలు తీసు కుంటూ, వైద్య సలహా పాటిస్తూ, తనతో తోడు ఎవరినైనా తీసుకుని ప్రయాణం చేయడమన్నది మంచి పద్ధతి.

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

Always looking for healthy meal ideas for your child?

Get meal plans
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}