• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
గర్భం

గర్భిణీ స్త్రీల స్టైల్ స్టేట్మెంటు

Vidyadhar Sharma
గర్భధారణ

Vidyadhar Sharma సృష్టికర్త
నవీకరించబడిన May 19, 2022

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

ఏ మహిళైనా తాను తల్లిని కాబోతున్నాన్న విషయం తెలియగానే ఆనందంతో ఉప్పొంగిపోతోంది. తన సంతోషానికి అవధులు ఉండవు. అయితే ఈ సమయంలో ప్రెగ్నెన్సీ మహిళల్లో కొన్ని శారీరక మార్పులు సంభవిస్తుంటాయి. నెలలు పెరిగినా కొద్ది మార్పులు వస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో ఆహారపు అలవాట్ల నుంచి ధరించే దుస్తువుల వరకు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది.

ఈ ఆధునిక ప్రపంచంలో అవసరాలకు తగ్గట్లుగా ఫ్యాషన్ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. మన అవసరాలకు తగ్గట్లుగా దుస్తువులను తయారు చేస్తున్నాయి. ప్రెగ్నెన్సీ మహిళలు శారీరకంగాను, మానసిక ప్రశాతంతతోపాటు, కంఫర్ట్ గా ఉండే డ్రెస్సులు ధరించినట్లయితే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకుఇప్పుడు ఎన్నో మెటర్నిటీ డ్రెస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రెగ్నెన్సీ మహిళలు ఎలాంటి డ్రెస్సులు ధరించాలో తెలుసుకుందాం.

ప్రెగ్నెన్సీ మహిళలు సౌకర్యవంతమైన దుస్తులు ఎందుకు ధరించాలి?

ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమయంలో ధరించే డ్రెస్సులు ఆమెకు మరింత హాయినివ్వాలి. మొదటి నెలలో ఉదయం వాంతులు, తలనొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. అంతేకాదు కొంతమందికి అజీర్ణం కూడా ఉంటుంది. అలాంటి సమయంలో నడుము చుట్టూ గట్టిగా ఉండే డ్రెస్సులు అసౌకర్యంగా ఉంటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్లు అధికంగా విడుదలవుతుంటాయి. శరీరంగా వేడిగా ఉంటుంది. కనుక వేడిని కలింగే డ్రెస్సులు అసౌకర్యానికి గురిచేస్తాయి.

జంప్ సూట్

ప్రెగ్నెన్సీ సమయంలో మీరు మరింత క్యూట్ గా కనిపించాలంటే జంప్ సూట్ ను ఓసారి ట్రై  చేయండి. అప్పడప్పుడు షర్ట్ లేదా టీ షర్ట్ ధరించినట్లయితే జంప్ సూట్లో మీరు మరింత అందంగా కనిపిస్తారు. ఇక స్లిమ్ అండ్ లుక్ కోసం బ్లాక్ జంప్ సూట్ ను సెలక్ట్ చేసుకోండి.

మ్యాక్సీ డ్రెస్

బీచ్ లేదా షార్ట్ ట్రిప్ కు వెళ్లాలనుకున్నప్పుడు మ్యాక్సీ డ్రెస్సును మీ స్టైల్ స్టేట్ మెంట్ గా మలచుకోండి. ట్రావెలింగ్ కు ఇంతకంటే బెస్ట్ అవుట్ ఫిట్ మరోకటి లేదు.

ర్యాప్ డ్రెస్

మీరు మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపించాలంటే ర్యాప్ డ్రెస్ కూడా ధరించవచ్చు. ఇది అడ్జస్టబుల్ గా ఉంటుంది. కాబట్టి తొమ్మిది నెలల పాటూ ధరించవచ్చు. అంతేకాదు ఈ డ్రెస్ డెలివరీ తర్వాత కూడా వాడుకోవచ్చు.

స్టోల్

మీ ప్లెయిన్ అవుట్ ఫీట్కు స్మార్ట్ లుక్ ఇచ్చేందుకు కలర్ ఫుల్ స్టోల్ కలెక్షన్ను తప్పకుండా పెట్టుకోండి. బేబీ జంప్ ను స్టోల్ పూర్తిగా కవర్ చేస్తుంది. ఒకవేళ మీరు షర్ట్ వేసుకున్నట్లయితే స్టోల్ కు బదులుగా స్కార్ఫ్ ధరించడం ఉత్తమం.

వన్ పీస్ డ్రెస్

గర్భవతి అయ్యారని పార్టీలకు వెళ్లడం మానేయకండి. ఈవినింగ్ పార్టీ వంటి ప్రత్యేక సందర్భాల్లో వన్ పీస్ డ్రెస్ తో మీరు మరింత గ్లామరస్ గా కనిపిస్తారు. పార్టీలో మరీ మరింత ఆకర్షణీయంగా కనిపించాలంటే ఆఫ్ షోల్డర్ ఫోర్ల్ స్పీపింగ్ వన్ పీస్ డ్రెస్ వేసుకోవడం బెట్టర్.

మెటర్నిటీ జీన్స్

ప్రెగ్నెన్సీ సమయంలో కొంత మంది స్త్రీలు జీన్స్ ధరించడానికి భయపడుతుంటారు. ఇలాంటి సమయంలో మీరు స్కినీ జీన్స్ కాకుండా మెటర్నిటీ జీన్స్ ధరించవచ్చు. స్ట్రెచబుల్ మెటీరియల్ తో చాలా కంఫర్ట్ గా ఉంటుంది.

పలాజో పాంట్స్

ఈ రకమైన పంటలు వెడల్పాటి గొట్టల్లాగా ఉంది గర్భిణీలకు సూలుకార్యం తో పటు చుడడానికి ట్రెండో గ ఉంటాయి. పలాజో ప్యాంటు తో ప్లెయిన్  కుర్తా కానీ, ఒక మంచి టాప్ కానీ వేసుకున్న బావుంటుంది.

లెగ్గింగ్స్

మీ మెటర్నిటీ వార్డ్ రోబ్ లో డిఫరెంట్ షేడ్స్ తో ఉన్న మూడు నుంచి నాలుగు లెగ్గింగ్స్ పెట్టుకోండి. లెగ్గింగ్స్ చాలా కంఫర్ట్ గా ఉంటాయి. స్ట్రెచబుల్ అయితే అవి మీరు సులభంగా కూర్చోవడం, లేవడం  చేయవచ్చు. స్మార్ట్ లూక్ కోసం లెగ్గింగ్స్ తోపాటు లాంగ్ టాప్ ట్యూనిక్ లేదే కుర్తీ వంటివి ధరించండి. చూడటానికి అందంగా మీకు కంఫార్ట్ గా ఉంటాయి.

జాగర్

గర్భవతి సమయంలో స్వెట్ ఫ్యాంట్స్ కనెక్టన్స్ జాగర్ లో రీప్లేస్ చేసుకోండి. స్పెట్ ఫ్యాంట్స్ తో కంపేర్ చేస్తే వీటి లుక్ మరింత అందంగా కనిపిస్తుంది.

చెప్పులు

గర్భిణీలకు సౌకర్యంకన్నా ఇంకేదీ ముఖ్యం కాదు. మరి అలాంటప్పుడు , వారు వాడే చెప్పులతో  సహా అన్ని తనకు తన బిడ్డకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలి, అందుకే హవాయి చెప్పులు, మెత్తగా ఉండేవి చూసుకోవాలి. వీలైనంతవరకు హీల్స్ ని ధరించడం మానేయండి.

ఒక్కసారి గర్భం ధరించాక దాదాపు అందరు తల్లులకు తాము ఇంక వాదులు బట్టలు మాత్రమే వేసుకుని ఫాషన్ కి దూరం అయిపోయామన్నా ఆలోచన వచ్చి ఉండకపోదు. అయితే అది పాత కాలపు ఆలోచన. ఇప్పుడు ప్రతి పెద్ద బట్టల దుకాణం లోను గర్భిణీ స్త్రీలకు విడిగా ఒక కలెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. బాబీయోయే, ఫస్ట్ క్రై, మీ అండ్ మామ్ కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇంకేం. డెలివరీ అయ్యేంత వరకు ఉన్న ఫ్యాషన్స్ అన్ని ఒక చుట్టూ చుట్టి రండి మరి.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • 4
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.

| Feb 10, 2019

ఉమ్మనీరు పెరగటానికి తీసకోవలసిన జాగ్రత్తలు చెప్పండి.

  • Reply | 1 Reply
  • నివేదించు

| Feb 10, 2019

మాఅమ్మయి 29వారంలో వుంది ఉమ్మనీరు పెరగటానికి తీసుకోల్సిన జాగ్రత్తలు చెప్పండి

  • Reply
  • నివేదించు

| Jan 16, 2021

  • Reply
  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}