• లాగ్ ఇన్
 • |
 • నమోదు చేయు
ఫుడ్ అండ్ న్యూట్రిషన్ గర్భం

గర్భిణిలకు మేలు కలిగించే ఆహారం

Monika
గర్భధారణ

Monika సృష్టికర్త
నవీకరించబడిన Aug 04, 2022

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

ప్రతి స్త్రీ జీవితంలో గర్భదశ చాలా ముఖ్యమైన సమయం. ఈ సమయంలో వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా అయితేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇక ఆహార విషయంలో చాలా సూచనలు పాటించాలి. గర్భిణీలు వారితో పాటు వారి కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం కూడా చూసుకోవాలి. గర్భావధికాలంలో తల్లి ద్వారానే ఆహారం, ఆయువును బిడ్డ పొందుతుంది.

పుట్టబోయే బిడ్డ ఎలాంటి లోపానికి గురికాకుండా ఉండేందకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అయితే గర్భిణీగా ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం అవసరం? అనేది చాలామందికి సందేహంగా ఉంటుంది. వీలైనంత వరకు శక్తి, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. దీని వల్ల శిశువు ఎదుగుదల బాగా ఉంటుది. పండ్లు, కూరగాయలు, పప్పులు, పాల ఉత్పత్తులు, మాంసం ఎక్కువగా తీసుకోవాలి.

దానిమ్మపండు ఇందులో ఫోలేట్, పొటాషియం, విటమిన్ కే, ఐరన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల దానిమ్మను నేరుగాగానీ, దాని జ్యూస్ నుగానీ నెల రోజుల పాటు క్రమం తప్పకుండా తాగాలి. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అలాగే దానిమ్మలో విటమిన్ ఎ, సి, ఇ, బి5, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. గర్భస్థ శిశువుల పెరుగుదలకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది.

నట్స్ ( గింజలు) బాదం, జీడిపప్పు, అక్రోట్లు, వేరుశెనగ, పిస్తాపప్పులులాంటివి చాలా మంచి ఆహారం. వీటిలో ఫ్యాట్స్, మాంసకృత్తులు, పీచుపదార్థాలు, విటమిన్లు , మినరల్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా కూడా తీసుకోవొచ్చు. మెగ్నీషియం బాందపప్పులో అధికంగా ఉంటుంది.

బీట్రూట్ బీట్రూట్ వల్ల కూడా గర్భిణీలకు చాలా ప్రయోజనాలున్నాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. గర్భిణీల్లో రక్తహీనత సమస్యను పరిష్కరిస్తుంది. శరీరానికి అవసరమైన ఐరన్ ను అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే జాయింట్స్ పెయిన్, వాపులను ఇది తగ్గిస్తుంది.

ఖర్జూర ఎండిన ఖర్జూర పండ్ల వల్ల శరీరానికి అవసరమైన ఐరన్, ఫోలేట్ లు అందుతాయి. అలాగే శరీరానికి అవసరమైన ఫైబర్ ను ఇవి అందిస్తాయి. అరటి గర్భిణీలు అరటి పండ్లు తినడం మంచిదే. వీటిలో క్యాల్షియం, పొటాషియం, ఇతర న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. బిడ్డకు బ్రెయిన్, నాడీవ్యవస్థ, వెన్నెముక ఏర్పడటానికి ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. అలగే అరటి రక్తహీనతను తగ్గిస్తుంది. అరటిపండ్లలో ఐరన్ ఎక్కువుగా ఉంటుంది. దీని వల్ల శరీరంలో హీమోగ్లోబిన్ పెరుగుతుందివిటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇది రెడ్ బ్లడ్ సెల్స్ ఏర్పడుటకు సహాయపడుతుంది.

ఆరెంజ్ ఆరెంజ్ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ పండు 90% నీరు కలిగి ఉంటుంది. అందువల్ల బాడీ ఎప్పుడూ హైడ్రేట్ గా ఉండేందుకు ఈ పండు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే గర్భిణీలు ఎక్కువగా కడుపులో వికారంగా ఉండడం, వాంతులతో ఇబ్బందులుపడుతుంటారు. ఈ సమస్య ఈ పండ్లను తినడం వల్ల పరిష్కారం అవుతుంది.

గుడ్డు గర్భంలోని శిశువు బ్రెయిన్ హెల్త్ కు గుడ్డు బాగా ఉపయోగపడుతుంది. గుడ్డులో అమైనో ఆమ్లాలు ఎక్కుగా ఉంటాయి. కొన్ని ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్లు ఉంటాయి. అయితే గుడ్డులో ఉండే సాల్మొనెల్ల రసాయనాన్ని తొలగించేందుకు గుడ్డును కచ్చితంగా ఉడికించాలి. ఆ తర్వాతే తినాలి. గుడ్లో ఉండే ప్రోటీన్లు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

బ్రొక్కోలి ఆకు కూరగాయలు గర్భస్రావం లేదంటే గర్భందాల్చిన మొదటి నెలలో ఏర్పడే సమస్యల పరిష్కారానికి ఇవి బాగా మేలు చేస్తాయి. అలాగే ఈ ఆహారాలు వెన్నుముక, మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా వీటిని తీసుకోవడం వల్ల పరిష్కారం అవుతాయి. బిడ్డ పుట్టుకలో ఏర్పడే సమస్యను ఇవి పరిష్కరిస్తాయి.

పప్పుధాన్యాలు గర్భంలోని బిడ్డ నాడీ వ్యవస్థ, మెదడు అభివృద్ధికి ఫోలిక్ యాసిడ్ అవసరమవుతుంది. ఇది మాత్రమే వీటిని డెవలప్ చేయగలదు. ఇది పప్పుధాన్యాల్లో ఎక్కువగా లభిస్తుంది.

బెల్ పెప్పర్స్ బెల్ పెప్పర్స్ లో కూడా విటమిన్ సీ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో బీటా-కెరోటిన్ విటమిన్ బీ6 కూడా అధికంగా ఉంటుంది. ఇది గర్భంలోని పిండం ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో తోడ్పడుతుంది.

అవోకాడో ఫోలిక్ ఆమ్లం గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఫోలిక్ యాసిడ్ అవోకాడో పండులో అధికంగా ఉంటుంది. ఇందులో ఐరన్ కూడా అధికంగా ఉంటుంది. ఇది గర్భిణీలలో ఉదయం సమయంలో ఏర్పడే సమస్యలను పరిష్కరిస్తుంది.

బెర్రీస్ గర్భిణీకి, కడుపులోని శిశువుకు కావాల్సిన విటమిన్లు మినరల్స్ మొత్తం బెర్రీస్ లో ఉంటాయి. వీటిలో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడే లక్షణాలను కలిగి ఉంటాయి. కొన్ని బెర్రీల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక వ్యవస్థను పెంచుతాయి.

చిలగడదుంపలు చిలగడదుంపలు గర్భిణీుల ఎక్కువగా తినాలి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పీచు మోతాదు చాలా ఎక్కువ. అలాగే వీటిని తీసుకోవడం వల్ల గర్భిణీలకు విటమిన్ ఎ ఎక్కువగా అందుతుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ సమస్యలు పరిష్కారం అవుతాయి.

మామిడి గర్భిణీలు ఎక్కువగా బరువు పెరిగే సమస్య లేదా కాళ్ల తిమ్మిరులతో బాధపడుతుంటారుమామిడిలోని మెగ్నీషియం తిమ్మిరి సమస్యను పరిష్కరిస్తుంది.

నీరు డీహైడ్రెషన్ (నీటి నిర్జలీకరణ) అనేది ఎక్కువ సమస్యలను తీసుకొస్తుంది. గర్భధారణ సమయంలో మహిళలు సాధ్యమైనంత వరకు ఎక్కువగా నీటిని తాగాలి. నీళ్లు ఎక్కువగా తాగకపోతే డీహైడ్రేషన్‌కు దారితీయవచ్చు. శిశువుకు పోషకాహారాలు అందాలంటే గర్భిణీలు నీరు ఎక్కువగా తాగాలి. మామూలు మహిళలతో పోల్చుకుంటే రెండింతలు ఎక్కువగా గర్భిణీలు నీరు తాగితే మంచిది.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

 • 4
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.

| Jun 21, 2020

ఈ రోజు సూర్య గ్రహణం కదా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి

 • Reply
 • నివేదించు
 • Reply
 • నివేదించు

| May 29, 2021

Hai sir I am pregnant and my fetal weight at 29 months 4 days is 1358 grams +/- 248 grams .Is this normal weight?

 • Reply
 • నివేదించు

| Apr 27, 2022

Tq medam

 • Reply
 • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}