• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ గర్భం

గర్భిణీలు రోజుకు ఎంత నీరు తీసుకోవాలి?

Monika
గర్భధారణ

Monika సృష్టికర్త
నవీకరించబడిన May 08, 2022

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

గర్భం దాల్చినప్పటి నుంచి గర్భిణీలను అనేక సందేహాలు వెంటాడుతాయి. ఏ ఆహార పదార్థాలను తీసుకోవాలి అలాగే వేటిని తీసుకోకూడదు అన్న సందేహాలు వెంటాడుతాయి. అలాగే తాగె నీటి విషయంలో కూడా సందేహం తలెత్తుతుంది. ఎంత నీరు తాగాలి? అన్న ప్రశ్న సాధారణంగా ప్రతి గర్భిణీని తొలచివేస్తుంది. నీరు లేనిదే జీవం లేదు. నీరు మానవాళి మనుగడకు ముఖ్యమైనది. ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీటిని తీసుకోవాలి. గర్భిణీలు కూడా తగినంత నీటిని తీసుకోవాలి. తనలో జీవం పోసుకుంటున్న మరో ప్రాణి సంరక్షణ కొరకు నీటిని తీసుకునే మోతాదును కొంచెం పెంచుకోవాలి. అయితే, ఎంత మోతాదు పెంచుకోవాలన్న విషయంలో సందేహం తలెత్తడం సహజమే. ఈ సందేహాన్ని నివృత్తి చేయడానికి ఈ ఆర్టికల్ తోడ్పడుతుంది. గర్భం దాల్చిన తరువాత ఎంత నీటిని తీసుకోవాలి అలాగే తగినంత నీటిని తీసుకోకపోవడం వలన కలిగే ఇబ్బందుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం

రోజువారీ ఎంత నీటిని తీసుకోవాలి:

గర్భం దాల్చిన తరువాత ఆహారాన్ని తీసుకునే మోతాదును పెంచాలి అని ఇంట్లోని పెద్దల నుండి అందే సలహా. అయితే, ఇది కేవలం ఆహారానికి మాత్రమే పరిమితం కాదు. ఇది తీసుకునే ద్రవాలకు కూడా వర్తిస్తుంది. గర్భిణీలు ప్రతి రోజూ దాదాపు 2.3 లీటర్ల నీటిని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అంటే సుమారుగా 10 కప్పుల నీటిని గర్భిణీలు తీసుకోవాలి

తగినంత నీటిని తీసుకోకపోతే గర్భిణీలు ఎదుర్కొనే పరిస్థితులేంటి? గర్భిణీ తగినంత నీటిని తీసుకోకపోవడం వలన తన ఆరోగ్యంతో పాటు గర్భస్థ శిశువు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. తగినంత నీటిని తీసుకోకపోవటం వలన ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు తగ్గే ఆస్కారం కూడా ఉండదు.

శరీరం అతివేడికి గురవుతుంది:

గర్భిణీలు తగినంత నీటిని తీసుకోకపోవడంతో శరీరంలో ఉత్పత్తి అయ్యే వేడి నియంత్రణలో ఉండదు. గర్భిణీల శరీరంలో వేడి సహజంగానే కొంత ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ వేడిని నియంత్రించకపోతే శరీరం ఎక్కువ వేడికి గురవుతుంది. ఇది మొదటి మూడు నెలలలొ మొదలైతే, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ బారిన పడి కొన్ని సార్లు గర్భస్రావంకు గురయ్యే ప్రమాదం ఉంది.

తల్లిపాల ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది: తగినంత నీటిని తీసుకోకపోవడంతో దీని ప్రభావం తల్లిపాలపై పడుతుంది. మరింత విపరీతమైన పరిస్థితులలో దీని వలన తల్లి తన బిడ్డకు సరైన పోషణను తన పాల ద్వారా అందించలేకపోతుంది. అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ప్రతి రోజూ తగినంత నీటిని తీసుకోవాలి

మూత్రం చిక్కబడుతుంది :నీటిని తక్కువగా తీసుకోవడం వలన మూత్రం చిక్కబడుతుంది. మాములుగా వచ్చేదానికంటే మూత్రం చిక్కగా వస్తుంది. ఇది ఇన్ఫెక్షన్స్ రిస్క్ ను పెంపొందిస్తుంది. ఇలా చివరి వరకు కొనసాగుతుంది. ఇది కాంట్రక్షన్స్ రిస్క్ ను పెంపొందిస్తుంది. ఈ కాంట్రాక్షన్స్ వలన ప్రీ టర్మ్ లేబర్ రిస్క్ అనేది పెరుగుతుంది

నిర్జలీకరణ (డీహైడ్రేషన్) వలన గర్భస్థ శిశువు ఆరోగ్యంపై దుష్ప్రభావం: గర్భిణీలు తగినంత నీటిని తీసుకోకపోవడం వలన గర్భస్థ శిశువుపై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితులలో పుట్టుకతో కలిగే లోపాలు తలెత్తే ప్రమాదం ఏర్పడవచ్చు. మొదటగా, శరీరంలోని ఉమ్మనీటి స్థాయి తగ్గిపోతుంది. ఉమ్మనీరు గర్భస్థ శిశువుకు రక్షణ కవచంలా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఉమ్మనీటి స్థాయి తగ్గిపోవడం వలన గర్భస్థ శిశువుకు రక్షణ కరువవుతుంది. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ తలెత్తే ప్రమాదం ఎక్కువవవచ్చు. ప్రీ టర్మ్ లేబర్ సమస్య ఎదురవవచ్చు. అందువలన, గర్భిణీలు తగినంత నీటిని తీసుకోవాలి

గర్భిణీలు తీసుకోదగిన ఇతర ద్రవాలేంటి? గర్భం దాల్చిన తరువాత మద్యం

కు దూరంగా ఉండాలన్న సంగతి తెలిసిందే. అయితే, ఇతర ద్రవాలను తాగకుండా ఉండాల్సిన అవసరం లేదు. రోజువారీ పొషక విలువలును అందుకునేందుకు కొన్ని ద్రవపదార్థాలపై ఆధారపడవచ్చు. అవేంటంటే.

తాజా పండ్ల రసం: తాజా పండ్ల రసంలో విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి గర్భిణీలకు అత్యంత అవసరం. తాజా పండ్ల రసాన్ని తాగండి. ఫ్రూట్ ఫ్లేవర్స్ కలిగిన పానీయాలను తాగకపొవడం మంచిది. ఎందుకంటే వీటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది గర్భిణీలకు అలాగే గర్భస్థ శిశువులకు మంచిది కాదు.

పాలు: పాలలో ప్రోటీన్లుతో పాటు కేల్షియం పుష్కలంగా లభిస్తుంది. గర్భిణీలు పాలను తగినంత తీసుకోవాలి. కనీసం ఒక కప్పుడు పాలనైనా రోజూ తీసుకోవాలి. లాక్టోస్ పడనివారు సొయా డ్రింక్ ను తాగవచ్హు.

సూప్ మరియు బ్రాత్స్ ఒక కప్పుడు సూప్ మరియు బ్రాత్ ను రోజువారీ తీసుకోవడం వలన రోజువారీ పోషక అవసరాలను అందుకోవచ్చు.

నీటిని ఎక్కువగా తీసుకోవడం వలన కలిగే దుష్ప్రభావం? గర్భిణీలు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. తగినంత నీటిని తీసుకోవడం వలన తల్లీబిడ్డల ఆరోగ్య స్థితి మెరుగ్గా ఉంటుంది. అయితే, నీటిని మరింత ఎక్కువగా తీసుకోవడం వలన ఉమ్మనీటి శాతం అతిగా పెరగదని తెలుసుకోవాలి. గర్భిణీలు ఇంతే నీరు తాగాలని ప్రత్యేకమైన పరిమితి లేదు. ఎవరి శరీర స్థితిని బట్టి నీటిని తీసుకునే మోతాదు ఆధారపడి ఉంటుంది. నిజానికి, నీటిని ఎక్కువగా తీసుకోవడం వలన అనేక సమస్యల బారిన పడాల్సి వస్తుందని, తల్లి ఆరోగ్యం ఇబ్బందుల పాలవుతుందన్న అపోహ ఉంది. ఇది కేవలం అపోహ మాత్రమే. నీటిని తీసుకోవడమనేది ఆరోగ్యకరమైన విషయం. ఒకవేళ మీరు ఎక్కువగా నీటిని తీసుకుంటున్నారని మీకనిపించినా దాని వలన మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురవవు. వాటర్ రిటెన్షన్ సమస్య తలెత్తదు. అలాగే సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన డెలివరీకి ఆటంకం ఏర్పడదు.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • 2
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.

| Jan 30, 2019

మా అమ్మాయి కడుపు లో శిశువు ఎదురు కాళ్లతో వుంది అన్నారు 30వ వారంలో వుంది మూమెంట్స్ మారి బేబి నార్మల్ స్థితిలో కి వచ్చే అవకాశం వుంటుందంటారా!దయచేసి చెప్పండి.

  • Reply | 1 Reply
  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}