• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

గర్భధారణ రక్తపోటు... గర్భధారణలో రక్తపోటును ప్రేరేపించే అంశాలు..

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Sep 15, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

లత ఐదు నెలల గర్భవతి, మొదటిసారి ఆమె పాదాలలో వాపు కనిపించింది. ఈ విషయాన్ని ఆమె తన తల్లితోను మరియు అత్తగారితోనూ పంచుకున్నది. గర్భధారణ సమయంలో అటువంటిి వాపు సాధారణం అని వారు ఆమెకు చెప్పారు. కానీ వారాలు గడిచేకొద్దీ ఆమె వాపు ఆమె మోకాళ్ళ వరకు పెరిగింది. ఏడవ నెల చివరికి వచ్చే సరికి ఆమె చేతులు కూడా వాచినట్లుగా ఆమె గమనించింది. ఇప్పుడు అది ఆమెకు భయంకరమైన సంకేతంగా అనిపించింది. వెంటనే ఆమె అపాయింట్మెంట్ తీసుకొని తన గైనకాలజిస్టును కలిసింది. గైనకాలజిస్ట్ రక్తపోటును పరిశీలించి అది అవాంతరంగా ఉంది అని పేర్కొన్నారు. గర్భధారణ రక్తపోటు అంటే ఏమిటి మరియు దానిని ఎలా నిర్వహించవచ్చో తెలుసుకోవడానికి దీనిని చదవండి.

 

మరింత సమాచారం కోసం..

 

గర్భధారణ రక్తపోటు అంటే ఏమిటి ?

 

గర్భధారణ ప్రేరిత రక్తపోటు లేదా పిఐహెచ్ ను గర్భధారణ రక్తపోటు అని కూడా పిలుస్తారు. ఇది గర్భిణీ స్త్రీలను ఎక్కువ శాతం ప్రభావితం చేస్తుంది. ఈ పిఐహెచ్ ప్రీఎక్లంప్సియాకు దారితీయవచ్చు. కాబట్టి దీనిని తేలికగా తీసుకోకూడదు. ఇది తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది. దీనివలన పిండానికి చేరే అమ్నియోటిక్ ద్రవం తగ్గుతుంది. పిండం లోని ఊపిరితిత్తుల యొక్క అభివృద్ధిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. కొన్ని సందర్భాలలో ఇంట్రయూతెరినే

డెత్ సంభవించడానికి కూడా అవకాశం ఉంది.

 

గర్భధారణ దశను బట్టి గర్భదారణ రక్తపోటును మూడు వర్గాలుగా విశదీకరించే వచ్చు :

 

సందర్భంలో ఇది ప్రమాదకరం ?

 

గర్భధారణ రక్తపోటు నిర్వహణ ...

 

గర్భధారణ రక్తపోటు :

 

ఇది సాధారణంగా 20 వారాల ప్రసవం తర్వాత అభివృద్ధి చెందుతుంది. మరియు ప్రసవం అయిన కొన్ని వారాల వరకూ ఉంటుంది.

 

దీర్ఘకాలిక రక్తపోటు :

 

గర్భం ధరించడానికి ముందే, అంటే గర్భధారణ ప్రారంభంలోనే ( 20 వారాల కంటే ముందు) రక్తపోటు సమస్యలు ఉన్న మహిళల్లో డెలివరీ అయిన తర్వాత కూడా ఇది కొనసాగచవచ్చు.

 

ఫ్రీ - ఎక్లంప్సియా:

 

ఇది తీవ్రమైన పరిస్థితి. ఇక్కడ రక్తపోటు నిజంగా చాలా ఎక్కువగా ఉంటుంది .(160/110 mm hg కంటే ఎక్కువ)

 

మొదటి సారిగా తల్లి అవుతున్న వారికి..

 

బహుళ గర్భధారణ ..

 

20 సంవత్సరాలలోపు లేదా 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సులో గర్భం ధరించిన స్త్రీ లలో.

 

రక్తపోటు లేదా మూత్రపిండాల వ్యాధి యొక్క గత చరిత్ర ఉన్న వారిలో..

 

అధిక బరువు కలిగిన గర్భవతులలో..

 

రక్తపోటు లేదా ఫ్రీ - ఎక్లంప్సియా యొక్క కుటుంబ చరిత్ర కలవారిలో..

 

మావిలో అసాధారణలు..

 

ఫ్రీ - ఎక్లంప్సియాకి నిర్దిష్ట చికిత్స లేదు. ప్రసవానికి మీరు ఎంత దగ్గరగా ఉన్నారు అనే దాని మీద చికిత్స ఆధారపడి ఉంటుంది.

 

ఫ్రీ - ఎక్లంప్సియాను నిశితంగా పరిశీలించ డానికి మీ డాక్టరు ప్రీ నాటల్ చెక్ అప్ ను సూచించవచ్చు. బిడ్డ అభివృద్ధి బాగా ఉండి, డెలివరీ సమయం దగ్గరగా ఉన్నట్లయితే వీలైనంత త్వరగా డెలివరీకి ప్లాన్ చేయమని సూచించవచ్చు.

 

తేలికపాటి రక్తపోటు ఉన్నట్లయితే వైద్యుడు విశ్రాంతి తీసుకోవడం, ఎడమ వైపు తిరిగి పడుకోవడం, ఉప్పును తక్కువగా తీసుకోవడం, నీటి వినియోగాన్ని పెంచడం మరియు ఇతర ఆహార మార్పులను సూచిస్తారు.

 

కొన్ని సందర్భాలలో రక్తపోటు నియంత్రణ కోసం డాక్టర్ కొన్ని మందులను ఇవ్వవచ్చు. మేతుల్దోపా, హైడ్రాలజయిన్ మరియు లబెటలోల్ వంటి కొన్ని యాంటీ హైపర్టెన్షన్ మందులు ఇవ్వవచ్చు. ఇటువంటి మందులు పిండం పైన మరియు తల్లి యొక్క ఆరోగ్యం పైన ఎటువంటి దుష్ప్రభావాన్ని చూపకుండా సురక్షితంగా ఉంటాయి. వీటితో పాటుగా అమ్నియోటిక్ ద్రవం తగ్గిన సందర్భంలో ప్రొటీన్ మందులు కూడా ఇవ్వవచ్చు.

 

ఏది ఏమైనప్పటికీ, రోగం వచ్చిన తరువాత నివారణకు వెళ్ళే కంటే కూడా జాగ్రత్త వహించడం మంచిది. పిఐహెచ్ లేకుండా గర్భధారణ సమయంలో సురక్షితంగా ఉండటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి.

 

ఉప్పుని తీసుకోవడం తగ్గించండి. టేబుల్ సాల్ట్ ను పూర్తిగా మానుకోండి.

 

రోజుకి కనీసం ఏడు నుండి ఎనిమిది గ్లాసుల నీరు తీసుకోవాలి.

 

ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.

 

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

 

టీ మరియు కాఫీల జోలికి వెళ్ళకండి.

 

శ్వాస తీసుకోవడంలో అసౌకర్యం, వాంతులు, తీవ్రమైన తలనొప్పి మరియు వాపులు ఉన్నట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించండి. ఈ లక్షణాలు గర్భధారణ రక్తపోటును సూచిస్తాయి. అందుకే జాగ్రత్త వహించండి. హ్యాపీ ప్రెగ్నెన్సీ.


గర్భధారణ రక్తపోటుపై ఉన్న ఈ బ్లాగు మీకు ఉపయోగకరంగా ఉందా ? దయచేసి మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాతో పంచుకోండి!

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}