• లాగ్ ఇన్
 • |
 • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

కరోనా బూస్టర్ డోస్‌ ఉచితంగా పొందండి: ఎక్కడ, ఎలా తీసుకోవాలి, జాగ్రత్తలు..

Ch Swarnalatha
గర్భధారణ

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన Jul 16, 2022

75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అమృత మహోత్సవ్‌గా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశప్రజలకు కానుకగా  కేంద్ర ప్రభుత్వం ఉచిత బూస్టర్ డోస్ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇంతకుముందు రెండు కరోనా టీకా డోసుల అనంతరం, 9 నెలల తరువాత బూస్టర్ డోస్ ఇవ్వబడేదని, ఇప్పుడు అది 6 నెలల తర్వాత లభిస్తోందని మీకు తెలిసినదే. ఉచిత బూస్టర్ డోస్‌ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో, అందుకు ఏ విధానాలను అనుసరించాలో ఈ బ్లాగ్‌లో పూర్తి వివరంగా చెప్పబోతున్నాము. అంతేకాకుండా, బూస్టర్ డోస్ వేసుకునే ముందు మరియు తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే సమాచారాన్ని కూడా మేము మీకు అందించబోతున్నాము.

బూస్టర్ డోస్ అంటే ఏమిటో తెలుసా?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కరోనా వ్యాక్సిన్ రెండు మోతాదులను తీసుకున్న 6 నెలల తర్వాత, మన శరీరంలో యాంటీబాడీస్ స్థాయి తగ్గుతుంది. అపుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడానికి బూస్టర్ డోస్ తీసుకోవడం మంచిది. కరోనా బారిన పడకుండా ఉండాలంటే బూస్టర్ డోస్ వేయాలని నిపుణులందరూ సలహా ఇస్తున్నారు.

ఉచిత బూస్టర్ డోస్ ప్లాన్ అంటే ఏమిటి?

స్వాతంత్ర్య అమృత్ మహోత్సవం సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం దేశప్రజలకు ఉచిత బూస్టర్ డోస్‌ను ప్రకటించింది అని మేము మీకు ముందే తెలియజేశాము. అయితే, మీరు 75 రోజుల పాటు మాత్రమే ఉచిత బూస్టర్ డోస్‌ను పొందగలరని గుర్తుంచుకోండి. ఈ పథకం జూలై 15 నుంచి ప్రారంభమైంది.

 1. ప్రభుత్వ కేంద్రాలు లేదా ప్రభుత్వ ఆసుపత్రులలో మాత్రమే ఉచిత బూస్టర్ డోస్ ఇవ్వబడుతుంది.

 2.  మీరు ప్రైవేట్ ఆసుపత్రి లేదా సెంటర్‌లో బూస్టర్ డోస్ వేయించుకుంటే, మీరు దాని కోసం చెల్లించాల్సి ఉంటుంది.

 3. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో బూస్టర్‌ డోస్‌ కోసం.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సర్వీస్‌ ఛార్జీకి రూ.150 మించి వసూలు చేయకూడదు.

 4. ఉచిత బూస్టర్ మోతాదులో, మీరు మొదట్లో తీసుకున్న టీకా నే ఇస్తారు.  అంటే, మీరు కోవి షీల్డ్ 2 మోతాదులనుతీసుకుంటే, బూస్టర్ మోతాదులో కోవిషీల్డ్ మాత్రమే ఇస్తారు. ఎవరైనా కోవాక్సిన్ తీసుకున్నట్లయితే, వారు బూస్టర్ డోస్‌లో కోవాక్సిన్‌ను పొందుతాడు.

 5. బూస్టర్ డోస్ కోసం మీరు మళ్లీ రిజిస్టర్ చేసుకోవలసిన అవసరం లేదు. మీరు తప్పనిసరిగా CoWin పోర్టల్ నుండి సందేశ౦ వచ్చినట్లయితే, అందులోని లింక్‌ను సందర్శించడం ద్వారా మీరు స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. అయితే, బూస్టర్ డోస్ తీసుకోవడానికి మీరు ఆఫ్‌లైన్లో కూడా స్లాట్‌ను కూడా బుక్ చేసుకోవచ్చు.

 6. మీరు ఇటీవల కరోనా నుండి కోలుకున్నట్లయితే, మీరు కోలుకున్న 3 నెలల తర్వాత మాత్రమే వ్యాక్సిన్ డోసు తీసుకోవచ్చు. ఒక వ్యక్తి 2 డోస్‌లు తీసుకున్న తర్వాత కూడా ఇన్ఫెక్షన్‌కు గురైనట్లయితే, కోలుకున్న తర్వాత మూడు నెలల అనంతరంమాత్రమే బూస్టర్ డోస్ తీసుకోవాలి. 

 7. ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం, గర్భిణీ స్త్రీలు కూడా బూస్టర్ డోస్ పొందవచ్చు. గర్భిణీ స్త్రీలు వారి వైద్యుని సూచనలను అనుసరించి బూస్టర్ మోతాదును పొందవచ్చు.

బూస్టర్ మోతాదును తీసుకునే ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు

కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో, తప్పనిసరిగా బూస్టర్ మోతాదును తీసుకోవాలని నిపుణులుసూచిస్తున్నారు. బూస్టర్ మోతాదును వర్తించే ముందు మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి.

 • నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీకు ఫ్లూ లేదా జ్వరం ఉంటే, ఆ సమయంలో మీరు బూస్టర్ డోస్ కోసం వెళ్లకూడదు.

 • బూస్టర్ డోస్ తీసుకోవడానికి ఖాళీ కడుపుతో ఎప్పుడూ వెళ్లకండి, అంతకు ముందు అల్పాహారం లేదా ఆహారం తినండి.

 • బూస్టర్ డోస్ వేసిన  కాసేపు తర్వాత కూడా తింటూ ఉండండి.

 • మీరు తీసుకున్న రోజు తీసుకునే విధంగానే, అదే పరిమాణంలో  సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినండి

 • మీ శరీరంలో నీటి శాతం తగ్గకూడదు, కాబట్టి కొంత సమయం పాటు ఆగిఆగి నీరు త్రాగుతూ ఉండండి.

 • సిగరెట్లు, మద్యం మరియు పొగాకు వినియోగం మానుకోండి

 • మీరు బూస్టర్ మోతాదు తీసుకున్న రోజున అధిక శారీరక శ్రమను నివారించండి

Booster మోతాదు తీసుకున్న తర్వాత ఏదైనా దుష్ప్రభావముంటుందా?

సాధారణంగా బూస్టర్ డోస్ తీసుకున్న తర్వాత కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కనిపించవచ్చు కానీ ప్రతి ఒక్కరూ సైడ్ ఎఫెక్ట్స్ గురికావాల్సిన అవసరం లేదు. కొన్ని సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఇలా ఉంటాయి:

 • జ్వరం

 • తలనొప్పి

 • అలసట

 • ఒంటి నొప్పి

 • వాపు

 • అతిసారం

 • వాంతులు కావడం

కానీ దీనితో పాటు, బూస్టర్ డోస్ తీసుకున్న తర్వాత ఏదైనా సైడ్ ఎఫెక్ట్ కనిపిస్తే, మీ వైద్యుడి సలహా ప్రకారం మాత్రమే ఏదైనా ఔషధం తీసుకోవాలని మా సలహా.

మీ సూచనలలు మా తదుపరి బ్లాగులను మరింత మెరుగుపరుస్తాయి. దయచేసి కామెంట్ సెక్షన్ లో వ్యాఖ్యానించండి. ఈ బ్లాగ్‌లో అందించిన సమాచారంతో మీరు సంతృప్తి చెందితే, ఖచ్చితంగా ఇతర తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి.

https://www.parentune.com/parent-blog/free-booster-dose-scheme/7901

 • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}