• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
పేరెంటింగ్ ఆరోగ్యం మరియు వెల్నెస్

పాఠశాల చిన్నారుల కోవిడ్ టీకాల కోసం కేంద్ర ప్రభుత్వ కీలక మార్గదర్శకాలు

Ch Swarnalatha
11 నుంచి 16 సంవత్సరాలు

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన Jun 15, 2022

దేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో కరోనా ‘ఫోర్త్‌ వేవ్‌’మొదలైందా? ప్రస్తు తం మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్కసారిగా పెరుగుతున్న కేసులను బట్టి చూస్తే మనం ఫోర్త్‌వేవ్‌లోకి అడుగుపెట్టినట్టుగానే భావించాల్సి ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో  దేశంలో 6,594  మంది కోవిడ్‌ బారినపడ్డారు. దీంతో. యాక్టిక్‌ కేసుల సంఖ్య 50,548కు పెరిగింది. రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా వస్తుండటంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. 

ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు మంగళవారం హెల్త్ బులిటెన్‌ విడుదల చేశారు. కొన్ని రాష్ట్రాలలో కోవిడ్-19 కేసుల పెరుగుదల కనిపించడంతో, మహమ్మారి ఇంకా ముగియలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా  నొక్కిచెప్పారు.  రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పాఠశాలలకు వెళ్ళే చిన్నారుల విషయంలో   తగిన కోవిడ్ జాగ్రత్తలను పాటించాలని ఆయన  తెలిపారు. 

12-17 సంవత్సరాల వయస్సులో ఉన్న లబ్దిదారులందరినీ మొదటి మరియు రెండవ డోసుల కోసం గుర్తించే  ప్రయత్నాలను వేగవంతంచేయాలని, తద్వారా వారు టీకా రక్షణతో నిర్భయంగా పాఠశాలలకు హాజరుకావచ్చు అని ఆరోగ్య మంత్రి మాండవ్య చెప్పారు. వేసవి సెలవుల్లో పాఠశాలకు వెళ్లని పిల్లల  కవరేజీతో పాటు, పాఠశాల ఆధారిత ప్రచారాల ద్వారా 12-17 ఏళ్ల మధ్య వయస్కుల దృష్టి కేంద్రీకరించాలని ఆయన రాష్ట్రాలను కోరారు. దేశవ్యాప్తంగా తగినన్ని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని కూడా ఆయన స్పష్టం చేసారు. 

దేశంలో కొత్త వేరియంట్‌లను గుర్తించేందుకు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు నిఘాను కొనసాగించాలని మరియు బలోపేతం చేయాలని మరియు జీనోమ్ సీక్వెన్సింగ్‌పై దృష్టి పెట్టాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉండే వయో వర్గాలలో COVID-19 టీకా యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ఆయన, జూన్ 1న ప్రారంభమైన ప్రత్యేక నెల రోజుల డ్రైవ్ -- హర్ ఘర్ దస్తక్ 2.0 ప్రచారం యొక్క స్థితి మరియు పురోగతిని వ్యక్తిగతంగా సమీక్షించాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రులను కోరారు.

హిందూస్తాన్ టైమ్స్

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన పేరెంటింగ్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}