మీ పిల్లలను లాక్ డౌన్ సమయంలో సానుకూలంగా , సంతోషంగా ఉంచేందుకు ఈ చిట్కాలు మీకు ఉపయోగపడతాయి

Aparna Reddy సృష్టికర్త నవీకరించబడిన Apr 04, 2020

1. వ్యాయామం: మన మానసిక సమతుల్యతను చెక్క పరిచేందుకు ఉత్తమమైన , మన పురాతనమైన వ్యాయామాలకు మించినది మరేమీ ఉండదు. మన పిల్లల మానసిక ప్రతి చర్య కూడా అదే విధంగా ఉంటుంది. కానీ మీరు ఈ మూడు షరతులను మాత్రం జాగ్రత్తగా పాటించండి.
పిల్లలతో కలిసి మీరు కూడా వ్యాయామం చేయండి.
కొంచెం కష్టం గా మరియు సవాలుగా ఉన్న దానిని ఎంచుకోండి. లేదా ఎక్కువ సాధన అవసరం అయిన దానిని ఎంచుకోండి.
ఆ తరువాత సాధనను మరికొంచెం పెంచండి.
మీరు మీ పిల్లలు కఠినతరమైన వ్యాయామాలు చేయడానికి ఇష్టపడేలా ఉంటే:
పుష్ అప్స్
మోకాళ్ళ మీద చేసే వ్యాయామాలు.
మీరు కొంచెం సులభమైన మరియు ఉపయోగకరమైన వ్యాయామాలు చేయాలనుకుంటే యోగా ను ప్రయత్నించండి. మా బ్లాగులలో కొన్ని ఆసనాల కు సంబంధించిన భంగిమలు ఉన్నాయి. మీరు వాటిని ప్రయత్నించవచ్చు.
A post shared by Sameera Reddy (@reddysameera) on Mar 26, 2020 at 4:05am PDT
పరీక్షల సమయంలో వచ్చే ఒత్తిడి నుండి బయట పడేందుకు 5 యోగాసనాలు ఉన్నాయి.
పిల్లలలో ఆస్తమాకు, రోగనిరోధక శక్తిని పెంచేందుకు అజీర్తికి కూడా యోగాలో ఆసనాలు ఉన్నాయి.
గమనిక: వ్యాయామం తర్వాత చేతులు కడుక్కోవడం మరియు స్నానం చేయడం మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ మరవకండి.
2. చదవడం:
చదవడం అన్నది ఎప్పుడూ చాలా ఉన్నతమైన అలవాటు. ఆ అలవాటు చేసుకున్నట్లయితే మీతో పాటు గా మీ పిల్లలను కూడా ఎంతో ఉన్నత స్థితికి చేరుస్తుంది. చదవడం అన్నది మీ మానసిక స్థితిని మార్చివేస్తుంది. మీ దగ్గర పుస్తకాల రూపంలో లేనప్పటికీ, మన దగ్గర మంచి సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఆన్ లైన్ లో మంచి మంచి పుస్తకాలు దొరుకుతాయి. పిల్లలకు ఆన్ లైన్ లో మంచి పుస్తకాలను చదవడం అలవాటు చేసినట్లయితే అవి వారి జ్ఞానాన్ని పెంచుకునేందుకు ఎంతో ఉపయోగపడతాయి. మీ పిల్లల వయసుకు సరిపడే పుస్తకాలను చదవడం వారికి అలవాటు చేయండి.
3. వ్రాయడం:
అందంగా రాయడం అన్నది ఒక కళ.రాయడంలో అభ్యాసం చేసినట్లయితే వారిని అది ఒక మంచి రచయితగా చేస్తుంది. మళ్లీ ఇక్కడ వేరే ఒక ప్రశ్న? మీ పిల్లలు కాగితంపై రాయాలా లేదా కంప్యూటర్ లో నా ?
సమాధానం అయితే రెండింటిలోనూ రాయాలని .కాగితంపై రాయడం వల్ల చేతులకు అలవాటు అవుతుంది .మరియు డ్రాయింగ్ లో కూడా నైపుణ్యత వస్తుంది.
ఉన్నతమైన ఆలోచనలు ఉన్నవారికి కథ మరియు వ్యాసం లేదా మీకు లేఖ రాయాలి అనుకున్న వారికిి కంప్యూటర్ సిఫార్సు చేయండి. కాగితాలను వృధా చేయకుండా తమ తప్పులను దిద్దుకునేందుకు వీలు కలుగుతుంది. (అంతర్జాతీయంగా మీ ఉనికిని చాటుకోవాలని అనుకున్నప్పుడు దానిని చేతిరాతతో ముడిపెట్టకూడదు కదా?)
4. వినడం:
వినడం అన్నది ఎంతో ప్రధానమైన లక్షణం. ఎంతో జ్ఞానవంతులు మరియు ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు వినడం ద్వారా తమ జ్ఞానాన్ని పెంచుకుంటారు. పరధ్యానం లేకుండా శ్రద్ధగా వినడం అన్నది పిల్లలకు మీరే నేర్పాలి. ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వినకుండా ప్రతిస్పందించడం చేయకూడదు.
మీరు మీ పిల్లలు చెప్పేది శ్రద్ధగా విన్నట్లు అయితే అది వారిలో ఆత్మ విశ్వాసం తో పాటుగా మీరు వారిని ఎంతో ప్రేమిస్తున్నారు అన్న భావన వస్తుంది. అది మీ పిల్లల ఆత్మగౌరవానికి ఎంతో ముఖ్యమైనది.
5. గీయడం (డ్రాయింగ్):
ఇది ఎప్పుడు బ్రెయిన్లో ఉండదు. పిల్లల మనస్సు ఒక పరిశోధనాత్మక ,ఊహాత్మక మరియు సృజనాత్మకమైనది. వారు అన్వేషణ అన్నది సులభంగా చేసుకోగలరు. ఆ తరువాత వారి ఊహలను చిత్రాల రూపంలో ఆవిష్కరించడం మొదలుపెడతారు.
6. సంభాషించడం:
సమాజంలో అందరితో కలిసి మెలిసి మాట్లాడడం అన్నది పిల్లల అభివృద్ధికి ఎంతో అవసరం.ఈ రోజుల్లో ప్రతిరోజూ ఒకటి రెండు సార్లు మీ పిల్లలను వాళ్ళ స్నేహితులతో గాని మీ బంధువులతో గాని వీడియో చాట్ ద్వారా మాట్లాడుకునే లాగా అలవాటు చేయండి. అలా వారిని తమ స్నేహితులతో మాట్లాడుకునే లాగా బిజీగా ఉంచండి.
వారి స్నేహితులకు కూడా వీడియో కాల్ అవకాశం ఉన్నట్లయితే వారిద్దరూ ఒకరినొకరు చూస్తూ మాట్లాడుకో గలరు.
గుర్తుంచుకోండి: ఇది ఇటువంటి సంక్షోభ సమయాల్లో ఒకరి నుండి ఒకరు ఓదార్పు పొందడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఎప్పుడో ఒక సమయంలో మాత్రమే అత్యవసర వస్తువులను తెచ్చుకునేందుకు బయటకు వెళ్లి మిగతా సమయం అంతా బందీల లాగ ఇంట్లోనే ఉంటున్నాము.ఇలా ఆత్మీయులను ఫోన్ల ద్వారా కలవడం అన్నది మనలను అతిగా ఆలోచించకుండా మానసికంగా మరియు శారీరకంగా బిజీగా ఉంచుతుంది.
(ఈ సందర్భంగా మీకు కేవ్ రెస్క్యూ ని గుర్తుకి తెస్తున్నాము. థాయ్ కుర్రాళ్ళు భూగర్భం నుండి ఎలా బయట పడ్డారు ?)
మొత్తం లాక్ డౌన్లో ఎలా జీవించాలో అది మంచి ఉదాహరణ. వారు కిటికీలు మరియు సూర్యకాంతి కూడా లేకుండా నీటితో చుట్టుముట్ట పడ్డారు. కానీ మన పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంది. అయినప్పటికీ ,సమాజానికి దూరంగా ఒంటరిగా ఉండడం పిల్లలకు ఎంతో కష్టతరమైన పని. వారు ఒత్తిడికి గురికాకుండా వారితో మనం ఎక్కువ సమయాన్ని గడపడం మరియు మాట్లాడడం ఎంతో అవసరం. వారు మరీ ఒత్తిడికి లోనై నట్లుగా గుర్తిస్తే మాత్రం వీడియో కౌన్సిలింగ్ లేదా టెలిఫోన్ కౌన్సిలింగ్ ద్వారా చైల్డ్ సైకాలజిస్ట్ లతో కౌన్సిలింగ్ ఇప్పించండి. అందుకు గా మేము ఈ పని మీకోసం చేయాలనుకుంటున్నాము. మీరు కౌన్సిలర్ తో అపాయింట్మెంట్ బుక్ చేసుకునేందుకు త్వరలో ఇక్కడ ఒక లింక్ ను పోస్ట్ చేస్తాము.
జాగ్రత్తగాను మరియు ఉత్సాహంగానూ ఉండండి.
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు


{{trans('web/app_labels.text_some_custom_error')}}
{{trans('web/app_labels.text_some_custom_error')}}