• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

శీతాకాలంలో సంభవించే సాధారణమైన జరుపు మరియు ఫ్లూ లను ఎదుర్కోవడానికి నివారణలు.

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Sep 08, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

గొంతు నొప్పి, తుమ్ములు, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, తలనొప్పి, కళ్ళు మంటలు, ఒళ్ళు నొప్పులు మరియు ఆకలి తగ్గడం వంటివి ఒక వ్యక్తి జలుబుతో బాధపడుతున్నప్పుడు ఏర్పడే కొన్ని సంకేతాలు మరియు లక్షణాలు. జలుబు వైరస్ వల్ల వస్తుంది . కాబట్టి, యాంటీబయాటిక్స్ సరైన చికిత్స కాకపోవచ్చు. సాధారణ జలుబును ఎదుర్కోవడానికి ఉత్తమమైన విధానాలు ఏమిటంటే , సాధారణ గృహ నివారణలు ఆశ్రయించడం ద్వారా ముక్కు దిబ్బడ మరియు గొంతు నొప్పుల నుండి బయటపడగలము.

 

సహజమార్గంలో జలుబుతో పోరాడడానికి ఇంటి నివారణలు..

 

జలుబు మరియు ఫ్లూ లనుండి సహజ మార్గంలో పోరాడడానికి మీకు సహాయపడే 12 గృహ నివారణలు ఇక్కడ ఉన్నాయి. క్రింద చదవండి.

 

1. ఎక్కువ ద్రవపదార్ధాలు మరియు వేడి పానీయాలు తీసుకోండి.

 

నీరు, రసాలు, వేడి పానీయాలు మరియు ఇంట్లోనే తయారు చేసిన సూప్ లను తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా మరియు గొంతును తేమగా ఉంచడానికి మరియు గొంతులోని గరగరను తొలగించడానికి సహాయపడుతుంది. తగినంత తేమ కలిగి ఉండడం వలన ముక్కు మరియు గొంతు యొక్క పొరలను తేమ చేస్తుంది. తద్వారా కపమును బయటకు పంపుతుంది. ఆల్కహాలిక్ మరియు కెఫిన్ పానీయాలను తీసుకోకూడదు . ఎందుకంటే ఇవి మరింత నిర్జలీకరణనికి దారి తీస్తాయి.

 

వేడి పానీయాలు చాలా ఓదార్పు ఇస్తాయి. మరియు వివిధ సీతల లక్షణాల నుండి త్వరగా ఉపశమనం ఇస్తాయి . వేడి పానీయాలు తాగడం ద్వారా సైనస్ ద్రవాలు కూడా పలచగా మారుతాయి. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతాయి. చికెను మరియు వెజిటబుల్ సూప్ లు మరియు రసం కూడా చాలా ఆరోగ్య కరమైనవి. మరియు రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఎంతో సహాయ పడతాయి.

 

నిమ్మకాయ, బత్తాయి మరియు క్రాన్బెర్రీ రసాలను జలుబు మరియు దగ్గు సమయంలో వైద్యులు సిఫార్సు చేస్తారు. ఈ రసాలలో విటమిన్లు , అవసరమైన పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. తద్వారా రోగి వేగంగా కోలుకుంటాడు.

 

తాటి బెల్లము, తురిమిన అల్లం, లవంగాలు, దాల్చిన చెక్క, తులసి ఆకులు, నల్ల ఏలకులు మరియు నల్లమిరియాలు మొత్తం వేసి ఇంట్లోనే మూలిక ఔషధాన్ని తయారుచేయండి. వీటన్నిటినీ కలిపి బాగా మరిగించండి.  నీటి పరిణామాన్ని సగానికి తగ్గే వరకు మరిగించడం ఎంతో అవసరం. ఇవి సైనస్ను  క్లియర్ చేయడంతోపాటు యాంటీవైరల్ ప్రభావాన్ని కలిగిన ఈ సుగంధ ద్రవ్యాలు అన్నీ కలిసి ఉపశమనం ఇవ్వడానికి  బాగా పనిచేస్తాయి.

 

2. తరచుగా గర్గ్లింగ్  (పుక్కిలించడం)

 

కనీసం రోజుకి 3 నుండి 4 సార్లు గోరువెచ్చని నీటితో గర్గ్లింగ్ చేయడం చాలా ఉపశమనం కలిగిస్తుంది. వేడి నీటిలో కొంచెం ఉప్పు వేసి గర్గ్లింగ్  చేయడానికి ఆ నీటిని ఉపయోగించడం మంచిది .ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది మరియు కఫంను క్లియర్ చేయడానికి కూడా సహాయపడుతుంది. గర్గ్లింగ్  శ్వాసకోస ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది.

 

3. ఆవిరి పట్టడం :

 

ముక్కు ఆవిరితో శ్వాస తీసుకోవడం వలన గొప్ప ఉపశమనం లభిస్తుంది. వేడి నీరు లేదా ఆవిరి పట్టే మిషన్ మీద తల పెట్టుకోవడం , ఒక టవల్ తో తలను కప్పుకొని ఆవిరిలో శ్వాస తీసుకోవడం చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇది ముక్కుదిబ్బడను మరియు తలనొప్పిని కూడా నయం చేస్తుంది.

 

4. ప్రశాంతంగా ఉంటూ విశ్రాంతి తీసుకోవడం :

 

ఒక దుప్పటిలో హాయిగా కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం మంచిది . జలుబు వల్ల తలెత్తే అసౌకర్యాలు శరీరానికి చాలా బాధ కలిగిస్తాయి. అందువలన చక్కగా విశ్రాంతి తీసుకోవడం మంచిది. తలగడను ఉపయోగించి ఒక పక్కకు తిరిగి నిద్రించడానికి ప్రయత్నించండి. తద్వారా నాసికా మార్గానికి ఉపశమనం కలుగుతుంది. మంచిగా నిద్రపో గలుగుతారు. 

 

5.హ్యూమిడిఫైర్ వాడండి :

 

హ్యూమిడిఫైర్ గదిలోని వాతావరణాన్ని తేమగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇది ముక్కు రంధ్రాలు మూసుకుపోకుండా తేమగా ఉంచి అసౌకర్యము మరియు  బిగుసుకుపోవడం నుండి కాపాడుతుంది.

 

6. సెలైన్ డ్రాప్స్ :

 

ముక్కు రంధ్రాలను క్లియర్ చేయడానికి మరియు కపంను బయటకు పంపించడానికి సెలైన్ చుక్కలను ఉపయోగించవచ్చు.

 

7. తేనె ద్వారా చేసే నివారణలు :

 

గొంతునొప్పి, జలుబు మరియు దగ్గు నుండి తక్షణ ఉపశమనం ఇవ్వడానికి ప్రసిద్ధిచెందిన 3 తేనే ఆధారిత వంటకాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

 

తేనె అల్లం తయారీ :

అల్లం రసం మరియు తేనె మిశ్రమాన్ని రోజుకి కనీసం మూడుసార్లు తీసుకోవాలి. ఈ మిశ్రమం లో గొంతు నొప్పిని తగ్గించే వ్యాధి నిరోధక లక్షణాలు ఉన్నాయి. తురిమిన అల్లం లేదా అల్లం పేస్టు సహజంగానే ముక్కుదిబ్బడ ను తొలగించడానికి సహాయపడుతుంది. మరియు తేనెలోని యాంటీ వైరల్ లక్షణాలు దీనికి సహాయపడతాయి.

 

తేనే మరియు దాల్చిన చెక్క పొడి :

తేనే మరియు దాల్చిన చెక్క మిశ్రమాన్ని తీసుకోవడం వలన గొంతునొప్పికి గొప్ప ఉపశమనం లభిస్తుంది. తేనెలోని యాంటీఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. తద్వారా వైరస్ లేదా బ్యాక్టీరియా కారణంగా వచ్చే జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది.

 

తేనె మరియు మెంతులు :

 

మెంతి గింజలను నీటిలో నానబెట్టి ఉడికించి ఆ ద్రవాన్ని వడకట్టి తేనెతో కలిపి రెండుసార్లు తీసుకోవడం వలన ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలుకల వీటివలన ఖచ్చితంగా చాలా ప్రయోజనం ఉంటుంది.

 

8. ఉపశమనం కోసం పసుపు కలిపిన పాలు :

 

ఒక టీస్పూన్ పసుపు కలిపి మరిగించిన ఒక గ్లాసు పాలను రాత్రి నిద్రపోయే ముందు తీసుకోవాలి. జలుబు నుండి బయటపడడానికి పసుపు కలిపిన పాలు తీసుకోవడం ఒక అద్భుతమైన ఇంటి నివారణ. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే పదార్థం యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీబయాటిక్స్ లక్షణాలను కలిగి ఉంటుంది.

 

9. బేకింగ్ సోడా :

 

ఒక గ్లాస్ నీటిలో అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలిపిన మిశ్రమాన్ని కనీసం రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. శరీరంలో నీటిశాతాన్ని సమతుల్య పరచడానికి ఇది సహాయ పడుతుంది. తద్వారా వైరస్ మనుగడ సాగించలేని వాతావరణాన్ని సృష్టిస్తుంది.

 

10. ఆపిల్ సైడర్ వెనిగర్ :

 

ఒక గ్లాసు వేడి నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు మూడు సార్లు త్రాగాలి. ఆపిల్ సైడర్ వెనిగర్ పీహెచ్ స్థాయిలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది .తద్వారా వైరస్ శరీరంలో నిలవలేని వాతావరణాన్ని సృష్టిస్తుంది.

 

11. తాటి మిఠాయిని నోటిలో ఉంచుకోవడం :

 

తాటి మిఠాయి నోట్లో ఉంచుకొని చప్పరించవచ్చు. ఇది తీవ్రమైన దగ్గును నియంత్రించడంలో సహాయపడుతుంది. మరియు గొంతునొప్పి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

 

12. పెరుగు:

 

ఫ్లూ తో బాధపడుతున్నప్పుడు పెరుగు తినకూడదు అనేది ఓ సాధారణమైన మాట. కానీ పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ శరీరంలోని నొప్పులను తగ్గిస్తుంది.


పైన తెలిపిన గృహ ఆరోగ్య నివారణలతోపాటు ఆరోగ్యకరమైన పోషక ఆహారం తీసుకోవడం వల్ల వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది. హ్యాపీ వింటర్ !

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}