• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

మీ చిన్నారిని దోమల నుండి కాపాడేందుకు ఇంట్లోనే తయారు చేసుకునే దోమల వికర్షకం (మందు)

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jun 05, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

కొత్తగా తల్లి అయిన ప్రతి ఒక్కరికీ అన్ని పరిస్థితుల నుండి తమ బిడ్డలను ఎలా కాపాడుకోవాలో అన్నది చాలా పెద్ద సమస్యగా ఉంటుంది. మీకు కూడా ఇదే సమస్య కదూ ? అందరు తల్లులు 'అవును' అనే సమాధానం చెబుతారు. దోమలు మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి కొన్ని భయంకరమైన వ్యాధుల తో పాటుగా చర్మంపై దద్దుర్లు, దురద తో కూడుకున్న వాపులు,ఎర్రటి పొక్కులు మరియు మంటలకు కూడా కారణం అవుతాయి .ఇవి మీ పిల్లలలో అలర్జీలు రావడానికి కూడా దారితీస్తాయి.

 

కారణంగా మీరు మీ చిన్నారులను రక్తం పీల్చే చిన్న రాక్షసుల నుండి రక్షించుకోవడం అత్యవసరం.

 

ఇంట్లోనే మూలికలతో తయారు చేయగల దోమల వికర్షకం (మందు)

 

అయితే వేచి ఉండండి...మార్కెట్లో లభించే వ్యాపారపరమైన దోమల నివారిణిలతో మీకు అవసరం లేదు. నిజానికి,ఇది దాని కోసం మంచి ప్రత్యామ్నాయాన్ని వెతకవలసిన సమయం ఇది అద్భుతమైన సువాసనతో సహజంగా దోమల వికర్షక ప్రభావం కలిగి ఉంటుంది . మరియు కొన్ని నిమిషాల్లోనే ఇది దోమలను తరిమి కొడుతుంది.

 

దోమల నివారణ మందు కి కావలసిన పదార్థాలు :

 

మూలికా దోమల నివారిణిని తయారు చేసేందుకు ముఖ్యంగా స్వచ్ఛమైన నూనెలు మరియు సహజ పదార్థాలు అవసరం.

 

దోమల నివారిణిని తయారు చేసేందుకు కావాల్సిన పదార్థాలు :

 

తీసుకోవాల్సిన పరిమాణం (మిల్లీ లీటర్ల లో)

 

కొబ్బరి నూనె (కోకోనట్ ఆయిల్) 100 ఎం ఎల్.

 

సిట్ర నెల్ల ఆయిల్ లేదా లెమన్ గ్రాస్ ఆయిల్ 10 ఎమ్ ఎల్.

 

వేప నూనె (నీమ్ ఆయిల్ ) 20 ఎంఎల్.

 

యూకలిప్టస్ ఆయిల్ (నీలగిరి తైలం) 10 ఎం.ఎల్.

 

లవంగ నూనె ( క్లోవ్  ఆయిల్)  10 ఎం ఎల్.

 

టీ ఎసెన్షియల్ ఆయిల్ 10 ఎం ఎల్.

 

కర్పూరం నూనె 10 ఎం ఎల్ లేదా  కర్పూరం బిళ్ళలు 10 లేదా 12 .

 

తయారీ విధానం :

 

ఒక గాజు బాటిల్ ని తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టండి. పైన పేర్కొన్న అన్ని సహజ నూనెలను కొలత ప్రకారం తీసుకొని ఆ బాటిల్ లో వేసి బాగా కలపండి. కర్పూరం బిళ్ళలు మాత్రం మెత్తగా పొడి చేసి ఆ మిశ్రమంలో కలపండి.బాటిల్ ను క్రిందకి పైకి బాగా కలపండి అంతే ..మన ఇంట్లోనే తయారుచేయబడ్డ దోమల నివారిణిి (వికర్షకం) ఉపయోగించేందుకు రెడీ.

 

ఉపయోగించాల్సిన విధానం :

 

ఈ మిశ్రమాన్ని శరీరం యొక్క అన్ని బహిర్గత భాగాలకు రాయవచ్చు . ప్రతి రెండు గంటలకు ఒకసారి రాస్తూ ఉండండి. ఈ నూనెను దుస్తులకు , బెడ్ షీట్ లకు మరియు ఇతర వస్త్రాలపై కూడా రాయవచ్చు .ఈ ఆయిల్ ను భద్రతా కారణాల దృష్టి నేరుగా చిన్నారుల చర్మంపై రాయడాన్ని సిఫారసు చేయబడలేదు. ఒక ఒక బ్యాండ్  ఎయిడ్ ను తీసుకొని దానిపై కొన్ని చుక్కల దోమల వికర్షణ ఆయిల్ ను వేసి దోమల వికర్షకం ప్యాచ్ ను తయారు చేసుకోవచ్చు. ఒక కాటన్ క్లాత్ ను తీసుకొని దాన్ని కొన్ని చుక్కల ఆయిల్లో నానబెట్టి ఈ దోమల నివారిని బ్యాండ్ ను తయారు చేసుకోవచ్చు.ఈ బ్యాండ్ను మణికట్టు లేదా చీలమండల దగ్గర కట్టవచ్చు .మన ఇంటిలో దోమలు లేకుండా ఉండేందుకు ఈ నూనెతో దీపాన్ని వెలిగించేందుకు కూడా ఉపయోగించవచ్చు.

 

మరికొన్ని సామీప్య బ్లాగులు :

 

ఈ తొమ్మిది రకాల మూలికలతో తయారు చేయబడ్డ దోమలకు వికర్షకం గా తయారు చేయబడ్డ ఈ మిశ్రమాన్ని దోమల నుండి చిన్నారులను రక్షించేందుకు ఉపయోగించవచ్చా ?

 

సులభమైన చిట్కాలు :

 

ఈ ఆయిల్ ను ఉపయోగించే ప్రతిసారి ముందుగా బాటిల్ను బాగా కలపండి. ఎందుకంటే కర్పూరం బాటిల్ యొక్క అడుగు భాగం లో ఉండిపోతుంది .ఈ బాటిల్ ను తడి తగలని చల్లని మరియు చీకటి ప్రదేశం లో ఉంచండి . మరియు నేరుగా ఎండ తగలకుండా ఉండేలాగా చూసుకోండి .కొంచెం కొంచెం గా తయారు చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాన్ని త్వరగా పొందవచ్చు.

 

ముఖ్య గమనిక :ఇంట్లో తయారు చేసుకునే ఈ దోమల వికర్షకం కేవలం బాహ్య ప్రదేశాల లో  వాడటానికి మాత్రమే. దయచేసి ఈ దోమల వికర్షకంని మీ పిల్లల నోటికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి.

 

దయచేసి మీ అభిప్రాయాలను మరియు ఆలోచనలను మాతో పంచుకోండి .మీ అభిప్రాయాలు తెలుసుకోవడం మాకెంతో సంతోషం.

 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}