• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్

డబ్బు గురించి మీ పిల్లలతో మాట్లాడడం... ఎప్పుడు మరియు ఎలా..

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Aug 11, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

ఒకప్పుడు ప్రతి వస్తువు తక్కువ ధరకే లభించేది. అటువంటి రోజులు ముగిసిపోయాయి.  పిల్లలను ఎంతో ప్రభావితం చేసే రోజులలో మనం జీవిస్తున్నాం. ప్రతిదీ ఖరీదైనదిగా మారిపోయింది . మరియు రాబోయే కాలంలో ఇది మరింతగా పెరుగుతూనే ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, డబ్బు విలువలను పిల్లలకు నేర్పించడం ఇప్పుడు చాలా ముఖ్యమైనది. ఆ డబ్బు అనేది ఎంతో విలువైనది, ఇది మన భౌతిక అవసరాలను నెరవేర్చి మన కోరికలను తీర్చే సాధనంగా ఉపయోగపడుతుంది.

 

 బిడ్డకు డబ్బు విలువను నేను ఎలా నేర్పించ గలను ?

 

నేను మీరు ఈ లక్ష్యాన్ని సాధించగల 5 ప్రాథమిక మార్గాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నా బిడ్డకు డబ్బులు నేర్పించడానికి అవి నాకు సహాయపడ్డాయి మరియు మీకు కూడా సహాయపడతాయి అని ఆశిస్తున్నాను.

 

ఇంటి పనులు :

 

ఇంటి పనులలో అంటే , ప్రతి వారం చేసే పనులలో మీ పిల్లలను భాగస్వాములను చేయండి. వారు చేయగల పనులను చేయనివ్వండి. అది మార్కెట్ నుండి కిరాణా సామాను కొనడం కాని లేదా ఇతర పనులు. ఇంట్లో  విద్యుత్తు ఉపయోగించేటప్పుడు వృధా చేయకుండా జాగ్రత్తగా చూసుకోమని తెలియజేయండి. వారు అడిగిన ప్రతి వస్తువుని కొనడానికి ప్రోత్సహించ వద్దు. వారి ఖర్చులకోసం ఆదా చేయండి. వారు డబ్బు కోసం పని చేయాల్సిన అవసరం ఉంటుంది అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మరియు దీని కోసం కృషి చేస్తారు.

 

కిరాణా బిల్లులు చెల్లించడం :

 

కిరాణా షాపింగ్ చేసేటప్పుడు మీ పిల్లవాడు మీతో ఉన్నప్పుడు స్టోర్ నుండి వస్తువులు కొనడానికి సహాయం తీసుకోండి. ఆ వస్తువులను రెండు బ్రాండ్ల ధరలతో పోల్చి ఏది తక్కువ ధరకే లభిస్తుందో తనిఖీ చేయమని చెప్పండి. వారిని బిల్లులు చెల్లించనివ్వండి. బిల్లు చెల్లించే సమయంలో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమని చెప్పండి. మీరు నగదు ద్వారా చెల్లిస్తున్నట్లు అయితే డబ్బును వారికి ఇచ్చి  చెల్లించమని చెప్పండి. డబ్బులు చెల్లించే ముందు మీరు రెండు సార్లు తనిఖీ చేయండి.

 

క్రెడిట్ కార్డ్ బిల్లులు :

 

ఇది పై దాని కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. చేతిలో ఉన్న డబ్బులు ఇవ్వకూడదు అనుకున్నప్పుడు మనము క్రెడిట్ కార్డు మీద వస్తువులను కొనుగోలు చేస్తాము . ఇది సాధారణంగా మన బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువగా ఉన్న వస్తువులను ఖరీదు చేసే సమయంలో ఉపయోగిస్తాము. క్రెడిట్ కార్డులో బిల్లులు చెల్లించడం మరియు కొన్ని రకాల బిల్లులకు క్రెడిట్ కార్డులను ఎందుకు అవసరము పిల్లలకు అర్థమయ్యేలాగా చేస్తుంది. ముఖ్యంగా మనం కొనాలనుకున్న వస్తువు మన బడ్జెట్లో లేనప్పుడు ఇది ఎలా ఉపయోగపడుతుందో వారికి అర్థమవుతుంది. దానిని తెలియజేయడం కోసం మీరు ఏమి చేయాలో ఇక్కడ ఉంది.

 

మీరు క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించే ఈ సమయంలో మీ పిల్లలను మీ దగ్గరగా కూర్చో పెట్టుకోండి. ఈ డబ్బు  మీరు కొంత వడ్డీతో కలిపి చెల్లిస్తారు అని వారికి అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. కానీ అది అప్పుడు వారికి అర్థం కాకపోయినా కొంత కాలం తర్వాత దానిని అర్థం చేసుకుంటారు.

 

క్రెడిట్ కార్డ్ పై కొనుగోలు మరియు వడ్డీతో సహా తిరిగి చెల్లించే విధానాన్ని అర్థం  అయ్యే విధంగా వివరించండి.

 

మీ పిల్లలు ఇవన్నీ అర్థం చేసుకోక పోవచ్చు. కానీ డబ్బు విలువ గురించి తెలియ చెప్పాల్సిన ఆవశ్యకత ఉంటుంది.

 

నెలసరి అవసరాల కేటాయింపు :

 

నెల ప్రారంభంలో మీరు వేర్వేరు వ్యక్తుల కోసం చెల్లించే జీతాల విషయంలో , అంటే పనిమనిషికి , పాల వారికి మొదలగు వారికి డబ్బులు చెల్లించే సమయంలో వారి సహాయాన్ని తీసుకోండి. ఈ సాధారణ దశలను అనుసరించడం ద్వారా మీరు ఈ విధంగా చేయవచ్చు..

 

క్రిందటి నెల బిల్లును పోల్చండి :

 

పాత కరెంటు బిల్లులను ప్రస్తుత నెల బిల్లుతో పోల్చడం ద్వారా కరెంటు వినియోగం గురించి ఆలోచింపజేస్తుంది. మరియు కరెంటు వాడకాన్ని తగ్గించాలి అనే ఆలోచనకి కూడా వారు వస్తారు. తద్వారా బిల్లు మొత్తాన్ని తగ్గించగలరు.

 

రోజు వారి వస్తువులను కొనే ముందు మిగిలిన వాటిని తనిఖీ చేయమని చెప్పండి :

 

మీ పిల్లలు మిగిలి ఉన్న సరుకులను తెలుసుకున్నప్పుడు ఇంట్లో ప్రతి వస్తువు ఎంత ఉందో తెలియడంతో పాటుగా , నెలకి ఎంత అవసరమో కూడా వారికి తెలుస్తుంది. ఇది ఒక వస్తువు యొక్క ధరను మాత్రమే కాకుండా డబ్బు విలువని తెలుసుకునేలాగా చేస్తుంది.

 

డిస్కౌంట్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునే అవకాశం :

 

వివిధ ఆన్లైన్ స్టోర్ లలోనూ, స్థానిక అమ్మకందారులు అందించే కూపన్లలోనూ వస్తువులపై డిస్కౌంట్లను గుర్తించే విధంగా మీ పిల్లలను ప్రోత్సహించండి. డిస్కౌంట్ రేటుకి వస్తువులను కొనడం ద్వారా మీరు డబ్బును ఆదా చేయగలరని మీ పిల్లలకు బోధిస్తున్నారు మరియు అదే వస్తువులను రెండు వేరు వేరు ధరలకు కొనుగోలు చేయవచ్చని వారికి తెలుపుతున్నారు.

 

పిగ్గీ బ్యాంక్ :

 

చివరిది కానీ తక్కువది కాదు, పిగ్గీ బ్యాంకులో డబ్బులు ఆదాయ చేసే విధానాన్ని పిల్లలకు పరిచయం చేయండి. పిగ్గీ బ్యాంకు విధానం డబ్బును వారి చేతిలో నుండి బయటకు వెళ్లే మార్గం నుండి ఆపుతుంది. అందుకే పిల్లలు చేతిలో ఉన్న ప్రతి రూపాయిని వెంటనే  ఖర్చు చేయరు. కళ్ళముందు లేకపోతే మనసును ప్రభావితం చేయదు అనే సిద్ధాంతం ఇక్కడ పని చేస్తుంది.

 

డబ్బు విషయంలో తెలివిగా ఉండేలాగా నా పిల్లలను నేను ఎలా తయారు చేయగలను ?

 

ఇప్పుడు మీరు మీ పిల్లలకు డబ్బు విలువను నేర్పించారు మరియు పిల్లలు కూడా దానిని అర్థం చేసుకున్నారు అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి  మీ పిల్లలకు డబ్బును తెలివిగా ఉపయోగించడం నేర్పాల్సిన సమయం ఆసన్నమైనది. మీరు ఇప్పుడు దాని కోసం ఏం చేస్తారు? సింపుల్ గా వీటిని అనుసరించండి..

 

డబ్బు ఎలా సంపాదించాలో నేర్పండి :

 

మీరు ఖర్చు చేసే ప్రతి పైసా లేదా ప్రతి రూపాయి కష్టపడి సంపాదించిన అది అని మీ బిడ్డ తెలుసుకోవాలి. ఆ డబ్బు సంపాదించడానికి మీరు మరియు మీ జీవిత భాగస్వామి ఉద్యోగాలకు వెళతారు. పనిమనిషి మరియు ఇతరులు కూడా ఆ డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడి పని చేస్తారు అని తెలపాలి. కానీ ప్రతి ఒక్కరు  సంపాదించాలి అని తెలపాలి.

 

ఒకసారి ఖర్చు చేసిన డబ్బు తనంతట అదే సమకూరదు :

 

మీ యజమాని నుండి మీరు జీతం పొందకపోతే మీ పర్సులో నుండి లేదా బ్యాంకు లో నుండి తీసి ఖర్చుచేసిన డబ్బు మళ్లీ భర్తీ చేయబడదు. బ్యాంకు ఖాతాలో ఆదా చేసిన మీ డబ్బులను మాత్రమే ఏటీఎం యంత్రం తిరిగి ఇస్తుందని వాళ్లు తెలుసుకునేలా చెప్పాలి.

 

చిన్న మొత్తము :

 

మీ పిల్లలకు  కొంచెం డబ్బులు వచ్చినప్పుడు వారు ఆ డబ్బు విలువను అర్థం చేసుకోవడం మొదలు పెడతారు మరియు డబ్బు ఆదా చేయడం లేదా దానిని పెంచడం అనేక సందర్భాలలో ఈ రెండింటిని గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు . కాబట్టి వారి ఆలోచనలను ప్రోత్సహించండి.

 

డబ్బులు పెంచడానికి మీ పిల్లలను ప్రోత్సహించండి :

 

మీ పిల్లలు వారి మొత్తాన్ని పెంచుకోవడానికి గురించి ఆలోచించడం ప్రారంభించినప్పుడు ఎక్కువ డబ్బులు సంపాదించడానికి మార్గాలను సూచించడం ద్వారా వారిని ప్రోత్సహించండి. దానిని వారు మీ ఇంటి ఖర్చుల విషయంలో సహాయం చేయవచ్చు లేదా సూపర్ మార్కెట్ నుండి వస్తువులను ఇంటి కొరకు కొనుగోలు చేయవచ్చు.

 

పైన పేర్కొన్న ఈ సూచనలు అన్నీ కొన్ని సార్లు కొంచెం ఎక్కువగా అనిపించవచచ్చు. కానీ ముఖ్యమైన వాటి విషయంలో ఎలా అమలు చేస్తారు గుర్తుంచుకోండి. మీ పిల్లలను తప్పులు చేయడానికి అనుమతించండి. మరియు మీరు జాగ్రత్తగా వారికి చూపించిన మార్గదర్శకం వారికి ఉపయోగపడుతుంది అని విశ్వసించండి. మీ లక్ష్యం మీ పిల్లలు నిజంగా డబ్బు విలువను తెలుసుకోవడం మరియు దానిని సంపాదించడానికి అవసరమైన కృషి చేయడానికి సహాయపడటం మాత్రమే. చిన్న వయసులోనే డబ్బు విలువను తెలుసుకోవడం అనే విషయాన్ని బాధ్యతాయుతంగాను మరియు ప్రేమ పూర్వకంగానూ తల్లిదండ్రులు నేర్పినట్లయితే పిల్లలు వారి సామర్థ్యం ప్రకారం వారు జాగ్రత్త కలిగి నడుచుకుంటారు.

 

డబ్బు విలువలను పిల్లలకు నేర్పించడంలో సుగంధ బ్లాగ్ మీకు ఉపయోగపడిందా ?డబ్బు మరియు పొదుపు విలువను అర్థం చేసుకోవడానికి మీ పిల్లలకు మీరు ఎలా సహాయం చేస్తారు ? మీ అభిప్రాయాలను మరియు సూచనలను మాతో పంచుకోండి. మీ నుండి వినడం మాకు చాలా ఇష్టం !
 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}