• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

ఇయర్బడ్ హెడ్ఫోన్స్ ను తప్పుగా ఉపయోగించడం వలన వినికిడి లోపం..

Aparna Reddy
3 నుంచి 7 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Oct 12, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

ఇయర్ ఫోన్స్ గురించి మీకు తెలిసినది ఏమిటంటే, వాటిని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్ళగలరు మరియు అవి మంచిగా వినిపిస్తాయి. ఎంత వరకు అయితే మీరు చిన్న శబ్దంతో ఇయర్  ఫోన్స్ ను వాడుతారో అంతవరకు అవి ఉపయోగకరమైన చిన్న పరికరాలు. అవి మామూలుగా మీ చెవుల్లో ధరించే చిన్న స్పీకర్ల జత.  పెద్ద శబ్దం తో మీరు సంగీతాన్ని వినినట్లయితే శాశ్వతంగా వినికిడిని కోల్పోతారు.

 

ఇయర్ బడ్ హెడ్ఫోన్ లను తప్పుగా ఉపయోగించడం వలన వినికిడి నష్టం.

 

చైన్ సాస్ మరియు మోటార్సైకిల్ ఇంజన్లు మీ వినికిడికి ఎంతో నష్టాన్ని సృష్టిస్తాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇయర్ ఫోన్స్ అదే విధమైన నష్టాన్ని కలిగిస్తాయి. ఇయర్ ఫోన్స్ చిన్నగా ఉన్నందువలన మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ నష్టం మాత్రం అదే విధంగా ఉంటుంది.

 

చైన్ సాస్ మరియు మోటార్ సైకిల్ ఇంజన్లు 100 డెసిమల్ ధ్వనిని సృష్టిస్తాయి. ఆ ధ్వని అర గంట కంటే తక్కువ సమయంలోనే ఒక వ్యక్తి చెవులను దెబ్బతీస్తుంది. దాని గరిష్ట శబ్దము 70 శాతం వద్ద ఉన్నప్పుడు యం పీ 3 ప్లేయర్ 75 డెసిమల్  ఉంటుంది. పెద్ద శబ్దంతో ఎక్కువసేపు వినడం వలన మిమ్మల్ని శాశ్విత వినికిడి నష్టానికి గురిచేస్తుంది.

 

ఇయర్ ఫోన్స్ వాడడం వలన వచ్చే వినికిడి నష్టాన్ని శబ్ద ప్రేరిత వినికిడి నష్టం ( ఎన్ ఐ హెచ్ ఎల్) అంటారు. చిన్న పిల్లలు మరియు టీనేజర్లలో ఈ రకమైన వినికిడి లోపం మరింత సమస్యగా మారుతుంది.

 

శబ్దం వినికిడి నష్టానికి ఎలా కారణం అవుతుంది ?

 

చెవి శబ్దాలను వినే ప్రక్రియ మూడు భాగాలుగా రూపొందించబడి ఉంటుంది. వెలుపలి చెవి, మధ్య చెవి మరియు లోపలి చెవి. లోపలి చెవిలో కోక్లియ  అని పిలువబడే చిన్న జుట్టు కణాలు ఉంటాయి. ఈ జుట్టు కణాలు మెదడుకు ధ్వని సందేశాలను పంపడంలో సహాయపడతాయి. కానీ, పెద్ద శబ్దం జుట్టు కణాలను దెబ్బతీస్తుంది. ఇది జరిగినప్పుడు కోక్లియా మెదడుకు ధ్వని సందేశాలను ప్రసారం చేయజాలదు.

 

మీ శరీరంలో ఇతర భాగాలకు జరిగే నష్టాన్ని పూరించకుండా, లోపలి చెవి నష్టం ఎప్పుడూ నయం కాదు. కాలక్రమేణా ఎక్కువ జుట్టు కణాలు దెబ్బతిన్నప్పుడు మీ వినికిడి మరింత దిగజారుతుంది.

 

ఏమి చేయాలి ?

 

ఇయర్ ఫోన్స్ ను  ఉపయోగించేటప్పుడు శబ్ద ప్రేరిత వినికిడి నష్టం రావడానికి సాధారణంగా కొంత సమయం పడుతుంది. ఇది క్రమంగా జరుగుతుంది కాబట్టి, సమస్య చాలా పెద్దది అయ్యే వరకు తమకు సమస్య ఉందని చాలా మందికి తెలియదు. నీకు వినికిడి లోపం ఉన్న సంకేతాలు :

 

పెద్ద శబ్దం విన్న తర్వాత మీ చెవుల్లో రింగింగ్, ధ్వని లేదా గర్జన

 

శబ్దాల వక్రీకరణ

 

మీకు వినికిడిలోపం సంకేతాలు ఉన్నాయని మీరు అనుకుంటే మీరు ఏం చేయాలి ? మీ వైద్యుని సంప్రదించండి. డాక్టరు మిమ్మల్ని పరీక్షించి ఆడియాలజిస్టుని కలవడానికి పంపవచ్చు. మీ వినికిడి ఎంత ప్రభావితం అయిందో తెలుసుకోవడానికి ఆడియాలజిస్టులు మీకు పరీక్షల శ్రేణి ఇస్తారు.

 

ఇయర్ ఫోన్స్ ను ఉపయోగించడం గురించి మరియు మీ వినికిడిని కాపాడడం గురించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఆడియాలజిస్టులు సమాధానం ఇవ్వగలరు.

 

ఇయర్ ఫోన్స్ ను సరైన మార్గంలో ఉపయోగించడం :

 

ఇయర్ ఫోన్స్ వలన సంభవించే శబ్ద ప్రేరిత వినికిడి నష్టం , మీరు వాటిని మితంగా ఉపయోగిస్తే నూటికి నూరు శాతం నివారించవచ్చు." అన్ని విషయాలు మితంగా ఉండాలి" అనే సామెతను బహుశా మీరు వినే ఉంటారు. దేనిని అతిగా చేయకుండా, మీరు చాక్లెట్ కేక్ తినండి లేదా ఇయర్ ఫోన్స్ వాడండి. మీరు ఎక్కువ కేక్ తిన్నట్లయితే, మీరు ఎంత ఎక్కువగా తింటే అంత వేగంగా బరువు పెరుగుతారు. మీరు ఎంత ఎక్కువ శబ్దంతో ఇయర్ ఫోన్స్ వినియోగిస్తే అంత త్వరగా వినికిడి నష్టం జరుగుతుంది.

 

ఇయర్ ఫోన్స్ ను ఉపయోగించేటప్పుడు మోడరేషన్ అంటే ఏమిటి ?

 వైద్యులు 60%/ 60 నిమిషాల నియమాన్ని సిఫార్సు చేస్తారు.

మీ చెవిలో ఇయర్ ఫోన్స్ తో మీరు గడిపే సమయాన్ని 60 నిమిషాలకు పరిమితం చేయండి.

 

మీ ఇయర్ఫోన్స్ సురక్షితమైన పరిమాణంలో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మీరు తెలుసుకోవాల్సిన మరొక ఉపాయం ఎక్కడ ఉంది : నీ పక్కన కూర్చున్న వారిని మీ మ్యూజిక్  వినగలుగుతున్నారా అని కనుక్కోండి. వారు వినగలుగుతున్నట్లయితే, ఇది మీ వినికిడి దెబ్బ తినడానికి సంకేతం. ఇతర వ్యక్తులు వినలేని విధంగా మీ శబ్దాన్ని సరి చేసుకోండి.

 

వినికిడి నష్టం అనేది మాత్రమే ఇయర్ ఫోన్స్ కలిగించే సమస్య కాదు. పెద్ద శబ్దంతో సంగీతాన్ని వినడం వల్ల మీ చుట్టూ ఏమి జరుగుతుందో కూడా మీకు తెలియదు. అది మీ ప్రమాద అవకాశాలను పెంచుతుంది. ఉదాహరణకు మీరు బైక్ నడుపుతూ ఉన్నట్లయితే సైకిల్ మీద వెళ్లే వ్యక్తి చేసే శబ్దాన్ని మీరు విన జాలరు .అందువల్ల ప్రమాదాలకు దారి తీయవచ్చు.

 

ఇతర ఎంపికలు ఉన్నాయా ?

 

ప్రతి ఫోను లేదా మ్యూజిక్ ప్లేయర్ లో చిన్న ఇయర్ ఫోన్స్ తో కలిపి ప్యాక్ చేసి వస్తుంది. అన్నింటికంటే, అవి తయారుచేయడానికి చౌక మరియు ఉపయోగించడానికి సులభం.

 

కాబట్టి మీరు ఏమి చేయవచ్చు ? పాత తరహాలో ఉన్న హెడ్ ఫోన్స్ ను వెతుక్కోండి. పాత పద్ధతులను అనుసరించడానికి ఒక కారణం ఉంటుంది. కొన్నిసార్లు పాత విధానాలు ఎంతో మంచిగా ఉంటాయి.

 

చాలా ఎలక్ట్రానిక్ షాప్ లలో హెడ్ ఫోన్ లకు సంబంధించిన అన్ని పరికర విభాగాలు ఉంటాయి. ఉత్తమమైన హెడ్ ఫోన్లు ఇతర శబ్దాలను నిరోధించడానికి సహాయపడతాయి. ఈ విధంగా, మీరు సంగీతాన్ని మంచిగా వినడానికి పెద్ద శబ్దాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. శబ్దాన్ని రద్దు చేసే హెడ్ ఫోన్ల అధ్యయన మీద మీ దృష్టి పెట్టడం మంచిది. కానీ మీ చుట్టూ ఉన్న ప్రపంచమే మీకు కావలసి వస్తే, అవి మంచి ఎంపికలు కాకపోవచ్చు.

 

మీ చెవులకు అమర్చుకునే ఇయర్ ఫోన్లు మీరు ఎక్కువ సేపు ఉపయోగించిన లేదా చాలా బిగ్గరగా సంగీతాన్ని వినాలి అనుకున్న అవి మీ వినికిడిని దెబ్బతీస్తాయి. ఇయర్ ఫోన్స్ ను ఉపయోగించడం వలన ఈ నష్టాలు మాత్రమే కాకుండా, ఆ ధ్వని వలన ఇయర్ కెనాల్ యొక్క పరిణామం ఆరు నుండి తొమ్మిది డెసిబెల్స్ పెరుగుతుంది. ఇది ఎన్నో తీవ్రమైన సమస్యలను కలిగించడానికి దారితీస్తుంది.


మనలో ఎంతో మంది సంగీత ప్రియులు ఉన్నందువలన ఇయర్ ఫోన్స్ కొనసాగుతున్నాయి. బహుశా మీరు మీ వినికిడిని కాపాడుకోవాలి అనుకుంటున్నారు. అయినప్పటికీ మీరు సంగీతాన్ని ఇష్టపడుతూనే ఉంటారు. కాబట్టి ఇయర్ ఫోన్స్ ( మరియు ఇతర శబ్ద ప్రమాదాలు)వలన కలిగే ప్రమాదాలను తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది. కాబట్టి మీరు సురక్షితంగా ఉండడానికి చర్యలు తీసుకోవచ్చు.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}