• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

మీ పిల్లలకు కాల్షియం అధికంగా లభించే ఆహారాలు ఎంత ముఖ్యమైనవి ?

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన May 13, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

పసిపిల్లలకు క్యాల్షియం చాలా ముఖ్యమైనది. వారికి చక్కటి ఆరోగ్యము మరియు ఎదుగుదల కొరకు వారి ఆహారంలో కనిజాలు తప్పనిసరిగా ఉండాలి. మీ పసిపిల్లలలో ఆరోగ్యకరమైన ఎముకలు మరియు దంతాల నిర్మాణంలోనే కాకుండా అనేక రకాలైన విధులను ఈ కాల్షియం నిర్వర్తిస్తుంది. అయినప్పటికీ చిన్న పిల్లలకు అవసరం అయినంత క్యాల్షియం అందటం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి . పిల్లల ఆహారంలో కాల్షియమ్ యొక్క ప్రాముఖ్యత , మీ పిల్లలకు ఎంత కాల్షియం అవసరం , పిల్లలకు ఉత్తమమైన క్యాల్షియం అధికంగా ఉండే ఆహారం ,మరియు క్యాల్షియం ఎక్కువ మరియు తక్కువ కాకుండా ఎలా నివారించాలి , పిల్లలకు తగినంత కాల్షియం అందకపోతే ఏమి జరుగుతుంది, మరికొన్ని అంశాలు....

 

పిల్లలలో కాల్షియమ్ యొక్క అవసరం ఏమిటి ?

 

పసి పిల్లలు మరియు చిన్నారులకు అనేక కారణాల వల్ల పెద్దల తో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా కాల్షియం అవసరం ఉంటుంది . పసిపిల్లలకు మరియు చిన్నారులకు క్యాల్షియం ఎంతో అవసరం.

 

ఎదిగే పిల్లలలో క్యాల్షియం యొక్క అవసరం ఏమిటి ?

 

బలమైన ఎముకలు, దంతాలు, కండరాలకు మరియు ఎముకల నిర్మాణంలో మార్పులు సంభవిస్తున్న వారికి కాల్షియం యొక్క అవసరం ఎంతో ఉంటుంది .శిశువు యొక్క గుండె విధులు సక్రమంగా జరిగేందుకు కాల్షియం యొక్క స్థిరమైన సరఫరా అవసరం ఉంటుంది .రక్తం గడ్డకట్టడంలో మరియు ఆహారాన్ని శక్తిగా మార్చే ఎంజైములను క్యాల్షియం ప్రేరేపిస్తుంది. తద్వారా క్యాల్షియం రిజర్వాయర్ ను నింపి జీవక్రియకు సహాయపడుతుంది. అస్తిపంజరం అనేది ఒక జీవ కణజాలము. మరియు క్యాల్షియం ఒక రిజర్వాయర్ లాగా పనిచేస్తుంది .క్యాల్షియంను చిన్న వయసులో జమ చేసినట్లయితే వారు ఎదిగిన తరువాత అది బాగా ఉపయోగపడుతుంది. 20 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి క్యాల్షియంను డిపాజిట్ చేసుకోవడం సాధ్యం కాదు. అందుకే పెద్దలు అందరూ వారికి అవసరమైన కాల్షియం ను ఎప్పటికప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది .లేదంటే శరీరం ఎముకలలోని క్యాల్షియంను తీసుకుంటుంది. ఫలితంగా -, బోలు ఎముకల వ్యాధి , ఎముకలు బలహీనపడడం లేదా పెళుసుగా  మారడం లాంటి పరిస్థితులకు దారి తీస్తుంది. అందువల్ల పిల్లలు తగినంత క్యాల్షియం తీసుకోవడంలో విఫలం అయినప్పుడు వారి ఎముకల పటిష్టత తగ్గిపోతుంది . వారు భవిష్యత్తులో ఎముకల బలహీనత లకు గురి అవుతారు.

 

ఇది కూడా చదవండి : ఈ కాల్షియం ఎక్కువగా ఉంటే వంటకాలతో పిల్లలలోని క్యాల్షియంను పెంచండి :

 

పసిపిల్లలకు మరియు చిన్నారులకు ఎంత కాల్షియం అవసరం ?

 

రోజుకి ఎంత కాల్షియం తీసుకోవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చే ఇవ్వబడిన సూచనలు క్రింద ఉన్నాయి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ... ప్రతి రోజు కచ్చితంగా అదే మోతాదులో కాల్షియంను ఇవ్వవలసిన అవసరం లేదు . దానికి బదులుగా ఆ వారంలో గాని , కొన్ని రోజులకు ఒక సారి గానీ ఆ మొత్తం క్యాల్షియం అందేలా చూసుకోవాలి.

 

పిల్లల వయస్సు - తీసుకోవాల్సిన కాల్షియం (mg లో) 0 - 6 నెలలు.. తల్లిపాలు తాగే వారిలో (300 ఎంజి), 0 - 6 నెలలు.. ఫార్ములా పాలు తాగే పిల్లలకు (500 ఎంజి), 7 నుండి 12 నెలల పిల్లలకు (550 ఎం జి),

1 నుండి 3 సంవత్సరముల వయస్సుగల పిల్లలకు (700 ఎం జి), 4 నుండి 7 సంవత్సరముల వయస్సుగల పిల్లలకు (800 ఎం జి), 8 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు... ఆడపిల్లలకు ( 900 ఎం జి )మరియు మగ పిల్లలకు (800 ఎం జి), 12 నుండి 15 సంవత్సరాల వయస్సు గల వారికి మరియు టీనేజ్  వారికి .. బాలికలకు (1000 ఎంజి )మరియు బాలురకు (1200 ఎం జి), మరియు 16 నుండి 18 సంవత్సరాల వయస్సు గల టీనేజర్స్ కు బాలికలకు (800 ఎం జి) మరియు బాలురకు (1000 ఎం జి) క్యాల్షియం అవసరం ఉంటుంది.

 

పిల్లల ఆహారంలో ఎక్కువ మోతాదులో కాల్షియం ఎలా అందించాలి ?

 

ఏడు నెలల లోపల ఉన్న చిన్నారులకు తల్లి పాలు లేదా ఫార్ములా పాల ద్వారా వారికి అవసరమైన క్యాల్షియం అందుతుంది. అయినప్పటికీ వారి పెరుగుదలకు మరియు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తగినంత క్యాల్షియం అందించేందుకు సమృద్ధిగా కాల్షియం లభించే పదార్థాలను వారి ఆహారంలో చేర్చడం ప్రారంభించండి.

 

పాల ఉత్పత్తులు :

 

మీ చిన్నారులకు రోజుకి రెండు సార్లు పాలు ఇవ్వడం ద్వారా 500 ఎం.ఎల్ (ఒకరోజు మోతాదు )వారికి అందుతుంది.

 

సోయా మిల్క్ :

 

ఇది కాల్షియం లభించే ఒక అద్భుతమైన ఆహారం . మీ పిల్లలకు పాల ఉత్పత్తుల వలన ఏదైనా ఎలర్జీలు వస్తున్నట్లయితే వారికి అవసరమైన క్యాల్షియంను సోయా మిల్క్ ద్వారా అందించవచ్చు. ఇందులో  ఎంతో ఉపయోగ కరమైన  క్యాల్షియం అందుబాటులో ఉంటుంది.

 

నారింజ :

 

ఒక చిన్న సైజు నారింజలో 50 ఎం.ఎల్ క్యాల్షియం ఉంటుంది .ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది.

 

ఆకుపచ్చ కూరలు :

 

బచ్చలి, బెండకాయ, బ్రోకలీ లాంటి పచ్చని కూరలు కూడా పిల్లలకి మంచి క్యాల్షియం ను అందిస్తుంది. అంతే కాకుండా ఈ ఆకుపచ్చ కాయకూరలు మీ పిల్లలకు ఫైబర్ మరియు ఇతర ఖనజాలను కూడా అందిస్తాయి.

 

కాయ ధాన్యాలు :

 

సోయా బీన్స్, కిడ్నీ బీన్స్, బాటనీలు, చిక్పీస్ లలో కూడా మంచి క్యాల్షియం లభిస్తుంది.

 

గుడ్లు :

 

గుడ్లలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఉడికించిన గుడ్డులో 50 ఎం.ఎల్ క్యాల్షియం ఉంటుంది . ఇది మంచి క్యాల్షియంను అందించినప్పటికీ మీ పిల్లలకు గుడ్డును ఇవ్వడం మొదలు పెట్టబోయే ముందు పిల్లల డాక్టర్ను సంప్రదించండి.

 

చేపలు :

 

ట్యూనా ,సాల్మన్ మరియు సార్దినేస్ వంటి చేపలలో కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది.

 

బాదం :

 

ఒక్క కప్పులో మూడోవంతు బాదంతో 110 ఎం ఎల్  క్యాల్షియం పొందవచ్చు.

పాల ఉత్పత్తులు మా పిల్లలకు అలర్జీని కలిగిస్తునట్లయితే వారికి అవసరమైన క్యాల్షియం ఎలా అందించాలి ?

 

పాల ఉత్పత్తుల ద్వారా క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది అనడం ఎంతో వాస్తవం. ఆవు పాలు మన పిల్లల ఎలర్జీలకు కారణం కావడం కూడా అంతే సాధారణం. అలాంటి సమయాలలో వారికి కాల్షియంను అందించే విషయంలో మీరు ఆందోళన చెందడం లో ఆశ్చర్యం లేదు .కానీ అదృష్టవశాత్తు ఈ రోజులలో క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలు ఎన్నో ఉన్నాయి .పాలకు బదులుగా వీటిని తీసుకోవచ్చు .ఎక్కువగా క్యాల్షియం  ఉండే తృణధాన్యాలను వాడవచ్చు . అవి మాత్రమే కాదు .మరెన్నో రకాల ఆహార పదార్ధాలను ఎంచుకోవచ్చు. మంచిగా క్యాల్షియం దొరికే బత్తాయి రసం, సోయా మిల్క్ , బత్తాయిలు , తోపు మరియు కాలర్ గ్రీన్స్ లాంటి ముదురు ఆకుపచ్చని కాయగూరలలాంటివి ఎన్నో ఉన్నాయి.

 

విటమిన్ డి :

 

విటమిన్ డి గురించి ప్రస్తావించ కుండా ఈ విషయాన్ని ముగించ లేము. శరీరానికి అవసరమైన విటమిన్ డి ను తీసుకోవడం చాలా అవసరం . క్యాల్షియంను గ్రహించేందుకు విటమిన్  డి యొక్క అవసరం చాలా ఉంటుంది .మీ పిల్లలకు అవసరమైన (దాదాపు 600 (iu) ఇంటర్నేషనల్ యూనిట్స్ )డి విటమిను అందేలా చూడండి.

 

సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి పుష్కలంగా అందుతుంది . ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ ను విటమిన్-డి గా మార్చడానికి సహాయపడుతుంది . అందువల్ల మీ పిల్లలను కొంతసేపు ఎండలో ఉంచడం చాలా అవసరం .సూర్యరశ్మి తో పాటు చేపలు ,గుడ్లలో కూడా విటమిన్ డి లభిస్తుంది .ఇతర ఆహార పదార్థాల ద్వారా కానీ మరే ఇతర మార్గాల ద్వారా పిల్లలకు విటమిన్ డి అందే అవకాశం లేదు .ఈ కారణంగా డాక్టర్లు విటమిన్-డి సప్లిమెంట్ తీసుకోమని చెబుతూ ఉంటారు .తల్లిపాలు మాత్రమే తాగే పిల్లలకు విటమిన్-డి సప్లిమెంట్ అవసరం ఉంటుంది . ఫార్ములా పాలు త్రాగే పిల్లలకు ప్రత్యేకంగా విటమిన్ డి యొక్క అవసరం ఉండదు .ఈ పాలలో విటమిన్ డి ని పొందుపరచి ఉంటారు.

 

ఈ బ్లాగు మీకు నచ్చిందా  ?ఉపయోగకరంగా ఉందా ? క్రింద కామెంట్ విభాగంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి .మీ ఆలోచనలను వినడానికి మేము ఎంతో ఇష్టపడతాము.

 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}