• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
అభిరుచులు బిడ్డ సంరక్షణ

నవజాత శిశువుల కోసం శిశు వైద్యుని ఎలా ఎంచుకోవాలి ?

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jul 09, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

బిడ్డ పుట్టిన తర్వాత ఒక అమ్మ ఫోన్ యొక్క స్పీడ్ డైల్ లిస్టు లో ఉండే మొదటి నెంబరు బహుశా శిశువైద్యునిదే అయి ఉంటుంది. శిశువు తుమ్మినా ,పడిపోయిన ,ఎక్కువగా ఏడుస్తున్న కొత్తగా తల్లిదండ్రులైన వారికి ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ల డాక్టర్ దగ్గరకు పరిగెడతారు . అతను ఒక డాక్టరు, ఒక కౌన్సిలర్ , ఆ తల్లిదండ్రులకు సర్వం తనే అవుతారు. ఆ వ్యక్తి మీకు ఎంత ముఖ్యమో కదా ! మీరు ఆ వ్యక్తిని తెలివిగా ఎంచు కావాల్సిన అవసరం లేదా ?

 

శిశు వైద్యుడిని ఎన్నుకునే సమయంలో పరిగణించవలసిన 7 అంశాలు :

 

మీ చిన్నారికి వైద్యుని ఎన్నుకునే సమయంలో గుర్తుంచుకోవాల్సిన 7 విషయాలను ఇక్కడ మేము మీకు తెలుపుతున్నాము.

 

వైద్యుడు ఎంత దూరంలో ఉంటారు :

 

అన్ని విషయాల మాదిరిగానే పిల్లల స్కూలు, హాబీ క్లాసులు, నివాసం లాగానే , డాక్టర్ను ఎన్నుకోవడం కూడా . ఇంటికి డాక్టర్ క్లినిక్ లేదా హాస్పిటల్ ఎంత దగ్గరగా ఉందో చూసుకోవాలి. అన్నింటికంటే శిశువుకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు మీ పిల్లల స్వస్థత కోసం కొన్ని గంటలు ప్రయాణం చేయడానికి ఎవరు ఇష్టపడతారు ?

 

డిగ్రీల కంటే కూడా వైద్యుని వైఖరిని చూడండి :

 

వైద్యుని లో ఇవి తప్పక ఉండాలి . అవి, అతను మీ మాటలు వినడానికి ,మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ,మీ బిడ్డ తో అనుబంధం పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి.(అన్నింటికంటే మొదటిది, మొదటి సంవత్సరంలో మీ బిడ్డను ఆరు సార్లు డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తారు) ఒక డాక్టరు ఎంత ప్రాచుర్యం పొందినప్పటికీ , ఎంత ప్రఖ్యాతి పొందిన డాక్టర్ అయినప్పటికీ , మీకు , మీ బిడ్డకు అందుబాటులో  లేనంత బిజీగా అయితే మాత్రం ఉండకూడదు . అతను అలా ఉంటే మాత్రం మీరు మీ ఎంపికను మరొకసారి పరిశీలించవలసి ఉంటుంది . అలాగే మీ పిల్లలు చికిత్సను ఎన్నుకునే సమయంలో మీ అభిప్రాయాలను తెలుసుకుంటారా అన్నది కూడా గమనించండి.

 

అందుబాటులో ఉండడం చాలా ముఖ్యం :

 

మీ డాక్టరు( లేదా అక్కడ పనిచేసే వారు) అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారా?  మీ ఫోన్ కాల్స్ కు , మెసేజ్ లకు సమాధానాలు ఇవ్వగలరా ? వైద్యులు వ్యక్తిగతంగా అందుబాటులో లేనట్లయితే, దానికి వేరే ప్రత్యామ్న్యాయం ఉందా ? ఇవి మీరు పరిగణలోనికి తీసుకోవాల్సిన విషయాలు.

 

డాక్టర్ యొక్క నెట్వర్క్ :

 

ఈ రోజులలో చాలా మంది డాక్టర్లు ఎక్కువ హాస్పిటల్స్లో కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. అతడు వేరువేరు హాస్పిటలలో మీకు అందుబాటులో ఉండటం వలన ప్రయోజనకరంగా ఉంటుంది . ఇలా ఆలోచించడం బాగుంది కదూ !

 

మీ పెంపకం యొక్క విధానము మరియు డాక్టర్ అభిప్రాయాలు :

 

ఇది మరింత పరిగణలోనికి తీసుకొనవలసిన అంశము . మరియు ప్రారంభంలో అంచనా వేయడం కష్టం అయినప్పటికీ , ఇది మీరు దృష్టి పెట్టవలసిన విషయము .ఆహారము , నిద్ర సమయాలు , మసాజ్ , మరియు ఆరోగ్య సంరక్షణ వంటి విషయాలలో డాక్టర్లకు వారి సొంత అభిప్రాయాలు ఉంటాయి .కొంతమంది డాక్టర్లు ఆవుపాలను, అందులోని ఉపయోగాలను నమ్ముతారు . కానీ ఎక్కువమంది వాటికి మద్దతు  ఇవ్వరు . కొంతమంది డాక్టర్లు అనుభవ జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు. మరికొందరు తల్లిదండ్రుల భావనలను పూర్తిగా వ్యతిరేకించవచ్చు . ఇది మీరు మీ బిడ్డను పెంచే విధానానికి అనుగుణంగా ఉందో ,లేదో చూడటం చాలా ముఖ్యం. లేదంటే మీరు ఏమి చేయాలో తెలియక గందరగోళానికి లోనవుతారు.

 

సహాయక సిబ్బంది :

 

వైద్యుని సహాయక సిబ్బంది అతని ప్రతిష్టను పెంచుతారు . వారు మీతో స్నేహపూర్వకంగా లేకపోయినా ,అక్కడ నీళ్ళు ,లేదా వాష్ రూమ్ లు సరిగ్గా లేకపోయినా , అక్కడ ఉన్న నర్సు లేదా అటెండర్లు గాని పిల్లలతో అసహనంగా ప్రవర్తిస్తున్న ట్లు అయితే , అటువంటి వాతావరణంలో మీ పిల్లల తో కలిసి వెయిటింగ్ రూమ్ లో కూర్చుని ఉండకూడదు. 

 

శిశువు మరియు డాక్టర్ :

 

చివరిది,  కానీ ..మీ శిశువు డాక్టర్ ని ఇష్టపడుతుందా, ఒక డాక్టర్ ని ఎంచుకోవడానికి పిల్లల నిర్ణయం కావాలి అని ఇక్కడ మేము చెప్పలేదు . డాక్టరు బిడ్డలతో ప్రవర్తించే విధానం , బిడ్డ డాక్టర్ ను చూసి భయ పడుతుందా, కారణాలు ఏమైనప్పటికీ బిడ్డ డాక్టర్కు దగ్గరకు  వెళ్లేందుకు పూర్తిగా ప్రతిఘటిస్తూ ఉంటే మాత్రం మీ కుటుంబానికి ఆ డాక్టర్ పనిచేయకపోవచ్చు.

 

చివరిగా, సరైన వైద్యుని ఎన్నుకోవడం చాలా ముఖ్యమైన ప్పటికీ, మీ వైద్యుని పై విశ్వాసం కలిగి ఉండడం చాలా ముఖ్యం . మరియు వారిని తరచుగా మార్చకూడదు . మీ పిల్లల వైద్య చరిత్రను పూర్తిగా అర్థం చేసుకున్న ఒక డాక్టరుకు మీరు కట్టుబడి ఉండటం చాలా మంచిది. (ఇంకా చదువుటకు: మీరు మీ బిడ్డకు సరైన వైద్యుని ఎన్నుకుంటున్నారా ? లేదా ?)

 

ఈ అంశంపై మీ అభిప్రాయాలను మరియు సూచనలను వినడానికి మేము ఇష్టపడతాము . నవజాత శిశువుల కోసం శిశు వైద్యుని ఎన్నుకునే సమయంలో తోటి తల్లిదండ్రులతో పంచుకోదగిన చిట్కాలు మీకు ఉన్నాయా ? దయచేసి ఈ విభాగంలో మీ అభిప్రాయాలు పంచుకోండి.

 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన అభిరుచులు బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}