• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
బొమ్మలు మరియు పిల్లల వస్తువుల

పిల్లల ఆట వస్తువులు... తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Sep 21, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

ప్రతి తల్లిదండ్రులకు పిల్లలు అన్నది ఇది వారి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన వారు. భారతదేశం లాంటి దేశాలలో ప్రతి తల్లిదండ్రుల జీవితాలు కూడా పిల్లల భవిష్యత్తుకే అంకితం చేస్తారు. తమ చిన్నారుల విషయంలో ప్రతిదీ కూడా ప్రత్యేకంగా, మరియు సురక్షితంగా ఉండాలని చూసుకుంటారు.

 

తమ కంటి పాపలు అయిన చిన్నారుల కోసం ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉండరు. తమ చిన్నారుల సంతోషం కోసం తల్లిదండ్రులు ఎంతో డబ్బుని, సమయాన్ని వెచ్చించడానికికూడా వెనుకాడరు. దానిలో భాగంగానే పిల్లలకు ఎటువంటి బొమ్మలను, ఆటవస్తువులను పిల్లల కోసం తీసుకోవాలో తెలియక కొంతమంది తల్లిదండ్రులు సతమతం అవుతూ ఉంటారు. వారి వారి ఆర్థిక స్థితిగతులను బట్టి వారి పిల్లలకు తల్లిదండ్రులు ఆటవస్తువులను కొనాలని అనుకుంటారు. ఖరీదు విషయాన్ని పక్కన పెడితే, తల్లిదండ్రులకు పిల్లల కోసం ఎటువంటి ఆటవస్తువులను తీసుకోవాలి అనే విషయంలో తల్లిదండ్రులకు కొన్ని సూచనలు...

 

* నెలల వయస్సు ఉన్న పిల్లలకు చిన్న చిన్న ముక్కలు గా ఉండే బొమ్మలను ఇవ్వకూడదు. కొన్నిసార్లు ఆ ముక్కలు విడిపోయి నోటికి అడ్డం పడే అవకాశం ఉంటుంది.బొమ్మలు సురక్షితమైనది గా మరియు ప్రమాదం కలిగినవిగా ఉండాలి.

 

* బొమ్మల యొక్క కొనలు సూది గా మరియు మూలలు గుచ్చుకునే విధంగా ఉండకూడదు. ఇవి పిల్లలు నోట్లో పెట్టుకున్నప్పుడు చిగుళ్లకు మరియు ఇతర శరీర భాగాలకు కూడా ప్రమాదకరంగా ఉండవచ్చు. పిల్లల కోసం బొమ్మలు తీసుకునేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది.

 

* మెత్తటి దారాలు ఉన్న బొమ్మలు, రబ్బరు మరియు రింగులు ఉన్న బొమ్మలను ఇవ్వకూడదు.వారు ఆ బొమ్మలను నోటిలో పెట్టుకున్నప్పుడు ఆ ధారాలు వారి కడుపు లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. మరీ ముఖ్యంగా రసాయనాలు లేని బొమ్మలను ఇవ్వడం అన్నది ఎంతో అవసరం. పిల్లల బొమ్మలను తరచూ శుభ్రపరుస్తూ ఉండడం అన్నది ఎంతో అవసరం. పిల్లలకు ఇవ్వబోయే ప్రతిసారి బొమ్మలను దుమ్ము ధూళి లేకుండా శుభ్రపరిచి మాత్రమే ఇవ్వాలి అని గుర్తుంచుకోండి.

 

* పెద్దగా చప్పుళ్లు మరియు మోతలు  వచ్చే బొమ్మలు ఇవ్వకూడదు. అలా చేసినట్లయితే పిల్లలు భయపడతారు. అది వారి మీద చెడు ప్రభావం చూపిస్తుంది. ఈ వయసులో పిల్లలకు పెద్ద శబ్దాలు ఎంతో హానికరం. అవి వారి వినికిడి శక్తి పై ప్రభావం చూపిస్తాయి.

 

* మీరు పిల్లల కోసం తీసుకునే బొమ్మలు సృజనాత్మకంగా మరియు ఉత్సాహాన్ని పెంచే విధంగా ఉండాలి. అంతేకాని భయం కల్పించే విధంగా మరియు  జుగుప్సాకమైనవిగా ఉండకూడదు. పిల్లలకు కొన్ని బొమ్మలు కరీదు కన్నా కూడా అవి వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా, విజ్ఞానదాయకంగా ఉండాలి.మీరు మీ చిన్నారులకు డాక్టర్ కిట్ ఇలాంటి బొమ్మలను ఖరీదు చేసే సమయంలో  వాటిని రసాయనాలు లేకుండా చేయబడినవిగా చూసుకోవడం ఎంతో అవసరం.

 

* కొన్ని రకాల బొమ్మలు పిల్లలలో కర్కశత్వాన్ని , విధ్వంసాన్ని పెంచే విధంగా ఉంటాయి. అవి పిల్లలలో అసాంఘిక భావాలకు నాంది పలికే ఎలా ఉంటాయి. అటువంటి బొమ్మలను పిల్లలకు ఎంత మాత్రము ఇవ్వకూడదు. పిల్లల్లో సృజనాత్మకతను పెంచే ఆటవస్తువులను వారి వయసు వారిగా తీసుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

 

* పిల్లలకు కేవలం బొమ్మలతో మాత్రమే కాకుండా , వారిలోని విజ్ఞానము, కళాత్మక అభివృద్ధి చెందే విధంగా ఇంటిలోనే కూరగాయలు, పప్పుధాన్యాలు, చెక్క ముక్కలు , అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, దూది, అట్టముక్కల వంటి వస్తువులను ఉపయోగించి పిల్లలతోనే సృజనాత్మకమైన చిన్న చిన్న వస్తువులను తయారు చేయించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

 

* టీవీలు, టాబ్ లు, కంప్యూటర్లను పిల్లలకు ఇచ్చే  సమయంలో తల్లిదండ్రులు తప్పకుండా జాగ్రత్త వహించాలి. వారు చూసే కార్టూన్ క్యారెక్టర్లు పిల్లలలో సృజనాత్మకతని , సంతోషాన్ని , విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. కానీ కొన్ని రకాల హింసాత్మకమైన క్యారెక్టర్లకు పిల్లలను దూరంగా ఉంచాలి. ఈ కాలపు చిన్నపిల్లలు ఎంతో చురుకుగా ఉంటున్నారు. వారు చూసే కార్టూన్ల మీద  తల్లిదండ్రుల పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలి. రోజుకి ఒక గంట నుండి రెండు గంటల సమయం మాత్రమే వీటికి కేటాయించే విధంగా అందుబాటులో ఉంచాలి. లేదంటే వారి కళ్ళ తో పాటుగా మనసు మీద కూడా ఎంతో ప్రభావం చూపిస్తుంది.

 

బొమ్మలను తరచుగా శుభ్రపరుస్తూ ఉండాలి. పిల్లలకు కొద్ది రోజుల పాటు ఉపయోగించిన తర్వాత ఆ బొమ్మలు మీద విసుగు కలుగుతుంది. అందుకే వాటిని కొంతకాలం పాటు లోపల దాచి ఉంచండి. కొత్త బొమ్మలతో ఆడుకోవడం విసుగు చెందిన తరువాత అవి లోపల ఉంచి,  దాచి ఉంచిన బొమ్మలను మరలా తిరిగి ఇవ్వండి. అలా చేసినట్లయితే బొమ్మల రూపంలో ఎక్కువ డబ్బును వృధా చేయవలసిన అవసరం ఉండదు. అది వారి భవిష్యత్తుకి ఉపయోగించవచ్చు.

 

కొంచెం పెద్ద పిల్లలకు అయితే ప్రతిరోజు పిల్లలు ఆడుకోవడం అయిపోయిన తరువాత వారి వస్తువులను వారే సర్దుకునే విధంగా అలవాటు చేయండి. అలా చేసినట్లయితే వారికి ఒక బాధ్యత అలవాటు అవుతుంది. అది వారి జీవితం అంతా కూడా ఉపయోగపడుతుంది. అదే విధంగా తల్లిదండ్రులకు ప్రతి రోజు వాటిని సర్దడం అనే పని తప్పుతుంది. తల్లిదండ్రులు ప్రారంభంలో పిల్లలకు బొమ్మలను ఎలా సెట్ చేసుకోవచ్చో  ఓపికగా చూపించాలి. తరువాత అదే క్రమంలో అమర్చడం వారికి అలవాటు అవుతుంది.

 

తల్లిదండ్రులు పిల్లలకు ఎంత ఖరీదైన బొమ్మలను కొంటున్నారు అనే విషయం కంటే కూడా పిల్లలకు ఎటువంటి సురక్షితమైన, సృజనాత్మకమైన మరియు ఆలోచనాత్మకమైన బొమ్మలను కొంటున్నారు అన్నది ఎంతో ముఖ్యం.


పిల్లల ఆట వస్తువుల విషయంలో వచ్చిన ఈ బ్లాగ్ మీకు ఉపయోగకరంగా ఉందా ! మీ అభిప్రాయాలను మరియు సూచనలను మాతో పంచుకోండి. మీ అభిప్రాయాలను తెలుసుకోవడం మాకెంతో ఇష్టం.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన బొమ్మలు మరియు పిల్లల వస్తువుల బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}