• లాగ్ ఇన్
 • |
 • నమోదు చేయు
పేరెంటింగ్ బిడ్డ సంరక్షణ ఆరోగ్యం మరియు వెల్నెస్ గర్భం

చిన్నారుల సున్నితమైన రహస్య అవయవాలను శుభ్రం చేయటం ఎలా?

Ch Swarnalatha
0 నుంచి 1 సంవత్సరాలు

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన Jul 14, 2022

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

పెళ్లయిన 3 సంవత్సరాల తర్వాత అనితకి  ఒక కొడుకు పుట్టాడు. ఆమెను మరియు ఆమె కొడుకు యుగ్‌ని బాగా చూసుకోవడానికి అనిత తల్లి వారిని తనతో తీసుకెళ్ళింది. డెలివరీ తర్వాత దాదాపు 4 నెలల వరకు, అనితకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు, ఎందుకంటే యుగ్‌కి సంబంధించిన పనులన్నీ అనిత తల్లి చేసేది. కానీ అనిత తన భర్త వద్దకు తిరిగి వెళ్ళవలసి వచ్చినప్పుడు, ఆమె మొదట ఏ పని చేయాలో, తరువాత ఏది చేయాలో అర్థం కాలేదు. ఆమె తల్లి ఆమెకు ప్రతిదీ బాగా వివరించినప్పటికీ, అనిత, యుగ్ కి సంబంధించి ఏదైనా పని చేయడానికి భయపడింది. కొన్ని రోజుల తర్వాత, అనిత చుట్టమైన బిన్నీ ఆంటీ,  అనిత వాళ్ళ ఇంటికి వచ్చింది.  యుగ్‌ని ఒడిలోకి తీసుకోగానే, వాడి డైపర్ తడిసిందని గ్రహించి ఆ  డైపర్ తీసేసింది. అపుడు, యుగ్ యొక్క రహస్య అవయవాలు శుభ్రంగా లేకపోవడాన్ని మారడాన్ని బిన్నీ మౌసి గమనించింది. 

బాబు వ్యక్తిగత  అవయవాల  ప్రాంతంలో మురికి అంటుకుని ఉంది. ఆ వెంటనే శుభ్రం చేయలేదా అని అనితను అడిగింది. దానికి అనిత, శుభ్రం చేస్తానని, కానీ ఆ సమయంలో తనకి చాలా భయం వేస్తుందని చెప్పింది.  ఆమె అత్తగారు రెండు నాలుగు రోజులకొకసారి  వస్తారు, ఇప్పుడు ఆమె ఇవన్నీ చేస్తుంట. ఇది విన్న బిన్నీ ఆంటీ, శిశువు యొక్క సున్నితమైన భాగాలను శుభ్రం చేయడానికి అనితకు కొన్ని చిట్కాలను చెప్పింది, అంతేకాకుండా  అనిత చేత తన కొడుకు యొక్క సున్నితమైన భాగాలను శుభ్రం చేయించింది.

మీ శిశువు జననాంగాలను ఎలా శుభ్రం చేయాలి?

నవజాత శిశువు యొక్క అన్ని శరీర భాగాలు చాలా మృదువైనవి, సున్నితమైనవి. ఇక తన వ్యక్తిగత  భాగాల విషయానికి వస్తే, ఇక్కడ మరింత శ్రద్ధ అవసరం. ఈ రోజు మనం మీ శిశువు యొక్క జననేంద్రియాలను ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం.  

ఎప్పుడూ ఒకలాగే కాదు…

మీ శిశువు యొక్క సున్నితమైన భాగాలను శుభ్రపరచడం అంటే ఎల్లప్పుడూ తుడిచివేయడం మరియు శుభ్రం చేయడం అని అర్థం కాదు. మీరు ఇలా చేస్తే, మీ శిశువు యొక్క సున్నితమైన చర్మం దెబ్బ తింటుంది, దద్దుర్లు కూడా రావచ్చు.

.డైపర్లను తనిఖీ చేస్తూ ఉండండి

 • రోజంతా మీ బిడ్డకు  డిస్పోజబుల్ డైపర్‌లను వేసి ఉంచితే, మీ బిడ్డ డైపర్ ఎప్పుడు నిండిపోయిందో, దానిని ఎప్పుడు మార్చాలో తనిఖీ చేస్తూ ఉండండి. శిశువు యొక్క డైపర్ రాత్రివేల కనీసం ఒకసారి అయినా మార్చాలి.
 • మీరు మీ బిడ్డకు గుడ్డ న్యాపీలనుతోడుగుతూ ఉంటే.. అవి తడిసిన వెంటనే వాటిని మార్చండి. ఈ విధంగా మీ శిశువు యొక్క శరీరంపై దద్దుర్లు రావు.. ఇంకా అతని చర్మం మృదువుగా, హాయిగా ఉంటుంది. డైపర్ రాష్ మీ శిశువు యొక్క మీ బిడ్డ పిరుదులు, తొడల మీద అలాగే వారి  సున్నితమైన అవయవాలను ప్రభావితం చేస్తుంది. 
 • మీ బిడ్డ పాటీకి వెళ్ళినపుడు, నీరు మరియు లిక్విడ్ మైల్డ్ బేబీ క్లెన్సర్ లేదా బేబీ వైప్‌లను ఉపయోగించడం ఉత్తమం. దీనికి నీరు మాత్రమే సరిపోదు.
 • మీ బిడ్డ అడుగు భాగాన్ని సున్నితంగా శుభ్రం చేసి, మెత్తని పొడి టవల్‌తో పొడిగా అయేలా ఆరబెట్టండి. ఎక్కువగా రుద్దడం వల్ల మీ శిశువు చర్మం దెబ్బతింటుంది. మీ బేబీకి  వీలైనంత వరకు  న్యాపీ లేకుండా ఉంచడానికి ప్రయత్నించండి, ఇది అతని చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

మీ అబ్బాయి జననాంగాలను జాగ్రత్తగా శుభ్రం చేయడం

 • స్నానం చేసేటప్పుడు లేదా న్యాపీలు మార్చేటప్పుడు, మీ శిశువు యొక్క సున్నితమైన భాగాలను పూర్తిగా శుభ్రం చేయండి.  తద్వారా అక్కడ మురికి ఉండదు. ఇంకా ఏమైనా అంటుకుని  ఉంటే, అది ఎండిపోతుంది, దానిని స్క్రబ్ చేయవలసి ఉంటుంది. అంత చిన్న పిల్లవాడికి అది సరికాదు.
 • మీ బిడ్డ అబ్బాయి అయితే, మీ శిశువు జననాంగాలను ఎలా శుభ్రం చేయడం భిన్నంగా  ఉంటుంది. నిజానికి బాబు పురుషాంగం యొక్క పై భాగం చాలావరకు దానంతటదే క్లియర్ చేయబడుతుంది. అక్కడ ఏదైనా మురికి కనిపిస్తే, వెట్ వైప్స్ సహాయంతో తేలికగా శుభ్రం చేయండి.
 • మీ శిశువు యొక్క ముందరి చర్మం అతని పురుషాంగం పైభాగానికి జోడించబడి ఉంటుంది. అతనికి రెండు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అది దానంతటదే పడిపోతుంది. దీని కోసం మీరు ఏమీ చేయవలసిన అవసరం లేదు. బలవంతంగా వెనక్కి నెట్టడం వల్ల, అది చిట్లిపోవచ్చు. నొప్పి కలిగి మేమే చిన్నారి భయపడవచ్చు. ఇది అతనికి తరువాత సమస్యలను కలిగిస్తుంది.
 • మీ బిడ్డ సున్తీ చేయించుకున్నట్లయితే, అతని న్యాపీని క్రమం తప్పకుండా మార్చండి. అతని పురుషాంగాన్ని శుభ్రం చేయడానికి లిక్విడ్ మైల్డ్ బేబీ క్లెన్సర్‌ని ఉపయోగించండి. అతని గాయంపై పెట్రోలియం జెల్లీని పూయండి. అతను కోలుకోవడానికి అతని ప్రైవేట్ పార్ట్స్ కి  కొంత గాలి ఆడనివ్వండి.
 • మీరు మీ బాబుకి  న్యాపీని ధరించేలా వెసినప్పుడు, అతని పురుషాంగాన్ని కిందికి దించండి, తద్వారా న్యాపీతో రాపిడిని నివారించవచ్చు.
 • మీ అబ్బాయి పురుషాంగంలో ఇన్ఫెక్షన్ ఉంటే, అది ఎర్రగా మారవచ్చు. అపుడు బాబు ఒంటికి పోసేతపుడు నొప్పిగా ఉంటుంది.  అలా అయినపుడు, వెంటనే శిశువైద్యుడిని కలవండి.

మీ చిన్నారి పాప  రహస్య అవయవాల శుభ్రత

 • మీ కుమార్తెకు స్నానం చేయించేటప్పుడు లేదా ఆమె న్యాపీని మార్చేటప్పుడు మీ శిశువు జననాంగాలను ఎలా శుభ్రం చేయాలి?
 • ఎల్లప్పుడూ ముందు నుండి వెనుకకు శుభ్రం చేయండి. దానివల్ల  విసర్జక అవయవాల లోని బ్యాక్టీరియా, యోనికి వ్యాప్తించదు.
 • అక్కడ తుడవడానికి,  బేబీ క్లీనింగ్ లిక్విడ్ తో తడిసిన మృదువైన, శుభ్రమైన కాటన్ గుడ్డ లేదా తేలికపాటి టవల్‌ను ఉపయోగించవచ్చు.
 • మీరు మీ కుమార్తె యోని పెదవులపై మురికి చూసినట్లయితే, తడిగ ఉన్న మెత్తటి గుడ్డ లేదా బేబీ వైప్స్‌తో పై నుండి క్రిందికి తుడవండి. ఆ తర్వాత ఇంకో తడి శుభ్రమైన గుడ్డతో లోపలి భాగాన్ని రెండు వైపులా శుభ్రం చేయండి.

ప్రతి ఒక్కరూ తన కన్నబిడ్డను ప్రేమిస్తారు..వారిని జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ, కొన్నిసార్లు శుభ్రపరచడం అనేదిసరిగ్గా జరగదు. మీరు మీ శిశువు యొక్క సున్నితమైన వ్యక్తిగత అవయవాలను శుభ్రం చేయడానికి మృదువైన, తడిగా ఉన్న కాటన్ గుడ్డ లేదా వైప్స్ ను ఉపయోగించాలి. మీ శిశువు యొక్క సున్నితమైన అవయవాలలో ఏవైనా మార్పులను మీరు గమనించినట్లయితే, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.

మీ సూచనలు  ఒకటి మా తదుపరి బ్లాగులను మరింత మెరుగుపరుస్తాయి, దయచేసి కామెంట్లు చేయండి, బ్లాగ్‌లో అందించిన సమాచారంతో మీరు సంతృప్తి చెందితే, ఖచ్చితంగా ఇతర తల్లిదండ్రులతో భాగస్వామ్యం చేయండి.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

https://www.parentune.com/parent-blog/how-to-clean-your-babys-delicate-organs-genitals/6345?fbclid=IwAR31vj24F-oBgeul2E2cGQcaqjuGbD8yJJRF3bDewTo5c80Ud6-gJY-hOMw

 • 1
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.

| Jul 21, 2022

hi

 • Reply
 • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన పేరెంటింగ్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}