• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

గర్భవతులు చివరి త్రైమాసికంలో ఈ భయంకరమైన వేసవిని ఎలా ఎదుర్కోవాలి ?

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన May 14, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

గర్భధారణ సమయంలో వేడి మరియు ఉక్కపోత ఎంతో భయంకరంగా అనిపిస్తుంది .ఎందుకంటే గర్భవతిగా ఉన్నప్పుడు మీ శరీరంలో ఉష్ణోగ్రతను మామూలు కంటే కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి .ముఖ్యంగా మూడవ త్రైమాసికంలో మరి కొంచెం ఎక్కువగా ఉంటాయి .కానీ వాటిని భరించడానికి మార్గాలు కూడా ఉన్నాయి .నా రెండు గర్భాల వేసవి సమయాలను నేను మర్చిపోలేను .నేను అప్పుడు చివరి త్రైమాసికంలో ఉన్నాను .మరియు వేడిని భరించలేక పోయేదాన్ని . నేను చాలా అధిక బరువు లో ఉండే దాన్ని . నేను నా  కాళ్లను   చూడలేక పోయేదానని . నా షూ లేసులు నేను కట్టుకోలేక పోయేదాన్ని . ఎండ వేడికి నేను కరిగి పోతున్నట్లుగా అనిపించేది . అటువంటి సమయంలో మనకు అనుకూలంగా ఉండే ఒక పేరెంట్ సుమిత్ర గోపాల్ గారు గర్భవతిగా ఉన్నప్పుడు శరీరాన్ని ఎలా చల్లగా ఉంచుకోవాలో తన చిట్కాలను నాతో పంచుకున్నారు.

 

మూడవ త్రైమాసికంలో ఉన్న గర్భవతులు వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

నాకు ఉపయోగపడిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి అవి మీకు కొంత వరకు పని చేయవచ్చు :

1. వేసవిలో ఉదయ కాలపు మరియు మధ్యాహ్నపు ఎండకు దూరంగా ఉండండి. బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోండి .సన్ గ్లాసెస్ ను దరించండి. మరియు ఎల్లప్పుడూ మీతో పాటు గొడుగును తీసుకువెళ్ళండి.

 

2.బయటకు వెళ్ళిన ప్రతి సారి నా పాదాలు బాగా వాచి పోయేవి .కాళ్ళను క్రాస్ గా పెట్టుకుని కూర్చోవడం అంటే నాకు ఇష్టం. నా పొట్ట పెద్దగా ఉండటంతో అలా కూర్చునేందుకు వీలు కుదిరేది కాదు. అందుకే ఒక చిన్న స్టూల్ ని తీసుకుని దానిపైన నా కాళ్ళు పెట్టుకుని సౌకర్యవంతంగా కూర్చుని వేడి నుండి విశ్రాంతి పొందే దానను.

 

3.అనవసరంగా బరువు పెరగడం అనేది గర్భధారణ సమయంలో ఎంతో అసౌకర్యానికి గురి చేస్తుంది .ప్రసవించిన తరువాత కూడా తల్లికి అది ఎంతో ఇబ్బందికరంగా మారుతుంది .అందుకు డాక్టర్లు సూచించిన విధంగా 15 కిలోల బరువును మాత్రమే పెరగాలని నేను చాలా ప్రయత్నించాను . గర్భం యొక్క చివరి త్రైమాసికంలో వీటి విషయంలో మాత్రం నియంత్రణ అన్నది నాకు అసాధ్యం అయింది . మొదటి రెండు త్రైమాసికాల్లో మాత్రం నేను కొంత వరకు నియంత్రించేందుకు ప్రయత్నించగలిగాను.

 

4.నేను మా టైలర్ తో అందంగా ,వేడిని బయటకు పంపించే విధంగా, సౌకర్యవంతమైన దుస్తులను కట్టించుకున్నాను .నాకు ఎంతో ఇష్టమైన ముస్లైన్ , కాటన్ మరియు లైనాన్ మెటీరియల్ తో లైట్ కలర్ బట్టలను చివరి త్రైమాసికంలో ఉపయోగించేదానను. తక్కువ బరువుతో బాగా గాలి తగిలేలాటి వస్త్రాలను ఎంచుకునేదానను.

 

5. నేను తక్కువ కేలరీలను ఎక్కువ నీటి శాతము గల ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే దానను .అవి ఎలాంటివంటే కీర దోసకాయ జ్యూస్ ,పుదీనా రసం ,నిమ్మరసం లాంటివి. వాటిలో తక్కువ కేలరీలు కలిగి మరియు నన్ను హైడ్రేట్ గా ఉంచేందుకు కూడా అవి సహాయపడేవి. ఆరోగ్యకరమైన తక్కువ కేలరీలు గల స్మూతీ ల మీద కూడా నేను ప్రయోగం చేశాను.

 

6.గర్భధారణ సమయం అన్నది ఏమాత్రం అపరాధ భావం లేకుండా అవసరం లేకపోయినా మంచి రుచికరమైన ఆహారం తినే సమయం .నేను కూడా అప్పుడప్పుడు అలా తినే విషయంలో తప్పులు చేయలేదు అని చెప్పలేను .కానీ ఆహారాన్ని రుచి గా ,సాఫ్ట్ గా మరియు ఘాటైన మసాలా లు లేకుండా చూసుకునే  దానను .మసాలా పదార్థాలను తక్కువగా తీసుకోవడం నాకు వేడిని ఎదుర్కోవడంలో కచ్చితంగా సహాయపడింది.

 

7.నా జుట్టు తో ప్రయోగాలు చేయడం నాకు ఇష్టం .అందువల్ల నా జుట్టును నేను చిన్నగా కత్తిరించు కున్నాను .దాన్ని చక్కగా పైకి మడిచి కట్టుకునేదాన్ని . జుట్టు నా మెడ మీద పడకుండా హాయిగా ఉండేది.

 

8.నాకు ఈత కొట్టడం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా నా చివరి త్రైమాసికంలో నీటిలో చేసే వ్యాయామాలు వేడి నుండి నన్ను కాపాడేవి .మీకు గర్భధారణకు ముందే ఈత అన్నది అలవాటు ఉన్నట్లయితే గర్భధారణ సమయంలో వాటిని ప్రయత్నించవచ్చు. కానీ గర్భధారణకు ముందు మీకు ఈత అలవాటు లేనట్లయితే గర్భధారణ సమయంలో వాటిని ప్రయత్నించకండి. దానికి బదులుగా మీరు స్విమ్మింగ్ పూల్ దగ్గర చల్లగా గడపండి . కానీ కాళ్లను జారకుండా జాగ్రత్త తీసుకోండి.

 

చివరిగాచివరి త్రైమాసికంలో ఉన్న వారు మండు వేసవిని ఎలా ఎదుర్కోవాలి ?

అన్నింటికంటే నాకు ఎక్కువగా ఉపయోగపడిన అది ఏమిటంటే పాజిటివ్ గా ఆలోచించడం మరియు నాకు దొరికిన ఖాళీ సమయంలో పుట్టబోయే బిడ్డకి కావలసినవి అన్ని సమకూర్చుకోవడం మీదనే నా ధ్యాసంతా ఉంచడం ద్వారా నా దృష్టి  వేడి నుండి దూరంగా ఉంచేందుకు ఉపయోగపడేది.

 

ఈ బ్లాగు మీకు సహాయ పడిందా ? క్రింది కామెంట్ బాక్స్ లో మీ చిట్కాలను వినడానికి మేము ఇష్టపడతాము.

 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}