• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
విద్య మరియు శిక్షణ

మీ పిల్లల చేతివ్రాత ను ఎలా మెరుగుపరచాలి..

Aparna Reddy
3 నుంచి 7 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Aug 12, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

సంజన వాళ్ళ ఇంటి వద్ద అందరూ కాఫీకి కలుసుకున్నారు. ఆమె  కుమార్తె యొక్క క్లాస్మేట్స్ తల్లులందరితో కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేశారు. ఆరోజు తల్లులందరూ వారిని బాధించే చేతివ్రాత సమస్యలను పంచుకుంటున్నారు. " నా కుమార్తె చేతిరాత ఎంతో గజిబిజిగా ఉంటుంది. ఆమె నోటి పుస్తకాలలో చక్కగా రాయాలని ఎంతో ప్రయత్నించినప్పటికీ గజిబిజిగానే ఉంటుంది " అన్నది సంజన, 7 సంవత్సరాల అమ్మాయికి తల్లి. " నా కొడుకు రాసిన దానిని నేను చదవలేను" అని ఎనిమిది సంవత్సరాల కుమారుడి తల్లి అయిన సునయన పంచుకున్నది." నా ఆరు సంవత్సరాల కుమార్తె పెన్సిల్ కూడా సరిగ్గా పట్టుకోవడానికి కష్టపడుతుంది "అని మరొక తల్లి ఆందోళనను వ్యక్తపరిచింది.

 

సరే , వారందరూ తమ పిల్లలు రాసిన అక్షరాలను మరియు పదాలను గుర్తించడానికి చాలా కష్టపడ్డారు ! చేతివ్రాత చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది గ్రేడ్లను ప్రభావితం చేస్తుంది. అందువల్ల పిల్లల చేతివ్రాతను మెరుగుపరచడానికి తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. చాలా మంది పిల్లలు ప్రారంభంలో రాయడానికి ఎంతో కష్టపడతారు. మీరు దానిని సరదాగా చేయగలిగితే చేతిరాతను మీ పిల్లలు తేనెటీగలోని తేనె లాగా తీసుకుంటారు.

 

కాబట్టి మీ పిల్లలలోని ఇబ్బందులను తొలగించడానికి మార్గాలు ఇక్కడ ఉన్నాయి. మరియు మీ తోటి తల్లిదండ్రులకు కూడా వారి నోట్బుక్లను చూపించండి.

 

1. మీ పిల్లలకు పెన్సిల్ సరిగ్గా పట్టుకోవడం నేర్పించండి :

 

ఇక్కడ పెన్సిల్ ను బొటన వేలు మరియు చూపుడు వేలు మధ్యలో ఉంచి మధ్యవేలు పై నిలిచి ఉండేలాగా పట్టుకోవాలి. దీనిని త్రిపాద  అంటారు. ఈ త్రిపాద పట్టును ప్రోత్సహించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. బబుల్ రాక్స్ , క్రేయాన్స్ , చిన్న సైజు పెన్సిల్స్, చిన్న ముక్కలుగా చేసిన బలపాల వంటివాటితో సాధన చేయవచ్చు. చేతిరాత గజిబిజిగా ఉన్న పిల్లలను పెయింటింగులలో పాల్గొనడం ద్వారా కళాత్మకంగా మారుతారు. ఒక్క గిన్నె నుండి మరొక గిన్నెలోనికి పూసలను పటకారు తో బదిలీ చేయించండి. కాగితాలను చింపి నలిపి ఉండలుగా చేయడం. భుజాలు మరియు చేతులకు బలం వచ్చే విధంగా నల్ల బోర్డు మీద చాక్ పీస్ తో రాయించండి.

 

2. మీ పిల్లలను వేరు వేరు గీతల పై రాయడం ప్రాక్టీస్ చేయించండి :

 

షేవింగ్ క్రీమ్ తో టేబుల్ మీద రాయడం, మబ్బులు కమ్మిన మిర్రర్ పై రాయడం, మట్టి తో గీతలు గీయడం, మిగిలిపోయిన సాస్ తో ప్రయోగాలు చేయవచ్చు. పిల్లల నైపుణ్యాలను పెంచడానికి ఇసుకతో ప్రయోగం చేయనివ్వండి లేదా బంకమట్టి లేదా పిండి తో ఆడుకోవడానికి అలవాటు చేయండి. ఇవి సరదాగా ఉంటాయి. కాబట్టి మీ పిల్లలు రాయడంలో ఉన్న ఇబ్బందుల నుండి తేలికగా బయట పడతారు.

 

3. పిల్లలకు వ్రాసే వాతావరణాన్ని ఇవ్వండి :

 

మీరు పిల్లలకు మంచి కుర్చీ,  సరైన ఎత్తులో ఒక టేబుల్ను అమర్చడం ద్వారా ఆ వాతావరణాన్ని ఇవ్వవచ్చు. ఇది భంగిమ తోపాటుగా మంచి రచనా నైపుణ్యానికి కూడా ముఖ్యమైనది. సరైన విధానంలో కూర్చోవడం మరియు చేతులను టేబుల్ మీద  విశ్రాంతిగా  ఉంచడం అన్నది చాలా అవసరం.

 

4. గళ్ళతో కూడిన కాగితాన్ని మీ పిల్లలకు అలవాటు చేయండి :

 

ఆంగ్లం  రాయడానికి నాలుగు లైన్ ల తో కూడిన పుస్తకాలను మరియు  హిందీ రాయడానికి ఐదు లైన్లతో కూడిన నోట్బుక్ లను ఇవ్వండి. ఈ గళ్ళ నోట్ బుక్స్ పిల్లలు అక్షరాలను ఒకే  పరిమాణంలో రాయడానికి సహాయపడతాయి. వారు అక్షరాలను పైకి కిందకీ రాయకుండా చక్కగా రాసుకుంటూ వెళ్లగలరు.

 

5. నెమ్మదిగా మరియు స్థిరంగా నేర్పించడం  సమస్యను పరిష్కరిస్తుంది :

 

నెమ్మదిగా రావడం మూలంగా పిల్లలు యొక్క శరీరము మరియు మనసు  స్థిరంగా ఉంటూ వారి ఆలోచనలను తక్కువ తప్పులతో కాగితం మీద పెట్టడానికి సహాయపడుతాయి. త్వరగా వ్రాయాలి అని పిల్లలను బలవంతం పెట్టవద్దు. మీ పిల్లలు మంచిగా రాయడానికి సరైన సమయాన్ని , మరియు స్థలాన్ని ఇవ్వండి. ఆమె కొంచెం, కొంచెం మెరుగు పడుతున్న సమయంలో గమనిస్తూ, ప్రోత్సహిస్తూ ఉండండి.

 

6. వ్రాయడాన్ని చిన్న చిన్న భాగాలుగా చేయండి :

 

ఒక్కసారిగా ఎక్కువ రాయడం అలసట మరియు నిరాశకు దారితీస్తుంది. ఇది మరొక సారి గజిబిజి చేతిరాత పునరావృత పరచడానికి దారి తీస్తుంది. ఈ సమయంలో కొంచెం కొంచెం రాయడం అలవాటు చేస్తే దీనిని నివారించవచ్చు. ఒక్క పేజీ అంటే చాలా ఎక్కువ, దీనిని సగం పేజీకి కుదించండి. మీరు చెప్పే విధానం చాలా సున్నితంగా ఉండాలి . తద్వారా మీ పిల్లలు ఈ ప్రక్రియను ఆనందిస్తారు. వారి పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించండి. అలా చేసినట్లయితే మీరు చేతివ్రాత ను నేర్పే సమయంలో ఆమె మిమ్మలను చూసి భయపడకుండా ఉంటుంది.

 

గుర్తుంచుకోండి, చేతివ్రాత అన్నది స్కూల్ లో వ్రాయడం మరియు ఇంట్లో హోం వర్క్ చేయడం కంటే కూడా  ఎక్కువ. ఇది ఒక జీవన నైపుణ్యము. ఇది రాబోయే కాలమంతా మీ బిడ్డ తోనే ఉంటుంది. ఆమెకు వ్రాయడం అంటే ఉన్న విసుగును తొలగించడానికి వారి స్నేహితుల పుట్టిన రోజు కి గ్రీటింగ్ కార్డ్ పై రాయడం లేదా వారి యొక్క డాన్స్ క్లాసులు గురించి లేదా ఆటల గురించి రాయడాన్ని ప్రోత్సహించండి. మీ పిల్లలు సహజంగా ఆనందించే విషయాలతో వారి  చేతివ్రాత ప్రక్రియను ముడి పెట్టడం వలన అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. డైరీ రాయడం అలవాటు చేసినట్లయితే వారి చేతివ్రాతతో ప్రతిరోజు ఒక పేజీని వ్రాయడం వలన కూడా తమ భావాలను బయట పెట్టడానికి మంచిగా ఉపయోగపడుతుంది. అదే సమయంలో వ్రాయడానికి కూడా అలవాటు అవుతుంది. వారు చేయాలనుకుంటున్న పనుల జాబితాలను కూడా తయారు చేయమని మీరు వారికి సూచించవచ్చు. (ఇది వారికి మరింత వ్యవస్థీకృతం కావడానికి  సహాయ పడుతుంది) లేదా మీ పిల్లలకు వారికి ఇష్టమైన కవితలు మరియు కొటేషన్లను కాపీ చేయమని ప్రోత్సహించండి .

 

మీరు ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తారు ? మీ పిల్లల చేతివ్రాత మెరుగుపరచడానికి మీరు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే దయచేసి  వాటిని మాతో పంచుకోండి. మరియు ఆ సమస్య లో ఉన్న ఇతరులకు సహాయం చేయండి. మీ అభిప్రాయాలను మరియు సూచనలు మా పాఠకులకు మరియు పేరెంటూన్ బృందానికి ఎంతో విలువైనవి.

 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన విద్య మరియు శిక్షణ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}