• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
బిడ్డ సంరక్షణ ఆరోగ్యం మరియు వెల్నెస్

గర్భధారణ సమయంలో శిశువు పిండం యొక్క బరువు ఎలా పెంచాలి.

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jun 11, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

మీరు గర్భం దాల్చిన క్షణం నుండి  ప్రసవం అయ్యేవరకు ప్రతి క్షణము ఒక అద్భుతం. ఈ సృష్టిలో తల్లి ఒక నిజమైన సృష్టికర్త.  ఒక చిన్న విత్తనాన్ని రక్తము, మాంసము మరియు ముఖ్యంగా ప్రేమతో పెంచుకుంటూ వెళ్తుంది. తల్లి తన ఆలోచనలను ,తన ఆహారాన్ని ప్రతిదీ కూడా బిడ్డకు అనుగుణంగానే చేస్తుంది. ఆరోగ్యకరమైన గర్భధారణ అంచనా వేయడం అంటే పిండం బరువును బట్టి ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి ఆల్ట్రాసౌండ్ స్కాన్ లో కూడా పిండం యొక్క బరువు మరియు ఎదుగుదలను చూచి మీకు సూచనలను ఇస్తారు. పిండం బరువు గర్భం యొక్క 5వ నెలలో లేదా  6 లేదా 7 వ నెలల్లో ఉండవలసిన బరువుకన్నా తక్కువగా ఉన్నది అని మీకు చెప్పబడితే? ఇక్కడ మీరు తెలుసుకోవలసిన అంశాలు.

 

పిండం బరువు అంటే ఏమిటి ?

 

గర్భధారణ సమయంలో పిండం యొక్క బరువును అంచనా వేయడానికి గర్భం యొక్క వివిధ దశలలో శిశువు యొక్క బరువు సరైన పద్ధతిలో రూపొందించడానికి అత్యంత సంక్లిష్టమైన వాటిని ఉపయోగించబడ్డాయి. అంటే ప్రతి గర్భిణీ ఒక ప్రత్యేకమైనది. మరియు పిల్లల ఎదుగుదల కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మీరు  నంబర్లు చూచి బేబీ చిన్నగా ఉంది లేదా పెద్దగా ఉంది అని దిగులు చెందవలసిన అవసరం లేదు. ఈ విషయంలో మీకు సహాయం చేసేందుకు ప్రముఖ గైనకాలజిస్టులు ఇక్కడ ఉన్నారు.  వారు ప్రత్యేకించి, చెప్పే వరకు ఏమాత్రం ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

 

7 నెల గర్భధారణ సమయంలో శిశువు బరువు ఎంత ఉండాలి?

 

గర్భం యొక్క ఏడవ నెల ప్రారంభం, గర్భం యొక్క మూడవ మరియు చివరి  త్రైమాసక ప్రారంభాన్ని సూచిస్తుంది. మీ బిడ్డ మీ చేతుల్లోకి వచ్చే సమయానికి మీకు సరైన ఆరోగ్య సంరక్షణ అవసరం ఉంటుంది.

 

మీరు 7వ నెల గర్భం తో ఉన్నప్పుడు ఆహారం తీసుకునే ఈ సమయంలో  బిడ్డను దృష్టిలో ఉంచుకోవాలి.  పిండం యొక్క ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం ప్రతిరోజు 450 కేలరీలు అదనంగా తీసుకోవాలి.

 

మీ గర్భాశయం ఎక్కువ స్థలం  తీసుకుం టున్నందువల్ల ఆహారాన్ని మితంగా తీసుకోవడం అవసరం. మీ ఏడవ నెల గర్భధారణ సమయంలో ఆహారం  ఐరన్ మరియు ప్రొటీన్లతో నిండి ఉండాలి.  కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, ఫోలిక్ ఆసిడ్లను తీసుకోవాలి. మరియు తీసుకోకూడని ఆహారాలు కూడా ఉన్నాయి. ఉప్పు, క్రొవ్వులు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలను మానుకోండి. ఇది మీకు కేవలం క్యాలరీలు ఇస్తాయి.  కానీ పోషక ప్రయోజనాలు ఉండవు.

 

8 నెల గర్భం లో శిశువు బరువుని ఎలా పెంచాలి ?

 

గర్భం దాల్చిన 8 మరియు 9వ నెలలో బిడ్డ ఎక్కువ శాతం మాంసము మరియు చర్మంతో కప్పబడి ఉంటుంది.

 

ఈ సమయంలో గర్భాశయం మరియు పొట్ట కూడా పెద్దగా ఉంటుంది. గంటకొకసారి కొంచెం కొంచెం ఆహారం తీసుకోవడం ఒక్కటే మార్గం. ఆ సమయంలో జరిగే రక్తం యొక్క నష్టాన్ని ఎదుర్కోవడానికి ఎక్కువగా విటమిన్లు,  ఖనిజాలు, ఇనుము మరియు కాల్షియం కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా అవసరం.

 

ఎక్కువ శాతం ప్రొటీన్లు,కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు మరియు ఫైబర్ ఉండేలాగా చూసుకోండి.  గుండెల్లో మంట మరియు అజీర్తి రాకుండా ఈ ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోండి.

 

ఎక్కువ క్రొవ్వు గల ఆహారాన్ని కెఫిన్ మరియు మెత్తని చీజ్ మరియు పచ్చి గుడ్లు లేదా సగం ఉడికిన గుడ్లను తీసుకోవడం ఈ  సమయంలో హానికరం.  అందుకే వీటికి దూరంగా ఉండండి.

 

8వ నెల మీకు చాలా సున్నితమైన సమయం. మరియు శిశువుకు మంచి పోషణను అందించేందుకు అధిక పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం.

 

మీరు కూడా ఈ సమయంలో వారం వారం బరువు పెరుగుతూ ఉంటారు.  అందుకే సున్నితమైన వ్యాయామాలు చేయండి. అంటే వాకింగ్, గర్భిణీల యోగ లలాంటివి చేస్తూ హుషారుగా ఉండండి.

 

గర్భం యొక్క చివరి నెలలో పిండం బరువు ఎలా పెంచాలి ?

 

పైన చెప్పిన విధంగా చూచినట్లయితే, పుట్టబోయే బిడ్డ మూడవ త్రైమాసికం నుండి వేగంగా బరువు పెరుగుతుంది. గర్భం యొక్క చివరి నెలలో శిశువు యొక్క బరువు పెరగడం మీ జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.  కాబట్టి సమతుల్యమైన పోషక ఆహారాన్ని తీసుకోవడంపై దృష్టిపెట్టండి.  కొంచెంకొంచెంగా ఎక్కువ సార్లు ఆహారాన్ని తీసుకోవాలి.  ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, క్యాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా దొరికే ఆహారాలు, మరియు విటమిన్ సి  మరియు విటమిన్ ఏ అధికంగా దొరికే పండ్లను కూడా పుష్కలంగా తీసుకోండి. గర్భం యొక్క చివరి నెలలో మీరు కదలకుండా ఉన్నట్లయితే చాలా కష్టంగా ఉంటుంది. దీని నుండి బయటపడాలంటే రోజుకి రెండు సార్లు వాకింగ్ చేసినట్లైతే చాలా తేలికగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోవడం వలన మలబద్ధకం మరియు గుండెల్లో మంటను నివారించవచ్చు .కెఫీన్, కోలాస్, పాలతో తయారు చేసిన స్వీట్లు, ఆల్కహాల్ లాంటి పానీయాలు, మెత్తని చీజు,  శుభ్రపరచని పౌల్ట్రీ ఆహారాలు మరియు ఫ్రై చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి.

 

గర్భధారణ సమయంలో శిశువు యొక్క బరువును పెంచడానికి సాధారణమైన చిట్కాలు :

 

 ** మీ గర్భధారణ సమయంలో అవసరమైనంత బరువు పెరిగేందుకు సమతుల్యమైన, పోషకాహారలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి.

 

* ప్రసవానికి ముందు ( ప్రినేటల్ )తీసుకునే విటమిన్లను క్రమం తప్పకుండా తీసుకోండి. మీ పోషకాహారంలో ఏదైనా లోపాలు ఉన్నా కూడా అవి భర్తీ చేస్తాయి.

 

* మీరు ఈ త్రైమాసికంలో ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ మరియు నట్స్ ను ఒక పిడికెడు తీసుకోండి. ఆరోజు శక్తికి అవి సరిపోతాయి.

 

* మీరు తగినంత విశ్రాంతిని తీసుకోండి. మరియు గర్భధారణ సమయంలో సరైన నిద్ర అవసరం అని గుర్తుంచుకోండి .మీరు నిద్ర పోవడానికి ఏదైనా సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అయితే చాయోముల్  గ్రీన్ టీ తీసుకోండి .లేదా మీకు నచ్చిన పుస్తకం చదవండి .

 

* మీరు ఎప్పుడు రిలాక్స్డ్గా ,పాజిటివ్ గా ఉండండి. మీ ఆందోళనను తగ్గించుకోండి.

 

* నీటితోనూ మరియు తాజా పండ్ల రసాలతో , ను మిమ్మల్ని బాగా హైడ్రేట్ గా ఉంచుకోండి. కెఫిన్ పానీయాలు మంచిది కాదు.

 

**గర్భధారణ సమయంలో శిశువు బరువు పెంచేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

 

గర్భధారణ సమయంలో ఫ్రైచేసిన ఆహారము మరియు కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం పూర్తిగా నివారించలేక పోయినప్పటికీ , తక్కువగా తీసుకోండి .లేకపోతే కొలెస్ట్రాల్ మరియు రక్తపోటులకు దారితీసి మీ గర్భధారణ ప్రమాదానికి దారి తీస్తుంది.

 

ధూమపానము, మారక ద్రవ్యాలు ,మధ్యము , కెఫిన్ మరియు కృత్రిమ తీపి కలిగిన జ్యూసులు మరియు పానీయాలను తాగడం మంచిది కాదు. ఇవన్నియు పిండం యొక్క ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి.

 

గర్భధారణ సమయంలో ఆల్ట్రాసౌండ్ స్కాన్ తో శిశువు బరువును ఎలా కొలుస్తారు?

 

పిండం బరువు-మొదటి ఎనిమిది వారాల వరకు పిండం చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది . ఆ సమయంలో  ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా తెలుసుకోగలుగుతారు. సుమారు 20 వారాల వరకు పిల్లల కాళ్లు వంకరగా ఉన్నందున తల నుండి కింది వరకు కొలుస్తారు .అటు తరువాత శిశువులను తల నుండి కాళ్ళ వరకు కొలుస్తారు . స్కాన్ సమయంలో రేడియాలజిస్ట్ పిండం యొక్క కొన్ని కొలతలను ఈ క్రింది విధంగా కొలుస్తారు.

 

*బై పారిటకల్ (బీ పీ డీ).. శిశువు యొక్క తల పక్క కొలత.

 

* ఎముక పడవు (ఎఫ్ ఎల్) తొడ ఎముక పొడవును కొలవడం.

 

*తల చుట్టుకొలత (హెచ్ సి)

 

* ఆక్సి ఫోటో ఫ్రంటల్ (ఓ ఎఫ్ డి)ముక్కు యొక్క మూలం నుండి చివరి వరకు పొడవును కొలవడం.

 

* ఉదర చుట్టుకొలత (ఏ సి) ఇది గర్భాశయం యొక్క పెరుగుదలను గుర్తించేందుకు కీలకమైనది.

 

* హ్యూమరస్ పొడవు (హెచ్ ఎల్ )చేయి ఎముక పొడవును కొలుస్తుంది .భుజం నుండి మోచేయి ముందు భాగం వరకు కొలుస్తుంది.

 

ఈ సూత్రాన్ని ఉపయోగించి పిండం బరువు మరియు గర్భధారణ వయస్సు లెక్కించబడుతుంది.ఈ సూత్రం ద్వారా చాలా ఖచ్చితంగా తెలుసుకోగలము అని అనుకోవడం మాత్రం మంచిది కాదు. అందువల్ల ఎప్పుడూ 10 శాతం మార్జిన్ ఉంటుందని గుర్తించాలి.

 

గర్భవతిగా ఉన్నప్పుడు నెలల వారీగా బేబీ యొక్క బరువు పట్టిక :

 

గర్భధారణ సమయంలో శిశువు పెరుగుదలను గ్రాములలో ఈ క్రింది పట్టికలో సూచించబడింది .ఈ పట్టికను అనుసరించండి.

 

గర్భస్త వారాలు          గ్రాముల లో బరువు

 

8 వారాలకు                  1 గ్రాము

 

9 వారాలకు                   2 గ్రాములు

 

10వారాలకు(2 నెలలు)   4  గ్రాములు

 

11వారాలకు                    7 గ్రాములు

 

12 వారాలకు                   14 గ్రాములు

 

13 వారాలకు                   23 గ్రాములు

 

14 వారాలకు                   43 గ్రాములు

 

15 వారాలకు                   70 గ్రాములు

 

16 వారాలకు                   100 గ్రాములు

 

17 వారాలకు                   140 గ్రాములు

 

18 వారాలకు                   190 గ్రాములు

 

19 వారాలకు                   240 గ్రాములు

 

20 వారాలకు(4 నెలలు)    300 గ్రాములు

 

21 వారాలకు                     360 గ్రాములు

 

22 వారాలకు                    430 గ్రాములు

 

23 వారాలకు                     501గ్రాములు

 

24 వారాలకు                     600 గ్రాములు


 

25 వారాలకు(5 నెలలు)      660 గ్రాములు

 

26 వారాలకు                   760 గ్రాములు

 

27 వారాలకు                   875 గ్రాములు

 

28 వారాలకు                   1005 గ్రాములు

 

29 వారాలకు                   1153 గ్రాములు

 

30 వారాలకు                   1319 గ్రాములు

 

31వారాలకు                   1502 గ్రాములు

 

32 వారాలకు                   1703 గ్రాములు

 

33 వారాలకు                   1918 గ్రాములు

 

34 వారాలకు                   2146 గ్రాములు

 

35 వారాలకు(7 నెలలు)     2483  గ్రాములు

 

36 వారాలకు                   2622 గ్రాములు

 

37 వారాలకు                   2858 గ్రాములు

 

38 వారాలకు                   3083 గ్రాములు

 

39 వారాలకు                   3288 గ్రాములు

 

40 వారాలకు(8 నెలలు)    3462 గ్రాములు

 

41 వారాలకు                   3597 గ్రాములు

 

42 వారాలకు                   3585 గ్రాములు

 

ముఖ్య సూచిక

పైన తెలిపిన పిండం యొక్క బరువు కు సంబంధించిన పట్టికలు సగటు అంచనాలు మాత్రమే .దీనిని ఆధారం చేసుకుని ఎటువంటి ప్రముఖ నిర్ణయాలు తీసుకోకండి. ఏదైనా సందేహాలు ఉంటే డాక్టర్ను సంప్రదించండి.

 

గర్భధారణ సమయంలో పిండం బరువు సరిగ్గా ఉంది అని నేను ఎలా నిర్ధారించుకోవాలి ?

 

బిడ్డ ఎక్కువ బరువు పెరగడం వలన డెలివరీ సమయంలో సమస్యలు వస్తాయని మరియు బరువు తక్కువగా ఉండడం వలన బలహీనమైన శిశువులు పుడతారని అధ్యయనాలు చెబుతున్నాయి. నేను చెప్పిన విధంగా ముందుగా తల్లి బరువు పిండం బరువును నిర్ణయిస్తుంది. కాబట్టి తల్లి సరైన బరువు కలిగి ఉండటం అన్నిటికంటే ముఖ్యం. బరువు ఎక్కువగా ఉండడం ,లేదా తక్కువగా ఉండడం మీకు మరియు మీ బిడ్డకు కూడా హాని కలిగిస్తుంది .గర్భధారణ బరువు పెరుగుదల , గర్భధారణ సమయంలో తల్లి యొక్క బి ఎం ఐ కి అనుగుణంగా ఉండాలి. తల్లి ఆ విధానం ప్రకారం బరువు పెరిగినట్లయితే సాధారణంగా పిండం పెరుగుదల కూడా సరిగ్గా ఉంది అనడానికి నిదర్శనం .కానీ కొంతమంది మహిళలు తమ బరువు పెరుగుదల సాధారణంగా ఉన్నప్పటికీ పిండం యొక్క బరువు తక్కువగా ఉండటాన్ని ఎదుర్కొంటున్నారు .ఈ విషయంలో సమస్యలు రాకుండా ఉండేందుకు ఏమి చేయాలో ,మరియు ఏమి చేయకూడదో చూద్దాం !

 

సహజ నివారణల ద్వారా శిశువు బరువుని ఎలా పెంచుకోవాలి ?

 

తల్లి గర్భంలోనే శిశువు యొక్క ఆరోగ్యానికి పునాది మొదలవుతుంది .శిశువు గర్భంలో ఉన్నప్పుడే మీరు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి .మరియు బిడ్డ పుట్టినప్పుడు సరైన బరువును కలిగి ఉండటం బిడ్డ ఆరోగ్యానికి సూచన. తల్లి ఆరోగ్యం ,జీవనశైలి, ఒత్తిడి స్థాయిలు, అలవాట్లు గర్భంలోని శిశువు పై ప్రభావం చూపుతాయి . గర్భధారణ సమయంలో ఒకవేళ మీ డాక్టరు బిడ్డ బరువు తక్కువగా ఉంది అని తెలిపినట్లు అయితే ,అది మీకు కొంత జీవనశైలిని మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అవలంభించిన వలసిన సమయం . తగినంత విశ్రాంతి తీసుకోండి .ఒత్తిడి మరియు ఆందోళనల నుండి దూరంగా ఉండండి .మరియు ఆరోగ్యకరమైన సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోండి .ఇది మీ బిడ్డకు పునాది సమయం.

కనుక మీ బిడ్డ మీ లోపలే అభివృద్ధి చెందుతుంది .గర్భధారణ సమయంలో పోషకాహారం  విషయంలో ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం .కాబట్టి గర్భధారణ సమయంలో మామూలు కంటే ఎక్కువ కేలరీలు ,ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ,కొవ్వులు మరియు ఎక్కువగా విటమిన్లు మరియు ఖనిజాలు తీసుకోవడం చాలా అవసరం.

 

** గర్భధారణ సమయంలో పిండం బరువు పెరిగే ఆహారాన్ని తీసుకోండి...

 

* ప్రోటీన్లు :

 

ఇది గర్భధారణ సమయంలో పిండం పెరుగుదలకు ప్రధాన భాగం కావడం తో రోజుకి 90 నుండి 100 గ్రాముల ప్రోటీన్ అవసరం ఉంటుంది. శిశువు యొక్క మొత్తం అభివృద్ధి ఇ ముఖ్యంగా మెదడు యొక్క అభివృద్ధికి ప్రోటీన్స్ చాలా అవసరం. బాదం, తక్కువ మోతాదులో చికెను, తక్కువ మోతాదులో బీఫ్, చేపలు మరియు జున్ను పాలు పాల ఉత్పత్తులు మరియు పెరుగు లో ఆరోగ్యకరమైన ప్రోటీన్లు ఉంటాయి. పిండం ఎదుగుదల కొరకు ప్రతి భోజనం లోనూ మ్యాక్ లోనూ ప్రొటీన్లు ఎక్కువగా ఉంది కొవ్వు తక్కువగా గల జున్ను ,వెన్న ,వేరుశెనగ లో చేర్చండి. అవిస గింజలు సబ్జా గింజలు వాల్ నట్స్ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ ఒమేగా త్రీ కోసం సీఫుడ్స్ కూడా తీసుకోవచ్చు.

 

* పిండి పదార్థాలు :

 

గర్భిణీ స్త్రీలకు అనవసరమైన బరువు పెరగడానికి మరియు తల్లికి లేదా బిడ్డకు పోషకాహారం తక్కువ అవడానికి కారణమైన, కేవలం కేలరీలు మాత్రమే లభించే కార్బోహైడ్రేట్లను తగ్గించాలి. వీటికి బదులుగా సాధారణమైన ,సమతుల్యమైన ఆహారం తో పాటుగా చిక్కుళ్ళు, తృణ ధాన్యాలు లేదా ఆఫ్రికాట్ ల వంటి ఎక్కువ కేలరీలు గల ఆహారాలను తీసుకోవచ్చు. తెల్లని బంగాళాదుంపలు, మొక్క జొన్నలు మరియు బఠానీల లాంటి వాటిలో కూడా కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి .కానీ ఇవి స్టార్చ్ ఫుడ్ కి సంబంధించినవి. రోజుకి ఐదు లేదా ఆరు రకాల కాయగూరలను మరియు ఆరు నుండి ఎనిమిది రకాల ఆరోగ్యకరమైన ధాన్యాలను సిఫార్సు చేశారు .ప్రతి స్త్రీకి ఆమె వ్యక్తిగత కేలరీల అవసరాలను బట్టి ఇవి మారుతూ ఉంటాయి.

 

* క్యాల్షియం :

 

ప్రపంచంలోని డాక్టర్ల అందరూ పాలిచ్చే తల్లులకు మరియు గర్భిణీ స్త్రీలకు రోజుకి 1000 ఎం జి క్యాల్షియం అవసరమని సూచిస్తున్నారు . మీరు గర్భధారణ సమయంలో పాల ఉత్పత్తులు, ముదురు ఆకుకూరలు, తృణ ధాన్యాలు ,బలాన్ని ఇచ్చే రసాలు, బాదం మరియు నువ్వుల వంటి ఎక్కువ కాల్షియం కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.

 

* ఫోలిక్ ఆసిడ్ :

 

మీ డాక్టరు మీకు సూచించే మొదటి  విటమిన్ పోలిక్ యాసిడ్. వెన్నుపూస సమస్యలతో పుట్టిన శిశువులనకు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది నిజానికి అన్ని రకాల న్యూరల్ ట్యూబ్ లోపాలను రాకుండా ఉండడానికి తగిన ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం ద్వారా 70 శాతం నివారించవచ్చని కనుగొనబడింది. కిడ్నీ బీన్స్ ,సిరి ధాన్యాలు ,ఆకు కూరలు, కాయగూరలు మరియు సిట్రిక్ పండ్లలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది.

 

* ఫ్యాట్స్ :

 

సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉండే ఆహారాన్ని గర్భధారణ సమయంలో తీసుకోకూడదు. పిండం బరువు పెరగడానికి అవకాడో, ఆలివ్ ఆయిల్ ,గింజల నుండి తీసిన వెన్న వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు తల్లికి మరియు బిడ్డకు మేలు చేస్తాయి . రోజుకి రెండు నుండి మూడు సార్లు ఈ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి .శిశువు బరువు పెరగాలంటే రోజుకి మరో రెండు సార్లు వీటిని అదనంగా తీసుకోండి .ఆవు నెయ్యి రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను పెరగనీయకుండా ,మంచి కొవ్వులను అందించడానికి బాగా పనిచేస్తుంది .ఫుల్ క్రీమ్ పాలు కొవ్వు మరియు క్యాల్షియం ను అందించడానికి బాగా ఉపయోగపడతాయి.

 

* చక్కెరలు :

 

మనం స్నాక్ లాగా తీసుకునే పండ్ల నుండి లభించే చక్కెర గర్భధారణ సమయంలో బిడ్డకు మరియు తల్లికి కూడా ఆరోగ్యకరమైన చక్కెరలను అందిస్తాయి. డెజర్ట్స్ లలో కూడా చక్కెర అధికంగా ఉంటుంది .అది బిడ్డకు తల్లికి కూడా మంచి పోషకాలను అందిస్తుంది. తాజా పండ్లు లేదా డార్క్ చాక్లెట్లు దంతాలకు మంచిది .రోజులో రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఈ రకమైన తీపి పదార్థాలు రోజుకి 100 క్యాలరీల కంటే ఎక్కువ తీసుకోకండి.ఈ రకమైన క్యాలరీలు బిడ్డ యొక్క బరువును తగ్గిస్తాయి. అదేవిధంగా తల్లి యొక్క  బరువును పెంచుతాయి.

 

* విటమిన్లు మరియు ఖనిజాలు :

 

రోజువారీ క్యాల్షియం మరియు డి విటమిన్ అవసరాలకు రెండు గ్లాసుల పాలు మరియు పెరుగు తీసుకుంటే సరిపోతుంది. ఉదయ కాలపు ఎండలో 20 లేదా 30 నిమిషాలపాటు గడిపినట్లు అయితే విటమిన్-డి మంచిగా లభిస్తుంది .బచ్చలి కూర లాంటి ఆకుకూరలు ప్రతిరోజూ తీసుకున్నట్లయితే ఐరన్, బీ 12, మరియు విటమిన్ ఇ వంటి అవసరాలకు ఉపయోగపడతాయి .ఆయా సమయాల్లో లభించే పండ్లు ఖనిజాలను బాగా అందిస్తాయి.

 

ప్రసవానికి ముందు గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు మల్టీవిటమిన్ లేదా మల్టి మినరల్స్ టాబ్లెట్స్ తీసుకోమని సలహా ఇస్తారు .తద్వారా వారికి అవసరమైన విటమిన్లు మినరల్స్ వంటి సూక్ష్మ పోషకాలు లభిస్తాయి .కళ్ళు తిరగడం మరియు వాంతులు లాంటివాటిని తగ్గించడంతో పాటు ఈ మల్టీ విటమిన్ మాత్రలు యొక్క పెరుగుదల కూడా సహాయపడతాయి .మార్కెట్లో దొరికే సప్లిమెంట్స్ లో గర్భిణీ స్త్రీలకు అవసరమైన విటమిన్ బీ12, ఫోలిక్యాసిడ్ ,మెగ్నీషియం, పొటాషియం మొదలైన సూక్ష్మపోషకాలు అవసరమైన మోతాదులో దొరుకుతాయి.

 

ఈ బ్లాగు మీకు నచ్చిందా ? దయచేసి ఈ వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను సూచనలను మాతో పంచుకోండి.

 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}