• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
బిడ్డ సంరక్షణ ఆరోగ్యం మరియు వెల్నెస్

రుతుపవనాల సమయంలో చిన్నారులను సౌకర్యవంతంగా ఎలా ఉంచాలి - తప్పక పాటించవలసిన 7 చిట్కాలు

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jun 05, 2020

 7
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

వర్షాకాలంలో పిల్లలు వర్షంలో తడవడం అంటే ఎంతో ఇష్టపడతారు. కానీ ఈ సీజన్ తల్లులను భయపెడుతుంది .ఒకవైపు  చెమటలు ,వేడి ,అలసట వంటివి పిల్లలకు  ఇబ్బందులు మరియు ఎంతో చిరాకు ను కలిగిస్తాయి . మరియు నవజాత శిశువులకు మరియు పిల్లలకు చర్మ వ్యాధులు, అజీర్ణం ,ఒంట్లో వేడి మరియు దోమల కారణంగా సంభవించే అలర్జీల వంటి కొన్ని ప్రమాదాలకు దారి తీస్తుంది.

 

వర్షాకాలంలో చిన్న పిల్లల విషయంలో చిట్కాలను తప్పక పాటించండి :

 

వర్షం కురుస్తున్నప్పుడు పిల్లలను ఎలా చూసుకోవాలో రుతుపవనాల గైడ్ మీకు చెబుతుంది....

 

# 1. వర్షం పడుతున్నప్పుడు చిన్నపిల్లలను ఇంట్లోనే ఉంచండి :

 

పిల్లలు వర్షంలో తడవడం అంటే ఎంతో ఇష్టపడతారు . కానీ చిన్న పిల్లలను, ముఖ్యంగా 12 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను వర్షాలు కొంత ఇబ్బందికి గురి చేస్తాయి .ఒక శిశువు వర్షంలో తడిసి నట్లయితే అది చర్మంపై దద్దుర్లు మరియు జ్వరం వంటి వాటికి కారణం అవుతుంది. ఎందుకంటే వారిలో రోగనిరోధక శక్తి తగినంతగా వుండదు .వాతావరణాన్ని ఆస్వాదించడానికి వారిని క్లోజ్ గా ఉండే డాబా మీద కాని ,బాల్కనీలో గాని కూర్చో పెట్టవచ్చు. కానీ నేరుగా బయటకు పంపడం తగ్గించండి. వర్షం సమయంలో బయటకు వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు......

 

# 2. కీటకాల వికర్షకాలను తప్పనిసరిగా వాడండి :

 

రుతుపవనాల సమయంలో నల్లులు , దోమలు, మరియు సాలెపురుగులు విపరీతంగా పెరిగిపోతాయి .అందుకే బయటకు అడుగుపెట్టే ప్రతిసారి దోమల వికర్షకం ని వాడండి . మీరు సహజమైన నూనెలను  లేదా ఔషధాలను అయినా సరే వాడండి . అలాగే దోమల వికర్షకం క్రీములను ఉపయోగించినప్పటికీ శిశువు యొక్క కాళ్లు మరియు చేతులను కప్పి ఉంచండి .ఏదైనా క్రిమి లేదా దోమ కుట్టినప్పుడు ఐస్ క్యూబ్ తో రుద్దడం వల్ల వాపు తగ్గుతుంది .మరియు దురద నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. అలాగే కలబంద (అలోవెరా ) జెల్ కూడా బాగా ఉపయోగకరం అని నిరూపించబడింది.

 

# 3. సురక్షితమైన దుస్తులు :

 

పిల్లలకు తేలికగా ఉండే డ్రెస్లను వేయండి. కాటన్ మరియు మల్ మల్ వంటి బాగా గాలి తగిలే లాంటి క్లాత్ ను వాడండి . ఎక్కువ పొరలుగా ఉండే వస్త్రాలను వేయడం మంచిది కాదు . ఉక్క పోతకు కారణమైన సింథటిక్ క్లాత్ తో తయారు చేసిన బట్టలను వేయకండి .ఇది చర్మానికి అంటుకుపోయి చెమటను బయటకు రానివ్వకుండా చేసి సమస్యలకు దారితీస్తుంది .అలాగే బట్టలను తరచుగా మారుస్తూ ఉండండి .మరియు వీలైనంత తరచుగా శుభ్రపరుస్తూ ఉండండి. మీ పిల్లలకు చెమట ఆరిపోయే విధంగా, సౌకర్యవంతంగా ,వదులుగా ఉండే బట్టలను వేయండి .బయటకు వెళ్ళిన ప్రతిసారి రెయిన్ కోట్ ను తీసుకుని వెళ్ళండి. అనుకోకుండా వర్షంలో చిక్కుకున్నట్లయితే అది ఉపయోగకరంగా ఉంటుంది.

 

# 4. పరిసరాల ఉష్ణోగ్రత :

 

రుతుపవనాల సమయంలో శిశువులకు గది ఎంత చల్లగా ఉండాలి అనే దానిపై చర్చ జరుగుతూ ఉంటుంది. (ఈ సీజన్ లో ఉష్ణోగ్రత చాలా హెచ్చుతగ్గులకు గురవుతుంది) కాబట్టి,మాకు చాలా వేడిగా ఉన్నందున మా బిడ్డకు కూడా ఎయిర్ కండిషన్ అవసరం అని పెద్దలు అనుకుంటారు. కానీ పిల్లలు పెద్దల కంటే కూడా ఉష్ణోగ్రతలకు అనుగుణంగా మారిపోతారు. గది ఉష్ణోగ్రత ల కంటే కూడా సరైన దుస్తుల మీద దృష్టి ఉంచండి.చల్లగా ఉండే గదిలో పైజమా మరియు ఫుల్ స్లిప్స్ ఉండే వదులైన దుస్తులతో శిశువు యొక్క కాళ్ళు మరియు చేతులు మొదలైన వాటిని కవర్ చేయండి. ఎయిర్ కండిషన్ ,కూలర్ లేదా ఫ్యాన్ యొక్క గాలిని పిల్లలకు నేరుగా తగలకుండా దూరంగా ఉంచండి. పిల్లలకు పుట్టిన రోజులు లేదా వివాహ సందర్భాలలో చేతులు కవర్ అయ్యే విధంగా ఫుల్ హాండ్స్ కాటన్ టీ షర్ట్ లను వేయండి.

 

# 5. కడుపులో వచ్చే వ్యాధులను గమనిస్తూ ఉండండి :

 

తేమ అనేది బ్యాక్టీరియా అభివృద్ధి చెందే సమయం .కనుక పరిశుభ్రంగా ఉండేలాగా, ముఖ్యంగా శిశువులు విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకునేలా గా చూసుకోండి. బిడ్డలు తల్లిపాలను బాటిల్ ద్వారా తీసుకుంటున్నట్లయితే బాటిల్, బ్రెస్ట్ పంప్ మరియు దాని యొక్క అన్ని భాగాలను ఉడక పెట్టకుండా ఆవిరి స్టెరిలైజర్ ను ఉపయోగించి క్రిమి సంహారం చేయాలని సూచించారు. కొత్తగా తల్లి అయిన వారికి ఆవిరి స్టెరిలైజర్ ను ఉపయోగించడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.  రసాయనాలు ఉపయోగించకుండా పిల్లల బాటిల్స్ ను మరియు ఇతర ఉత్పత్తులను క్రిమిసంహారకం చేసేందుకు ఈ స్టెరిలైజర్ తో ఆవిరి ద్వారా సహజంగా శుభ్రపరచవచ్చు. సీసాలు మాత్రమే కాకుండా ఇతర ఉపకరణాలు మరియు బ్రెస్ట్ పంపులు ,బొమ్మలను కూడా శుభ్ర పరచుకోవచ్చు. బొమ్మలను శుభ్రపరచే విధంగా విశాలమైన స్టెరిలైజర్లను  ఎంచుకోవడం మంచిది .పిల్లలు నోట్లో పెట్టుకుని ప్రతి వస్తువులు దీనితో శుభ్ర పరచుకోవచ్చు.

 

# 6 . ఆరోగ్యకరమైన ద్రవ ఆహారాలను మరియు తేలికపాటి ఆహారాన్ని ఎంచుకోండి :

 

ఇంకా తల్లిపాల నే తాగుతున్న పిల్లలకైతే తల్లిపాల ద్వారా వారికి కావలసిన అన్ని పోషకాలు మరియు అవసరం అయిన నీరు అందుతాయి. తల్లి పాలు విడిచిన  పిల్లలకు అదనపు ద్రవాలు అవసరం అవుతాయి .లేత కొబ్బరి నీరు, పలచని లస్సీ లేదా తాజా పండ్ల రసం వంటి ఆరోగ్యకరమైన పానీయాలను ఎంచుకోండి . వాతావరణంలోని తేమ దాహాన్ని అణిచి వేస్తుంది .కానీ శరీరానికి ద్రవాలు అవసరంలేదు అని కాదు .అలాగే ఆహారాన్ని తాజాగా ,తేలికగా జీర్ణం అయ్యే విధంగా మరియు ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెం ఇస్తున్నట్లయితే పిల్లలకు సులువుగా జీర్ణం అవుతుంది.

 

₹ 7 . చర్మ వ్యాధుల గురించి జాగ్రత్తపడండి :

 

రుతుపవనాలు చాలామంది పిల్లల్లో చర్మంపై దద్దుర్లు మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ల కు దారితీస్తాయి. పిల్లలకు డైపర్లు వాడుతున్నట్లయితే తరచూ మార్చండి . డైపర్లు మార్చే మధ్య సమయంలో కొంచెంసేపు చర్మాన్ని ఆరనివ్వండి . స్నానం చేసిన తరువాత చర్మపు ముడుతలు మరియు వేళ్ళ మధ్య నీరు చేరకుండా పొడిగా ఉంచండి. శిశువు చర్మానికి సురక్షితమైన టాల్కమ్ పౌడర్ను డాక్టరు సలహాతో ఉపయోగించండి. వర్షాకాలంలో  చర్మపు మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎలా నివారించాలో చదవండి.

 

గమనిక : రుతుపవనాల సమయంలో తల్లులు తమ పిల్లల విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేయడం మాత్రమే బ్లాగు యొక్క ప్రయత్నం .దీనికి ఫిలిప్స్ అవెంట్ మద్దతు కూడా లభించింది.

 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన బిడ్డ సంరక్షణ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}