• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
వేడుకలు మరియు పండుగలు

టపాసులు లేకుండానే దీపావళి ఆసక్తికరంగా మార్చడానికి చిట్కాలు..

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Nov 09, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

దీపావళి అంటే టపాసుల ధ్వనులు మాత్రమే ఎందుకు ఉండాలి ? పండుగ యొక్క ఉద్దేశం స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం, సంతోషాలను పంచుకోవడం మరియు రుచికరమైన డ్రైఫ్రూట్స్తో వంటకాలను తయారుచేసుకొని ఆనందిస్తూ పెద్ద ధ్వనులు మరియు పొగలతో కూడుకొన్న టపాసులకు స్వస్తి పలుకుదాం.

 

దీపావళి అంటేనే ఇల్లంతా మూల మూలల శుభ్రపరిచి పండుగ కోసం సన్నద్ధం అవుతాము. కొత్త బట్టల కోసం షాపింగులు చేయడం లేదా టపాసులు కాల్చడానికి సంసిద్ధమవుతాము. కానీ ఈ దీపావళికి టపాసులు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీపై, మీ పిల్లలపై మరియు చుట్టుపక్కల వారిపై ప్రతికూల ప్రభావాలను చూపించే టపాసుల ద్వారా విడుదలయ్యే ప్రమాదకరమైన మరియు ప్రాణాంతకమైన వాయుకాలుష్యం మరియు ధ్వనికాలుష్యం గురించి మీరు ఆలోచించారా ? టపాసులు నుండి దూరంగా ఉండడం అంటే సరదాల నుండి దూరంగా ఉండటం కాదు.

 

టపాసులు లేకుండా మీరు దీపావళి ఎలా ఆనందించాలో తెలుసుకోవడానికి దీన్ని చదవండి.

 

టపాసులు లేకుండా దీపావళిని ఎలా సరదాగా చేసుకోవాలి ?

ఈ పండుగ సమయంలో మీ చిన్నారిని బాధ్యతాయుతంగా పండుగ జరుపుకోవాలని ప్రోత్సహించండి. టపాసులు నివారించేటప్పుడు మీ పిల్లలకి దీపావళి పండుగను ఆసక్తికరంగా మార్చడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. ప్రేమను వ్యాప్తి చేద్దాం మరియు ఇతరుల ముఖాల్లో చిరునవ్వులు కురిపిద్దాం. టపాసుల ద్వారా హానికరమైన మరియు విధ్వంసకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి దోహదం చేయకూడదు. బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలని మన పిల్లలకు నేర్పిద్దాం.

 

పిల్లలకు కథ చెప్పడం :

పిల్లలు సహజంగా నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటారు. వారిని తర్కించకుండ మౌనంగా ఉంచడం అసాధ్యం.

పురాణాల ద్వారా దీపావళి యొక్క ప్రాముఖ్యతను వివరించండి. మీ బిడ్డకు రాముడు మరియు అతని భార్య సీత యొక్క పురాణ కథలను వివరించడం ద్వారా మీరు దీనిని చేయవచ్చు.

 

పరిశుభ్రమైన మరియు ప్రకాశవంతమైన గృహాల కోసం వెతుకుతున్న లక్ష్మీ దేవి భూమి చుట్టూ తిరుగుతున్న పౌరాణిక కథను కూడా మీరు వారికి చెప్పవచ్చు. ఈ కథ మీ పిల్లలు వారి గదులు మరియు వారి పరిసరాలను శుభ్రంగా మరియు చక్కగా ఉంచుకోవడానికి ప్రోత్సహిస్తుంది.

 

మీరు పిల్లలందరితో కలిసి దీపావళి సంబరాలు జరుపుకుంటూ ఉన్నట్లయితే, పిల్లల కోసం కథ చెప్పే కార్యక్రమాన్ని నిర్వహించండి. ఇరుగు పొరుగున ఉన్న ఇతర తల్లులతో కలవండి. కొంత అలంకరణ వస్తువులను అమర్చండి. కొన్ని మ్యూజిక్ సిస్టంలను అమర్చి పరిసరాలను ఉత్సాహభరితమైన యువ ప్రేక్షకులతో నింపండి. ఆసక్తికరమైన కథల ప్రదర్శనను చూపించినట్లయితే వారు తప్పకుండా టపాసులను మరచిపోతారు.

 

రుచికరమైన ఆహారం :

రుచికరమైన ఆహారము మరియు స్వీట్లు లేకుండా భారతీయ పండుగలు ఏవైనా ఉంటే అవి అసంపూర్ణంగానే ఉంటాయి. ఎంచి ఎంచి తినేవారు కూడా రకరకాల పిండివంటలతో ఆనందించగలరు.

 

రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తయారు చేయండి. ఆహార పదార్థాలలోని రుచి మీ పిల్లలకు చక్కలిగింతలు కలిగిస్తాయి మరియు ప్రేమను పంచుతాయి.

 

కొంచెం పెద్ద పిల్లలు పండుగ కోసం ఆహారాల పట్టికను తయారు చేయడం, ఇంటర్నెట్ లో కొత్త రకమైన వంటకాలను చూడడం మరియు వాటిని తయారుచేయడం వంటి పనులలో పాల్గొనవచ్చు.

 

మీరు కిరాణా సామాన్లు ఖరీదు చేసేటప్పుడు మీతో పాటు మీ పిల్లలను కూడా వెంట తీసుకు వెళ్ళవచ్చు. టేబుల్ మీద అన్నీ అమర్చడం వంటి సాధారణ పనులను కూడా వారికి అప్ప చెప్పవచ్చు. పిల్లలకు బాధ్యతలను అప్పగించిప్పుడు వారుపెద్దవారుగా భావించి ఆ పనిని బాధ్యతాయుతంగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

 

అలంకరణ :

మీపిల్లలు సాధారణంగా పాఠశాలలో అలంకరణ విషయంలో ఉత్సాహంగా ఉంటే ఇంట్లో కూడా అతని ప్రతిభను ప్రదర్శించాలని ప్రోత్సహించండి. మీ ఇంటికి సులభమైన దీపావళి అలంకరణలు చేసేందుకు మీ చిన్నారులను పాల్గొనమని తెలపండి. ఇంటిని అలంకరించడం విషయంలో వారి సహాయాన్ని తీసుకోండి. ఇది వారిలోని సృజనాత్మకతను పెంచుతుంది మరియు పండుగ కార్యకలాపాలలో పాల్గొనడానికి బాధ్యత వహిస్తారు.

 

కలిసిమెలిసి ఉండండి :

మీ పిల్లలకు తమ ప్రియమైన వారితో అనుబంధాలు బలపడడానికి సన్నిహిత కుటుంబసభ్యులు మరియు స్నేహితుల కోసం పార్టీని నిర్వహించండి.

 

ఇన్విటేషన్ కార్డు తయారు చేయడం లేదా ఫోన్ కాల్స్ ద్వారా వారిని ఆహ్వానించడం, స్నేహితులు మరియు దాయాదులను వ్యక్తిగతంగా ఆహ్వానించడానికి వారిని ప్రోత్సహించండి.

 

సాయంత్రం పార్టీ సమయంలో అలంకరణ, మెనూ మరియు ఇతర పార్టీ వివరాలను నిర్ణయించేటప్పుడు మీ పిల్లల సహాయం తీసుకోండి.

సాయంత్రం జరగబోయే పార్టీ కోసం వారి బట్టలను వారినే ఎంచుకోనివ్వండి.

 

ఆటలు మరియు సరదా కార్యక్రమాలను ఏర్పాటు చేయండి :

మీరు పెద్ద అపార్ట్మెంట్ లో నివసిస్తున్నట్లయితే పిల్లలు మరియు పెద్దల కోసం ఆటలు మరియు సరదా కార్యక్రమాలను ఏర్పాటు చేయండి.

నాటకాలు మరియు ఆటలను నిర్వహించండి . ఇది పిల్లలకు పండగ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది.

 

నాటకాలు మరియు ఆటలు పిల్లలు మన సంస్కృతిలోని వాస్తవాన్ని మరియు నిజాయితీని తెలుసుకొని గౌరవించడానికి మన పండుగల గురించి కథలరూపంలో తెలియజేయాలి.

 

మీ పిల్లలకు ఇవ్వడాన్ని నేర్పండి :

ఇవ్వటం మరియు పంచుకోవడం లేకుండా పండుగ ఏమిటి? మీరు మామూలుగా టపాసుల కోసం కర్చు చేసే డబ్బులు నుండి కొంత తీసుకోండి మరియు అవసరమైన వారికి పండుగ వినోదాన్ని పంచడానికి దానిని ఉపయోగించండి. వివిధ ధార్మిక సంస్థలకు బట్టలు అవసరమైన వస్తువులు లేదా స్వీట్లు కొనండి. మీ పిల్లలు ఉపయోగించని బొమ్మలను కూడా ఇవ్వటానికి అలవాటు చేయండి.

 

ఆత్మీయులకు బహుమతులు ఇవ్వండి :

ప్రియమైన వారికి బహుమతులు ఇవ్వకుండా దీపావళి పూర్తికాదు.

 

బామ్మలు, తాతయ్యలు, మేనమామూలు, అత్తమామలు మరియు దాయాదులతో సహా కుటుంబ సభ్యులందరికీ బహుమతులు నిర్ణయించడంలో మీ పిల్లల సహాయం తీసుకోండి.

 

మీ పిల్లలతో కార్డులు తయారు చేయించవచ్చు. ఏదైనా క్రాఫ్ట్ చేయవచ్చు. చాక్లెట్లు, కేకులు తయారు చేయడంలో మీకు సహాయపడవచ్చు.

 

ఇది వారిని బిజీగా ఉంచుతుంది మరియు వారు ఏదైనా సొంతంగా తయారు చేసేటప్పుడు ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.


ఈ సంవత్సరం దీపావళిని మీరు ఎలా జరుపుకోవాలి అని ఆలోచిస్తున్నారు ?దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మరియు సూచనలను మాతో పంచుకోండి!

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన వేడుకలు మరియు పండుగలు బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}