మీ పిల్లలను త్రేన్పించడం ఎలా ?

Aparna Reddy సృష్టికర్త నవీకరించబడిన Jun 18, 2020

హలో కొత్త మమ్మీ లూ,మీరు పొందుతున్న అవధులు లేని ఆనందానికి అభినందనలు మరియు మాతృత్వానికి స్వాగతం. రోజుల్లో తమ్ముడు కడుపునొప్పి ఏడవడం సరిగ్గా ఇవ్వలేకపోవడం ఎక్కువ సమయం పాలు పట్టడం గ్యాస్ మొదలైన వాటి గురించి ఫిర్యాదు చేస్తున్నారని నేను గ్రహించాను. అలాంటి వారికి సహాయం చేద్దాం !మీలో ఎంత మంది తల్లులు బిడ్డ ను త్రేన్పించిన తరువాత రెండో వైపు పాలు ఇస్తున్నారు.
త్రేనుపు కోసం మీ బిడ్డను భుజంపై ఎంతసేపు ఉంచుకుంటారు ? మీరు మీ బిడ్డకు సమయానికి పాలిస్తున్నారా ?మీ బిడ్డకు మీరు ఎక్కువ సేపు పాలు ఇచ్చిన లేదా తక్కువ సమయం ఇచ్చినా ,గంటకు ఒకసారి ఇచ్చినా సరే ఇంకా ఆకలి గా ఉండి ఏడుస్తుందా ? మంచి నిద్రలో కూడా అకస్మాత్తుగా లేచి ఏడుస్తుందా ?
అవును అయితే ,మీ అన్ని ప్రశ్నలకు ఏకైక పరిష్కారం త్రేనుపు. నేను 26 రోజుల శిశువు కు తల్లిని .ఈ అన్ని రోజులు నేను పై సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. శిశువైద్యుడను కలుసుకుని ,మరికొంత పరిశోధన చేసిన తర్వాత నాకు సహాయకారిగా ఉన్న ఒక పరిష్కారానికి వచ్చాను .మీకు కూడా ఇది సహాయ పడుతుంది అని ఆశిస్తున్నాను.
ఎల్లప్పుడు గుర్తుంచుకోండి...పాలిచ్చిన ప్రతిసారి బిడ్డను మీ భుజం మీద వేసుకుని కొంచెం నొక్కి ఉంచండి .అప్పుడు సులభంగా త్రేన్పు వస్తుంది .కొన్నిసార్లు త్రేన్పు కి ఐదు నిమిషాలు మరియు కొన్నిసార్లు 30 నిమిషాల సమయం కూడా పడుతుంది .కానీ చింతించకండి .ప్రతి శిశువుకు ఇది భిన్నంగా ఉంటుంది . ఒకవైపు పాలు ఇచ్చిన తర్వాత త్రేన్పించిన మరోవైపు పెట్టండి . ఎందుకంటే శిశువు త్రేనుపు తరువాత మాత్రమే సంతృప్తి చెందుతుంది .డాక్టర్ చెప్పిన దాని ప్రకారం, త్రేనుపు రాకపోతే బిడ్డ జీర్ణించుకోలేక చిరాకు పడుతుంది .గ్యాస్ పట్టేస్తుంది .పొట్ట గట్టిగా అవుతుంది మరియు మలబద్ధకం మొదలవుతుంది . ఎక్కువ నీరు మరియు బుడగలతో కలిగిన విరోచనం అవుతుంది. మంలంలోని ఆమ్ల పదార్థాల వల్ల దద్దుర్లు వస్తాయి .ఎందుకంటే కడుపులో గ్యాస్ చేరిపోయి పిల్లలకు పాలు జీర్ణం కావు.
కొన్నిసార్లు బిడ్డకు పాలు సరిగ్గా జీర్ణం కాకుండా కడుపులో గ్యాస్ చేరుతుంది. త్రేన్పించక పోవడం వలన కడుపులో గ్యాస్ చేరుకోవడం వలన ఇది జరుగుతుంది .బిడ్డను ప్రతిసారి త్రేన్పించండి .అన్ని సమస్యలు
పరిష్కారించబడతాయి .ఏ విధమైన ఔషధము అవసరం లేదు.
పాలు తాగే సమయంలో బిడ్డ అసౌకర్యంగా కనిపిస్తున్నట్లయితే మీరు బిడ్డతో త్రేన్పించ వలసిన అవసరం ఉంటుంది . ఉదాహరణకు బిడ్డ మెలికలు తిరుగుతూ మరియు లాగుతూ ఏడుపు మొదలు పెట్టినట్లు అయితే మీరు మరో వైపుకు మార్చే ముందు త్రేన్పించేందుకు మంచి అవకాశం ఉంటుంది. పిల్లలు పాలు తాగిన తర్వాత కారణం లేకుండా ఏడుస్తున్నట్లు అయితే మీ బిడ్డను త్రేన్పించండి.
త్రేపించే కొన్ని మార్గాలు :
మీ భుజంపై వేసుకొని :
మెల్లగా బేబీని మీ దగ్గరగా జరుపుకోండి .నిద్ర నుండి లేప వలసిన అవసరం ఉండదు .వారి తలను లేదా గడ్డం ను మీ భుజం మీద పెట్టుకుని విశ్రాంతి తీసుకోవ్వండి .వారి క్రింది భాగాన్ని మీ చేతులతో భరోసాగా పట్టుకోండి. అలా చేసినట్లయితే వారు జారిపోకుండా ఉంటారు . మీ మరో చేతిని వెనుకభాగంలో ఉంచి మెల్లగా తడుతూ ఉండండి.
మీ ఒడిలో కూర్చోబెట్టుకోవడం :
మీ బిడ్డను మీ ఒడిలో కూర్చోబెట్టుకోండి. మీకు అంటుకొని కాకుండా కొంచెం దూరంగా ఉంచండి .ఒక చేతిని బిడ్డకు ఆసరాగా ఉంచండి .మీ అరచేతిని ఆసరాగా ఉంచి మీ చేతివేళ్ళ తో బిడ్డ యొక్క గడ్డం మరియు దవడను సున్నితంగా భరోసాగా ఉంచండి .మీ వేళ్ళను బిడ్డ గొంతు నుండి దూరంగా ఉంచండి .మీ వేరొక చేతితో బిడ్డను కొద్దిగా ముందుకు లాగి వీపుపై సున్నితంగా తట్టండి . లేదా మెల్లగా నిమరండి.
మీ వడిలో బోర్లా పడుకోబెట్టు కోవడం :
బిడ్డను మీ కాళ్ల మీద బోర్లా పడుకో బెట్టుకొండి.అలా అయితే బేబీ మోకాళ్లపై పడుకుంటుంది . ఒక చేస్తూ మీ బిడ్డ గడ్డం మరియు దవడను ఆసరాగా పట్టుకోండి .బిడ్డ తలను ఆమె శరీరంలోని మిగిలిన భాగాల కంటే తలను కొంచెం ఎత్తులో ఉంచండి .మరో చేతితో సున్నితంగా రుద్దండి . లేదా మెల్లిగా తట్టండి. ఇవన్నీ మీ బిడ్డ విశ్రాంతి మరియు సౌకర్యవంతంగా ఉండేందుకు సహాయపడుతాయి.
పై సమాచారం కొత్తగా తల్లి అయిన వారికి సహాయపడుతుందని ఆశిస్తున్నాము .క్రింది వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి .
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు