• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
బిడ్డ సంరక్షణ

నవజాత శిశువుల ను త్వరగా నిద్ర పెట్టడం ఎలా ?

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Nov 12, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆహారం ఎలా ఇవ్వాలి అనే చర్చ తో పాటుగా , ఎక్కువగా చర్చించే విషయం మరి ఏదైనా ఉంది అంటే అది పసిపిల్లలను నిద్ర  పుచ్చడం ఎలా .. అని మాత్రమే. పసి పిల్లలు ఒక లాలి పాట తో నిద్రపోయే రోజులు పోయాయి. ఈ సమయంలో మీకు సరైన నిద్ర అన్నది చాలా అవసరం. కానీ నవజాతశిశువులు ఉన్న తల్లులకు ఇది చాలా కష్టమైనది. ఇలా చెప్పడం అన్నది తొలిసారిగా తల్లి అయిన వారిని మరియు తల్లి కాబోతున్న వారిని భయాందోళనకు గురి చేయాలని మాత్రం కాదు. వారిని ముందుగా అప్రమత్తం చేసి తల్లిగా వారి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు కొన్ని చిట్కాలను అందించడం కోసమే..

 

తమ నవజాతశిశువులను కొత్త ప్రపంచంలోకి అలవాటు చేయడంతో తల్లులు ఇబ్బందులను ఎదుర్కొంటారు.  వారికి పగలు మరియు రాత్రి కి మధ్య తేడాను గుర్తించడం కష్టం .అందుకే వారు చాలా తక్కువ సమయం నిద్రపోతారు. కొంచెం అభ్యాసం మరియు ప్రయత్నం తర్వాత మంచిగా నిద్ర పోవడానికి అలవాటు పడిపోతారు .కానీ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి . కొన్ని నెలల వయస్సు వచ్చాక వారికి సౌకర్యవంతమైన విధానంలోనే వారిని పడుకోనివ్వాలి. తద్వారా వారు త్వరగా నిద్ర పోవడమే కాకుండా ఎక్కువ సేపు మంచిగా నిద్ర పోతారు . వారు మధ్య రాత్రి నిద్ర నుండి లేచినప్పటికీ తమంతట తామే నిద్ర లోకి వెళ్ళిపోతారు . అలా నిద్రించేందుకు మీ నుండి కొంత సహాయం తీసుకుంటారు లేదా వారంతట వారే నిద్రపోతారు.

 

మీ బిడ్డ బాగా నిద్ర పోవడానికి సహాయపడే చిట్కాలు :

 

కొత్తగా తల్లి అయిన ప్రతి ఒక్కరి లోనే ఉన్న ఆందోళన ఏమిటంటే బిడ్డను ఎలా నిద్రపుచ్చాలి అనే..కొత్త ప్రపంచం లో అడుగు పెడుతున్న  చిన్నారులు బయటి వాతావరణానికి అలవాటు పడేందుకు కొంచెం కష్టం అవుతుంది .వారిని నిద్రపుచ్చేందుకు కొన్ని మంచి చిట్కాలతో దీన్ని ప్రారంభిద్దాం..

 

క్రింది సూచనలను గమనించండి :

 

మీ బిడ్డ ఆకలితో ఉంది అని మీరు గుర్తించినట్లే , బిడ్డ నిద్రించే సమయం అనే సూచనలను కూడా గమనించండి. అవి ఏమిటంటే ... నిశ్శబ్దంగా ఉండటం , ఆవలించడం, నిరాసక్తంగా ఉండటం , కారణం లేకుండా ఏడవడం అనేవి నిద్రకు సంకేతాలుగా గమనించండి.

 

నిద్రపుచ్చే సమయంలో చేయవలసినవి :

 

మీరు రోజంతా అలిసిపోయి చివరిగా పడుకునేందుకు వచ్చినప్పుడు ఈ పనులు మీకు చాలా కష్టంగా అనిపించవచ్చు .కానీ చాలామంది తల్లిదండ్రులు హామీ ఇస్తున్నారు. ప్రతిరోజూ ఒకే విధంగా చేయవలసిన అవసరం లేదు. కర్టెన్లను మూయడం ,లైట్ గా స్నానం చేయించడం, వెలుతురును డిమ్ గా ఉంచడం ,మెల్లగా సంగీతాన్ని వినిపించడం లేదా మృదువుగా లాలి పాట పాడడం లాంటివి చేయండి. ఇవి మీ బిడ్డను నిద్రపుచ్చడానికి బాగా ఉపయోగపడతాయి .మీరు వీటినన్నింటిని అనుసరించవచ్చు లేదా కొన్నింటిని మాత్రమే అనుసరించవచ్చు . కానీ ఏదైతే అనుసరిస్తారో  దాన్ని మాత్రమే స్థిరంగా ప్రతిరోజూ చేయాలి.

 

ఉయ్యాలలో కానీ రాక్ లో కానీ ఉంచి మృదువుగా ఊపడం..

 

దీనిని మొదటి కొన్ని నెలలు మాత్రమే ఉపయోగించాలి . బిడ్డను మెల్లగా ఊపుతూ ఉంటే సులభం గా నిద్ర లోకి వెళ్ళిపోతారు . ఆరు నెలల తర్వాత దీనిని కొనసాగించనివ్వకండి . ఎందుకంటే పిల్లలు ఎదిగాక నిద్రపోవాలంటే చాలా కష్టపడతారు.

 

తొట్టె లో వేసే సమయం :

 

మీ బిడ్డ నిద్రలోనికి జారుకుంటున్న సమయంలో మెల్లగా వారిని ఊపుతూ తొట్టి లోనికి  చేర్చండి. అప్పుడు వారు అది వారి నిద్రించే స్థలంగా గుర్తిస్తారు. ఇది మొదట్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది . కానీ దాన్ని అలా కొనసాగనివ్వండి.

 

గదిని సౌకర్యవంతంగా ఉంచండి :

 

పిల్లలకు లేదా పెద్దలకు మంచి నిద్ర అన్నది సౌకర్యవంతమైన గది మీద ఆధారపడి ఉంటుంది. గది చల్లగా ఉండేలాగా చూసుకోండి. లైట్లను కొంచెం మసకగా ఉంచండి .మీ చిన్నారిని ఫ్యాను లేదా ఏసీ (వేసవి అయితే) ల నుండి వచ్చే గాలికి నేరుగా ఉంచకుండా కొంచెం దూరంగా ఉంచండి. గది ఎక్కువ వేడిగా కానీ లేదా ఎక్కువ చల్లగా కానీ ఉండకుండా చూసుకోండి.

 

అవసరం అయినప్పుడు మాత్రమే పాలు పట్టండి :

 

మీ బిడ్డ అర్ద రాత్రి ఆకలితో నిద్ర మేల్కొని పెద్దగా ఏడుపు ప్రారంభించక ముందే పాలు పట్టండి. మీరు అప్రమత్తంగా ఉండి ముందుగా పాలు పట్టి నట్లయితే వారిని నిద్ర పూర్తిగా చెదిరిపోకపోవడంతో వారు త్వరగా నిద్ర పోతారు. పిల్లలు ఎదిగే కొలదీ సాయంత్రం పూట పాలు పట్టే సమయాల మధ్య వ్యత్యాసాన్ని  తగ్గించండి. అంటే ముందు మీరు ప్రతి 3 గంటలకి ఒక్కసారి పాలు ఇస్తున్నట్లయితే దాన్ని రెండు గంటలకి ఒకసారి ఇచ్చే లాగా తగ్గించండి. వారి పొట్ట నిండుగా ఉండి ఎక్కువ సేపు నిద్ర పోతారు.

 

డైపర్స్ మార్చండి :

 

బిడ్డకు పాలు పట్టే ముందు డైపర్ ను మార్చండి .ఎందుకంటే బిడ్డ పాలు తాగుతూ నిద్రపోవచ్చు . డైపర్ మార్చడం మరచి పోయినట్లయితే మధ్యలో డైపర్ కోసం బిడ్డను నిద్రలేపడానికి మీకు కష్టంగా ఉంటుంది.

 

ప్రతిది సరిగా ఉందో లేదో తనిఖీ చేయండి :

 

అన్ని పూర్తయిన తర్వాత కూడా బిడ్డ నిద్రపోకుండా అసౌకర్యంగా ఉన్నట్లయితే బిడ్డ ఆకలి తీరలేదేమో పరిశీలించండి .లేదా డైపర్ మార్చవలసిన అవసరం ఉందేమో గమనించండి .లేదా మరేదైనా అసౌకర్యానికి గురవుతుందేమో  తనిఖీ చేయండి.

 

అవసరం అయితే పక్కనే పడుకునేందుకు ప్రయత్నించండి :

 

మీ శిశువు చాలా చిన్నది అయితే ,మీరు కూడా వారి పక్కనే పడుకునేందుకు ప్రయత్నించండి .తద్వారా వాళ్ళు భరోసా పొందుతారు .మరియు సులభంగా నిద్రపోతారు .బిడ్డకు ఆరు నెలలు దాటిన తర్వాత ఆ అలవాటును మార్చాలి.

 

కెఫిన్ కు దూరంగా ఉండండి :

 

మీరు మీ బిడ్డకు తల్లిపాలు ఇస్తూ ఉన్నట్లయితే ,మీరు కాఫీ త్రాగడం తగ్గించడం మంచిది .ఎందుకంటే అది బిడ్డ నిద్రకు కూడా భంగం కలిగించి మామూలు కంటే ఎక్కువ సమయం మేల్కొని ఉండే అవకాశం ఉంటుంది.

 

ప్రశాంతత మరియు విశ్రాంతి :

 

మీరు ప్రశాంతంగా రెలాక్సెడ్ గా ఉండేందుకు ప్రయత్నించండి .పిల్లలు వారి తల్లిదండ్రుల భావాలను మరియు చిరాకు విషయంలో కూడా చాలా సున్నితంగా ఉంటారు. మీకు కొంచెం అలజడిగా అనిపిస్తే మంచి సంగీతాన్ని వినండి. హెడ్ ఫోన్లు పెట్టుకొని వింటున్నట్లయితే మీ చిన్నారి కోసం దాన్ని మీరు మెల్లిగా పాడుతూ ఉన్నట్లయితే మీ బిడ్డ సులువుగా నిద్రలోకి జారుకుంటుంది.

 

కొత్తగా తల్లి అయిన వారు మొదటి వారంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వారి చుట్టూ ఉండే కొత్త వాతావరణం,ప్రతిదీ చాలా కష్టతరంగా ఏదో కొత్త ప్రపంచంలో పడిపోయినట్లు గా అయిపోతారు. ఆ తర్వాత ప్రతిదీ సర్దుకు పోతుంది . మీరు మొదటి సారిగా తల్లి అయినట్లయితే మీ బిడ్డను నిద్రపుచ్చే విషయంలో ఏమాత్రం ఆందోళన చెందకండి. కూల్ గా ఉండండి .అన్నీ అవే సర్దుకుంటాయి . దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి. గుడ్ లక్.


ఈ చిట్కాలు మీకు ఉపయోగకరంగా ఉన్నాయా ? బిడ్డను నిద్రపుచ్చే విషయంలో మీ దగ్గర ఉన్న చిట్కాలను తోటి తల్లిదండ్రులతో పంచుకోవాలి అనుకుంటున్నారా ! కింద ఉన్న వ్యాఖ్యల విభాగంలో మాతో పంచుకోండి .మీ అభిప్రాయాలను తెలుసుకోవడం మాకు ఎంతో సంతోషం.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన బిడ్డ సంరక్షణ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}