• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

మీ పసిపిల్లల పళ్ళను బ్రష్ చేయడం ఎలా ?

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jul 16, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలు బ్రష్ చేయడం లేదా పళ్ళు తోముకోవడంను ఇష్టపడడంలేదు అనే పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది.  ఇది తల్లిదండ్రులను నిరాశ మరియు నిస్పృహలకు గురి చేస్తుంది. ఈ విషయంలో పిల్లలు కొన్నిసార్లు మొండిగా తయారవుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎలా అధిగమించాలి మరియు మన పిల్లల నోటి పరిశుభ్రతను ఎలా కాపాడుకోవచ్చు. తెలుసుకోవడానికి ఇక్కడ చదవండి...

 

మాదిరిగా ఉండండి :

 

మీ పిల్లలకు మీరే మాదిరిగా ఉండండి. రాత్రిపూట బ్రష్ చేయడం అన్నది మీ దినచర్యలో ఒక ముఖ్యమైన భాగం అని,  పిల్లల ముందు ప్రతిరోజు రాత్రిపూట  మీరు బ్రష్ చేయండి. బ్రష్ చేసే సమయంలో మీరు పాటలు పాడుతూ , డాన్స్ చేస్తూ దాన్ని ఒక సరదా కార్యక్రమంగా మార్చండి. కొన్నిసార్లు పిల్లలు బ్రష్ చేయడాన్ని అసహ్యకరమైన సంఘటనగా భావిస్తారు . మరియు బ్రష్ చేసుకోవడంపై భయాన్ని కూడా పెంచుకుంటారు. ఇది తరువాత దంత చికిత్స కోసం జరిగే 'టో ఫోబియా  ' కు దారి తీస్తుంది. దీనిని నివారించడానికి, ఇది వారి దినచర్య లో ఒక అంతర్భాగమని వారు గ్రహించేలాగా చెప్పడం ఎంతో ముఖ్యం.

 

ఆరోగ్యకరమైన కుటుంబ అలవాటు :

 

రాత్రిపూట బ్రష్ చేయడం అన్నది ఒక కుటుంబ కార్యకలాపంలాగా సాధన చేయగగాలి. తల్లిదండ్రులు ఒకరికొకరు బ్రష్ చేయించుకోవచ్చు. ఈ విధంగా తల్లిదండ్రులు ఇద్దరూ బ్రష్ చేసుకోవచ్చు అని పిల్లలకు అర్థమవుతుంది. మీ పిల్లలు మీకు బ్రష్ చేయించడానికి కూడా మీరు అనుమతించవచ్చు. రాత్రిపూట బ్రష్ చేయడం ఎప్పుడూ మాననీయకండి. ఇది ప్రతి రోజూ చేయవలసిన ఒక దినచర్య లాగా వారికి అలవాటు చేయండి.

 

మీరు ఇంట్లో ఎక్కడైనా బ్రష్ చేయవచ్చు. వాష్ రూమ్ లో మాత్రమే చేయాలి అనే విధానం పెట్టకండి. పిల్లలకు అది ఒక విసుగుపుట్టే పని కాదు అని అర్థమవుతుంది.

 

అద్దం ముందు నుంచుని బ్రష్ చేయడం వల్ల మీ పిల్లలు అలవాటును పెంచుకుంటారు. మరియు బ్రష్ చేసే విధానాన్ని కూడా అర్థం చేసుకుంటారు.

 

టూత్ బ్రష్ ను ఎంచుకోవడం :

 

చిన్నపిల్లలకు మృదువైన బ్రిస్టాల్ టూత్ బ్రష్ ను ఉపయోగించండి. టూత్ బ్రష్ పైభాగం మీ పిల్లలు వయసుకు అనుగుణంగా ఉండాలి.  చిన్న పిల్లల కోసం పెద్ద సైజు బ్రష్ ను ఎంచుకుంటే , దానివలన నోటి వెనుక భాగంలో పిల్లలకు నొప్పి కలుగుతుంది. అలా జరిగినట్లయితే మీ పిల్లలు బ్రష్ చేయడాన్ని ఇష్టపడకపోవచ్చు. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ లు పిల్లలకు వాడవచ్చు. కానీ వాటిని సరిగ్గా ఎలా వాడాలో వారికి నేర్పించాలి. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్లు అవే వాటి సొంత కదలికలను కలిగి ఉంటాయి. అందువల్ల వాటిని ప్రతి దంతాల పై భాగంలో కొన్ని సెకన్ల పాటు ఉంచాలి. చిన్న పిల్లలకు దంతాలు ప్రక్రియ ప్రారంభం అయ్యేవరకు వేలి బ్రష్ ను ఉపయోగిస్తే సరిపోతుంది. వేలి బ్రష్  తల్లిదండ్రులు వేలికే సరిగ్గా సరిపోతుంది . కాబట్టి శిశువుల పళ్ళను సులభంగా  బ్రష్ చేయడంలో అది వారికి సహాయపడుతుంది.

 

టూత్ పేస్ట్ ను ఎంచుకోవడం :

 

ప్రారంభ దినాలలో మీరు టూత్ పేస్ట్ ను ఉపయోగించడం కూడా మానేయవచ్చు. ఎందుకంటే కొన్ని సార్లు పిల్లలు టూత్ పేస్ట్ ను ఇష్టపడరు. ఒకవేళ పిల్లలకి టూత్ పేస్ట్ నచ్చకపోతే  పేస్టు ని మార్చండి . లేదా దానిని వాడడం మానేయండి. మీరు టూత్ పేస్ట్ వాడకాన్ని క్రమంగా వాడటం అలవాటు చేయవచ్చు.

 

మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల పిల్లలకు ఫ్లోరైడ్ లేని టూత్ పేస్ట్ లను ఉపయోగించాలి. ఎందుకంటే ఈ వయసు పిల్లలు టూత్ పేస్ట్ ను మింగడానికి ఇష్టపడతారు . 4 నుండి 6 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలకు ఫ్లోరైడ్ తక్కువ పరిమాణంలో ( 450-500)  కలిగి ఉండవచ్చు. 6 సంవత్సరాలు కంటే ఎక్కువ వయస్సున్న పిల్లలకు సాధారణ ఫ్లోరైడ్ టూత్ పేస్టులను ఉపయోగించవచ్చు. దంతాలకు ఫ్లోరైడ్ అన్నది ఎంతో ముఖ్యం . ఎందుకంటే ఇది ఎనామిల్  ను బలంగా ఉంచి మరియు దంతక్షయాన్ని రాకుండా చేస్తుంది.

 

తల్లిదండ్రుల ప్రమేయం :

 

పిల్లలు బ్రష్ చేసుకునే సమయంలో తల్లిదండ్రులు వారి వెనక నిలబడి ఉండాలి. పిల్లల తల వారు బ్రష్ చేసుకునే సమయంలో తల్లిదండ్రుల ఛాతీ లేదా కడుపును అనుకొని ఉంటుంది. ఈ విధంగా వారు బ్రష్ చేసే సమయంలో పిల్లల తల కదలికలు మీరు నివారించవచ్చు. పిల్లలకు 6 సంవత్సరాల వయసు వచ్చే వరకూ తల్లిదండ్రులే బ్రష్ చేయించాలి. ఆ తర్వాత పిల్లలు తమంతట తామే తల్లిదండ్రుల ఆధ్వర్యంలో బ్రష్ చేసుకోగలరు. ఈ విధంగా 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం. తద్వారా పిల్లలు నోటిలోని ఏ భాగాన్ని కోల్పోకుండా ఉంటారు. 12 సంవత్సరాల వయస్సు తరువాత  పిల్లలు స్వతంత్రంగా బ్రష్ చేసుకోగలరు. పిల్లలు రెండు నుంచి మూడు నిమిషాల పాటు పళ్ళు తోముకోవాలి . అన్ని దంతాల యొక్క ఉపరితలాలను బాగా బ్రష్ చేయాలి. టైము చూసుకోవడానికి టైమర్ ను ఉపయోగించుకోవచ్చు.

 

బ్రష్ చేయడం అనే విషయం పై డాక్టర్ కునాల్ గుప్తా గారి చిట్కాలు మీకు ఉపయోగపడ్డాయా  ? మీ పిల్లలు పళ్ళు తోముకోవడం ఎలా అనే ఈ విషయంపై దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ అనుభవాలు మరియు సూచనలను మాతో పంచుకోండి. మీ నుండి వినడానికి మేము ఎంతో ఇష్టపడతాము.
 

 

 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}