• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

దీపావళి సందర్భంగా తలెత్తే ఉబ్బసం మరియు శ్వాసకోస వ్యాధుల ప్రభావాన్ని తగ్గించే చిట్కాలు

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Nov 12, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

దీపావళి, దీపాల పండుగ. ఇది కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందాలను పంచుకునే సమయం. ఏది ఏమైనప్పటికీ పండుగల సమయంలో పిల్లల సంరక్షణ చూడడం కూడా అందులో ఒక భాగం అవుతుంది. అధిక స్థాయిలో ఉండే వాయు కాలుష్యం మరియు శబ్ద కాలుష్యం. శబ్ద కాలుష్యం కొన్ని రోజులకు మాత్రమే పరిమితం అవుతుంది . అంటే టపాసుల ఉత్సాహం అయిపోయే వరకు మాత్రమే. కానీ వాయు కాలుష్యం చాలా రోజులు కొనసాగుతుంది. ఇప్పటికే మనం పీల్చే గాలి నాణ్యతను కోల్పోయి కాలుష్యంగా మారిపోయింది. దీపావళి సందర్భంగా పొగ మరియు విషపదార్థాలు మరింత దిగజారుతాయి. ఈ దీపావళి సీజన్ లో మీ పిల్లలను ఎలా సంరక్షించుకోవాలో తెలుసుకోవడానికి దీనిని చదవండి.

 

ఆస్తమా మరియు శ్వాసకోస వ్యాధులు ఉన్నవారు దీపావళి సందర్భంగా జాగ్రత్తలు వహించాలి.

 

దీపావళి ఒత్తిడి లేకుండా ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారా ?  ఈ కాలుష్యాన్ని పూర్తిగా నివారించలేం . అయినప్పటికీ, మీ పిల్లల పైన మరియు మీ పైన దాని ప్రభావాన్ని తగ్గించడానికి మీరు ప్రయత్నించవచ్చు. మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని చిట్కాలు. మీ చుట్టుపక్కల వారు కూడా జాగ్రత్త వహించే విధంగా శ్రద్ధ తీసుకోండి.

 

ముందుగానే జాగ్రత్త వహించండి:

మీ పిల్లలకు ఏవైనా శ్వాసకోశవ్యాధులు ఉన్నట్లయితే అది తీవ్రతరం కావచ్చు. అటువంటి సమయంలో మందుల యొక్క మోతాదును పెంచవలసిన అవసరం ఉంటుందా అని డాక్టర్ను సంప్రదించండి. మీ  వైద్యులను సంప్రదించిన తర్వాత నెబులైజేషన్ను కూడా పరిగణించవచ్చు.

 

మందుల యొక్క మోతాదును సిద్ధం చేసుకోండి :

పిల్లలు దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్లైతే, ఇన్హేలర్ లు లేదా నెబ్యులైజర్లు తీసుకునేవారు రోజంతా కవర్ చేయడానికి నెబులైజేషన్ను ప్లాన్ చేయండి.మీ వైద్యుడితో మాట్లాడండి మరియు అతడు తయారుచేసిన పట్టికను దగ్గర ఉంచుకోండి.

 

సెలైన్ నాసికా స్ప్రే మరియు ఆవిరి మిషన్:

సెలైన్ నాసికా స్ప్రేలను అందుబాటులో ఉంచండి. మీ పిల్లలు బయట నుండి తిరిగి వచ్చి అలర్జీలు మరియు అసౌకర్యానికి గురైనట్లుగా అనిపించినట్లయితే సెలైన్ నాసిక డ్రాప్స్ ను వాడండి. అదేవిధంగా శ్లేష్మము విడుదల కావడానికి ఆవిరి కూడా చాలా సహాయకారిగా మరియు సురక్షితంగా ఉంటుంది. మీరు ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు ఆవిరి పట్టవచ్చు .ఇది చాలా సురక్షితం.

 

పరిశుభ్రత విషయంలో శ్రద్ధ వహించండి:

మీ పిల్లలను తరచుగా చేతులు శుభ్రపరచుకోవాలని, సున్నితంగా కళ్ళను కడుక్కో మని, వారికి అసౌకర్యంగా అనిపించినప్పుడు ముక్కును చీదమని చెప్పండి.

 

కాలుష్యం అధికంగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లడం నివారించండి :

 

సాధారణంగా సాయంత్రాలు సమయం గాలి ఎక్కువ కలుషితమయ్యే సమయం. కాబట్టి మీ పిల్లలను ఆరు బయటకు తీసుకు వెళ్లడం మానుకోండి. బదులుగా ఇంటి లోపలే వారికి ఆటలను సిద్ధం చేయండి.

 

ముఖము మరియు నోటిని కవర్ చేయండి :

ప్రత్యేకంగా మీ పిల్లలు పొగ విషయంలో సున్నితంగా ఉన్నట్లయితే ఒక కాటన్ రుమాలుతో ముఖము మరియు నోటిని కవర్ చేసుకోమని చెప్పండి. వారు టపాకాయలను కలుస్తున్నప్పుడు లేదా కాల్చే వారికి సమీపంగా ఉన్నప్పుడు కొంతవరకు కాలుష్యాన్ని నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి.

 

పురాతన గృహ నివారణలను ప్రయత్నించండి :

వివిధ రకాల మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన (కాదా) మిశ్రమాన్ని ప్రతిరోజూ మీ పిల్లలకు ఇవ్వడం వంటి కొన్ని గృహ నివారణలు వారిని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతాయి. అదే విధంగా నల్లమిరియాలు లేదా అల్లంతో తయారు చేసిన సూప్ మరియు పాలలో మరిగించిన బడాఇలాచీలు రోగనిరోధకశక్తిని పెంచడానికి సహాయపడుతాయి.

 

ధూమపానం నుండి మరియు ధూమపానం చేసే వారి నుండి దూరంగా ఉంచండి :

ధూమపానం మరింత కాలుష్యాన్ని జోడిస్తుంది. ఇది మీ పిల్లలకు చాలా కష్టతరం అవుతుంది. పార్టీలు మరియు ఫంక్షన్లలో ధూమపానం చేసే ప్రాంతాలకు దూరంగా ఉండండి.

 

వెచ్చని నీరు :

రోజంతా గోరువెచ్చని నీటిని తాగుతూ ఉండమని మీ పిల్లలకు చెప్పండి. ఇది శరీరంలో నుండి కాలుష్యాన్ని బయటకు పంపటానికి సహాయపడుతుంది. అదే సమయంలో  వారిని హైడ్రేట్ గా కూడా ఉంటుంది.

 

మీ పిల్లలలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడం అన్నది ఒక రోజుతో అయ్యేపని కాదు. మంచి ఆహారము మరియు వ్యాయామాలతో ప్రతిరోజు చేయవలసిన ఒక  కార్యక్రమము. మీరు ఏ పని చేసినా , మీ పిల్లలు వాటిని అనుకరిస్తారు. కాబట్టి మీరు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోండి. విటమిన్లు, ఖనిజాలు మరియు ప్రొటీన్లవంటి అన్ని పోషకాలు సమృద్ధిగాకల ఆహారాన్ని తీసుకోండి. ఇది ఎవరో చెప్పవలసిన విషయం కాదు. మీరు ఎటువంటి ఆహారం తీసుకుంటారో ,అదే మీ ఆరోగ్యం. సంతోషకరమైన మరియు సురక్షితమైన దీపావళి ! 

దీపావళి సందర్భంగా తలెత్తే సాధారణ ఆరోగ్య సమస్యలు ఏమిటి ?

 

వాహనాల నుండి వచ్చే కాలుష్యం తో పాటుగా దీపావళి సందర్భంగా కాల్చే టపాసులు నుండి వచ్చే పొగ వివిధ శ్వాసకోస మరియు హృదయ సంబంధమైన వ్యాధులకు కారణమవుతుంది. ఈ సమయంలో సాధారణంగా సంభవించే , మరికొన్ని సందర్భాలలో తీవ్రతరం చేసే అరోగ్య సమస్యలు ఎక్కడ ఉన్నాయి.

 

ఉబ్బసం :

గాలిలో కాలుష్యం మరియు పొగ ఆస్తమా యొక్క ప్రమాదాన్ని పెంచుతాయి మరియు టపాసులు దీనిని విపరీతంగా పెంచుతాయి.

 

శ్వాసకోస అనారోగ్యాలు :

సల్ఫర్ డయాక్సైడ్ మరియు గాలిలోని ఇతర కాలుష్య కారణాల వలన వివిధ శ్వాసకోస సమస్యలు తలెత్తుతాయి. అలర్జీ, సైనసిటీస్ మరియు బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి.

 

చర్మ సమస్యలు :

గాలిలోని కాలుష్యం కారణంగా చర్మ సమస్యలు మరియు అలర్జీలను కూడా కలిగిస్తాయి.

 

కాలిన గాయాలు :

ఇది టపాసుల వలన నేరుగా కలిగే ప్రమాదం. పిల్లల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది.


దీపావళి సందర్భంగా శ్వాసకోశ సమస్యలను పరిష్కరించడంలో మీకు ఏమైనా చిట్కాలు ఉన్నాయా ? వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి !

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}