• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

ఈ లాక్ డౌన్ సమయంలో మహిళలు ముఖ్యంగా తల్లులు ప్రశాంతంగా మరియు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆర్ట్ ఆఫ్ లైఫ్ అంటే ఏమిటి?

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Apr 21, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

జీవితం అనేది ఒక కళ (ఆర్ట్ ఆఫ్ లైఫ్)

జీవితం అన్నది చాలా చిన్నది.ఆర్ట్ ఆఫ్ లైఫ్ అన్నది తెలుసుకున్న వారు జీవితాన్ని అద్భుతంగా మలుచుకుంటారు. మన దేశంలో ఎక్కువగా మహిళలు ఇతరుల కోసమే బ్రతుకుతారు. అది చాలా మంచిది కూడా. కానీ మీ  సంతోషాని దానికి ఫణంగా పెట్టకూడదు. అలా పెట్టినప్పుడు అది వారి జీవితాన్ని అసంతృప్తితో దహించివేస్తుంది. ప్రతి మనిషికి కొన్ని ఇష్టాలు ఉంటాయి . ఎన్నో కోరికలు ఉంటాయి .ఇవి ఇతరుల కోసం అనుచుకున్నప్పుడు ,వారికి మిగిలేది అసంతృప్తి. ఈ జీవితం అనే కళను తెలుసుకున్నవారు తమకు ఏమి కావాలో వాటిని చాలా చక్కని మార్గంలో పొందగలరు . మన భారతీయ వ్యవస్థలో  తల్లులకు తన కుటుంబమే సర్వస్వం . పిల్లలు సంతోషమే తల్లిదండ్రుల ఆనందం. మన సంతోషం ఎప్పుడూ మన కుటుంబం మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలోనే ఇంత గా కుటుంబ విలువలు, ప్రేమలు , పెనవేసుకున్న బంధాలు మరి ఎక్కడా కనిపించవు .వీటిలో మహిళలదే ఎక్కువ పాత్ర ఉంటుంది.  తల్లి సమర్థంగా , సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం అన్ని విధాలా అభివృద్ధి కలిగి ఉంటుంది.

ప్రపంచాన్ని వణికిస్తున్న రోజులివి. మరియు ఒక వైపు లాక్డౌన్ మరొకవైపు మానసికమైన ఆందోళన, పిల్లలకు ఊహించని సెలవులు, హస్బెండ్ కి వర్క్ ఫ్రొం హోమ్. వీటి అన్నింటి మూలంగా ఎక్కువ పని ఒత్తిడి కలిగేది మాత్రం తల్లులకే. పని మనుషుల మీద ఆధారపడి బతుకుతున్న జీవితాలు. పని వారికి ఇప్పుడు ప్రవేశం లేదు.అన్ని పనులు చేసుకోవడం ఒక అదనపు బాధ్యత. రోజంతా స్కూలు, ట్యూషన్ ఆటలతో బిజీగా ఉండే పిల్లలు ఒక్కసారిగా నాలుగు గోడలకే పరిమితం అయినప్పుడు వారిని ఎంగేజ్ చేయడం అన్నది తల్లులకు చాలా పెద్ద సవాలు అయింది. ఇంట్లో అన్ని పనులు చేసుకోవడంతో పాటు పిల్లలను ఎంగేజ్ చేయడం, రోజంతా ఇంట్లో ఉండే హస్బెండ్ కి అన్ని సమకూర్చడం కూడా వీరి బాధ్యత అయిపోయింది.

చిన్నారులే తల్లిదండ్రుల కంటి వెలుగులు. బహు ముఖ్యంగా తల్లి సంతోషం పిల్లల సంతోషం మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే దేశంలో కరోనా విస్తరిస్తూ అంతా లాక్ డౌన్లో ఉన్న సమయంలో లో పిల్లలను ఇంట్లోనే ఉండటంతో వారిని సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో కూడా తల్లి ప్రముఖ పాత్ర వహిస్తుంది.

ఈ లాక్ డౌన్ సమయంలో పని ఒత్తిడిని ఒక శక్తిగా మార్చుకోవాలి. 

మీ ఒక్కరే పని మొత్తం మీ మీద వేసుకుని టెన్షన్ పడిపోయే కంటే పిల్లలతో చిన్న చిన్న పనులు చేయిచడం అలవాటు చేయండి.

ఎక్కడ నుండి తీసిన వస్తువులను అక్కడే పెట్టడం పిల్లలకు అలవాటు చేయండి. ఎవరి బెడ్షీట్లు వాళ్లే మడత పెట్టుకునే లాగా మరియు ఎవరు తిన్న ప్లేట్లు వాళ్ళు కడిగి పెట్టుకోవడం లాంటివి అలవాటు చేయండి. ఇంట్లోనే సులభమైన స్నాక్స్ లాంటివి తయారు చేస్తూ పిల్లలను కూడా అందులో భాగస్వాములను చేయండి. అలా చేసినట్లయితే ప్రస్తుతం మీకు కొంత పని తగ్గుతుంది మరియు పిల్లలకు ఆ క్రమశిక్షణ అన్నది జీవితకాలమంతా ఉపయోగపడుతుంది.

 

మీ మీద మీరు శ్రద్ధ వహించండి:

  • ప్రతి రోజూ 30 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు యోగా చేయండి. ప్రాణాయామం లాంటివి మీ మనసుని ఎంతో ప్రశాంతంగా ఉంచి మీకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. మీ పిల్లల తో కూడా చిన్న వ్యాయామాలు చేయించండి.

  • మీకు మీరు చిరాగ్గా కనిపించినట్లయితే మీ మీద మీకే విసుగు కలుగుతుంది. బయటకు వెళ్లలేని కారణంగా అప్పుడప్పుడు ఫేస్ క్లీనప్ లాంటివి ఇంట్లోనే చేసుకోండి. అవి చేసుకునేందుకు కూడా మీకు సమయం లేదు అనుకుంటే, రెండు స్పూన్ల తేనె తీసుకొని మీ ముఖానికి ఐదు నిమిషాల పాటు సున్నితంగా మర్దనా చేసుకోండి. ఆ తరువాత ఆ తేనెను పది నిమిషాల పాటు మీ ముఖం మీదనే వదిలేయండి. మీ అలసట అంతా మాయమవుతుంది. చక్కగా కాంతివంతంగా తయారు అవుతారు.ఈ విధంగా మీ కోసం మీరు కొంత సమయం గడిపి నట్లయితే మీకు విసుగు మాయమై హుషారు వస్తుంది.

  • మీ సంతోషం కోసం ఎప్పుడూ పక్క వారి మీద ఆధారపడకండి. మీకు ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో దానిని వెతికి అలవాటుగా మార్చుకోండి. ఉదాహరణకు పుస్తకాలు చదవడం, పెయింటింగ్, ప్రకృతిని ప్రేమించడం, సంగీతం, సాహిత్యం ఇలా మీకు సంతోషాన్ని ఇచ్చే వాటిని ఎవ్వరూ మీ నుండి దూరం చేయలేరు. ఎప్పుడూ సంతోషంగా పాజిటివ్ గా ఉంటూ మీ జీవితంలోని ప్రతి క్షణాన్ని కళాత్మకంగా మలుచుకోండి. మీ పిల్లలకు కూడా నేర్పించండి.

  • చివరిగా.. ఈ లాక్ డౌన్ కారణంగా మీకు మీ పిల్లలతోనూ, మీ హస్బెండ్ తోను ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశం దొరికినందుకు దాన్ని సంతోషంగా, ఉపయోగకరంగా మలుచుకోండి. మీ పిల్లలు ఎదిగే కొద్దీ వారితో గడిపే సమయం తగ్గిపోతూ ఉంటుంది. చదువులు, ఉద్యోగాలు , విదేశాలు ,వివాహాలు ఇలా ఏదో ఒక కారణంగా  పిల్లలతో గడిపే సమయం తగ్గిపోతోంది .ఈ చిన్న జీవితంలో గడిచిన ఏ క్షణము తిరిగి రాదు. అందుకే దేవుడిచ్చిన ఈ జీవితాన్ని పాజిటివ్ గా, సంతోషంగా గడపండి.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • 1
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.

| Apr 23, 2020

  • Reply
  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}