• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
పేరెంటింగ్

పసిపిల్లలకు తల్లిపాలు మానిపించడం ఎలా ? తల్లిపాలు మానిపించడానికి మార్గాలు

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన May 15, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

మీ పాలు మీ పసిపిల్లలకు చాలా ఉత్తమమైన ఆహారం అని మీకు తెలుసు . మీకు ,మీ పసిపిల్లలకు పాలు ఇచ్చే సమయంలో ఎంతో ఆనందంతో పాటుగా కొంచెం గర్వంగా కూడా అనిపిస్తుంది. ఏది ఏమైనా  ఒక రోజు దానికి ముగింపు పలికే సమయం ,(వయస్సు) వస్తుంది అని కూడా మీకు తెలుసు .దాన్ని పూర్తిగా మానిపించాలి అని కూడా ఆలోచిస్తారు .తల్లి పాలను పూర్తిగా ఎప్పుడు మానిపించాలి మరియు ఫెమైట్ లాంటి  సొల్యూషన్స్ ను ఎప్పుడు వాడవలసిన అవసరం వస్తుందో మీకు తెలుసు. కానీ సమస్య అన్నది ఇక్కడే మొదలవుతుంది .పిల్లలు ఆ సమయంలోనే మొండిగా తయారై తల్లిపాల కోసం చాలా పోరాటం చేస్తారు .ఏది ఏమైనప్పటికీ పూర్తిగా ఎప్పుడు పాలు మానిపించే సమయం వచ్చిందో మీరు గుర్తించాలి. పాలు మానిపించడం విజయవంతంగా జరగాలంటే పిల్లలు ఎంత మొండిగా ప్రవర్తించినప్పటికీ వారి డిమాండ్లను పట్టించుకోకూడదు.

 

తల్లిపాలు మానిపించే సమయంలో ఒకటికి రెండు సార్లు పరిశీలించవలసిన విషయాలు :

 

మీ శిశువుకు ఆరు నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలు సరైన ఆహారం గా ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు అంగీకరిస్తున్నారు .మీ పిల్లలకు 6 నెలల తరువాత ఘన పదార్థాలు మరియు కొత్త రుచులను ఇవ్వడం మొదలు పెట్టినప్పుడు మధ్యమధ్యలో తల్లిపాలను తగ్గించవచ్చు .అయినప్పటికీ పాలు వారి ఆహారంలో ఒక ప్రధాన భాగం .ఏది ఏమైనా, బిడ్డకు ఒక సంవత్సరం వయస్సు వచ్చేవరకు పోషకాలను తల్లిపాల ద్వారా పొందుతారు. ఆ వయసులో మీరు పాలు మానిపించాలి అనుకోవచ్చు. ఒక సంవత్సరానికి ముందుగానే మీరు పాలు మానిపించాలి అని నిర్ణయించుకున్నట్లు అయితే  ఫెమైట్ సొల్యూషన్ లాంటివి పూసి పాలు మానిపించాలి అనుకున్నట్లయితే బిడ్డను ఫార్ములా పాలకు మార్చ వలసి ఉంటుంది. మధ్యలో తల్లిపాలు ఇస్తూ ఫార్ములా పాలకు మార్చ వలసి ఉంటుంది. బిడ్డకు పూర్తిగా పాలు మానిపించడం అన్నది వ్యక్తిగత నిర్ణయం .అది కొంతవరకు భావోద్వేగానికి సంబంధించిన విషయం. ఎక్కువశాతం తల్లులు పాలు మానిపించడం ద్వారా తమ పాత శరీరాకృతిని తిరిగి పొందగలము అని సంతోష పడతారు. అదే సమయంలో బిడ్డ తో తమకున్న ప్రత్యేకమైన బాంధవ్యాన్ని కి ముగింపుగా భావిస్తారు. అలా భావిస్తున్నట్లయితే , నేను మీకు భరోసా ఇస్తున్నాను ఇది చాలా ప్రత్యేకమైన అనుబంధానికి నాంది.

తల్లిపాలు మానిపించడానికి సరైన సమయం ఎప్పుడు ?

 

ఎక్కువ శాతం పిల్లలు ఒక సంవత్సరం తరువాత వారు తినే ఇతర ఆహారపదార్థాల ద్వారా ఎక్కువ పోషకాలు పొందుతారు. ప్రతిరోజు కొత్త కొత్త రుచులకు అలవాటు పడ్డ తరువాత తల్లిపాల మీద మక్కువ తగ్గుతుంది .ఆ తరువాత తమంతట తామే పాలు మానేందుకు అవకాశం ఉంది. దానిని పిల్లల తమంతట తామే పాలు మానడం అంటారు. ఒక్క సంవత్సరం లోపల బిడ్డ తనంతట తానే పాలు మానేసిన లేదా మీరు మానిపించాలి అని అనుకున్నట్లయితే పిల్లలకు పోషకాలను ఫార్ములా పాల ద్వారా అందేలాగా చూడాలి .పాలు మానిపించడం అనే ప్రక్రియ చాలా నెమ్మదిగా ఒక పద్ధతి ప్రకారం జరగాలి .ఎందుకంటే బిడ్డకు మామూలు ఆహారం కంటే తల్లిపాలు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే బిడ్డకు మామూలు ఆహారం కంటే తల్లిపాలు ఎంతో సంతృప్తిని ,రక్షణని ,తల్లి తో ఒక దగ్గరితనం తో కూడుకున్న అనుబంధాన్ని ఇస్తాయి.

 

తల్లి పాలను ఎలా మానిపించాలి ?

 

రాత్రిపూట పిల్లలకు పాలు మానిపిస్తున్నప్పుడు, వారికి కొత్తగా పళ్ళు రావడం లేదా మరేదైనా అసౌకర్యాలు ఉన్నా ఏమో ముందుగా నిర్ధారించుకోండి. రోజంతా తినడానికి మంచి ఆహారాన్ని ఇవ్వండి .రాత్రిపూట ఎక్కువగా ఆహారాన్ని తినిపించండి .పడుకునేటప్పుడు కడుపు నిండుగా ఉంటుంది .రాత్రిపూట ఏడ్చినప్పుడు మీ భర్తను ఓదార్చమని చెప్పండి .ఎందుకంటే మీ స్పర్శ ,మీ వాసన వారికి పాల మీద మక్కువను పెంచుతాయి. ముందు అప్పుడప్పుడు  మాత్రమే ఇవ్వడం మొదలు పెట్టి ,మెల్లగా బుజ్జగిస్తూ మాన్పించండి. కొన్నిసార్లు కఠినంగా ఉండవలసిన అవసరం వస్తుంది.

 

తల్లిపాలను మానిపించడానికి 8 తెలివైన చిట్కాలు :

 

అయినా, ఎలా ఆపగలను అనుకుంటున్నారా ?ప్రశాంతంగా ఉండండి. సానుకూలంగా ఉండే తల్లులు చెప్పేది వినండి .దీన్ని చదవండి.

 

పసిపిల్లలు మానేందుకు తయారుగా ఉన్నారో లేదో గమనించండి :

 

పసిపిల్లలు ఎక్కువ సేపు పాలు తాగకుండా ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నట్లయితే పసిపిల్లలకు పాలు మానిపించే సమయం వచ్చింది అని మీకు అర్థం అవుతుంది. ఎలా అంటే, ఆడుకోవడం లేదా ఇతర ఆహారాలు తినడం లాంటివి చేస్తున్నప్పుడు బిడ్డ సులభంగా పాలను మానడానికి సిద్ధంగావున్నారు అని అర్థం.

 

నెమ్మదిగా మరియు క్రమంగా ప్రారంభించండి :

 

తల్లి పసిపిల్లలకు పాలు ఇవ్వడం అంటే పెంచి పోషించడం మాత్రమే కాదు.అది ఒక విడదీయరాని అనుబంధం .  మానిపించే ప్రక్రియ అన్నది నెమ్మదిగా ఒక పద్ధతి ప్రకారం జరగాలి. ఇద్దరు సౌకర్యవంతంగానూ, సిద్ధంగానూ ఉండాలి . ఒక్కసారిగా మానేసి నట్లయితే అది చాలా కష్టతరంగా ఉంటుంది.

 

మెల్లగా ఒక్కొక్క ఫీడింగ్ ను తగ్గిస్తూ మాన్పించండి :

 

మీరు ఎప్పుడైతే పాలు మానిపించాలి అని నిర్ణయించుకుంటారో ,మెల్లమెల్లగా ఒక్కొక్క ఫీడ్ ను తగ్గించుకుంటూ రావాలి .పాలకు బదులుగా వేరే ఏదైనా ఆహారంతో వారి పొట్టను నింపండి .పసిపిల్లల పొట్ట నిండినట్లయితే పాల కోసం మిమ్మల్ని బలవంతం చేయరు. ప్రతిరోజూ ఒకే సమయంలో పాలను స్కిప్ చేయడం మొదలు పెట్టండి. మిగతా సమయం లో మామూలుగా ఇవ్వండి.

 

పాలు పట్టే సమయము :

 

మీ పసిపిల్లలు ఏ సమయాలలో పాలు తాగుతున్నారో మీకు తెలుసు. పసిపిల్లలు పాలు ఎప్పుడు అడుగుతున్నాలరో కూడా మీకు తెలుసు .ముందుగానే సరైన ఆహారాన్ని తయారు చేసి పెట్టుకొని వారు పాలు అడిగే సమయంలో దానిని ఇవ్వండి . పసిపిల్లల కడుపు నిండుతుంది, మీ పాల కోసం మారాం చేయడం మరచిపోతరు .మీరు ఇతర ఆహారాన్ని సమృద్ధిగా ఇవ్వండి .అలా ఇచ్చినట్లయితే పసిపిల్లలు ఆకలితో బాధ పడరు. మిమ్మల్ని పాల కోసం బాధించరు.

 

బిడ్డ దృష్టిని మళ్ళించడండి :

 

మీ పసిపిల్లలు కడుపు నిండుగా ఉన్నదని మీకు తెలుసు. కానీ మీ పాల కోసం బిడ్డ మొండిగా ఏడుస్తున్నారు ఆ సందర్భంలో మీరు ఏమి చేస్తారు ?మీరు ఏమైనా చేయండి , కానీ ..పాలు మాత్రం ఇవ్వకండి . ఎందుకంటే,  వాళ్ళు దాన్ని అలవాటుగా చేసుకుంటారు. ఆ తర్వాత ఆ అలవాటును మాన్పించడం చాలా కష్టం అవుతుంది .ఆ సమయంలో వారి దృష్టిని పాల నుండి ఏ బొమ్మ వైపో లేదా వీడియో వైపో మళ్ళించడం మంచిది. అలా చేసినట్లయితే బిడ్డ దాన్ని మర్చిపోయి వేరే ధ్యాసలోనికి వెళ్ళిపోతారు.

 

నిద్రపోయే సమయంలో మీ పాలు ఇవ్వకండి :

 

మీ పసిపిల్లలకు తల్లిపాలు త్రాగిన తర్వాత మాత్రమే నిద్రపోయే అలవాటు ఉన్నట్లయితే మీరు దాన్ని మార్చాలి .మీ పసిపిల్లవాడు పడుకోవాలి అన్నప్పుడు పాలు ఇవ్వడం మానండి. మీరు మీ భర్త (చిన్న కుటుంబం అయితే )లేదా అత్తగారు లేదా మరెవరైనా (ఉమ్మడి కుటుంబం అయితే) సహాయం తీసుకోవచ్చు . మీరు బిడ్డకు కనిపించకండి, మీరు గదిలో కనిపించక పోయినట్లయితే బిడ్డ ఏడుపు ప్రారంభించకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి .బిడ్డ నిద్ర పోయిన వెంటనే మీరు గదిలోనికి రావచ్చు.మీ భర్తను మధ్యలో పడుకో పెట్టి  బిడ్డను ఒక వైపు ,మీరు ఒక వైపున పడుకోవాలి. పసిబిడ్డకు రాత్రిపూట తల్లిపాలు త్రాగే అలవాటు ఉంటుంది.మా పాప విషయంలో దూరంగా పడుకోవడం అలవాటు చేయక ముందు పాలు ఇవ్వడం కోసం రోజు రాత్రి ఐదుసార్లు లేచి దాన్ని . అలా చేసినట్లయితే పగటిపూట బిడ్డను సముదాయించడం కూడా సులభం అవుతుంది .మీ బిడ్డను దూరంగా ఉంచేందుకు మరెన్నో అంశాలు ఉన్నాయి.

 

బిడ్డను భిన్నంగా ఎత్తుకోండి :

 

చాలాసార్లు పిల్లల ను భిన్నంగా పట్టుకోవడం కూడా ఉపయోగపడుతుంది. ఎంతో హుషారుగా ఉండే మా పాప తను నా దగ్గర పాలు త్రాగాలి అనుకున్న ప్రతిసారి ఒడిలో కూర్చుని నర్సింగ్ కి సిద్ధపడేది . కానీ నేను ఆమె తల్లిని ,తన కంటే  నేను తెలివిగా ఉంటానని మరిచిపోయేది .నేను ఆమెను నా రొమ్ము నుండి దూరంగా నా భుజంపై వేసుకోవటం మొదలు పెట్టాను .ఆ ట్రిక్ బాగా పనిచేసింది . అలా మా పాప తో పాలు మాన్పించ గలిగాను.

 

ప్రేరణకు అవకాశం ఇవ్వకండి :

 

మీ పసిపిల్లలు పాలు త్రాగాలి అనే ప్రేరణ కలిగేలా ప్రవర్తించకండి .ఆమె ముందు బట్టలు విప్పటం లేదా బట్టలు ధరించడం లాంటివి చేయకండి .ఆమె ముందు స్నానం చేయకండి .మా పాప చిన్న చిన్న విషయాలకు కూడా ప్రేరణ చెందేది. ఉదాహరణకు ..,నేను కూర్చుని ఆమెకు పాలు పట్టే రాకింగ్ కుర్చీని చూస్తూ పాల కోసం ఏడ్చేది.

 

తల్లిపాలను మాన్పించడానికి పరీక్షించి మరియు ప్రయత్నించిన కొన్ని చిట్కాలు ఇవి . మీకు మరికొన్ని ఉన్నాయా ?ఉన్నట్లయితే తల్లిపాలను మాన్పించాలి అనుకుంటూ ,వివిధ కారణాలతో మాన్పించ లేకపోతున్న తల్లులకు ఉపయోగకరంగా ఉండటానికి ఈ క్రింద వ్యాఖ్యల విభాగంలో వాటిని మాతో పంచుకోండి.

 

ఈ విభాగాన్ని పేరెంట్యూన్ నిపుణుల ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు .మరియు ధృవీకరించారు.  మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ & లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ టీం ఉన్నారు.

 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన పేరెంటింగ్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}