• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఫుడ్ అండ్ న్యూట్రిషన్

ఈ వేసవి ఎండ నుండి మీ చిన్నారులను సౌకర్యంగా చల్లగా ఎలా ఉంచాలి... తప్పక తెలుసుకోవలసిన 10 టిప్స్

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Apr 17, 2020

 10
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

రండి.. భయంకరమైన వేసవికాలం లోనికి అడుగు పెడుతున్నాము. నిజంగా ఈ వాతావరణం ఎంత వేడిగా ఉందో అంటూ తల్లులు ఫిర్యాదు చేస్తున్నారు. ఎప్పుడూ చురుకుగా ,చలాకీగా ,అల్లరి గా ఉండే తమ చిన్నారులను ఎండ వేడిని తగ్గేవరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉంచాలి అని అనుకుంటున్నారు. ఈ భయంకరమైన వేసవి ఎండల నుండి తమ శిశువులను చల్లగా , సౌకర్యవంతంగా ఉంచేందుకు ప్రతి తల్లిదండ్రులకు తమ స్వంత పద్ధతులు ఉంటాయి.

వేసవి ఎండ నుండి శిశువులను చల్లగా మరియు సౌకర్యవంతంగా ఉంచడానికి మార్గాలు:

తల్లిదండ్రులు గుర్తుంచుకోవలసిన గమనిక లు ఇక్కడ ఉన్నాయి .ముఖ్యంగా అప్పుడే పుట్టిన శిశువులు మరియు చిన్న పిల్లల విషయానికి వస్తే:

1. సరైన వస్త్రాలు మరియు చర్మ సంరక్షణ:

పిల్లలకు సౌకర్యంగా ఉండే బట్టలను వేయం డి .ఎంబ్రాయిడింగ్ ,పూసలు ,రకరకాల అలంకారాల తో కూడినవి మరియు ఫ్యాన్సీవీ, మరియు యు. లేయర్ లేయర్లు గా ఉండే ఫ్రాక్ లను వేయకండి. కేవలం కాటన్ దుస్తులను మాత్రమే వేయండి . దుస్తులను తరచు మారుస్తూ ఉండండి. మరియు శుభ్రపరుస్తూ ఉండండి. పిల్లలకు వదులుగా మరియు పలచగా ఉండే దుస్తులు వేసినట్లయితే చెమట దానంతట అదే ఆవిరి అయిపోతుంది . రోజుకి రెండుసార్లు స్నానం చేయించడం మంచిది.(గది ఉష్ణోగ్రత లోనే గోరువెచ్చని నీటిని స్నానానికి వాడండి) అలా చేసినట్లైతే చర్మంలోని చెమట మరియు క్రిములు నశిస్తాయి.

2. ఫ్యాన్  లేదా ఎయిర్ కండిషన్ ( సీ):

శిశువుల గది ఎంత చల్లగా ఉండాలి అనే విషయం పై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. నిజానికి మన కంటే కూడా ఎక్కువగా చాలా త్వరగా వాతావరణ మార్పులకు  శిశువులు అలవాటు పడిపోతారు.మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ,పిల్లలకు పలుచని దుస్తులు వేసి హాయిగా ఎగురుతూ ఉన్న ఫ్యాన్ ఉన్న గదిలో కంటే ఏసీ గదుల్లో సంతోషంగా ఉన్నారా  ? బహుశా కాదు ! తల్లిదండ్రుల ఆలోచన ప్రకారం మనం వేడిలో పని చేసినా సరే తమ చిన్నారులు ఏసీలో ఉండాలి అనుకుంటారు.

పరిసరాల ఉష్ణోగ్రత కంటే కూడా సరైన దుస్తుల మీద శ్రద్ధ వహించండి .మీరు పిల్లలతో కలిసి ఏసీ రూములో నిద్రించే సమయంలో ఏసీ నుండి వచ్చే గాలి పిల్లలకు  నేరుగా తగలకుండా చూడండి. ఏసీ గది ఉష్ణోగ్రత సాధారణంగా 22c లో ఉన్నట్లయితే బిడ్డను బయటకు తీసుకు వచ్చినప్పుడు వాళ్ళు ఒక్కసారిగా చల్లని వాతావరణం నుండి వేడి వాతావరణం లోనికి వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. ఏసి రూమ్ లో ఉన్నప్పుడే పిల్లల కాళ్లు, చేతులు బాగా కప్పి ఉంచండి. పైజామా లాంటి నిండుగా ఉన్న దుస్తులను వేయండి. శిశువుల శరీరపు ఉష్ణోగ్రత ఎలా ఉందో తల్లులకు బాగా తెలుస్తుంది. శిశువు ఉష్ణోగ్రతల విషయంలో చల్లగా ఉంది ,లేదా వేడిగా ఉంది అని ఇతరుల సలహాలు తీసుకునే కంటే కూడా మీ సొంత అనుభవం ఉపయోగించండి . ప్రతి శిశువు కి శిశువుకు మధ్య ఇది మారుతూ ఉంటుంది .కొంత మంది శిశువులకు ఇతరుల కంటే కూడా ఎక్కువ వేడి అవసరం ఉంటుంది .అందుకే మీ పిల్లల అవసరాన్ని మీరే గుర్తించి జాగ్రత్త వహించండి. కూలర్లు అన్నవి సాధారణంగా మంచిది కాదు .ఇవి ఒకలాంటి ఉక్కపోత కు కారణం అవుతాయి.

3. హ్యుమిడి ఫైయర్ లను ఉపయోగించండి:

వేసవి కాలపు వేడిలో ఉండే మరొక అతి పెద్ద లోపం ఉక్క పోత. దేశంలో కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉండే సమస్య ఉక్కపోత మరియు పొడి గాలి. ఇది ఎయిర్ కండిషన్స్ గదులలో మరింత ఎక్కువగా ఉంటుంది. దీనికోసం   హ్యుమిడి ఫైయర్ లను అమర్చండి.(ఇవి పెద్ద పెద్ద కిరాణా షాపుల్లో ను మరియు మెడికల్ షాపుల్లోనూ అందుబాటులో ఉంటాయి) ఈ హ్యుమిడి ఫైర్ గది యొక్క వాతావరణాన్ని సమతుల్యంగా (బ్యాలెన్స్) చేస్తుంది.

4. మంచి ఎండ సమయంలో ఇంటి లోపలే ఉంచండి:

ఎండ మరియు వేడి ఎక్కువగా ఉన్న సమయంలో ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల మధ్యలో పిల్లలను బయటకు తీసుకురాకండి. కానీ శిశువును పూర్తిగా ఇంటి లోపలే ఉంచడం మంచిది కాదు .వారికి బయట గాలి మరియు వాతావరణం కూడా అవసరం.

5. పురుగు కాట్లు:

సాయంత్రం ఆరుబయటకు తీసుకు వచ్చే ముందు దోమల వికర్షణ క్రీమును వాడండి. మార్కెట్లో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. (సహజ దోమల క్రీములకొరకు మా బ్లాగులు చదవండి)అలాగే దోమల క్రిములను వాడినప్పటికీ బయటకు వెళ్లేటప్పుడు శిశువు యొక్క చేతులను, కాళ్లను కప్పి ఉంచండి .ఒకవేళ ఏదైనా దోమలు గాని పురుగులు గానీ కుట్టి నట్లయితే వాపు ,దురద ను తగ్గించేందుకు ఐస్ క్యూబ్ వాడండి . అలోవెరా (కలబంద )జెల్ లేదా డాక్టర్ రాసిచ్చిన ఏదైనా క్రీమును వాడండి.

6. ఎప్పుడూ పిల్లల లో నీటి శాతం (హైడ్రేట్) తగ్గకుండా చూడండి:

పసి పిల్లలకు ముఖ్యంగా అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లిపాలు తాగుతున్నన్ని రోజులు ఈ హైడ్రేషన్ సమస్య అన్నది రాదు .వారికి అవసరమైన నీరు తల్లిపాల ద్వారా లభిస్తుంది .తల్లిపాలు మానేసిన తరువాత ఒక విధానం ప్రకారం కొన్ని అదనపు ద్రవాలు అవసరం అవుతాయి .మీ పిల్లల వయస్సును బట్టి లేత కొబ్బరి నీరు , లస్సీ లేదా తాజా పండ్ల రసం లాంటి ఆరోగ్యకరమైన పానీయాలు ఇవ్వండి. ముఖం ఉబ్బినట్లు ఉండడం ,ఒళ్ళు వేడిగా ఉండడం ,వేగంగా శ్వాస తీసుకోవడం లాంటి అసౌకర్యాలకు పిల్లలు గురవుతున్నట్లు అయితే అది డీహైడ్రేషన్కు సంకేతం కావచ్చు.

7. పిల్లలకు ఎక్కువ ఆహారాన్ని ఇవ్వడం లేదా ఆహారాన్ని జీర్ణించుకోవడం లోని సమస్యలు:

చిన్నారులకు తేలికగా జీర్ణం అయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు ఇవ్వండి . పలచని పప్పు ,నీటి శాతం ఎక్కువగా ఉండే  టిన్ డా, టోరీ లాంటి వెజిటబుల్ సూప్ లు(కీరదోసకాయ మరియు టమాటాలతో చేసిన చల్లని సూప్ లు) ఈ వేసవిలో అనుకూలమైనవి. శరీరానికి జీర్ణమయ్యేందుకు కష్టంగా ఉండే కీర్ లు ,హల్వాలు మరియు ఎక్కువ తీపి పదార్థాలను ఇవ్వకండి.

8. డైపర్స్ లేదా గుడ్డతో కుట్టిన నాపీస్:

ఇది మీ జీవన శైలికి సరిపడే విధంగా ఎంచుకోవాల్సిన మరొక విషయం .కానీ ఈ వేసవికాలంలో డైపర్స్ విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసి ఉంటుంది. తరచుగా డైపర్ మారుస్తూ ఉండాలి .మార్చే మధ్య సమయంలో  శరీరాన్ని కొంచెం సేపు గాలికి ఆరనివ్వాలి (శిశువును ఎటువంటి డైపర్  లేకుండా కొంత సమయం వదిలేయండి) వేసవిలో బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుంది . కాబట్టి నాపీల  విషయంలో కూడా పరిశుభ్రత అవసరం.

9. శిశువును తగినంత వెలుతురు లో ఉండనివ్వండి :

చిన్న బిడ్డలకు సాధారణంగా ఎక్కువగా చెమటలు పట్టవు. కనుక వాళ్లు పెద్ద వారి కంటే త్వరగా వేడి గా అవుతారు.అలాగే మీ చిన్నారులను వేడిగా ఉండే గదిలో గాని, పార్క్ చేసి ఉన్న కారులో గాని ఉంచకూడదు .ఒక్కొక్కసారి కొన్ని నిమిషాల్లోనే వారి శరీర ఉష్ణోగ్రతలు పెరిగి పోయి ఇబ్బందికరంగా మారవచ్చు.

10. పొట్టలో వచ్చే సమస్యల నుండి కాపాడడం:

వేసవిలో బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి చెందుతుంది. మీ వాటర్ ఫిల్టర్ బాగా పని చేస్తుందో లేదో నిర్ధారించుకోండి .(మీ ఫిల్టర్లను తరచూ శుభ్రపరుస్తూ ఉండండి) తాజాగా వండిన ఆహారాన్ని మాత్రమే ఇవ్వండి. ఫ్రిజ్లో నిల్వ చేసిన ఆహారాన్ని గాని నాలుగు గంటల కంటే ముందుగా వండిన ఆహారాన్ని గాని ఇవ్వకండి. నులిపురుగు లకు మందును మరియు మంచి బ్యాక్టీరియాను పెంపొందించేందుకు మందుల కొరకు మీ డాక్టర్ ను సంప్రదించండి.

పైన ఇచ్చిన సమాచారం మరియు సలహాలు పిల్లల వయసు రీత్యా మార్చవలసిన అవసరం ఉండవచ్చు. అప్పుడే పుట్టిన బిడ్డలకు ,చిన్న పిల్లలకు, మొదటి పుట్టినరోజు కు దగ్గరగా ఉన్న పిల్లలకు మధ్య వ్యత్యాసం ఉండవచ్చు .మీ బిడ్డలకు ఏది సరిపోతుందో సరిగ్గా చూసుకొని దానిని అనుసరించడం అన్నిటికంటే ముఖ్యం.

ఈ వేసవి మరియు ఎండ సమయంలో మీ పిల్లలను సురక్షితంగా మరియు సంతోషంగా ఉంచడం లో మీరు పరీక్షించి మరియు ప్రయత్నించిన చిట్కాలను మాకు వ్రాయండి.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}