• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

ఇంటి వైద్యం చేద్దాం రోగాలను నివారిద్దాం

Vidyadhar Sharma
1 నుంచి 3 సంవత్సరాలు

Vidyadhar Sharma సృష్టికర్త
నవీకరించబడిన Dec 12, 2018

పిల్లలలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన వారి శరీరానికి త్వరగా వ్యాధులు సోకుతుంటాయి. పిల్లలలో ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఆలా అని పిల్లలు అనారోగ్యంగా ఉన్నప్పుడు వెంటనే మందులు ఇవ్వడం వలన వారిలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే సహజంగా ఎలా బయటపడాలో తెలుసుకోవడం, ఆ టిప్స్ పాటించడం పిల్లల ఆరోగ్యానికి మంచిది.  మన ఇంట్లో తరచూ వాడే వస్తువులతోనే, సాధారణ జలుబు, దగ్గు, జ్వరం వంటి నొప్పులు అన్ని తగ్గించవచ్చు. అయితే, ప్రస్తుతానికి జ్వరాన్ని చిటికెలో మన ఇంటి వైద్యం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చలో మార్గాలు కింద వివరించిఉన్నాయి.

ఆలివ్ ఆయిల్

పిల్లలలో అయినా, పెద్దలలో అయినా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వలన జ్వరం ఉంటుంది. ఆ ఉషోగ్రతను తగ్గించడానికి ఆలివ్ ఆయిల్ ను శరీరానికి రాసి మసాజ్ చేయాలి. కాటన్ దుస్తులు మరియు పలుచటి వస్త్రం కప్పి పడుకోబెట్టాలి. రెండేళ్లలోపు పిల్లలకు ఈ విధంగా చేయవచ్చు.

తడి సాక్స్ తో జ్వరానికి వైద్యం

సాధారణం జ్వరం అయితే ఒకటి లేదా రెండు రోజుల్లో తగ్గిపోతుంది. శరీర వేడి తగ్గడానికి కాటన్ సాక్స్ తీసుకుని చల్లని నీటిలో ఉంచి పాదాలకు తొడిగి విశ్రాంతి తీసుకోవడం వలన శరీర వేడి తగ్గుతుంది. సాక్స్ ఆరిన తర్వాత మళ్ళీ వేస్తూ ఉండాలి.

కలబంద రసం

కలబంద రసం లేదా జామ ఆకు నుండి తీసిన రసం తల నుదుటిపై రాయడం వలన శరీరవేడి తగ్గుతుంది.

వేడినీటితో స్నానం

గోరువెచ్చని నీటితో స్నానం చేయించడం బాడీ ఉష్ణోగ్రత కంట్రోల్ లో ఉంటుంది. ఫలితంగా జ్వరం వెంటనే తగ్గుతుంది.

తల మెడ భాగంలో

ఒక పలుచటి వస్త్రాన్ని తీసుకుని నీటిలో తడిపి తల, మెడ భాగంలో వేయడం వలన శరీరా ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఆరిన తర్వాత మళ్ళీ వేయడం చేయాలి.

వర్షా కాలం పిల్లలకు వచ్చే జబ్బులను ఇంట్లోనే నయం చేసే ఆయుర్వేద చిట్కాలు

జ్వరానికి మనం ఇంటి వైద్యం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చో చూసాము కదా, అలాగే, వానాకాలం లో వేరే సాధారణ జబ్బుల బారి నుండి ఎలా బయట పడగలమో తెలుసుకుందాం ఇప్పుడు.

వానా కాలం వచ్చేసింది. వానలు పేదలకు చిన్నలకి, చల్లదనాన్ని సంతోషాన్ని పంచుతాయి. వానల చిరు జల్లుల్లో తడిచి ఆనందాన్ని పొందాలని అందరికి ఉంటుంది. కానీ వర్షాలు వీటన్నిటితో పాటు క్రీములను, ఇన్ఫెక్షన్స్ ను, జబ్బులను కూడా మోసుకొస్తాయి. పిల్లలు వీటి బారిన ఎక్కువగా పడుతుంటారు. ఎంత కాపాడుకున్న రోగాలు తప్పకుండా వస్తాయి. ఆ వానా కాలం రోగాలను నయం చేసే ఆయుర్వేద చిట్కాలు.

  • దగ్గు, జలుబు జ్వరం - వాన కాలంలో గాలిలో ఉండే ఇన్ఫ్లుఎంజా వైరస్ ఈ జబ్బులకు కారణం. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఇతరులకు కూడా అంటుకుంటుంది. పసి పిల్లలకు ఎక్కువగా వస్తుంది. అల్లం రసం, గోరు వెచ్చని నీరు, ఒక్క చెంచా తేనే , బాగా కలిపి రోజులో అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే త్వరగా ఉపసమనం లభించును.
  • విరేచనాలు - తాగే నీటి ద్వారా వైరస్, బాక్టీరియా కడుపులోకి చేరడం విరేచనాలు అవ్వడానికి కారణం. అవి జీర్ణ వ్యస్థను మందగింప చేస్తాయి. పిల్లలు కడుపునొప్పి, వాంతులు, డిహైడ్రాషన్, విరేచనాలతో బాధపడతారు. నిమ్మ రసం, దానిమ్మ రసం వాడటం వలన విరేచనాలు  తగ్గును . దానిమ్మ పూర్తిగా కడుపునొప్పిని, విరేచనాలను తగ్గిస్తుంది. 6 నెలల లోపు పిల్లలకు గింజలు పెట్టకూడదు . గొంతులో అడ్డు పడే ప్రమాదం ఉంటుంది .
  • కళ్ళ కలక - వర్షా కాలంలో ఎక్కువగా ఉండే బాక్టీరియా, వైరస్ కళ్ళ కలకకు కారణం. ఏది వచ్చినప్పుడు, పిల్లల కళ్ళు ఎర్రగా మారిపోతాయి, కంటి నుండి పుసి కారుతుంటుంది. ఉప్పు నీళ్ళతో కడగడం. కళ్ళ కలకకు ఇదే ఉత్తమమైన వైద్యం. వేడి నీళ్లలో కళ్ళు ఉప్పును కలిపి, దానితో పిల్లల కళ్ళను కడగాలి.

  • డెంగ్యూ - డెంగ్యూ జ్వరం ఏడెస్ అనే దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఈ రకం దోమలు వానా కాలంలో ఎక్కువగా వస్తాయి. వీలున్నంత వరకు వీటి బారిన పడకుండా పిల్లలను కాపాడుకోవడం మంచిది. తులసి ఆకులను నీళ్ళలో వేసి కాసేపు మరగనివాలి . ఈ నీటిని పిల్లలకు ఇస్తూ ఉండాలి. అంతే కాకుండా ఆకులను పిల్లల చేత నమిలించాలి.

  • చర్మ వ్యాధులు - వానా కాలంలో అధికంగా వ్యాపించే క్రిములు, పిల్లలకు ఇన్ఫెక్షన్ లు కలిగించి, చర్మ వ్యాధులకు కారణమవుతాయి.

పసుపు, వేపాకు పేస్ట్   వాడడం వలన చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి.  వేపాకులో ఎన్నో వైద్య గుణాలు ఉంటాయి. పసుపు వేపాకు కలిపిన పేస్ట్ ను ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రాంతంలో పూయడం  వలన వెంటనే ఉపసమనం లభించును.

ఇలా చిన్న చిన్న చిట్కాలు ఇప్పటివి కాదు. తరతరాలుగా వస్తున్నా జ్ఞానం. ఇంటి చిట్కాల ద్వారా వైద్యం చెయ్యడం వల్ల డాక్టర్ కు కట్టే డబ్బులతో పాటు, మానసిక వ్యధని కు నివారించగలుగుతారు.

వీటన్నిటిని పక్కన పెట్టి, అసలు సాధారణంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగటానికి రోజు కింద వివరించినట్టుగా కొన్ని చిన్న చిట్కాలు తప్పనిసరిగా పాటిస్తే పిల్లల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

నీరు - నీరు ఎక్కువగా తీసుకోవడం వలన శరీరానికి వ్యాధులు సోకకుండా కాపాడుకోవచ్చు అని అందరికీ తెలిసిందే. పిల్లలకు ఎక్కువ నీటిని, ద్రవ పదార్థాలను ఇవ్వడం వలన రోగనిరోధక శక్తి పెరిగి, శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.

తేనె - ప్రతిరోజూ ఒక స్పూన్ తేనే పిల్లలకు ఇవ్వడం వలన రోగనిరోధక శక్తి పెరిగి జ్వరం,జలుబు,దగ్గు సమస్యలు ఉండవు.

  • 2
వ్యాఖ్యలు()
Kindly Login or Register to post a comment.

| Feb 28, 2019

ஜ்98

  • నివేదించు

| Feb 28, 2019

ஜ்ஜ்ங்கொஈஜ்ஜ்ஜிஒல்ல்ல்ல்8ஊழ்

  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు
పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Always looking for healthy meal ideas for your child?

Get meal plans
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}