• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
వేడుకలు మరియు పండుగలు

నేటి నిజమైన హీరోలకు ధన్యవాదాలు

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Aug 14, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

మన పూర్వీకులు స్వాతంత్రం కోసం ఎంతో పోరాడి మనకు స్వతంత్రాన్ని తెచ్చారు. రాబోయే తరాల కోసం ఈ స్వతంత్రాన్ని రక్షించడం ,
గౌరవించడం మరియు
సంరక్షించడం ఇప్పుడు మనముందున్న కర్తవ్యం.
ఈ స్వాతంత్ర దినోత్సవం ఎంతో మంది వ్యక్తుల మరియు సంస్థల ధైర్యానికి,  పట్టుదలకు గర్వకారణం. ప్రజలలో మానవత్వంపై
విశ్వాసాన్ని పెంచేందుకు మనం వారి ఆత్మలకు సెల్యూట్ చేద్దాం...

మేజర్ అనుజ్ సూద్
మే 2, 2020 న ఉత్తర కాశ్మీర్లోని కుప్వారా జిల్లా లోని హంద్వారా లోని చాంగిముల్ లో జరిగిన కాల్పుల్లో మరణించిన ఐదుగురు
భద్రతా సిబ్బంది లో మేజర్  అనుజ్ సూద్ కూడా ఉన్నారు. ఇంటి లోపల చిక్కుకున్న పౌరులను కాపాడడానికి అతడు ధైర్యంగా
ఉగ్రవాదులతో పోరాడాడు.
డిసెంబర్ 17, 1989 న జన్మించిన మేజర్
అనుజ్ సూద్ రెండవ తరం అధికారి, అతను ఎల్లప్పుడూ సాయుధ దళాల్లో చేరాలని కోరుకునేవారు. అతనికి పాఠశాలలో 'ఫౌజీ 'అని
మారు పేరు వచ్చింది. అతను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో చేరడానికి ఎంపికయ్యారు. కానీ, అనుజ్ ఎప్పుడూ తన
దేశానికి యూనిఫాంలో సేవ చేయాలని కలలు కనేవాడు. అతని గురించి మరియు అతని కుటుంబం గురించి తెలియని వారు అతను
ఐఐటీ లో జాయిన్ అవుతాడు అనుకున్నారు. కానీ  ఆశ్చర్యకరంగా అతను ఎన్ డి ఏ ను ఎంచుకున్నారు.
మేజర్ అనుజ్ 6 సెమిస్టర్ లలో కూడా టార్చి హోల్డర్ గా నిలిచారు. ఐ ఐ ఎస్ సి బెంగుళూరు నుండి ఎం టెక్ డిస్టింక్షన్లో పూర్తి చేసి
అగ్రస్థానంలో నిలిచారు.
అనుజ్ తండ్రి కూడా భారత సైన్యానికి సేవ చేశారు. అతని భార్య ఆకృతి సమయం వస్తే తన భర్త దేశం కోసం తనను తాను త్యాగం
చేస్తాడు అని తనకు ఎప్పుడో తెలుసు అని పేర్కొన్నారు.
తన దేశం కోసం ఆయన చేసిన అత్యున్నత త్యాగాన్ని భారత్ ఎప్పటికీ మర్చిపోదు. మేజర్ అనుజ్ సూద్ యొక్క సౌర్యం మరియు
ధైర్యం ప్రతి బిడ్డకు స్వయం కంటే దేశం ముఖ్యమని తెలుపుతుంది. భవిష్యత్ తరాలకు అతను ఒక ఆదర్శం. భారత దేశ సరిహద్దుకు
కాపలాగా ఉన్న అటువంటి దేశభక్తులను కలిగి ఉన్నందుకు  మనము కృతజ్ఞులము.
సోను సూద్
కరోన వైరస్ లాక్ డౌన్ సమయంలో నటుడు సోను సూద్ చాలామందికి ఒక దూతగా నిలిచారు. వలసదారులకు సోనుసూద్ చేసిన
సహాయము మరియు ఆ సహాయాన్ని అందించిన వేగము ఆదర్శ ప్రాయమైనది. అతడు నిరుపేదలకు ఆహారము మరియు నిత్యవసర
వస్తువులను అందించడమే కాక దిక్కుతోచని వలస కార్మికుల కోసం ప్రత్యేక బస్సులు మరియు రైల్వే టికెట్లను కూడా ఏర్పాటు
చేశారు. తద్వారా వారు ఈ కఠినమైన సమయంలో వారి ఇళ్లకు వారు చేరుకోగలిగారు.
వలస కార్మికుల తరువాత , కరోనా వైరస్ కారణంగా విధించిన ఆంక్షల కారణంగా గత నాలుగు నెలలుగా కిర్గిజిస్తాన్ లో చిక్కుకున్న
భారతీయ విద్యార్థులకు సహాయం చేశారు. 1500 మంది భారతీయ విద్యార్థులను ఇంటికి తీసుకు రావడానికి స్పెైస్ జెట్  సహకారంతో

చార్టర్ విమానాలను ఏర్పాటు చేశారు. కేరళలో ఒంటరిగా ఉన్న 177 మంది బాలికలను భువనేశ్వర్లోని వారి ఇళ్లకు చేరుకోవడానికి
అతని సహాయం చేశారు.
ఈ నిజ జీవిత హీరో తన బృందంతో నిర్విరామంగా పనిచేస్తున్నారు. అతను టోల్ ఫ్రీ నెంబర్ తో కాల్ సెంటర్లను ప్రారంభించారు. తద్వారా
ప్రజలు అతన్ని త్వరగా చేరుకోవచ్చు.
మానవత్వము, కరుణ మరియు వ్యక్తిత్వం గురించి మాట్లాడే సోను సూద్ మనందరికీ ఒక ఉదాహరణగా నిలిచారు. ఇతరులకు
సహాయపడటంలోనూ ,ఇతరులకోసం మిమ్మల్ని మీరు సమర్పించుకోవడంలోనూ అతను చూపిస్తున్న చొరవ అతని గొప్పతనాన్ని
మనకు తెలియజేస్తుంది.
గుర్తేజ సింగ్
23 సంవత్సరాల సిపాయి గుర్తేజ సింగ్ ఇటీవల భారత్ చైనా ప్రతిష్టంభన లో తన శత్రువులతో పోరాడారు పంజాబ్లోని మాన్సా జిల్లాలోని
బీరువాలా గ్రామానికి చెందిన  గుర్తేజ సింగ్ 2018 డిసెంబర్ లో ఆర్మీలో చేరారు.
2020 జూన్ 15న నలుగురు చైనా సైనికులు సింగ్ పై దాడి చేశారు. అతను వారిలో ఇద్దరూ అతనిని చుట్టుముట్టారు. మరో ఇద్దరు
అతనిని పడగొట్టడానికి ప్రయత్నించినప్పుడు అతను ఆ నలుగురిని త్రోసి పైకి లేచారు. మెడ మరియు తల పై తీవ్రంగా
గాయపడినప్పటికీ తిరిగి పోరాటంలోకి దిగారు. అతడు తన కిర్పాన్ ను ఎక్కువ మంది సైనికులతో పోరాడడానికి ఉపయోగించారు. ఆపై
ఒక చైనా సైనికులు నుండి పదునైన ఆయుధాన్ని లాక్కున్నారు.
సిపాయి గురు తేజ్ సింగ్ తన కత్తిపోట్లకు ముందు 11 మంది చైనా సైనికులను హతమార్చారు. ఈ దైర్యవంతుడు తన నిరంతర
పోరాటంతో చివరి 12వ శత్రువును తన కిర్ఫాన్ తో హతమార్చి తన చివరి శ్వాస విడిచారు.
అతని స్వగ్రామం చుట్టూ'  గుర్తేజ సింగ్ అమర్ రహే' ' బోలె సో నిహాన్ సత్ శ్రీ అకాల్' అనే నినాదాలు వినిపించాయి. ధైర్యవంతుడు
అయిన  గుర్తేజ సింగ్ యొక్క తండ్రి గర్వంగా " ఒక కొడుకును కోల్పోయినందుకు వేదనగా ఉంది, కానీ అతను దేశం కోసం తన
జీవితాన్ని అర్పించినందుకు నేను కూడా గర్వపడుతున్నాను "అని అన్నారు.
అతడు అన్నిటికంటే కూడా తన కర్తవ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఇది  గుర్తేజ సింగ్ మనకు నేర్పిన ముఖ్యమైన పాఠం.
ముందుండి నడిపించిన నాయకులు
వైద్యులు మరియు నర్సుల నుండి సహాయక సిబ్బంది వరకు కోవిడ్ మహమ్మారి సమయంలో ఫ్రంట్లైన్ కార్మికులు చూపిస్తున్న
మద్దతు మరియు దయ ప్రశంసనీయం. వారు ప్రశంసలకు మరియు  సెల్యూట్ లకు అర్హులు. నిర్విరామంగా ఇతరులకు చికిత్స చేసే
ప్రక్రియలో వారిలో కొందరు వైరస్ బారిన పడ్డారు . దురదృష్టవశాత్తు వారిలో కొందరు కన్నుమూశారు కూడా. కానీ వారి విధులను
నిర్వర్తించడానికి వారికి ఏది అడ్డుగా నిలవలేదు. ఈ రోజులలో వారు దేశ సైనికులుగా నిలిచారు.
వారిలో ఒకరు గువహతి మెడికల్ కాలేజ్ కి చెందిన డాక్టర్ మాల్విక బర్మన్, కరోనా రోగులకు చికిత్స చేస్తున్నప్పుడు ఆమె కూడా
కరోనా పాజిటివ్ గా గుర్తించబడ్డారు. సింగిల్ మదర్ అయిన డాక్టర్ బర్మన్ తన విధులను కొనసాగించడానికి సిద్ధపడ్డారు. ఆమె
కోలుకున్న వెంటనే రోగులకు చికిత్స చేయడాన్ని తిరిగి ప్రారంభించారు.

కోవిడ్- 19 తో పోరాడటానికి దేశంలో వివిధ ప్రాంతాల నుండి వైద్యులు మరియు నర్సులు పగలు రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం
విధుల్లో ఉన్నారు. వారి కుటుంబాలను విడిచిపెట్టారు. అంతా లాక్ డౌన్ లో ఉండి అందరూ భయపడుతూ, భయాందోళనలతో ఉన్న
సమయంలో రోగులను పరీక్షించడం , పడకలు కేటాయించడం , వారికి చికిత్స చేయడం ద్వారా అలసిపోకుండా నిస్వార్ధంగా సేవ చేస్తూ
వారిని ,వారి కుటుంబ సభ్యులను శాంత పరిచారు.
వారిలో కొందరు దీనిని యుద్ధభూమిగా పేర్కొన్నారు. వారి కుటుంబాలకు భరోసా ఇస్తూ, ప్రతి ఒక్కరి మనోధైర్యాన్ని పెంచుతూ,
ఒకదాని తరువాత ఒకటి అదనపు షిఫ్ట్ లలో పనిచేసే ఈ ఫ్రంట్లైన్ కార్మికులు ఈ కఠినమైన కాలంలో దేవుళ్ళ కంటే తక్కువ కాదు.
భారతీయ రైల్వే
ఈ మహామారి సమయంలో భారతీయ రైల్వే చూపిన మద్దతు ప్రశంసలకు అర్హమైనది. ఈ మహమ్మారిపై పోరాటానికి ప్రభుత్వం యొక్క
భాగంగా మంత్రిత్వ శాఖ అనేక సహాయ చర్యలను తీసుకున్నది.
భారతీయ రైల్వే తన వనరుల ద్వారా ఆక్సిజన్ సిలిండర్లు , దోమతెరలు , ఐసోలేషన్ సెంటర్ ల వంటి హాస్పిటల్ లో గలిగిన మౌలిక
సదుపాయాలను రైలు కోచ్ లలో ఏర్పరిచి కొవిడ్-19 సంరక్షణ కేంద్రాలు గా మార్చింది.
మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు ఆహారము మరియు ఇతర వస్తువుల పంపిణీ చేయడం ద్వారా అత్యవసర సరఫరా గొలుసును
సజీవంగా ఉంచడానికి అతిపెద్దదైన భారతీయ రైల్వే అద్భుతంగా ఉపయోగించుకుంది.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన వేడుకలు మరియు పండుగలు బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}