భారత్ లో మొట్టమొదటి మంకీపాక్స్ కేసు : మీకు రాకుండా ఉండాలంటే..

Ch Swarnalatha సృష్టికర్త నవీకరించబడిన Jul 15, 2022

భారతదేశంలో మొట్టమొదటగా ధృవీకరించబడిన మంకీపాక్స్ కేసు, కేరళకు చెందిన 35 ఏళ్ల వ్యక్తికి చెందినట్టుగా తెలియవచ్చింది. అతను మూడు రోజుల క్రితం UAE నుండి రాష్ట్ర రాజధానికి చేరుకున్నాడు. పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ వ్యాధిని నిర్ధారించింది.
కొల్లంకు చెందిన ఈ వ్యక్తిని తిరువనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి (MCH)లో చికిత్స కోసం ఇసోలేషన్ లో ఉంచారు. అతను చాలా ఆందోళనగా కనిపించినప్పటికీ అతని పరిస్థితి నిలకడగా ఉంది. జ్వరం మరియు ఇతర లక్షణాలు కనిపించడంతో అతను మొదట కొల్లంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిని సంప్రదించాడు. UAEలో నివసించే అతనితో సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఒకరు ఇప్పటికే మంకీపాక్స్‌తో బాధపడుతున్నట్లు అతను స్వయంగా తెలియచేసాడు. ఈ నేపధ్యంలో మీకు ..
మంకీపాక్స్ రాకుండా నిరోధించడానికి క్రింది చర్యలను తీసుకోండి:
-
మంకీపాక్స్ లాగా కనిపించే దద్దుర్లు ఉన్న వ్యక్తుల సమీపంలో ఉండటం, వారిని తాకడం చేయకండి.
-
మంకీపాక్స్ ఉన్న వ్యక్తి శరీరం మేమేది దద్దుర్లు లేదా పుండ్లను తాకవద్దు.
-
మంకీపాక్స్ ఉన్న వారిని ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, కౌగిలించుకోవడం లేదా శృంగారంలో పాల్గొఫడం వంటివి చేయవద్దు.
-
మంకీపాక్స్ ఉన్న వ్యక్తి తినే పాత్రలు, గ్లాసులు లేదా కప్పులను మీరు వాడవద్దు.
-
మంకీపాక్స్ ఉన్న వ్యక్తి యొక్క పరుపులు, తువ్వాలు లేదా దుస్తులను మీరు వాడవద్దు ఇంకా తాకవద్దు.
-
మీ చేతులను తరచుగా సబ్బు మరియు నీటితో కడగాలి లేదా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్‌ని ఉపయోగించండి.
-
మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చేసే ఎలుకలు తదితర జంతువులతో సామీప్యాన్ని నివారించండి. అలాగే, జబ్బుపడిన లేదా చనిపోయిన జంతువులను, వాటి పరుపు లేదా ఇతర వస్తువులను నివారించండి.
మీకు ఇప్పటికే మంకీపాక్స్ ఉందని సందేహం ఉంటే:
-
మీ ఇంట్లో ఇసోలేషన్ లో ఉండండి
-
మీకు దద్దుర్లు లేదా ఇతర లక్షణాలు ఉంటే, సాధ్యమైన౦త వరకు వ్యక్తులు లేదా పెంపుడు జంతువులకు దూరంగా ప్రత్యేక గదిలో లేదా ప్రాంతంలో ఉండండి.
మీ సూచనలు మాకు ఎంతో అమూల్యం. దయచేసి కామెంట్ సెక్షన్లో వాటిని తెలియచేయండి. మా బ్లాగ్ మీకు ఉపయోగకరం అనిపిస్తే.. తప్పకుండా షేర్ చేయండ౦ ద్వారా తోటి పేరెంట్స్ కు సహాయపడండి!
పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు
పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ చర్చలు
పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ ప్రశ్న

{{trans('web/app_labels.text_some_custom_error')}}
{{trans('web/app_labels.text_some_custom_error')}}