అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022: టీనేజ్ అమ్మాయిల కోసం 5 బెస్ట్ యోగా భంగిమలు

Ch Swarnalatha సృష్టికర్త నవీకరించబడిన Jun 21, 2022

భారతదేశంలో ఉద్భవించిన పురాతన భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక అభ్యాసంఅయిన యోగాకు ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన ఆదరణ లభించింది. సంస్కృతం నుండి ఉద్భవించిన 'యోగా' అనే పదానికి 'ఐక్యత' అని అర్థం. ఐక్యరాజ్యసమితిచే గుర్తించబడిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న జరుపుకుంటారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ‘యోగా ఫర్ హ్యుమానిటీ’ థీమ్‌గా ఎంపికైంది.
ఇక యుక్తవయస్సులో మీ శరీరం అకస్మాత్తుగా మారుతు౦ది. ఇక మరియు మీ మనస్సు కొత్త విషయాలను ఎదుర్కోవడానికి సమయం కావాలి. మీ ఆలోచనలు మరియు సందేహాలను స్నేహితుడు, తల్లిదండ్రులు లేదా తోబుట్టువులు.. ఇలా ఎవరితో అయినా పంచుకోవాలి. అలా పంచుకోవడం సౌకర్యంగా లేకుంటే, అన్ని అవాంఛిత భావోద్వేగాలు మరియు ఆలోచనలను వదిలించుకోవడానికి యోగా క్లాస్‌లో చేరండి. యోగా అనేది యువతులకు తమకు తమపై అపనమ్మకం తొలగించి, ఆత్మగౌరవాన్ని పెంచి శక్తివంతం చేయడానికి ఒక గొప్ప సాధనం. ఈ బ్లాగ్ లో యోగా ప్రయోజనాలను, యుక్తవయస్సు బాలికలకు ఎంతో ఉపయోగపడే కొన్ని యోగా భంగిమలను చూద్దాం.
టీనేజ్ బాలికలకు యోగా వల్ల కలిగే ప్రయోజనాలు
1. ఆందోళనను తగ్గిస్తుంది
2. దృష్టి మరియు ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది
3. తమపై తమకు నమ్మకాన్ని పెంచుతుంది
4. విశ్వాసం మరియు సంకల్ప శక్తిని పెంపొందిస్తుంది
5. స్వీయ-క్రమశిక్షణను అభివృద్ధి చేస్తుంది
6. శారీరక దృఢత్వం మరియు చురుకునిస్తుంది
7. సానుకూల వైఖరి మరియు ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది
టీనేజ్ అమ్మాయిల కోసం ఐదు ఉత్తమ యోగా భంగిమలు
-
అధో ముఖ శవాసనం
-
వృకాసన౦
-
వీరభద్రసన౦
-
బద్ధకోణాసనం
-
ధనురాసనం
శారీరక మరియు మానసిక శ్రేయస్సు రెండింటినీ మెరుగుపరచడానికి యోగా ఒకచక్కని మార్గం. దీనిని యుక్తవయస్సులోనే ప్రారంభించడం వల్ల టీనేజర్లు మంచి ఆరోగ్యం, ఏకాగ్రత మరియు ఉత్సాహంతో మరియు ఆనందంతో జీవించడానికి అవసరమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. మరి ఈ రోజు నుండే యోగాను మొదలెడదామా?
మీ సందేహాలను, సూచనలను కింది కామెంట్ల సెక్షన్ లో మీ తోటి తల్లిదండ్రులతో, మీ సమీపంలో ఉన్నవారితో పంచుకోండి.
పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు
పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ చర్చలు
పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ ప్రశ్న

{{trans('web/app_labels.text_some_custom_error')}}
{{trans('web/app_labels.text_some_custom_error')}}