• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

ఇది కరోనా లేదా సీజనల్ జ్వరమా? తెలుసుకునేందుకు ఆరు సూచనలు!

Ch Swarnalatha
11 నుంచి 16 సంవత్సరాలు

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన Jul 04, 2022

భారతదేశంలో 16,135 కొత్త కరోనావైరస్ కేసులు  నమోదుతో, మొత్తం COVID-19 కేసుల సంఖ్య 4,35,18,564 కు చేరుకుంది. అంతేకాకుండా, ప్రస్తుతం  క్రియాశీల కేసులు 1,13,864 కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటి౦చింది. ఈ నేపధ్యంలో కొందరు కొద్దిపాటి జ్వరం వంటి సాధారణ ఫ్లూ మాదిరి లక్షణాలు కనిపిస్తే దానిని కరోనా అని భావించి ఇసోలేషన్ లోకి వెళ్ళడం, ఆందోళనకుగురికావడం చేస్తున్నారు. కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతున్న పరిస్థితిలో,  ప్రతి జ్వరాన్ని అనుమానించి వైరస్ కోసం పరిశోధించాలని, అయినప్పటికీ భయపడకుండా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. మలేరియా, డెంగ్యూ, లెప్టోస్పిరోసిస్, ఎంటెరిక్ ఫీవర్, వైరల్ హెపటైటిస్ మొదలైన రుతుపవన సంబంధిత వ్యాధులు కూడా ఈ వర్షాకాలంలో వచ్చే అవకాశం ఉన్న విషయం దృష్టిలో ఉంచుకోవాలని వారు సూచిస్తున్నారు. 

COVID-19-సంబంధిత జ్వరం మరియు సాధారణ ఫ్లూ వంటి వాటి మధ్య మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా  ఉంది. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు వచ్చినపుడు అది కోవిడ్ వల్లనా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అని నిర్ధారించవలసిన అవసరం ఉంది. అటువంటి సందర్భంలో నిర్ధారించుకోవాల్సిన విషయాలు, ఈ బ్లాగ్లో మీకోసం:

1. ప్రతి ఇన్ఫెక్షన్ కోవిడ్‌కి సంబంధించినది కాదని మనం అర్థం చేసుకోవాలి.

ఒకవైపు కోవిడ్ భయం ఇంకా కొనసాగుతూనే ఉంది, కానీ  అంతా కోవిడ్ కాదని మనం తెలుసుకోవాలి. మహమ్మారి మళ్ళీ వ్యప్తిస్తున్న ఈ  రోజులలో, ప్రజల్లో భయం చాలా ఎక్కువగా ఉంది. వారు ఏ అనారోగ్యాన్నైనా  కరోనాకే ముడిపెట్టి, కనీసం ఇతర ఆరోగ్య సమస్యల కోసం వైద్య పరీక్షలను చేయించుకోవాలని  కూడా ఆలోచించడంలేదు. ఈ వైఖరికి ఆసుపత్రి యాజమాన్యాలను కూడా పాక్షికంగా కారణం అని చెప్పాలి. ప్రజలు తెలుసుకోవలసినది ఏమిటంటే, COVID ఇన్‌ఫెక్షన్ నుండి తమను తాము రక్షించుకోవడం  ఎంత ముఖ్యమో, అదే సమయంలో ఇతర ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ చూపడం కూడా అంతే ముఖ్యం.

2.  ప్రతి వ్యాధి లేదా ఇన్‌ఫెక్షన్‌ని కోవిడ్‌తో ముడిపెట్టడం మానేయాలి.

మార్చి 2020లో భారతదేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లిన తర్వాత, కొత్త క్షయవ్యాధి కేసుల సంఖ్య 70% వరకు తగ్గింది. TB స్క్రీనింగ్‌లో ఈ తగ్గుదల ఆశ్చర్యకరమైనది. ఎందుకంటే ఈ వ్యాధి ప్రతి సంవత్సరం 1.5 మిలియన్ల మందికి దగ్గరగా ఉంటుంది   COVID కారణంగా స్క్రీనింగ్ లేకపోవడంతో ఒక దిశలో కొత్త TB  కేసులలో ఆకస్మిక తగ్గుదల కనిపించింది. పెద్ద ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు సంబంధిత  వైద్య పరీక్షలు  చేయించుకోక పోవడంతో వారి పరిస్థితి మరింత దిగజారిందని తెలియవచ్చింది. ఈ భయంకరమైన వివరాలు  తెరపైకి వచ్చిన తర్వాత, ఆరోగ్య నిపుణులు ఇతర అనారోగ్యాలు  ఉన్న వ్యక్తులు వారి ఆరోగ్యం గురించి మరింత జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత త్వరగా వైద్య సహాయం తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

3. ఇతర ఆరోగ్య పరిస్థితులను విస్మరించవద్దు

మహమ్మారి తర్వాత ఇతర అంటువ్యాధులు మరియు వ్యాధుల స్క్రీనింగ్ తగ్గింది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు మరియు ప్రతి సంవత్సరం చాలా మంది ప్రాణాలను బలిగొంటున్న TB వంటి వ్యాధులు క్రమం తప్పకుండా పరీక్షించబడాలి మరియు రోగ నిర్ధారణ చేయాలి. లాక్‌డౌన్‌ సమయంలో యాక్సెస్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. సంవత్సరాల తరువాత ఇప్పుడుకూడా ఇతరుల కంటే వైరల్ దాడికి ఎక్కువ అవకాశం ఉన్నవారు చాలా మంది ఇప్పటికీ ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడుతున్నారు.  అయినప్పటికీ, అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని, ఇతర వైద్య పరీక్షలు కూడా సరిపోయేలా ఒక రొటీన్‌ను కూడా ప్లాన్ చేసుకోవాలి.

4. COVID భయాన్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది

COVID శరీరాన్ని బలహీనపరుస్తుండానే మాట నిజమే. అయితే ప్రతి రోగలక్షణం కోవిడ్‌కు సంబంధించినది కాదని అర్థం చేసుకోవాలి. జ్వరం వచినపుడు అది కోవిడ్ అనుకుని  ఒక వారం పాటు ఐసోలేషన్‌కు వెళ్లడం మీకు మంచిడే. కనీ అది కోవిడ్ కాకపొతే, ఆ ఇతర వ్యాధి పెరగడానికి మీరు ఒక వారం సమయం ఇచ్చినట్టు అవుతుంది. అందువల్ల, స్వయంగా నిర్ధారణ చేసేబదులు, COVID పరీక్ష చేయించడం తెలివైన పని.

కండరాల నొప్పి ఉంటె, మీరు ఎటువంటి శారీరక శ్రమ చేయకపోవడం వల్ల కావచ్చు లేదా ఏదైనా బరువు  ఎత్తినప్పుడు కండరాలు బెణుకడం వల్ల కావచ్చు. అలాగే తలనొప్పి, జలుబు ఉంటె మీకు కోవిడ్ ఉందని అర్థం కాదు, మీకు ఇటీవల మారిన వాతావరణం వల్ల కావచ్చు లేదా ఒత్తిడి వల్ల కావచ్చు.

5.  కోవిడ్ కాకపోతే, అది ఏమి కావచ్చో ఇక్కడ చూడండి

రైనోవైరస్‌ల వల్ల వచ్చే జలుబు: అన్ని రైనోవైరస్‌లకు మీ వద్ద ఎప్పటికీ రోగనిరోధక శక్తి ఉండదు. మీరు ఒక దానికి రోగనిరోధక శక్తిని కలిగి ఉండవచ్చు కనీ మరొకదానికి గురవుతారు. ఇది రైనోవైరస్ల యొక్క ఒక ప్రత్యేక లక్షణం; సాధారణ జలుబు లక్షణాలు ఒకేలా లేకపోయినా, అవి కోవిడ్‌ని పోలి ఉంటాయి.

నోరోవైరస్ల ద్వారా ఇన్ఫెక్షన్: నోరోవైరస్ ఇన్ఫెక్షన్ అతిసారం మరియు పొత్తికడుపులో నొప్పిని కలిగిస్తుంది, ఇది COVID ఇన్ఫెక్షన్ సమయంలో కూడా కనిపించే కొన్ని సాధారణ లక్షణాలలో ఒకటి. కరోనావైరస్ వలె, నోరోవైరస్లు కూడా పెద్ద అంటువ్యాధి. ఇవి చేతివేళ్లపై మరియు కలుషితమైన ఉపరితలాలపై ఎక్కువసేపు ఉంటాయి. ఇన్ఫెక్షన్‌ను దూరంగా ఉంచడానికి శానిటైజర్లు మరియు క్రిమిసంహారకాలు మాత్రమే మార్గాలు.

మైయాల్జియా: కండరాల నొప్పి, దీనిని వైద్యపరంగా మైయాల్జియా అని పిలుస్తారు, ఇది సాధారణంగా COVID రోగులలో కనిపిస్తుంది. కానీ మయాల్జియాకు దారితీసే అనేక ఇతర కారణాలు మరియు  ఆరోగ్య పరిస్థితులు  చాలాఉన్నాయి. ఇది మహమ్మారి సమయంలో ఎక్కువసేపు కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల కావచ్చు. మీ శరీరానికి కొంత శారీరక శ్రమ కచ్చితంగా  అవసరం అని గ్రహించాలి.

అలసట: మీకు  నీరసంగా ఉన్న ప్రతిసారీ మీకు కోవిడ్ ఉందని అర్థం కాదు. ఒక వ్యక్తి నుండి శక్తిని హరించే అనేక కారణాలు మరియు ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి. మీరు నిరంతరం అనారోగ్యంతో బాధపడుతుంటే, మీరు మీ జీవనశైలి అలవాట్లను తనిఖీ చేయాలి. అలసట మీ రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తే, వైద్యుడిని సంప్రదించి పూర్తి శరీర తనిఖీని పొందండి.

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్: గొంతు నొప్పి, నెలల తరబడి దగ్గు స్ట్రెప్టోకోకస్ పయోజీన్స్ వల్ల కలిగే బ్యాక్టీరియా సంక్రమణకు సూచిక కావచ్చు. ఇవి వారాలు, నెలల తరబడి ఉండి క్రమంగా తగ్గుముఖం పట్టడం తెలిసిందే

6 COVID ట్రీట్మెంట్ మిమ్మల్ని ఇతర ఇన్ఫెక్షన్‌ల నుండి రక్షించదు 

మీరు కోవిడ్‌కు పట్ల నిర్లక్షంగా వ్యవహరించాలని దీని అర్థం కాదు.  మీ ఇతర ఆరోగ్య సమస్యల గురించి మీకు తెలియజేయడం మరియు కోవిడ్ భయం నుండి మిమ్మల్ని దూరంగా ఉంచడం దీని ఉద్దేశం. ప్రతి ఆరోగ్య సమస్యను కోవిడ్‌కి లింక్ చేయడం ద్వారా, మీరు అసలు సమస్యకు  అవసరమైన వైద్య సంరక్షణను కోల్పోతున్నారు. కోవిడ్‌పై నిరంతర దృష్టితో మీరు ఇతర వ్యాధుల అభివృద్ధికి అవకాశం కల్పి౦చరాదు.

 

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}