• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

గర్భధారణ సమయంలో వచ్చే దురద

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Aug 21, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

గర్భం మీ శరీరంలోనికి అనేక జీవక్రియ మరియు హార్మోన్ల మార్పులతో పాటుగా వస్తుంది. మరియు ఈ మార్పుల కారణంగా తేలికపాటి దురదలు కూడా తప్పనిసరిగా వస్తాయి. మరియు మీరు మీ గర్భధారణ సమయంలో మీ ఉదరము మరియు వక్షోజాల చుట్టూ కూడా దురదగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతాల చుట్టూ చర్మం పెరుగుతున్న పిండానికి అనుగుణంగా విస్తరించి ఉంటుంది. తద్వారా దురద వస్తుంది. అదనంగా మీరు పొడి చర్మం కలిగి ఉంటే దురద తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. దీని గురించి మరింత లోతుగా పరిశీలిద్దాము. మరియు దురదకు ఖచ్చితమైన కారణాలు ఏమిటో చూద్దాము. కొంత మంది తల్లులకు అందరికంటే ఎక్కువ దురద ఎందుకు వస్తుంది.

 

గర్భధారణ సమయంలో వచ్చే దురదకు కారణం ఏమిటి ?

 

ఇంతకుముందే తెలిపినట్లుగా సాధారణంగా గర్భధారణ సమయంలో శరీరంలో జరిగే అన్ని మార్పుల కారణంగా దురద వస్తుంది. అయినప్పటికీ కొన్ని అరుదైన సందర్భాల్లో ఈ దురద ఎక్కువయ్యి డాక్టర్ను సంప్రదించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కొన్నిసార్లు తీవ్రమైన దురద ఇతర లక్షణాలతో కూడి ఉండవచ్చు. అటువంటి సందర్భాలలో మీరు తప్పనిసరిగా వైద్యుని సంప్రదించవలసిన ఉంటుంది.

 

3 ప్రధాన లక్షణాలు :

 

ముదురు రంగు మూత్రం

 

అసాధారణ ప్రేగు కదలికలు

 

కళ్ళు మరియు చర్మం పసుపు గా ఉండడం.

 

ఇది కూడా చదవండి : గర్భధారణ సమయంలో మీకు బెనాడ్రిల్ ఉందా?

 

గర్భధారణ సమయం లో దురద స్ట్రెచ్ మార్కులకు కారణం అవుతుందా ?

 

ఇది సాగిన గుర్తులను కలిగించే దురద కాదు. దురదను తగ్గించడానికి మీరు గోకడం వలన సాగిన గుర్తులు ఏర్పడతాయి. పూర్తిగా ఊదిన బెలూన్ను ఊహించుకోండి మరియు మీరు మీ వేలి గీతలు పెడితే బెలూన్ చర్మంపై కొన్ని గుర్తులు వస్తాయి. మీ గర్భవతి కడుపు విషయంలో కూడా అదే జరుగుతోంది. సాగిన మీ కడుపు కండరాల మీద దురదను తగ్గించడానికి గోకినప్పుడు చర్మంపై గీతలు పడతాయి. మరియు ఆ గీతలు డెలివరీ అయిన తర్వాత కూడా స్పష్టంగా కనిపిస్తాయి. తద్వారా స్ట్రెచ్ మార్కులు ఏర్పడతాయి.

 

గర్భధారణ సమయంలో స్థిరంగా ఉండే దురదకు చికిత్స ఏమిటి ?

 

గర్భధారణ సమయంలో తగ్గకుండా ఉండే దురద నిరాశ మరియు సమస్యగా మారుతుంది. కాబట్టి మీరు దురద ను ఇలా నియంత్రించవచ్చు లేదా చికిత్స చేయవచ్చు. స్థిరమైన దురదలను తగ్గించడానికి ఇక్కడ  4 సాధారణమైన మార్గాలు ఉన్నాయి.

 

హైడ్రేటెడ్ గా ఉండండి :

చర్మాన్ని సున్నితంగా మరియు మృదువుగా ఉంచడంలో సహాయపడే విధంగా మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుకోండి.

 

నూనెతో తేలికపాటి మసాజ్ :

 

దురద ఉన్న ప్రదేశంలో తేమగా ఉండటానికి కొబ్బరినూనెను రాయండి.

 

టవల్ తో సున్నితంగా రుద్దండి :

 

టవల్తో సున్నితంగా రుద్దండి మరీ గట్టిగా మరీ గట్టిగా రుద్దకుండా టవల్తో నెమ్మదిగా రుద్దండి. రుద్దిన తర్వాత దురద తగ్గించడానికి శరీరమంతా కొంచెం నూనె రాయండి. నన్ను నమ్మండి. ఇది అద్భుతాలు చేస్తుంది మరియు మీ చర్మాన్ని బాగా హైడ్రేట్ గా ఉంచి దురదను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది.

 

తేలికపాటి డిటర్జెంట్ ను వాడండి :

 

బట్టలు ఉతికేటప్పుడు మీరు తేలికపాటి డిటర్జెంట్ ను ఉపయోగించాలి. మరియు బట్టల మీద ఆ సబ్బు యొక్క అవశేషాలు మిగిలి ఉండకుండా బట్టలను శుభ్రంగా ఉంచుకోండి. లేదంటే అవి దురదను పెంచుతాయి.

 

రాత్రి సమయంలో గర్భిణీ స్త్రీలకు పొట్ట మీద దురద ఎందుకు వస్తుంది ?

 

గర్భధారణ సమయంలో తేలికపాటి దురద అన్నది చాలా సాధారణం. కానీ , దురద తీవ్రంగా ఉండి రాత్రి పూట మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మాత్రం మీరు వైద్యుడిని సంప్రదించడం మంచిది. దురదని తగ్గించడానికి మీరు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ రాత్రిపూట దురదగా ఉన్నట్లయితే మీరు మీ వైద్యుని సంప్రదించడం మంచిది.

 

గర్భధారణ సమయంలో దురద శిశువు లింగానికి సూచికగా ఉంటుందా ?

 

మీ దురద మీ శిశువు యొక్క లింగాన్ని ఊహించ గలదు అనేది ఒక అపోహ మాత్రమే. దీని గురించి అనేక కథలు ఉన్నాయి. నేను నా బిడ్డని గర్భవతిగా ఉన్నప్పుడు మీకు ఎడమవైపు దురద పెడితే అమ్మాయి అని , కుడివైపు దురద పెడితే అబ్బాయి అని నాకు చెప్పారు. ఓ అబ్బాయి !! కానీ నేను నా పొట్ట అంతా దురద తో ఉన్నాను! స్త్రీలు దాని మీద శ్రద్ధ చూపటం లేదు మరియు దురదకు చికిత్స గురించి ఆలోచించడం లేదు.

 

గర్భధారణ సమయంలో కాళ్ళ పై దురద :

 

చర్మానికి చిరాకు కలిగించే టైట్స్ లేదా బట్టలు ధరించడం వల్ల గర్భధారణ సమయంలో కాళ్ళు దురదకు గురవుతాయి. మూత్రపిండాల వ్యాధి లేదా మధుమేహం కూడా కాళ్ళ పై దురదకు ఒక కారణంగా గమనించవచ్చు. గర్భధారణ సమయంలో తేలికపాటి దురద సాధారణం . మరియు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఈ దురద తీవ్రమైనప్పుడు వైద్యుని సంప్రదించాలి. మీ వైద్యుడు దేనికోసం ' ఓబీస్ట్రుకటెడ్ కొలెస్టసిస్' లేదా 'ఇంట్రా హెపాటిక్ కొలెస్టసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ' కోసం తనిఖీ చేయవచ్చు. కానీ ఇది చాలా అరుదు. ఇది కేవలం ఒక్క శాతం గర్భిణీ స్త్రీలను మాత్రమే ప్రభావితం చేస్తుంది.

 

గర్భధారణ సమయంలో వచ్చే దురద కోసం ఇంటి నివారణలు :

 

గర్భధారణ సమయంలో వచ్చే దురదను తగ్గించడానికి మీరు ఇంట్లో చేయగలిగే కొన్ని సహజ చికిత్సలు ఉన్నప్పటికీ మీ దురద తీవ్రంగా ఉంటే మాత్రం దయచేసి  గైనకాలజిస్ట్ను సంప్రదించండి. గర్భధారణ సమయంలో వచ్చే దురదలు తగ్గించడానికి ఈ క్రింద 7మార్గాలు ఉన్నాయి.

 

గర్భధారణ సమయం లో దురద నుండి ఉపశమనానికి నేను కొన్ని చిట్కాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

 

కోల్డ్ ప్యాక్ :

 

మీరు మీ పొట్ట మరియు వక్షోజాల చుట్టూ దురద తో బాధపడుతున్నప్పుడు మస్లిన్ వస్త్రంలో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి దురద తగ్గేవరకు ఆ ప్రదేశంలో రుద్దండి.

 

మృదువుగా ఉంచడం :

 

గాఢమైన వాసన లేని చర్మాన్ని మృదువుగా ఉంచే మాయిశ్చరైజర్ ను వాడండి. మీరు కోకో బటర్ ను కూడా వాడవచ్చు. ఎందుకంటే అది చర్మాన్ని మృదువుగా మరియు దురద లేకుండా చేస్తుంది.

 

మిమ్మల్ని మీరు బాగా హైడ్రేట్ గా ఉంచుకోండి :

 

మీ చర్మాన్ని మృదువుగా ఉంచుకోవడానికి బయటకి వాడే క్రీములతో పాటు ఆహారంలో కూడా హైడ్రేట్ గా ఉండే ఆహారాన్ని తీసుకోవడం అవసరం. కాబట్టి పుష్కలంగా నీరు తాగండి. తద్వారా టాక్సిన్స్ బయటకు పోతాయి. మరియు మీ చర్మం మృదువుగా ఉంటుంది.

 

సహజమైన నూలు వస్త్రాలను ధరించడం :

 

సహజమైన పత్తితో చేసిన నూలు బట్టలను ఎంచుకోండి. ఎందుకంటే మీ చర్మం తేలికగా ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది. అది దురదను పెంచకుండా కొంతవరకు ఉపశమనం కలిగిస్తుంది.

 

సువాసనగల వాటికి దూరంగా ఉండండి :

 

సబ్బులు, పరిమళ ద్రవ్యాలు మరియు డియోడరెంట్స్ కూడా చర్మం యొక్క దురదను పెంచుతాయి. కాబట్టి  తేలికపాటి సువాసనగల సబ్బులు మరియు పరిమళ ద్రవ్యాలను వాడండి. వాస్తవానికి మీకు వీలైనంత వరకు పరిమళ ద్రవ్యాలు మరియు డియోడరెంట్లను మానుకోండి.

 

వేడి నీటి తో షవర్ చేయకండి :

 

వేడినీటితో షవర్ చేయడం ద్వారా శరీరం యొక్క దురదను పెంచుతాయి. వేడినీటితో షవర్ చేయడం మానేయండి. ఒకవేళ మీరు వేడినీటితో షవర్ చేయడానికి బానిసలు అయినట్లయితే అప్పుడు మీరు గోరువెచ్చని నీటితో షవర్ చేయడానికి అలవాటు చేసుకోండి. తద్వారా చర్మం ఒక్కసారిగా పొడిబారకుండా ఉంటుంది.

 

అలోవెరాను వాడటం ద్వారా :

 

చర్మం యొక్క దురద మరియు మంట నుండి ఉపశమనం పొందడానికి కలబంద లేదా అలోవెరా జెల్ ని కూడా వాడవచ్చు. ఎందుకంటే ఇది సహజమైన వైద్యం. మీరు నేరుగా మొక్క నుండి జెల్ తీసుకొని దురద ఉన్న ప్రదేశంలో రాయవచ్చు. లేదా బయట నుండి కూడా దీనిని కొనుగోలు చేసుకోవచ్చు.

 

మీకు దురదలు లేదా దద్దుర్లు తీవ్రతరం లో ఉన్నట్లైతే మాత్రం ఈ చర్యలు ఎంత మాత్రం సరిపోవు. మీ వైద్యునితో మాట్లాడండి. మీకు పూత మందులు లేదా నోటి మందులు లేదా రెండు కూడా అవసరం కావచ్చు.

 

తల్లులు ! సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన గర్భధారణ.

 

గర్భధారణ సమయంలో వచ్చే దురద గురించి రిథి ఇచ్చిన సమాచారం మీకు ఉపయోగపడిందా ? మీ గర్భధారణ సమయంలో దురద నుండి మీరు ఎలా ఉపశమనం పొందారు ? ఈ క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి. మీ నుండి తెలుసుకోవడం మాకు చాలా ఇష్టం.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}