• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
పేరెంటింగ్ అవుట్డోర్ యాక్టివిటీస్ అండ్ ఈవె క్రీడలు మరియు ఆటలు

మీ 0-1 వయస్సుగల చిన్నారికి సరదా ఆటపాటలు

Radha Shree
0 నుంచి 1 సంవత్సరాలు

Radha Shree సృష్టికర్త
నవీకరించబడిన Nov 28, 2019

 0 1

అందరు పిల్లలు వాళ్ళు ఎదుగుతుండగా ఎన్నెన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటారు అసలు అందుకే ఎంత పెద్దవాళ్ళమైనా, పసిపిల్లలవంటి ఉత్సాహం ఎప్పుడూ కోల్పోకూడదు అంటుంటారు. వారి కుతూహలం ముద్దులొలికిస్తూ ఉంటుంది, వారి ప్రయత్నాలు చూసి పెద్దవాళ్ళకి కూడా సమయం తెలియదు. ఇంతటి అందమైన ప్రక్రియలో, పిల్లలకి సున్నితంగా వారు కూడా పూర్తిగా ఆనందించే విధంగా కొన్ని ఆటపాటల గురించి చదివేద్దాం రండి.

మీ 0-1 వయస్సుగల చిన్నారికి సరదా ఆటపాటలు

0-1 వయస్సు గల పిల్లలు అప్పుడప్పుడే స్పందించడం నేర్చుకుంటారు. వీటినే, రిఫ్లెక్సీస్ అని అంటారు. పైగా అటు ఇటు కదలడానికి ప్రయత్నిస్తుంటారు. ఇటువంటి సమయం లో వారు దెబ్బలు తగిలించుకోకుండా, జాగ్రత్తగా మనం ముందునుంచే ప్లాన్ చేసి పెట్టుకోగల ఆటలు నెలలవారీగా కింద వివరించబడి ఉన్నాయి.

0-3 నెలలు:

  • మూడో నెల ఒక మైలురాయ్. ఈపాటికి వారు బోర్లా పడడానికి ప్రయత్నిస్తుంటారు కనుక వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకి దన్ను అందిస్తే వాళ్ళకి, ఎక్సర్సిస్ అవుతుంది, పట్టుదల కూడా పెరుగుతుంది.

  • వాళ్ళ పట్టు ఇప్పుడిప్పుడే పెరుగుతూ వస్తుంది కాబట్టి, నొక్కగా కీచు శబ్దం చేసే బొమ్మలు, బొమ్మమధ్యలో నొక్కితే శబ్దం వచ్చే బొమ్మలు వారి పట్టు ని మెరుగుపరచవచ్చు. ఒకసారి వారి ముందు ఈ బొమ్మను వాడి, వారిని కూడా తిరిగి అదే చేసేట్టు ప్రోత్సహించండి.

4- 6 నెలలు:

  • పిల్లలకి పెద్దలకి ఎప్పటికి ఎవర్గ్రీన్ ఆట దోబూచులాట. ఏదైనా ఒక సరిసమానమైన ఉపరితలం మీద పిల్లలకి ఇషటమైన బొమ్మమీద వారికీ చూపిస్తూ దుప్పటి కానీ, గుడ్డ కానీ కప్పండి.వెంటనే పిల్లలు వారికిష్టమైన బొమ్మని వెలికితీయడంలో మునిగిపోతారు.

  • ఇంకా, ఫామిలీ ఫోటో ఆల్బమ్స్, రంగురంగుల కధల పుస్తకాలూ పిల్లలు ఎంజాయ్ చెయ్యడానికి ఇదే సరైన దశ. ఈ వ్యాపకం మనమందరం చుసిన ‘సిసింద్రీ ’ సినిమానే ఒక మలుపు తిప్పింది. పిల్లల్ని వాళ్ళో కూర్చోపెట్టుకుని వారికీ రంగులు చూపిస్తూ, వాటి పేర్లను గట్టిగ బయటకి చదవండి. దీని ద్వారా పిల్లల మెదడుకి కూడా కసరత్తు అయిపోతుంది.

  • రియాక్షన్ టాయ్స్ అంటే, మీట నొక్కితే పాటలు పాడేవి, లైట్ వెలిగేవి పిల్లలకి ఈ దశలో నచ్చుతాయి. వాటితో మొదటిసారి ఆడించెదపుడు మొదట పెద్దవాళ్ళ సహాయం తో ఎక్కడ నొక్కాలి ఎం చెయ్యాలి అని నేర్పిస్తే, పిల్లలు వాళ్ళంతట వాళ్ళు ఆడుకునేపుడు భయపడకుండా ఉంటారు. లేకపోతె అనవసర భయాలకు లోనయ్యి ఆహ్ బొమ్మంటేనే దూరం జరుగుతారు.

  • చాలామంది పిల్లలు నీటితో ఆదుకోవడానికి కూడా ఇష్టపడుతుంటారు. ఒక 3-4 ఇంచెస్ నీళ్లలో, వారిని కూర్చోబెట్టి, నీళ్ళల్లో కాళ్ళని ఆడనివ్వండి. ఆలా అని ఎక్కువసేపు నీళ్ళల్లో నాననివ్వకండి.

7 – 9 నెలలు:

10 – 12 నెలలు:

వీటన్నిటితోపాటు ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులు తమ పిల్లలతో మాట్లాడాలి, ఆడాలి పడాలి. వారి తో పాటు నడుస్తూ పాకుతూ ఉంటే వారి మధ్య ప్రేమాప్యాతలతో పాటు పిల్లలు నేర్చుకోవలసినవి నేర్చుకుంటారు. ఎన్ని విధాలు మనం ఆలోచించిన, పిల్లలు ప్రక్రుతి లో ఉన్న ప్రతి విషయాన్ని ఈ దశకల్లా గమనించి పూర్తిగా అనుభవిస్తుంటారు. అందువల్ల, కొత్త ఆటలు, వారి అభిరుచిని బట్టి అప్పటి వీలుని బట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఏ ఆట ఆడిన వారికి ఆనందమే.

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన పేరెంటింగ్ బ్లాగ్లు

Always looking for healthy meal ideas for your child?

Get meal plans
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}