• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
అభిరుచులు ఫుడ్ అండ్ న్యూట్రిషన్

ఈ లాక్ డౌన్ సమయంలో మీ చిన్నారుల కోసం బియ్యం పిండి తో టేస్టీ టేస్టీ బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం

 Kalpana
3 నుంచి 7 సంవత్సరాలు

Kalpana సృష్టికర్త
నవీకరించబడిన Apr 07, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

లాక్ డౌన్ సమయంలో మీ పిల్లలకు రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన కొత్త వంటకాలు చేయడానికి తల్లులు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. కొన్నిసార్లు అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. పిల్లలకైతే ఎదురుచూడని సెలవులు. మగవారికి వర్క్ ఫ్రం హోం . పాపం. ఇంట్లో గృహణిల పని ఇక వేరే చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఇష్టమైన వారి కోసం కష్టపడటం లో కూడా ఎంతో సంతోషం ఉంటుంది. రోజంతా బయటకు వెళ్లకుండా, కనీసం పార్క్కి కూడా వెళ్లలేని పరిస్థితుల్లో ఇంట్లోనే ఉంటున్న పిల్లలను సంతోషంగా ఉంచడం అన్నది తల్లులకు ఈ రోజుల్లో ఒక పెద్ద సవాలుగా మారింది. వారి కోసం ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బియ్యం పిండి తో టేస్టీ టేస్టీ బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో మీకోసం.

మీ పిల్లలు కొంచెం పెద్దవారు అయితే వారిని కూడా భాగస్వాములను చేసినట్లయితే వారికి కూడా కాలక్షేపంగా ఉంటుంది. మరియు మీ పని కూడా సులభం అవుతుంది.

100 గ్రాముల బియ్యపు పిండిలో పోషక విలువలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం

కేలరీలు 366

కొవ్వు 1.4 గ్రా 

పొటాషియం 76 ఎంజి 

కార్బోహైడ్రేట్ 80 గ్రా 

 ఫైబర్ 2.4 గ్రా 

 షుగర్ 0.1 జి

ప్రొటీన్ 6 గ్రా 

విటమిన్ సి 0% 

కాల్షియం 1% 

ఐరన్ 2% 

విటమిన్ డి 0% 

విటమిన్ బి6  20% 

మెగ్నీషియం 8% 

 

మరి ఈ టేస్టీ టేస్టీ బియ్యపు పిండి బిస్కెట్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం..

బియ్యం పిండి.... 2 కప్పులు,

మైదా .. 1 కప్పు,

పంచదార ..1 కప్పు,

పాలు ...ఒక కప్పు,

నెయ్యి ..రెండు స్పూన్లు,

వంట సోడా... కొంచెం,

గసగసాలు..1 స్పూన్,

ఇలాచి పౌడర్..1/2 స్పూన్.

ఇప్పుడు దీని తయారీ విధానం ఏమిటో చూద్దాం:

ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి  పాలను మరిగించండి. పాలు మరుగుతుండగా అందులో పంచదార వేసి ఆ పంచదార బాగా కరిగేవరకు మరిగించి పక్కన పెట్టుకోండి. వేరొక గిన్నెలో మైదా, బియ్యపు పిండి , నెయ్యి , గసగసాలు,వంటసోడా వేసి బాగా కలుపుకోండి. నెయ్యి అందుబాటులో లేనట్లయితే మరిగించి నూనె గాని , రెండు స్పూన్లు  మరిగించిన డాల్డా గానీ అందులో కలుపుకోవచ్చు. ఇప్పుడు మరిగించి పక్కన పెట్టుకున్న పాలు మరియు పంచదార మిశ్రమము ఆ పిండిలో వేసి బాగా కలుపుతూ  చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్ గా కలపండి. ఈ పిండిని మరీ ఎక్కువసేపు గట్టిగా కలపకూడదు. సున్నితంగా కలుపుకోవాలి.

ఇప్పుడు ఆ పిండిని మూత పెట్టి  ఒక అరగంట సేపు పక్కన ఉంచండి. 

అరగంట తర్వాత ఆ పిండి కొంచెం మృదువుగా తయారవుతుంది. చపాతీల కంటే కొంచెం మందంగా చేసి డైమండ్ షేప్ లో కట్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే స్క్వేర్ షేప్ లో కూడా కట్ చేసుకోవచ్చు. రౌండ్ షేప్ లో కావాలనుకుంటే మీకు సరిపడిన సైజులో ఉన్న బాటిల్ మూతను   కూడా ఉపయోగించి రౌండ్ గా కట్ చేసుకోవచ్చు.ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆ ఆయిల్ మరిగాక మీడియం ఫ్లేమ్ లో ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా చల్లారాక టైట్ కంటైనర్ లో వేసి గట్టిగా మూత  పెట్టుకోండి .ఇవి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి.

ప్రపంచం అంతా కూడా ఈ కరోనా భయంతో ఎంతో వణికిపోతుంది. దీనికి మందు కనుక్కోవడానికి ఎంతోమంది మేధావులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ సఫలం కాలేక పోతున్నారు. ఇటువంటి సమయంలో మన ముందున్న ఒకే ఒక కర్తవ్యం వ్యక్తిగత పరిశుభ్రత మరియు సామాజిక దూరం పాటించడం.

మన చిన్నారులే మన కంటి వెలుగులు . వారికి కరోనా వైరస్ చక్కని అవగాహనను కలిగించండి .కాలింగ్ బెల్ మోగినప్పుడు తలుపు దగ్గరకు వారిని వెళ్ళనివ్వకండి. అవతలి వ్యక్తి ఎవరో తెలియదు కనుక జాగ్రత్త వహించండి. బయట నుండి వచ్చిన ఏ వస్తువులను కూడా వారిని ముట్టుకోకుండా జాగ్రత్తలు చెప్పండి. ఏదైనా తినేముందు 30 సెకండ్ల నుండి ఒక నిమిషం పాటు చేతులను శుభ్రపరుచుకోవడం అలవాటు చేయండి. వీటితో పాటుగా మంచి ఇమ్యూనిటీని పెంచే ఆహారాన్ని ఇవ్వండి. జాగ్రత్తలు పాటించండి. సంతోషంగా ఉండండి.

 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • 1
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.

| Apr 07, 2020

Wow

  • Reply
  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన అభిరుచులు బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}