• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
బిడ్డ సంరక్షణ

మీ బిడ్డతో మొదటి 24 గంటలు

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Nov 24, 2020

 24
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

 

ప్రసవం తర్వాత హాస్పిటల్లో ప్రశాంతంగా ఉండాలని మీరు ప్లాన్ చేసుకుని ఉండవచ్చు. కానీ మీ నవజాతశిశువు రెట్టింపు బిజీగా ఉంటుందని మీరు గ్రహించి ఉండకపోవచ్చు. పుట్టిన కొద్ది నిమిషాలకే మీ బిడ్డను కొలుస్తారు, శుభ్రపరుస్తారు, కదిలిస్తారు. ఆసుపత్రికి ఆసుపత్రికి తేడా ఉండొచ్చు మరియు మీ డెలివరీ రకంలో తేడాలు ఉండవచ్చు. అయితే మీ బిడ్డ మొదటి  24 గంటల ఎలా ఉంటుందో , దాని యొక్క రూపురేఖలు ఎలా ఉంటాయో క్రింద ఇవ్వబడ్డ విధంగా మాత్రమే ఉంటాయి.

 

మొదటి 5 నిమిషాలు :

 

ముందుగా మీ బిడ్డ జన్మించినప్పుడు డాక్టరు ఆమె నోరు మరియు ముక్కు మరియు అమ్నియోటిక్ ద్రవంను శుభ్రం చేస్తారు. మరియు బిడ్డ వారి స్వంత శ్వాసను ప్రారంభించాలి. డాక్టర్ ఆ తర్వాత బొడ్డుతాడును కత్తిరిస్తారు. పుట్టిన తరువాత ప్రధానంగా పరిశీలించేది ఎఫ్గర్  స్పందన. ఇది గర్భం వెలుపల జీవించడానికి నీ బిడ్డ సర్దుబాటు ను తెలియపరుస్తుంది. హృదయ స్పందన రేటు, రంగు, ప్రతిస్పందన, కండరాల స్థాయి మరియు శ్వాసను కొలవడం కూడా ఇందులో ఉంటుంది. ఈ పరీక్షలు ప్రసవం అయిన తర్వాత 1 నిమిషం నుండి 5 నిమిషాల వ్యవధిలో 0 నుండి 10 స్కేల్ లో ఇవ్వబడతాయి. చాలామంది పిల్లల్లో 8 నుండి 9 స్కోరు ఉంటుంది. కానీ బిడ్డ స్కోరు తక్కువగా ఉంటే కారణం తెలుసుకుని పరిష్కరించబడుతుంది మరియు పరీక్షలు కొనసాగించబడతాయి సమస్య పరిష్కరించబడుతుంది. దీని గురించి చింతించకండి. పుట్టినప్పుడు చాలా తక్కువ స్కోరు ఉన్న ఎంతో మంది శిశువులు ఆరోగ్యకరంగా, సంతోషకరంగా జీవిస్తున్నారు.

 

1 గంటల నుండి 3 గంటల వరకు :

 

మీరు ప్రసవించిన వెంటనే మీరు ఆ గదిలో ఉండగానే మీ బిడ్డకు కే విటమిన్ షార్ట్ తొడకు ఇవ్వబడుతుంది. ఇది రక్తం గడ్డ కట్టే సమస్యలనుండి కాపాడుతుంది. మీది మామూలు ప్రసవం అయితే అప్పుడే పుట్టిన మీ శిశువు మీ స్పర్శకు దగ్గరగా ఛాతిపై ఉంచబడుతుంది .

 

ఇలా చేయడం వలన శిశువు ఏడుపు తగ్గిస్తుంది.

 

ఇది తల్లిపాలు ఇవ్వడాన్ని ప్రారంభించడానికి 

మరియు కొనసాగించడానికి సహాయపడుతుంది.

 

శిశువు శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

 

మీ బిడ్డను సురక్షితంగా మరియు వెచ్చగా ఉంచడానికి శారీరకంగా మీకు దగ్గరగా ఉంచడం ఎంతో అవసరం. ఒకవేళ మీకు సిజేరియన్ డెలివరీ అయినట్లయితే మీరు సౌకర్యవంతంగా మరియు ఎటువంటి సమస్యలు లేనట్లయితే శిశువుని మీ శరీరానికి హత్తుకొని ఉండడం ఎంతో మంచిది. అలా వీలుకుదరన.ట్లయితే వీలైనంత త్వరగా మీ బిడ్డ తో శారీరక అనుబంధాన్ని కలిగి ఉండే విధంగా ఏర్పాటు చేయమని నర్సులను అడగవచ్చు.

 

బిడ్డలను హత్తుకొని ఉండడం, మొదటిసారిగా తల్లిపాలు ఇవ్వడం ఆ తర్వాత మీ శిశువు బరువుని కొలుస్తారు. ఆ తర్వాత శిశువు యొక్క పొడవు మరియు తల చుట్టుకొలతను కూడా కొలుస్తారు.

 

4 గంటల నుండి 22 గంటల వరకు :

 

బహుశా మీరు మీ నవజాత శిశువు చూసుకోవడానికి మరియు ఎత్తుకోవడం నేర్చుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తారు. మీ బిడ్డను శుభ్రం చేయడంలో నర్సుకు సహాయం చేస్తారు. మేకోనియం అని పిలువబడే మొదటి మలవిసర్జన ముగించిన తర్వాత వారి డైపర్ ను మార్చండి. మీరు మీ బిడ్డకు పాలివ్వడం మొదలు పెట్టిన తర్వాత ప్రతి రెండు గంటలకు లేదా అంతకంటే ముందు వారిని పరిశీలిస్తూ ఉంటారు. మీ బిడ్డ తక్కువ పాలు తాగుతున్నట్టు అయితే మీరు ఆందోళనకు గురికావద్దు. వారి కడుపు చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది.

 

నీ బిడ్డ వారి మొట్టమొదటి పాలు తాగిన వెంటనే నిద్ర పోవచ్చు . మరియు 6 గంటలు మరియు అంతకంటే ఎక్కువ సమయం నిద్రలోనే గడపవచ్చు. వాస్తవానికి వారు ఈ ప్రపంచంలో వారి మొదటి రోజును సగానికిపైగా నిద్రలోనే గడుపుతారు.

 

23 గంటల నుండి 24 గంటల వరకు :

 

మీబిడ్డను శిశువైద్యుడు అధికారికంగా పరీక్షలు చేయవచ్చు. డాక్టరు సంక్రమణ ప్రమాద కారకాలను అంచనా వేస్తారు మరియు ఏదైనా అంగవైకల్యాలు ఉన్నాయో అని తనిఖీ చేస్తారు. మీబిడ్డ ఆహారం తీసుకునే విధానము మరియు శ్వాస తీసుకునే విధానాన్ని ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు. వారు కామెర్ల యొక్క పరీక్షలు కూడా చేస్తారు.

 

మీకు సాధారణ ప్రసవం జరిగినట్లయితే 24 నుండి 48 గంటలు ఆస్పత్రిలో గడుపుతారు. సిజేరియన్ డెలివరీ అయితే మీరు సాధారణంగా 4 నుండి 5 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండవలసి ఉంటుంది.


ఈ బ్లాగు మీకు నచ్చిందా ? ఇది మీకు ఉపయోగకరంగా ఉందా ? ఈ క్రింది వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మరియు సూచనలను మాతో పంచుకోండి. మీ నుండి వినడానికి మేము ఎంతో ఇష్టపడతాము.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన బిడ్డ సంరక్షణ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}