• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్

మీ బిడ్డను తోబుట్టువు కోసం సిద్ధం చేయడానికి 8 చిట్కాలు

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jan 08, 2021

 8
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

మీ భర్త మరియు మీరు మరొక బిడ్డ రాక గురించి ఆనందిస్తున్నప్పుడు మీ పెద్ద బిడ్డను తోబుట్టువు కోసం ఎలా సిద్ధం చేయాలి అనేది మీ మనసులో ఉన్న పెద్ద ప్రశ్న. సిద్ధం చేయడం గురించి మర్చిపోండి, శిశువు వచ్చిన తరువాత జరిగే మార్పులను వారు ఎలా అర్థం చేసుకుంటారు. వారి మీద నుండి శ్రద్ధను చిన్న వారి వైపు మరల్చడం అనేది వారిని ఎక్కువ ప్రభావితం చేస్తుంది. అందువలన పెద్దవారిలో అసూయ లేదా తోబుట్టువుల మీద శత్రుత్వం ఆనవాళ్లు కనిపించకుండా సానుకూలంగా తయారు చేయడం చాలా ముఖ్యం. కాబట్టి ముందుగా మొదటి బిడ్డను కొత్తగా వచ్చే శిశువు కోసం ఎలా సిద్ధం చేయాలో చూద్దాం.

తోబుట్టువు కోసం మీ బిడ్డని ఎలా సిద్ధం చేయాలి ?

కుటుంబంలో కొత్త వారి రాక యొక్క వార్తను మీ బిడ్డ ఎంత బాగా స్వీకరిస్తుంది అనేది వారి వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. 4 సంవత్సరాల వయస్సు లేదా 6 సంవత్సరాల వయస్సు వారితో పోలిస్తే రెండు సంవత్సరాల వయసు వారిని సిద్ధం చేయడం చాలా సులభం అని మీరు అనుకుంటే, మీరు తప్పుగా భావిస్తున్నారు. తోబుట్టువు కోసం మీ మొదటి బిడ్డను ఎలా మరియు ఎప్పుడు సిద్ధం చేయాలో నిర్ణయించడంలో మీకు సహాయం చేయడంలో వయస్సు కీలకమైన అంశం కాబట్టి, దానికి తగిన ప్రాముఖ్యత ఇవ్వాలి అని నేను భావిస్తున్నాను. అందువలన మీ బిడ్డను సానుకూల రీతిలో సిద్ధం చేయడం చాలా ముఖ్యం మరియు కొత్త శిశువు రాకతో వారి పట్ల మీ భావాలను మార్చదు అని వారికి భరోసా ఇవ్వాలి. మొట్టమొదటిగా పుట్టిన వారిని వారి తోబుట్టువుల కోసం సిద్ధం చేసే కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి.

 

2 సంవత్సరాల వయస్సు గల వారిని తోబుట్టువు కోసం సిద్ధపరచడం :

2 సంవత్సరాల పిల్లలు తమ కుటుంబంలోనికి రాబోతున్న వేరొక బిడ్డ గురించి ఆలోచించడం, అంగీకరించడం కొంచెం కష్టం అని రుజువు చేయబడింది. అందుకే కొత్త వారి రాక వార్తలను వీలైనంత సమయం ఆలస్యం చేయడం మంచిది. కానీ అదే సమయంలో రెండు సంవత్సరాల వయస్సు గల పిల్లలు కొన్ని విషయాలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు కనుక  కొంత ఓపిక పట్టండి. మరియు వారికి కొన్ని విషయాలు చెప్పండి.

 

1.శిశువు తల్లిపై ఆధారపడి ఉంటుంది :

నవజాత శిశువు పూర్తిగా తల్లిపై ఆధారపడి ఉంటుందని, అందువలన మమ్మీ శిశువుతో బిజీగా ఉంటుంది అని మీ మొదటి బిడ్డకు అర్థం చేసుకునే విధంగా చెప్పండి. కానీ మమ్మీ నీ గురించి మరియు నీ అవసరాలు గురించి చూసుకోవడం మానేస్తుంది అని దీని అర్థం కాదు అని చెప్పండి. కాబట్టి మీ పెద్దవారికి కూడా కొంత సమయం కేటాయించండి.

 

2 . నవజాత శిశువు వెంటనే ఆడుకోలేదు అని చెప్పండి :

బహుశా మీ మొదటి బిడ్డ ఈ విధంగా ఆలోచించడం ప్రారంభిస్తుంది - సరే ఒక చిన్న బిడ్డ వస్తుంది. కొత్త వారితో నేను ఆడుకోవచ్చు. నవజాత శిశువులు తక్షణమే ఆడుకోలేరని వారికి మీరు వివరించి చెప్పటం ద్వారా వారు ఉత్సాహంగా ఉంటారు మరియు వారిపై ఆశలు పెంచుకోరు. మీ రెండు సంవత్సరాల వయస్సు గల పిల్లలు దానిని అర్థం చేసుకుంటారు మరియు తమ సహోదరులను స్వాగతించే ఆలోచనకు వస్తారు.

 

మీ నవజాత శిశువు కోసం మీ 3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలను సిద్ధపరచడం :

 

బిడ్డ పెరుగుతున్నప్పుడు తమ పరిసరాల గురించి సున్నితంగా పరిశీలిస్తూ  విషయాలను బాగా అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. కాబట్టి మీ మొదటి బిడ్డ మూడు సంవత్సరాల వయస్సులో ఉన్నట్లయితే అప్పుడు మీరు నవజాత శిశువు కుటుంబంలోనికి తోబుట్టువుగా రావడం గురించి వారికి వివరించవచ్చు. ఏది ఏమైనప్పటికీ , ఈ వయస్సులో పిల్లలు సాధారణంగా చాలా పరిశోధనాత్మకంగా ఉంటారు కాబట్టి మీరు సమాధానాలతో సిద్ధంగా ఉండండి.

 

1. శిశువు మీ కడుపు లోనికి ఎలా వచ్చింది :

ఎక్కువ వివరాలలోకి వెళ్ళకుండా మీరు ఇవ్వగలిగినంత తార్కికంగా సమాధానం ఇవ్వండి. 3 సంవత్సరాల వయస్సు పిల్లలకు మీరు ఒంటరిగా ఉన్నారని మీకు ఒక సహోదరుడు లేదా సహోదరిని మీకు బహుమతిగా ఇస్తున్నట్లుగా చెప్పండి. ఈ కథ నాలుగు సంవత్సరాల వయస్సులో కూడా చెప్పవచ్చు. ఐదు సంవత్సరాల వయస్సులో పిల్లలు తాము స్వతంత్రంగా ఉండడాన్ని నేర్చుకుంటారు. అందువలన మీ 5 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు నవజాత శిశువుల గురించి అంత కష్టపడి వివరించి చెప్పవలసిన అవసరం లేదు. కానీ, అక్కడ కూడా ప్రశ్నలు ఉంటాయి.

 

2. శిశువు ఎలా బయటకు వస్తుంది :

అవును, మీరు కొత్త శిశువు గురించి చెప్పిన తర్వాత వారి నోటి నుండి వచ్చే మొదటి ప్రశ్న ఇది. కాబట్టి శిశువు బయటకు రావడానికి మమ్మీ డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది అని వారికి చెప్పండి. అదేవిధంగా మీరు మీ బిడ్డను కొత్తగా డెలివరీ అయిన  మీ స్నేహితుల ఇంటికి తీసుకుని వెళ్ళవచ్చు. తద్వారా మీ మొదటి బిడ్డకు నవజాత శిశువు ఎలా ఉంటుందో తెలుస్తుంది.

 

3. మమ్మీ మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంది :

మీ మొదటి బిడ్డ 6 సంవత్సరాల వయస్సుకు దగ్గరగా ఉన్నట్లయితే, తల్లికి అవసరమైన ,మీ మొదటి బిడ్డ చేయగలిగిన పనులను సహాయంగా తీసుకోవచ్చు. అలా చేసినట్లయితే మీ మొదటి బిడ్డ కొత్తగా వచ్చే తన సహోదరులకు బాధ్యత వహిస్తాడు.

 

4. మీ క్రొత్త తోబుట్టువు కోసం స్థలాన్ని తయారు చేయండి :

మీ నవజాత శిశువు కోసం స్థలాన్ని సిద్ధం చేయాలి  అని 6 సంవత్సరాల బిడ్డ కూడా అర్థం చేసుకుంటుంది. కాబట్టి ఇద్దరూ ఒకే గదిలో నిద్రపోయేలా చేయాలనుకుంటే, నవజాత శిశువుకు అనుకూలంగా అనవసరమైన ఫర్నిచర్ను గదిలోనుండి బయటకు పంపండి.

 

ఏది ఏమైనప్పటికీ , మీరు పెద్ద బిడ్డను తోబుట్టువు కోసం సిద్ధం చేయడం ప్రారంభించాలి. దానికోసం మీకు సహాయపడే కొన్నింటిని నేను పంచుకుంటున్నాను. మీరు చేయవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.

 

1. నాన్నతో మంచిగా సమయం గడపడం :

మీ గర్భధారణ సమయం అంతా కూడా మీ పెద్ద బిడ్డకు మీ భాగస్వామికి మధ్య మంచి అనుబంధం ఉండే విధంగా చూసుకోండి. కొత్తగా పుట్టిన బిడ్డతో మీరు ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నప్పుడు, మీ పెద్ద బిడ్డ వారి నాన్నతో ఎక్కువ సమయం ఉత్సాహంగా గడపాలని కోరుకుంటారు. ఎందుకంటే సహజంగానే మీ నుండి పెద్ద బిడ్డకు కొంత ఎడబాటు వస్తుంది.

 

2. చక్కటి అనుబంధాన్ని సృష్టించడం :

ప్రసవానికి సంబంధించిన పుస్తకాలను కలిసి చదవడం, శిశువు యొక్క హృదయ స్పందన వినడానికి వారిని కూడా మీతోపాటు వైద్యుడి వద్దకు తీసుకు వెళ్లడం, మీ ఇద్దరూ కలిసి పుట్టబోయే బిడ్డ కోసం మంచి పేర్లను ఎంచుకోవడం ( మీ పెద్ద బిడ్డను శిశువుకు పెట్టే పేరుని నిర్ణయించమని చెప్పండి. ఇది చాలా బాగుంటుంది) హాస్పిటల్కు తీసుకువెళ్లే బ్యాగును ఇద్దరూ కలిసి ప్యాక్ చేయండి. ఆ బ్యాగ్ లో మీ పెద్ద బిడ్డ చిన్నప్పటి ఫోటో ఉంచి, అప్పుడు నువ్వు ఎంత ముద్దుగా ఉన్నావో, ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉన్నావు అంటూ మీకు వారు ఎంత ప్రత్యేకమైన వారో తెలియజెప్పండి.

 

3. సానుభూతితో ఉండండి :

గర్భధారణ సమయంలోనూ, బిడ్డ పుట్టాక మరియు ఆ తరువాత కూడా మీ బిడ్డ యొక్క ప్రతి భావాన్ని మీ దగ్గర వ్యక్తపరచడానికి అనుమతివ్వండి. ప్రతి ఒక్కరూ నవజాత శిశువును ప్రత్యేకంగా చూడటం, అందరూ శ్రద్ధగా గమనించడం వలన వారికి కొంత అసూయ ఉంటుంది. మీరు వారితో లాలనతో కూడుకున్న మాటలతోనూ , చేతలతోనూ పూర్తి భరోసా ఇవ్వండి. మరియు ప్రతి రోజు ప్రత్యేకంగా కొంత సమయాన్ని వారితో గడపాలని నిర్ధారించుకోండి.

 

4. మంచిగా సిద్ధం చేసుకోండి :

గదులు మార్చడం, తల్లిపాలు మాన్పడం మరియు టాయిలెట్ శిక్షణ వంటి పెద్ద మార్పులను ముందుగానే చేయండి. మీ పెద్ద బిడ్డకు ఈ కొత్త నిత్యకృత్యాలు చిన్న బిడ్డతో సంబంధం లేకుండా అలవాటుగా మార్చడానికి సమయం మరియు స్థలం అవసరం.

 

5. ఓపికగా మరియు ప్రేమగా ఉండండి :

మీ పెద్ద పిల్లలతో మీ సంబంధాన్ని సాధ్యమైనంతవరకు సున్నితంగా మరియు ఆప్యాయంగా ఉంచండి. గొడవలను పక్కదారి పట్టించి విభేదాలను తగ్గించండి. కొత్త తోబుట్టువు రాక వలన వారి విషయంలో మీ ప్రేమకు ఎటువంటి ఆటంకములు లేదని భరోసా ఇవ్వండి. వారు స్వతహాగా కొంచెం మొండిగా ఉండి మిమ్మల్ని పరీక్షించవచ్చు. కానీ చింతించకండి. మీరు వారిని ప్రేమిస్తున్నారని నిర్ధారించుకోవడానికి వారు ప్రయత్నిస్తారు.

 

6. శ్రద్ధగా చూసుకునే విధంగా సిద్ధ పరచండి :

పుట్టినప్పటి నుండి చిన్న బిడ్డతో ఎవరు ఉండాలో మీరు పెద్ద బిడ్డతో చర్చించాలి. ముందు పుట్టిన పిల్లలకు ఇది చాలా కష్టతరమైన సమయం. వారిని ఎవరు చూసుకుంటారో వారితో రాత్రిపూట గడపడానికి ముందుగానే అలవాటు చేయాల్సి ఉంటుందని నిర్ధారించుకోండి.

 

7. మొదటి అనుబంధాన్ని బలోపేతం చేయండి :

రెండవ బిడ్డ ప్రక్రియలో మీ మొదటి బిడ్డని భాగస్వామిని చేయండి. అది చిన్న బిడ్డతో బంధాన్ని బలపరుచుకోవడానికి సహాయపడుతుంది. ప్రసవ సమయంలో మీ పెద్ద బిడ్డ మీతో లేనట్లయితే, శిశువు జన్మించిన వెంటనే ఇతరులు చూడక ముందు సాధ్యమైనంత త్వరలో బిడ్డను మీ దగ్గరికి పిలిపించుకోండి. కొత్తగా పుట్టిన బిడ్డపై ఆసక్తి చూపించడం కంటే కూడా మొదటి బిడ్డను చూసిన ఆనందాన్ని ప్రత్యేకంగా కనపరచండి. అప్పుడే పుట్టిన వారి సహోదరీ లేదా సహోదరుని పట్టుకొని బిడ్డ తలకింద చేయివేసి మద్దతివ్వాలని వారికి చెప్పండి.

 

8. వారికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగించండి :

కొత్తగా పుట్టిన బిడ్డకు బహుమతులు ఇచ్చే బదులుగా వారి పెద్ద బిడ్డకు బహుమతులు ఇవ్వమని కుటుంబ సభ్యులకు చెప్పండి. అప్పుడే పుట్టిన పిల్లలకు బహుమతులు గురించి ఏమీ తెలియదు కానీ పెద్ద పిల్లలకు అది ఒక సంతోషం. కానీ కొత్తగా పుట్టిన శిశువు వారికి ఒక ప్రత్యేకమైన బహుమతి అని తెలియ చెప్పాలి అని నిర్ధారించుకోండి.

 

మన పిల్లలే మన ప్రపంచం ! పుట్టుకతోనే తోబుట్టువుల మధ్య జీవితాంతం బలమైన, శాశ్వతమైన బంధం ఉండేలాగా చూడడం తల్లిదండ్రులుగా మన బాధ్యత.


మీ బిడ్డను కొత్తగా వచ్చే వారి తోబుట్టువుల కోసం సిద్ధం చేయడంపై వచ్చిన ఈ బ్లాగ్ మీకు నచ్చిందా ? మీ పెద్ద బిడ్డకు కొత్తగా జన్మించే సహోదరుడు లేదా సహోదరి కోసం బలమైన బంధాన్ని ఏర్పరచడానికి మీరు ఏ విధంగా సహాయం చేసారు ? మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. మీ నుండి వినడం మాకు చాలా సంతోషం !

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}